
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
ఈజీగా డబ్బు సంపాదించాలనే ఓ తల్లి ఆలోచన.. తమ కుమారుడిని దారుణ నేరాలు పాల్పడేలా చేసింది. తన మైనర్ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో పెను సంచలనం రేపింది. ఇద్దరు మహిళలను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరికొందరిని హత్య చేసేందుకు కూడా నిందితులు ప్రణాళికలు వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.దుబ్బాక మండలం భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత.. తన మైనర్ కుమారుడితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తల్లి, కుమారుడు కలిసి నేరాలకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. ఒంటరిగా ఉండే మహిళలు, వివాదాలు ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలను టార్గెట్ చేస్తే తమపై అనుమానం తక్కువగా ఉంటుందని నిందితులు భావించినట్లు పోలీసులు గుర్తించారు.భూంపల్లి గ్రామానికి చెందిన విజయను.. తన ఇంటికి పిలిచిన రజిత.. ఆ తర్వాత కుమారుడితో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గొంతు నులిమి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్పై రామక్కపేట శివారుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోకపోవడంతో స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.సగం కాలిన మృతదేహం లభించడంతో దుబ్బాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అనుమానితుల కదలికలు బయటపడ్డాయి. దీంతో రజిత, ఆమె మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో వరుస నేరాల వ్యవహారం బయటికి వచ్చింది.విచారణలో కుంఠ రేణుక అనే మరో మహిళను కూడా హత్య చేసి, అచ్చాయిపల్లి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని తగులబెట్టినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది జూన్లో భూంపల్లికి చెందిన అన్నపూర్ణపై కూడా దాడి