
Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్కుశ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ
Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ
© 2026 nimisham.in

Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ

టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే అతడిపై వేటు పడింది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యను తప్పించిన యాజమాన్యం.. జట్టులోనూ అతడికి చోటు లేకుండా చేసింది. కెప్టెన్‌గా విజయవంతమైనా.. బ్యాటర్‌గా విఫలమైనందున 35 ఏళ్ల సూర్యకుమార్‌ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ గనుక మళ్లీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటితే తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు! దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ముంబై జట్టుకు సూర్య కెప్టెన్ కానున్నట్లు సదరు అధికారి సంకేతాలు ఇచ్చారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘మా జట్టులో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఈ ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు’ అని ఎంసీఏ అధికారి తెలిపారు. అయ్యర్.. అంచెలంచెలుగా ఎదిగి కాగా దేశవాళీ క్రికెట్ ముంబై తరఫున.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అత్యుత్తమంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా భారత టీ20 జట్టులో చోటు కోసం పరితపించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనూహ్య రీతిలో ఏకంగా కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు. టీమిండియాకు మూడో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ స్థానాన్ని సెలక్టర్లు శ్రేయస్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం అతడు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తో బిజీ కానున్నాడు. కాగా 2024–25 సీజన్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను ఓడించి శ్రేయస్ సారథ్యంలోని ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 6 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ టీమిండియాలో జరిగిన ఈ 8 మార్పుల వెనుక కారణం ఏమాత్రం శిక్ష కాదని తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు తిరిగి రావడంతో, గత సిరీస్‌లో ఆడిన చాలామంది కుర్రాళ్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. జింబాబ్వే సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న యంగ్ పేసర్లు మయూంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మలు ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే కూడా తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ఫినిషర్ బాధ్యతలు నిర్వర్తించే రింకూ సింగ్‌ను కూడా ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం గమనార్హం. అఫ్గానిస్థాన్ జట్టుపై పూర్తి ఆధిక్యత సాధించాలనే లక్ష్యంతో భారత సెలెక్టర్లు సీనియర్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వేగవంతమైన బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తిరిగొచ్చారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల పునరాగమనంతో జట్టు కలయిక పూర్తిగా మారిపోయింది. అఫ్గానిస్థాన్ టి20 సిరీస్ కోసం భారత జట్టు

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. ఇక ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్‌తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రకటించిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 13న ఆదివారం, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న మంగళవారం, మూడో టీ20 సెప్టెంబర్ 17న గురువారం జరగనుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు కూడా సెలక్షన్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైన బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్‌ల అనుభవం జట్టుకు బలంగా మారనుంది. మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోనే జరగనున్న నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్న టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది