
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

హైదరాబాద్ శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్ సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో.. నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని తనిఖీ చేయగా.. తొలుత నాలుగు కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. విచారణలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి మద్యం తీసుకున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. దాదాపు 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 55 కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఒక్కో బాటిల్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు లాభం పొందుతున్నట్లు తేలింది. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అమీర్‌పేట్ ఎక్సైజ్ సీఐ బానోత్ పటేల్ వెల్లడించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

నవా షెవా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. DRI అధికారులు చేపట్టిన తనిఖీల్లో 56 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న సంచుల్లో దాచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నించగా.. 351 సంచులను తనిఖీ చేసి డ్రగ్స్‌ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి సౌదీ అరేబియాకు సుమారు 56 కిలోల మెథాంఫేటమిన్‌ను అక్రమంగా ఎగుమతి చేసే ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. నవా షెవా పోర్టులోని ఓ ఎగుమతి సరుకును తనిఖీ చేయగా పొడి రూపంలో ఉన్న నిషేధిత మెథాంఫేటమిన్‌ను గుర్తించారు. మొత్తం 351 సంచులతో కూడిన సరుకులో ఒక సంచిలో మొక్కజొన్నతో కలిపి భారీ మొత్తంలో డ్రగ్‌ను దాచినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలను తప్పించుకునేందుకు పక్కా ప్లాన్.. మెథాంఫేటమిన్‌ను మొక్కజొన్నతో కలిపి.. మొత్తం సరుకును సాధారణ వ్యవసాయ ఉత్పత్తిగా చూపించేలా నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు DRI తెలిపింది. ఎగుమతి సమయంలో జరిగే సాధారణ తనిఖీలు, డ్రగ్స్ గుర్తింపు ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే ఈ విధానాన్ని అనుసరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సరుకు ఎగుమతి వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్ వివరాలపై DRI దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ అక్రమ రవాణాలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. స్కిమ్ మిల్క్ పొడి, పామాయిల్, సువాసన ‘రసాయనాల’తో తయారీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హెచ్-ఫాస్ట్ పోలీసుల దాడులు 36 టన్నుల కల్తీ నెయ్యి, రసాయనాలు స్వాధీనం నివేదికల ఆధారంగా కేసుల నమోదు.. చట్టపరంగా చర్యలు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్-ఫాస్టు పోలీసులకు సీపీ అభినందన, రివార్డులు హైదరాబాద్ సిటీ: ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల భారీ ఎత్తున కల్తీ మసాలాలను పట్టుకున్న హెచ్-ఫాస్టు పోలీసులు, ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్‌లోని 39 కల్తీ తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాల (130 ప్రాంగణాలు)పై సంయుక్తంగా దాడులు చేసి 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, మూడు రకాల సువాసన బాటిళ్లు ఆరు, రవ్వతోపాటు పిండి 30 కిలోలు ఉన్నాయి. జప్తు చేసిన వస్తువులను టెస్టింగ్ కోసం ల్యాబ్‌లకు, ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించినట్లు మంగళవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ విజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి తయారీ దారులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిల్క్ క్రీమ్ తెప్పిస్తున్నారు. పాలు లేకుండా జీరో ఫ్యాట్ కల

పోలీసుల కళ్లుగప్పి హషీష్ ఆయిల్‌ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎస్ఓటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల్‌కుంట వద్ద నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని మల్కాజిగిరి సీపీ బి.సుమతి వెల్లడించారు. దూసుకొస్తున్న వాయుగుండం - ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా అలర్ట్...!!ఏజెన్సీ ప్రాంతాల నుంచి.. బెంగళూరుకు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్ ఆయిల్‌ను సేకరించి.. హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పక్కా సమాచారంతో చింతల్‌కుంట వద్ద నిందితులను అడ్డుకున్నామని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తూ డ్రగ్స్‌ను తరలించే ప్రయత్నం చేశారని.. పోలీసులు తనిఖీలు చేయడంతో వారి అక్రమ రవాణా బయటపడిందని చెప్పారు.కాళ్లకు.. కడుపుకు కిలో చొప్పున!పోలీసుల కళ్లుగప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. ఒక్కొక్కరు రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపుకు మరో కిలో.. మొత్తం 3 కిలోల హషీష్ ఆయిల్‌ను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకుని తరలించారు. నలుగురు క్యారియర్లు కలిపి 12 కిలోల హషీష్ ఆయిల్ తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 12 కిలోల హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు అక్కడి రిసీవర్ సిజో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరుకు బెంగళూరుకు చేరిన అనంతరం ప్రధాన నిందితులకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు.నిరుద్యోగ గిరిజన యువతే క్యారియర్లుఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరులో ఉంటున్నట్లు సీపీ తెలిపారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారని

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్ హైదరాబాద్: చట్టవిరుద్ధంగా మెఫెంథెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ సిటీ, రాజేంద్రనగర్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం (15.08.2026) అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో దాడి నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ బృందం, మహమ్మద్ ఐజాజ్ (23) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించింది. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ 'ఇండియా మార్ట్' (IndiaMART) ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, థర్డ్ పార్టీ కొరియర్ సేవల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తేలింది. సుమారు ₹5,000 లకు 30 ఇంజెక్షన్ల ప్యాక్‌ను కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌ను ₹1,000 చొప్పున విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. జుబేర్ సూచనల మేరకు మహమ్మద్ సైఫ్ ఖాన్ ఈ ఇంజెక్షన్లను సరఫరా చేయగా, మహమ్మద్ ఐజాజ్ వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఐజాజ్ (23): వృత్తి: చార్మినార్ KPB కాంప్లెక్స్‌లోని దుస్తుల దుకాణంలో పని, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (ఇంజెక్షన్ల విక్రేత). (గతంలో సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, బహదూర్ పురా, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లలో 5 కేసుల్లో నిందితుడు). మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ (30): వృత్తి: మోడలింగ్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (గతంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది). మహమ్మద్ సైఫ్ ఖాన్ (20): వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. శుభమ్ రాజ్‌పుత్: నివాసం: రాజస్థాన్. (ముఖ్య సరఫరాదారు — పరారీలో ఉన్నాడు). 110 మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్ (Vails) (మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 6,00,000/- గా అంచనా). రాజేంద్రనగర్ మరియు శంషాబాద్ జోన్ల అదనపు డిసిపి కె.ఎస్. రావు

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు. రాజమండ్రి, ఆగస్టు 13: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో గంజాయిని పోలీసులు గుర్తించారు. మూడు పాలిథిన్ సంచుల్లో 25.970 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా. అలాగే, గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లెకు చెందిన దులపల్లి సుజీవ్ కుమార్, మోదుగు నరేష్‌గా గుర్తించారు. విచారణలో నిందితులు చెప్పిన సమాచారం మేరకు, విజయవాడలో గంజాయి తీసుకునే వ్యక్తి చినమ్సెట్టి రాజేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. గంజాయి సేకరించిన సీలేరు సమీపంలోని చింటు అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రయ్.. రయ్ మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్: తాండూరులో రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తాండూరులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైలులో గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తాండూరులో రైలు దిగి, అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయిని తరలించేందుకు నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. బ్రీఫ్‌కేసుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని తరలిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మధు ప్రధాన్ (34), సింబా సాహక్ (22), నీల్ మండల్ (22)లను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం
హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వెండి నాణేలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 7 కిలోల వెండి నాణేలను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వెండి నాణేలకు సంబంధించిన బిల్లులు, రసీదులు లేకపోవడంతో ఆ ప్రయాణికుడిని తమ అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటి గురించి విచారణ చేస్తున్నారు.ఎయిర్‌పోర్టు చెకింగ్ పాయింట్ వద్ద ప్రయాణికులు, వారి లగేజీని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా భారీగా ఈ వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిపై అనుమానం రావడంతో సిబ్బంది ప్రయాణికుడి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో వెండి నాణేలు ఉన్నట్లు గుర్తించారు. వాటి బరువు సుమారు 7 కిలోలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెండి నాణేలు కొనుగోలు చేసినట్లు బిల్లులు గానీ, రసీదులు గానీ లేదా ఇతర ఆధారాలను ఆ ప్రయాణికుడు అధికారులకు చూపించలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటిని ఢిల్లీకి ఎందుకు తరలిస్తున్నారు.. వాటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలు ఎందుకు లేవు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.వెండి నాణేల కచ్చితమైన బరువు, వాటి విలువ, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రయాణికుడి వద్ద ఉన్న పత్రాలు, అతను ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఈ వ్యవహారంపై సంబంధిత కస్టమ్స్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెండి నాణేల రవాణా వెనుక అసలు కారణం ఏంటి.. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఢిల్లీలో ఎవరికి అప్పగించాల్సి ఉంది అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.. వెండి నాణేలకు సంబంధించిన పత్రాలు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ

Nagari: నగరి మీదుగా తమిళనాడుకు అక్రమ ఇసుక అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడి! ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్‌ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్‌తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోకి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది.. అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని

హ్యాష్ ఆయిల్ స్వాధీనం స్నాప్‌చాట్ ద్వారా దందా పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్ Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా, కొత్త దారుల్లో ఈ దందాను విస్తరిస్తూ యువతను నాశనం చేసేందుకు పెడ్లర్లు యత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ అమ్ముతున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడి నేర పథకాన్ని భగ్నం చేశారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు స్నాప్‌చాట్ వేదికగా రూ. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ దందా: ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అతడు, ఆగస్టు 2న ఒడిశా వెళ్లి రూ.9,000కు హ్యాష్ ఆయిల్(Hash Oil Seized) కొనుగోలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా స్నాప్‌చాట్ ద్వారా సరఫరాదారుడితో మాట్లాడటంతో పాటు, ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించాడు. హైదరాబాద్‌లో 10 మి.లీటర్లను రూ. 1,200 చొప్పున అమ్మి లాభ పడాలని ప్లాన్ చేశాడు. పోలీసులు వేసిన పక్కా స్కెచ్: విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ORR వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బస్సు దిగిన వెంటనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, రూ. 2.5 లక్షల విలువైన 200 మి.లీ (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై కన్నువేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు

సాక్షి, యాదాద్రి: బీబీనగర్, ఎస్వోటీ పోలీసులు స్థానికంగా తయారవుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్ , 40 కేజీల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి చేసే సమయంలో మరో నలుగురు నిందితులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..? నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?