
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

తిరుమల శ్రీవారి భక్తుల ప్రయాణ సౌకర్యాలు, వాహనాల రాకపోకలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుండటంతో టీటీడీ(TTD) స్పందించింది.

'Anywhere registration' is not being done! ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేయట్లే!

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో
హైదరాబాద్ కంటోన్మెంట్లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే రూం తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశం పరిమితంగా ఉండటంతో లోపలి వ్యక్తుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు మొబైల్ లోన్ యాప్స్ ఎంతో సులభంగా లోన్స్ అందిస్తుననట్లు కనిపిస్తాయి. కొన్ని క్లిక్స్, ప్రాథమిక వ్యక్తిగత వివరాలు అందించగానే నిమిషాల్లో నగదు జమ చేస్తామనే ఆకర్షణీయమైన ఆఫర్లు చాలా మందిని ప్రశ్నలు అడగకుండా అప్పు తీసుకునేలా చేశాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుతం అనేక లోన్ యాప్స్ తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు, ఎలాంటి కాగిత పత్రాలు అవసరం లేదనే ప్రచారాలతో వినియోగదారులను వలలో వేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలుఅప్పు కాదు.. ముందు అప్పు ఇచ్చే సంస్థ గురించి తెలుసుకోండి.. రుణం ఎంత త్వరగా వస్తుందనే దానికంటే అసలు మీకు రుణం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్పష్టత లేని రుణదాత వివరాలు, వడ్డీ రేట్లు, చార్జీలపై సమాచారం లేకపోవడం, ఫోన్ లోని అనవసరమైన సమాచారానికి అనుమతులు అడగడం, ఎటువంటి క్రెడిట్ పరిశీలన లేకుండా తక్షణ ఆమోదం తెలపడం వంటివి నకిలీ యాప్స్ ప్రధాన లక్షణాలు. అద్భుతమైన డిజైన్ లేదా తక్షణ రుణం అని చెప్పినంత మాత్రాన ఆ సంస్థ నిజమైనదని నమ్మకూడదు.యాప్ స్టోర్ వివరాలను సరిచూసుకోండి.. ఏదైనా యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లో లభ్యమైనంత మాత్రాన దానిని వెంటనే నమ్మలేం. యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు దాని డెవలపర్ పేరు, వివరణ, ప్రైవసీ పాలసీ, కస్టమర్ కేర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ వివరాలన్నీ ఆ రుణదాత అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదా చూసుకోవాలి. యాప్ డెవలపర్ వివరాలకు, అధికారిక వెబ్సైట్ కు తేడా ఉంటే ఈ యాప్‌కు దూరంగా ఉండటమే మంచిది.నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా?మీకు రుణం

ఆర్మీ కాంపౌండ్‌లో ఆయుధాల చోరీ నాలుగు ఏకే-47 రైఫిళ్లు మాయం రంగంలోకి దిగిన బొల్లారం పోలీసులు Madras Regiment Incident: సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్(Madras Regiment Incident) ప్రాంతంలో సంచలన ఘటన వెలుగు చూసింది. ప్రహరీ గోడలు, మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండే ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన దుండగులు ఆయుధాల గది తాళాలు పగలగొట్టి ఏకంగా 12 అత్యాధునిక ఆయుధాలను అపహరించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ సీసీ ఫుటేజ్ పరిశీలన, లోపలి వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు: రక్షణ రంగానికి చెందిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వేగంగా శోధిస్తున్నారు. ఆయుధాల బరువు, పరిమాణం దృష్ట్యా ఈ చోరీలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని, ఆర్మీ కాంపౌండ్ లోపలి వ్యక్తుల సహకారం ఉందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు ఇటీవల లోపలికి వచ్చి వెళ్లిన వారి వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయుధాలు నిజంగానే చోరీ అయ్యాయా లేక రికార్డుల్లో తేడాల వల్ల మిస్సింగ్‌గా కనిపిస్తున్నాయా అనే కోణంలోనూ ఆర్మీ స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేస్తున్నారు

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కింద నైపుణ్య శిక్షణ అందించనుంది. ఇజ్రాయెల్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కోచోట 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడత 100 రోజుల పాటు శిక్షణ అందించనుండగా.. త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభం కానుంది.ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్గివింగ్కు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఉద్యోగాల కోసం ఏఎన్ఎం/జీఎన్ఎం,బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు మాత్రమే అర్హులు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన శిక్షణ అందిస్తారు. వీరికి కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. అంతేకాదు గతంలో ఇజ్రాయెల్‌లో పనిచేసి ఉండకూడదు. అభ్యర్థుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివాసం, ఉద్యోగం చేస్తుండకూడదు.రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకునేలా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో ఈ శిక్షణా కేంద్రాలు ప్లాన్ చేశారు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురంలలో ఇతర వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఈ శిక్షణా కేంద్రాల్లో ఎస్సీ మహిళలతో పాటు పురుషులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు జర్మనీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత కోసం ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మూడు నెలల పాటూ శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి సర్టిఫికెట్ కూడా అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంతేకాదు వారు

కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్‌చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్‌కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు. తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్‌కు వెళ్తాయి. కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు) ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నయనతార (Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్.సి. ఇందులో నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో రెజీనా, నయనతార, మీనా, కుష్బూ, తదితరులు ఉన్నారు. నయనతార పాత్రకు ఎదురు నిలిచే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఇప్పటివరకు కనిపించని డార్క్ అవతార్‌లో రెజినా సర్ప్రైజ్ చేయనుందట. దర్శకుడు సుందర్.సి ఆమె పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. రెజీనా కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటిగా నిలవబోతుందని తెలిసింది. గతంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఈ క్యారెక్టర్లో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక నయనతార, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. దీంతో ‘మూకుత్తి అమ్మన్ 2’లో హీరోయిజంతో పాటు హీరోయిన్ వర్సెస్ యాంటీ హీరోయిన్ తరహా ఆసక్తికరమైన కాన్ఫ్లిక్ట్ను కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. నయనతార స్టార్ పవర్‌కు రెజీనా డార్క్ పెర్ఫార్మెన్స్ తోడైతే ‘మూకుత్తి అమ్మన్ 2’ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రెజీనా ఏ రేంజ్లో తన పాత్రను పండించిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే

రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎల్ నినో భయాల నేపథ్యంలో పంటలకు బీమా చేయించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అందుకే అన్నదాతల క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, అకాల వర్షాలు ముంచెత్తుతాయో లేదా కరవు తాండవిస్తుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులెవరూ రిస్క్ తీసుకోవద్దని, వెంటనే బీమా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు ఏ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చవుతుందని భయపడుతుంటారు. కానీ ఫసల్ బీమా యోజనలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రైతు వాటా అత్యంత స్వల్పంగా ఉంటే, మిగిలిన ప్రధానమైన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రూపాయి ఖర్చు పెద్దగా లేకుండా వేల రూపాయల నష్టపరిహారం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ సమీపంలోని సీఎస్ఈ (CSC) సెంటర్లు లేదా మీ సేవా

ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. ఐనవోలులో మొత్తం 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. జూన్, 2027లో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ఇక, లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెంలో 3 ఎకరాల్లో SBI ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. SBI కార్యాలయానికి గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం, ఎస్బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణం మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

బీఆర్ఎస్ నేత, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో సాధారణ ప్రజలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం వీరు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు చేరడంతో దుకాణదారుడితోపాటు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయవాది శివశంకర్ సింగ్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జల్హుపూర్ మార్కెట్లోని ఓ స్వీట్ దుకాణం వద్దకు వెళ్లాడు. తినేందుకు సమోసాలు ఇవ్వాలని కోరగా.. దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ చల్లటి సమోసాలు ఇచ్చాడు. దీంతో నాకు వేడి సమోసాలు కావాలని న్యాయవాది శివశంకర్ కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై శివశంకర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దుకాణం యాజమాని, అతని సిబ్బంది దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో శివశంకర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. శివశంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేయాలని చౌబేపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది శివశంకర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తాను చందౌలి నుంచి వారణాసికి ప్రయాణిస్తున్నాను. మార్గం మధ్యలో ఆకలి వేయడంతో జల్హుపూర్ మార్కెట్లోని ఒక స్వీట్ షాపులో రెండు సమోసాలు ఇవ్వాలని ఆర్డర్ చేశాను. వారు చల్లటి సమోసాలు ఇవ్వండంతో.. నేను వేడి సమోసాలు కావాలని కోరాను.. కానీ, దుకాణ యాజమాని ఆయన అనుచరులతో కలిసి నాపై దాడి చేశాడని శివశంకర్ సింగ్ ఆరోపించారు. నువ్వు ఏమైనా కలెక్టర్ వా.. వేడి వేడి సమోసాలు ఇచ్చేందుకు అంటూ తనపై వారు దుర్భాషలాడారని పేర్కొన్నాడు. అంతేకాదు.. వారు తన వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, నగదు లాక్కొన్నారని

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి, ఆగస్టు 20: అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు ఫీజులను మినహాయిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. తొలి దశలో అచ్చుతాపురం, మునగపాక మండలాల్లోని 1,947.225 ఎకరాల భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు వర్తించనుంది. అనంతరం మిగిలిన భూములకు కూడా దశలవారీగా ఈ రాయితీని రెవెన్యూ శాఖ వర్తింపజేయనుంది. అచ్చుతాపురం ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహించే కేంద్రాన్ని BARC ఏర్పాటు చేయనుంది. దేశ రక్షణ, ఇంధనం, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో పరిశోధనల కోసం బీఏఆర్సీ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజుల మినహాయింపుపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 285(1) నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా? అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలనా లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' విధానంలోకి మారే క్రమంలో, 2026 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22A కింద ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. ఈ నిబంధన ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ (PPL)ను నిర్వహిస్తుంది. సాధారణంగా దీనినే 22A నిషేధిత జాబితాగా వ్యవహరిస్తారు. ఈ జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా పూర్తి చేయలేరు. సిస్టమ్‌లో సంబంధిత సర్వే నంబర్ లేదా ఆస్తి వివరాలు నిషేధితంగా నమోదై ఉంటే విక్రయం, బదలాయింపు వంటి లావాదేవీలకు అడ్డంకి ఏర్పడుతుంది. 22A పరిధిలో ప్రధానంగా వివిధ రకాల ప్రభుత్వ లేదా పరిరక్షణ అవసరమున్న భూములు ఉంటాయి. వీటిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ ఆస్తులు, వక్ఫ్ ఆస్తులు, భూ పరిమితి చట్టాల కింద మిగులు భూములు, కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు సంబంధించిన భూములు, కోర్టు ఆదేశాల పరిధిలో ఉన్న ఆస్తులు వంటి కేటగిరీలు ఉన్నాయి. అంటే ప్రతి 22A భూమి తప్పనిసరిగా వివాదాస్పదమైనదని అర్థం కాదు. చట్టపరంగా నిషేధించాల్సిన కేటగిరీలో ఉన్న ఆస్తులను అక్రమంగా చేతులు మారకుండా అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒక భూమికి సంబంధించిన పాత రికార్డులో ఉన్న వివరాలు, ప్రస్తుత యాజమాన్య హక్కులు, భూమి వర్గీకరణ మధ్య తేడాలు ఏర్పడితే.. చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తి కూడా నిషేధిత జాబితాలో కనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక ఆస్తి 22A నిషేధిత జాబితాలో నమోదైతే దాని యజమానికి మొదటి సమస్య రిజిస్ట్రేషన్ వద్ద ఎదురవుతుంది. భూమిని విక్రయించేందుకు కొనుగోలుదారుడితో ఒప్పందం చేసుకున్నా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తేలితే డాక్యుమెంట్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నవారు, అమ్మకానికి ఒప్పందం చేసుకున్నవారు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆస్తిని విక్రయించలేకపోవడంతో అత్యవసర ఆర్థిక అవసరాలకు దాన్ని వినియోగించుకోవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో బ్యాంకు

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యాంశాలు.. * రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు. * జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. * ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం. * 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దు

CM Revanth Reddy : ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. 22ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలి.. జిల్లా కలెక్టర్లు 22ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందించాలని.. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సీఎం రేవంత్ ప్రజలకు సూచించారు

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవతల సైన్యానికి అధిపతి 'కుమారస్వామి' కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి నుంచి ఈ మూవీకి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ ను హారిక & హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే రెండు టైటిల్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కోసమే ఈ టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అర్థమవుతోంది. మరి ముందు నుంచి ప్రచారం జరుగుతున్న 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ ను ఫైనల్ చేస్తారా? లేక 'దేవసేనాపతి' వైపు మొగ్గుచూపుతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా రూపొందనున్న మూవీ కాబట్టి, అన్ని భాషల వారికి ఈజీగా రీచ్ అయ్యేలా 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే? తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ ది హత్యా.. ఆత్మహత్యా!.. ది గ్రేట్ సిబిఐ ఏం చెప్పిందంటే
తెలంగాణలో నిషేధిత22ఏ భూముల జాబితా వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు నిషేదిత 22ఏ జాబితాలోకి చేరటం, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో భూ యజమానులు, ప్లాట్ల యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యవహారం కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 22ఏ జాబితాలో చోటుచేసుకున్న లొసుగుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.22ఏ జాబితా అంశంపై ప్రభుత్వం త్వరలోనే సమగ్ర విచారణ చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా సరే.. ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భూములను నిషేదిత జాబితాలో చేర్చే ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎవరి ఆదేశాలతో మార్పులు చోటు చేసుకున్నాయి..? ఏ స్థాయిలో అధికారుల ప్రమేయం ఉంది..? అనే పూర్తి అంశాలు విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొందరు అధికారుల పాత్ర కూడా ఈ వ్యవహారం వెనుక ఉండి ఉండొచ్చునని తాను బలంగా అనుమానిస్తున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా, ప్రభుత్వ విచారణలో అధికారులు, రికార్డులు, భూముల వర్గీకరణ, డిజిటల్ డేటాలో జరిగిన మార్పులు వంటి అంశాలు పరిశీలించే అవకాశం ఉంది.రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా 22Aరెవెన్యూ నిబంధనల ప్రకారం కొన్ని రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటి రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 22A Dispute : తెలుగు రాష్ట్రాల్లో 22 ఏ ( నిషేధిత భూముల జాబితా) వివాదం రచ్చలేపుతోంది. లక్షలాది మంది రైతులు, ఆస్తి యజమానుల పాలిట శాపంగా మారింది సెక్షన్ 22ఏ. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసి.. పక్కగా సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూములు కూడా ఆకస్మాత్తుగా ఈ 22 ఏ జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ రికార్డుల ప్రక్షాళన విధానంలోని లోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేవలం బ్రిటిష్ కాలం పాత పత్రాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఆ తర్వాత దశాబ్దాల పాటు జరిగిన చట్టబద్ధమైన క్రయవిక్రయాలను, యాజమాన్య బదిలీలను పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల వ్యవసాయ పట్టాభూములు రికార్డుల్లో రాత్రికి రాత్రే ప్రభుత్వ ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రభుత్వ సాంకేతిక తప్పిదం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై క్రయవిక్రయాల హక్కులు కోల్పోయి యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై సెంటర్ ఫర్ లిబర్టీ అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి విశ్లేషించారు. రికార్డుల అప్ డేట్ లో భాగంగా జరిగిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రస్తుత గందరగోళానికి మూలకారణమని స్పష్టం చేశారు. కింది స్థాయిలోని లావాదేవీల చరిత్రను పరిగణలోనికి తీసుకోకుండా.. ఏకపక్షంగా సామాన్య భూములను 22ఏ జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని నల్లమోతుల వివరించారు. ఈ అన్యాయంపై ముఖ్యంగా ఏపీలో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేరుస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్టు 17న తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని లక్షలాది ఆస్తులను రాత్రికి రాత్రి ఈ జాబితాలోకి చేర్చడం దారుణమని విమర్శించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యుల ఆస్తులను కూడా 22A పరిధిలోకి తెచ్చి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 1999లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం రద్దయినప్పటికీ, తెలంగాణలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని పూర్తిగా ఎత్తివేశారు. అయితే, ఇప్పుడు పాత సీలింగ్ పరిధిలోని భూములను మళ్లీ 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఏకపక్షమని హరీశ్ రావు పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో 30 ఏళ్లుగా ఉన్న ఫ్లాట్లు, 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం చలాన్ డబ్బులు చెల్లించిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ అనుమతి (NOC) పొంది బ్యాంక్ రుణాలు తీసుకున్న ఆస్తులు కూడా ఇప్పుడు 22A జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీతో పాటు ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రభుత్వ భూములు కూడా ఈ జాబితాలో ఉండటం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా 30% కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా ఇదే 22A జాబితాలో ఉందని, తనకు సెగ తగిలితేనే ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన విమర్శించారు. ఫలితంగా అవినీతి అక్రమార్కులకు ఈ సెక్షన్ ఒక ఆయుధంగా మారిందని, ప్రజల సొమ్మును ప్రభుత్వం నిలువునా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరపాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు

22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు భూములు చేరుతున్న అంశంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏను అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.22ఏ జాబితాలో భూమి ఉందనే కారణంతోనే దరఖాస్తును తిరస్కరించవద్దని మంత్రి సూచించారు. అసలు ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలించాలని చెప్పారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని సూచించారు.నిషేధిత భూముల అంశంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 22ఏ భూముల విషయంలో నిబంధనల పేరుతో ప్రజలకు అనవసర ఇబ్బందులు కలిగించకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు

రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మాస్కో ప్రాంతంలోని ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్‌కు చెందిన ఒక గోదాముపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. తమకు తెలిసినంత వరకూ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలోని కొలెడీనో అనే ప్రాంతంలోని వైల్డ్‌బెర్రీస్ సంస్థ గోదాముపై ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి అనంతరం భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్టు దట్టమైన పొగలు మిన్నంటాయి. డోమోడిడోవో ప్రాంతంలోని మరో గోదాముపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనేక డ్రోన్స్‌ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. మొత్తం 822 డ్రోన్స్‌ను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో దిశగా 600 డ్రోన్స్ వచ్చాయని నగర మేయర్ తెలిపారు. వైల్డ్ బెర్రీస్ సంస్థకు రష్యా అమెజాన్‌గా పేరుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి రకరకాల వస్తువులను భారీ స్థాయిలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, వైల్డ్‌బెర్రీస్ సంస్థ సాయంతో మిలిటరీ సామగ్రిని రష్యా తరలిస్తోందని ఉక్రెయిన్ కొంతకాలంగా ఆరోపిస్తోంది. గతంలో పలుమార్లు వైల్డ్ బెర్రీస్ సంస్థ గోదాములను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. రష్యా మాత్రం ఈ ఆరోపణలను పలుమార్లు ఖండించింది. ఒమన్ చర్చలు వేరు.. హోర్ముజ్ తెరవడం వేరు: ఇరాన్ హోర్ముజ్‌పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, హక్కులు ఉన్నపట్టా భూములు చేరడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ పేర్లతో స్పష్టమైన చట్టబద్ధమైన హక్కులు, పత్రాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో భూములను అమ్మాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టాలన్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో ఈ రకమైన భూములు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణలకు గురై లావాదేవీలు జరిగిన ఘటనలను పరిశీలించిన హైకోర్టు, 2015, 2024లలో నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా నవీకరించాలని రవాణా, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీని ప్రకారం 2025 చివర్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి రికార్డులను సమకూర్చి కొత్త జాబితాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్రక్రియలో ప్రాథమిక మూల సర్వే నంబర్ల ఆధారంగా డేటాను సేకరించడం వల్ల సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వ వేలం ద్వారా, జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పొందిన స్థలాలు, ప్లాట్లు రికార్డుల్లో ప్రైవేటు ఆస్తులుగా ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే కొనసాగుతున్నాయి. ఫలితంగా మూల సర్వే నంబర్‌ను 22ఏలో చేర్చగానే అందులో ఉన్న సబ్-డివిజన్లు, లేఅవుట్లు, ప్రైవేటు ప్లాట్లు కూడా ఆటోమేటిక్‌గా నిషేధిత పరిధిలోకి వెళ్లిపోతున్నాయి.దీనికితోడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ , ఇనాం, అసైన్డ్, భూదాన్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నంబర్లలో ప్రైవేటు పట్టా భూములు కలిసిపోవడం మరొక కారణం. కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు పొందిన ఆస్తులు సైతం రెవెన్యూ రికార్డుల్లో సవరణలు జరగకపోవడం వల్ల ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులకు ఊరట కలిగించేందుకు జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా గ్రామాల స్థాయిలో జాబితాలను సరూర్‌నగర్, ఉప్పల్

ప్రకృతి ఇండోనేషియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొద్ది గంటల వ్యవధిలోనే వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ ద్విపకల్పాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన 7.7 తీవ్రత కలిగిన వినాశకర భూకంపం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, పశ్చిమ సుమత్రా ప్రాంతంలో మరోసారి 6.9 తీవ్రతతో భూమి తీవ్రంగా ప్రకంపించింది. ఈ దెబ్బకు కనీసం 38 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.శనివారం తెల్లవారుజామున సుమారు 3:28 గంటల సమయంలో ఫ్లోరెస్ తీర ప్రాంతంలో సంభవించిన తొలి భూకంపం ధాటికి అనేక గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 47 మంది చనిపోగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. శతాబ్దాలలోనే అతిపెద్ద ప్రకంపనగా భావిస్తున్న ఈ ఘటనతో సుమారు 2,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలేసి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. తీరప్రాంత ప్రజలను సునామీ భయం తీవ్రంగా వేధించింది.కొండచరియలు విరిగిపడి నిలిచిన సహాయక చర్యలు!భూకంప ధాటికి పలు ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోయాయి. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న నాగేకియో ప్రాంతానికి వెళ్లే రహదారులు మట్టిదిబ్బలతో మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు.ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!పశ్చిమ సుమత్రాలో మరో భారీ ప్రకంపన!తొలి ప్రమాదం నుంచి కోలుకోకముందే, శనివారం ఆలస్యంగా పశ్చిమ సుమత్రా పరిధిలోని పెమాటాంగ్ సియంతార్ సమీపంలో 183 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతో రెండో భూకంపం సంభవించిందని యూఎస్ జీయోలాజికల్ సర్వే ధృవీకరించింది. అయితే ఈ రెండో భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు ఏవీ జారీ కానప్పటికీ, వరుస భూప్రకంపనలతో భయపడిపోయిన

సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది. బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరి ఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశవ్యాప్తంగా చేపట్టనున్న ‘జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. జనగణన ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు. దేశంలోనే తొలిసారిగా యాప్‌లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. 15 రోజుల పాటు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన-2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పించారు. సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది. కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్‌లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

భారత నావికాదళం సముద్రంలో తన సార్వభౌమత్వాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సరికొత్త రక్షణ వ్యూహాలకు పదును పెడుతోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర ఎంత కీలకమో ఎర్రసముద్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు స్పష్టంగా చూపించాయి.ఈ నేపథ్యంలో శత్రువు ఊహించని రీతిలో, సముద్రం మీది యుద్దనౌకల నుంచే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు భారత నేవీ రంగం సిద్ధం చేస్తోంది. శత్రుదేశాల తీరప్రాంత క్షిపణి వ్యవస్థల కంటికి చిక్కకుండా, మన యుద్ధనౌకలు సురక్షిత దూరంలో ఉంటూనే వ్యూహాత్మక దాడులు చేయడానికి ఈ సాంకేతికత అద్భుతంగా తోడ్పడనుంది.గగనతలంలో నిఘా పెట్టి నాశనం చేసే సాంకేతికత!ఈ ప్రత్యేక డ్రోన్లు గాల్లోకి ఎగిరిన తర్వాత దాదాపు 9 గంటల పాటు నిరంతరాయంగా పహారా కాయగలవు. శత్రువు స్థావరాన్ని గుర్తించగానే గంటకు 200 నాట్ల వేగంతో విరుచుకుపడతాయి. పగటితో పాటు చీకట్లోనూ ఖచ్చితమైన లక్ష్యాలను గుర్తించేలా ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను వీటిలో అమర్చనున్నారు. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అనుకున్న టార్గెట్‌ను నేలమట్టం చేసే అద్భుతమైన సామర్థ్యం వీటి సొంతం. అంతేకాదు, శత్రువులు ఒకవేళ శాటిలైట్ సిగ్నళ్లను జామింగ్ చేసినా తమ పనిని విజయవంతంగా ముగించే అధునాతన నావిగేషన్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.నౌకాదళంలోకి మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..ఒకే ఆపరేటర్.. ఒకేసారి 10 డ్రోన్ల నియంత్రణ!ఈ విప్లవాత్మక సాంకేతికత ద్వారా యుద్ధనౌకపై ఉన్న ఒక్క డిజిటల్ ఆపరేటర్ ఏకకాలంలో 10 డ్రోన్లను కంట్రోల్ చేసే వీలుంటుంది. అవసరాన్ని బట్టి ఈ డ్రోన్ల కంట్రోల్‌ను మరో నావికాదళ నౌకకు లేదా తీరంలో ఉన్న ల్యాండ్ స్టేషన్‌కు సులభంగా బదిలీ చేయవచ్చు. అత్యంత తీవ్రమైన గాలులు అంటే గంటకు 50 నాట్ల వేగంతో గాలి వీచినా, 95 శాతం తేమ ఉన్న కఠిన సముద్ర వాతావరణాన్ని తట్టుకుని ఇవి పనిచేస్తాయి. ఈ సిస్టమ్ యొక్క కీలక

సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. మరో రెండు రిజిస్ట్రార్ హాల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మెయిన్ క్యాంపస్‌లోని వెస్ట్ వింగ్ మొదటి అంతస్తులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కేసులు తగ్గించేందుకు వీలుగా పార్లమెంటు ఈ మేరకు చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయసేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా రెండు కొత్త కోర్టు హాళ్లను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ.. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు

Telangana Govt : తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసిన తరువాత.. అర్హత ఉన్న వాటిని జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 లక్షల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూములు, 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములతోపాటు దేవాదాయ తదితర కేటగిరీల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. కొన్ని ప్రైవేటు భూములు కూడా 22ఏ జాబితాలోకి వెళ్లడంతో వాటి యజమానులు ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, గతంలో చేపట్టిన సర్వేల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇలా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో వాటిని విక్రయించలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక కొందరు భూ యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు రుణాలు పొందడంలోనూ వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో 22ఏ భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి అర్హులైన భూ యజమానులకు ఊరట కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Start Railway Station Business: సొంత బిజినెస్ ప్రారంభించాలని ఈ కాలంలో చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. అయితే, మీరు కూడా బిజినెస్ రైల్వేస్టేషన్లో ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రక్రియ ఏంటో తెలీదా? రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసా? రైల్వేస్టేషన్లో వ్యాపారం ప్రారంభించడం.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చిన్న షాపు సులభంగా ఓపెప్ చేయడం సులభమే. దీనికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా రైల్వేస్టేషన్ అధికారుల పర్మిషన్ కూడా అవసరం. ఈ టెండర్ ప్రక్రియ అనేది ఐఆర్సీటీసీ ఆధారంగా జరుగుతుంది. విజయవంతంగా టెండర్ పూర్తి చేసిన వారికి లైసెన్స్ ఇస్తారు. రైల్వే రూల్స్ ప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు. రైల్వేస్టేషన్ సంబంధిత అధికారులు టెండర్ విధానం ద్వారా ఈ దుకాణాలు ప్రారంభించవచ్చు. ఐఆర్సీటీసీ నిర్ణీత సమయాల్లో టెండర్లకు ఆహ్వానిస్తుంది. ఎప్పటికప్పుడు టెండర్స్ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. ఆ స్టేషన్, మీకు ఆ టెండర్ సెట్ అవుతుందా? చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్ లిస్ట్.. రైల్వే స్టేషన్లో షాప్ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? లొకేషన్ చెక్ చేయండి. దీంతోపాటు దుకాణం సైజు, బిజినెస్ యాక్టివిటీకి పర్మిషన్, లైసెన్స్ గడువు, సెక్యూరిటీ డిపాజిట్, బిడ్డింగ్ డెడ్‌లైన్ కూడా చెక్ చేసుకోండి. మీ వద్ద ఈ టెండర్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి. సాధారణంగా రైల్వేకు సంబంధించిన టెండర్స్ ఇండియన్ రైల్వేస్ ఇప్రోక్యూర్మెంట్ సిస్టమ్ (IREPS) పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎ్‌ఫబీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎఫ్‌బీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. వరి రైతులకు ఈ నెల 15వ తేదీతో బీమా గడువు ముస్తుండగా, పోర్టల్స్ మొరాయించడంతో బీమా చేసుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) ఇచ్చి, బీమా ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయ శాఖ చెప్తోంది. కానీ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా బీమా పోర్టల్స్‌లోనే అప్లోడ్ చేయాలి. పోర్టల్స్ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు. ఈ-క్రాప్ చేయించకోకపోయినా.. స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్తున్న అధికారులు.. బీమా పోర్టల్స్ ఓపెన్ కాకపోవడంపై స్పందించడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరికి మినహా ఇతర ఖరీఫ్ పంటలకు గడువు ముగిసిపోయింది. వరికి మాత్రం మరో మూడు రోజులే గడువు ఉంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈ పోర్టల్స్ స్తంభించాయి. దీంతో బీమా పోర్టల్స్ ఓపెన్ అయ్యేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బీమా గడువు పెంచాలని వరి సాగుదారులు కోరుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR)లో దాదాపు కోటి మంది ఓట్లు తొలగించారు. దీంతో వారిని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. భారత మాజీ సీజేఐకి రష్యా కీలక పోస్టు ..! ఉక్రెయిన్ తో మధ్యవర్తిత్వం..! తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ తాజాగా పూర్తయింది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఇందులో దాదాపు కోటి మంది ఓటర్ల పేర్లు గల్లంతుకావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ జూలై 25న ఫ్యామిలీ రిజిస్టర్ సర్ఠిఫికెట్ల జారీకి నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేషన్ కార్డుల ఆధారంగా అధికారులు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. వీటిలో రేషన్ కార్డులో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యులు అందరి డేటా ఉంటోంది. దీనిపై ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. వర్షాల కోసం వరుణ యాగం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ రేషన్ కార్డుతో సమానమని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేల్చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు తీసుకున్న వారు కూడా ఓటర్ల జాబితాలో తమ ఓట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది

చండ్రుగొండ, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మద్యం మత్తులో ఓ బంజారా నాయకుడు వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యం సేవించిన అధికార పార్టీకి చెందిన బంజారా నాయకుడు కార్యాలయంలోకి ప్రవేశించి చండ్రుగొండ సబ్ రిజిస్టర్ జగదీశ్వర్ ప్రసాద్ పై చిందులు వేశాడు. ఇటీవల సమాచార హక్కు ప్రకారం చండ్రుగొండ మండలంలో గల ప్రభుత్వ రెవెన్యూ భూముల వివరాలను తీసుకుని అందులో గిరిజనేతరులు ముఖ్యంగా పేదలు నిర్మించిన ఇండ్లను తొలగించి రెండు కుంటల భూమి తనకు ఇవ్వాలని పరోక్షంగా బెదిరిస్తూ గత కొంతకాలంగా వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో నేరుగా తాసీల్దార్ తో తనకు భూములను కొలిచి చూపించాలని, ఏ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో ఎంత ఉందో చూపించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే తనకు రెండు కుంటలు భూమి ఇవ్వాలని లేకపోతే నీ అంత చూస్తానని బెదిరించారు. సబ్ రిజిస్ట్రార్ వైపు వేలు చూపిస్తూ ఏక వచనంతో మాట్లాడి అవమానకరంగా వ్యవహరించినట్లు కార్యాలయంలోని రెవెన్యూ అధికారులు బహిరంగంగా తెలుపుతున్నారు. దీనిపై తాసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ ను వివరణ కోరగా తనను గిరిజన నాయకుడు బెదిరించిన మాట వాస్తవమేనని చెప్పారు. అప్పుడు చండ్రుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం మద్యం సేవించిన విషయం సైతం బ్రీత్ టెస్ట్ చేయలేదని, ఇటువంటి వ్యవస్థ చండ్రుగొండలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా, 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను గుర్తింపు పత్రంగా అంగీకరించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ల జారీపై గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి ఈసీఐ తాజా ప్రకటనతో తెరపడింది.రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) డేటా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ సర్టిఫికెట్, రేషన్ కార్డుతో సమానమని ఎన్నికల సంఘం తన వివరణలో పేర్కొంది. ఓటర్ల పరిశీలన ప్రక్రియలో రేషన్ కార్డును ధ్రువీకరణ పత్రంగా పరిగణించనందున, ఈ సర్టిఫికెట్‌ను కూడా అంగీకరించలేమని తేల్చిచెప్పింది. మీసేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జులై 25న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు, వయసు, చిరునామా, ఆధార్ వివరాలతో కూడిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను ఓటర్ల జాబితా సవరణలో ఉపయోగించుకోవచ్చని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఈ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు. న్యూఢిల్లీ, ఆగస్టు 12: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని కోరారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్, డోర్నకల్ - గద్వాల్ (కల్వకుర్తి మీదుగా) రైల్వే లైన్, కల్వకుర్తి - మాచర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే, హైదరాబాద్ - అమరావతి - బందర్ పోర్ట్ సరుకు రవాణా(ఫ్రైట్) కారిడార్, హైదరాబాద్‌ను పూణే-ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్(RRR) ప్రాజెక్ట్ ఫ్రైట్ & హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా కాచిగూడ - జగ్గయ్యపేట, పటాన్చెరు - ఆదిలాబాద్, బోధన్ - లాతూర్ ప్రాజెక్టుల డీపీఆర్(DPR) ప్రక్రియను వేగవంతం చేసి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీలు వినతి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, వంశీ గడ్డం ఉన్నారు. ‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్ మేడ్చల్ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Vehicle RC card : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల్లో యజమాని ఫొటో కనిపించకుండా పోయింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల బదిలీ, యాజమాన్య మార్పు వంటి సేవల్లో గతంలో వాహన యజమాని ఫొటోను తప్పనిసరిగా నమోదు చేసేవారు. ఇప్పుడు కొత్తగా జారీ అవుతున్న స్మార్ట్ కార్డుల్లో మాత్రం చిరునామా, వాహన వివరాలు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 ఏళ్ల క్రితమే వాహన యజమాని ఫొటో గుర్తింపు విధానం అమల్లోకి వచ్చింది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని డిజిటల్ ఫొటో, సంతకాన్ని రవాణాశాఖ అధికారులు నమోదు చేసేవారు. వాహనం విక్రయం లేదా యాజమాన్య బదిలీ సమయంలో సంబంధిత వ్యక్తి వివరాలను ధ్రువీకరించేందుకు ఈ ఫొటో గుర్తింపు ఉపయోగపడేది. వాహనాన్ని ఒకరి నుంచి మరొకరికి అక్రమంగా బదిలీ చేయకుండా నియంత్రించేందుకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావించేవారు. దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పు వంటి సేవలను ఒకే విధానంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్సీ స్మార్ట్ కార్డుల్లో యజమాని ఫొటోను ముద్రించే పద్ధతి తొలగిపోయింది. దీంతో ప్రస్తుతం వాహనదారులకు గతంలో మాదిరిగానే స్మార్ట్ కార్డులు అందుతున్నప్పటికీ.. వాటిపై యజమాని ఫొటో మాత్రం ఉండటం లేదు. పాత ఆర్సీ కార్డుల్లో ఫొటో ఉండగా, కొత్త కార్డుల్లో లేకపోవడంతో వాహనదారులు తేడాను గుర్తిస్తున్నారు. వాహన ఆర్సీల్లో యజమాని ఫొటో లేకపోవడంకు కారణం ‘వాహన్’ పోర్టల్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడమేనని తెలుస్తోంది. అయితే, ఫొటో గుర్తింపు తొలగింపుతో వాహన యాజమాన్య బదిలీల్లో మోసాలకు అవకాశం ఉందా? అనే సందేహాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. సెకండ్ హ్యాండ్ వ్యక్తిగత, వాణిజ్య వాహనా ల విక్రయ సమయంలో విక్రేత, కొనుగోలుదారు ఆర్టీఏ అధికారి సమక్షంలో వివిధ పత్రాలపై సంత కాలు చేయాల్సి
తెలంగాణలో 22ఏ లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్తగా తమ ప్రభుత్వం ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. 22ఏ, పీఓబీ అంశంపై మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు.. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారీగా పరిశీలించారు. అర్హులైన బాధితులకు వీలైనంత త్వరగా ఊరట కల్పించాలని అధికారులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు సహా అన్ని రికార్డులను ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ విధానం ద్వారా బోగస్ లేదా ఫోర్జరీ పత్రాలను గుర్తించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావచ్చని మంత్రి చెప్పారు. పహానీలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్లు గుడ్డిగా తిరస్కరించకూడదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సిన పరిస్థితి ఉంటే కారణాలను పరిశీలించేందుకు 3 రోజుల సమయం తీసుకుని.. స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని ఆదేశించారు.ఇకపై నిషేధిత జాబితాకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లకు పంపకుండా నేరుగా జిల్లా కలెక్టర్లకు పంపించాలని మంత్రి పొంగులేటి నిర్ణయించారు. కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ స్థాయిలోనే సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ల

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.. 22ఏ/POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భూ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకే ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. POB దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకు పంపాలి.. POB దరఖాస్తులను ఇక తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని మంత్రి పొంగులేటి సూచించారు. POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దని ఆదేశించారు. తిరస్కరణకు కారణాలు తెలిపేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదని స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. 'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. ఇంటర్నెట్ డెస్క్: సిరియా దేశంలో 14 ఏళ్లుగా కొనసాగిన అంతర్యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే కేసులో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్ అసద్‌కు సిరియా కోర్టు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు. తీర్పు వెలువడే సమయంలో కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నజీబ్ ఖైదీ దుస్తులు ధరించి బోనులో నిలబడి ఉండగా న్యాయమూర్తి తీర్పును చదివారు. 2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అసద్, ఆయన సోదరుడు మహేర్ రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అతేఫ్ నజీబ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై విచారణ చేపట్టారు. అసద్ ప్రభుత్వంలో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారుల్లో నజీబ్ ఒకరిగా ఉన్నారు. నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011లో బషర్ అసద్ పాలనలో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. అక్కడ తిరుగుబాటును అణచివేసిన చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు.. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్