
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Free onions distribution in Warangal: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా మంది వంటింట్లో ఉల్లిపాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వెరైటీగా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన నేపథ్యంలో..ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణిని చేశారు. ట్రాలీలో ఉల్లిగడ్డ సంచులను తీసుకొనివచ్చిసీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిరోడ్డు మీద పంపిణి చేపట్టాడు. దీంతో జనాలు ఉల్లిపాయల ప్యాకెట్ ల కోసం భారీగా క్యూలు కట్టారు. Read more: Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. సుష్మిత వివాదంపై హీటెక్కిన రాజకీయాలు.!. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది.ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నేత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

తెలుగువారి వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ ఏదంటే చాాలామంది గృహిణుల నుండి వచ్చే సమాధానం… ఉల్లిపాయ. కూర, పప్పు, సాంబార్… ఇలా ప్రతి వంటకంలో ఉల్లిపాయ ఉండాల్సిందే… చివరికి బిర్యానీ తింటున్నా పక్కన ఉల్లిపాయ నంజుకోవాల్సిందే. అయితే వంటలో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో మంట, నీళ్లు రావడం ఖాయం. ఇది కేవలం ఉల్లి ఘాటు వల్ల మాత్రమే కాదు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కెమిస్ట్రీ ఉందని తెలుస్తోంది. ఉల్లిపాయల వెనకున్న ఆ సైన్స్ రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మనం ఉల్లిపాయను కోసినప్పుడు దాని కణాలు దెబ్బతిని 'అల్లినేస్', 'లాక్రిమేటరీ ఫాక్టర్ సింథేస్ (Lachrymatory Factor Synthase - LFS)' అనే ఎంజైమ్‌లు విడుదలవుతాయి. ఇవి ఉల్లిపాయలోని అమైనో ఆమ్లాలతో చర్య జరిపి సల్పెనిక్ ఆమ్లాన్ని, 'సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఘాటైన గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఈ వాయువు గాలితొ చర్య జరిపి కళ్లలో మంట పుట్టిస్తుంది. ఈ సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్ అనే వాయువు గాలిలో కలిసి మన కళ్లను చేరుతుంది… అక్కడ కంటిలోని నరాలను ప్రేరేపించి మంట పుట్టిస్తుంది. అప్పుడు కళ్లను రక్షించుకోవడానికి, మన కన్నీటి గ్రంథులు ఎక్కువగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఉల్లిపాయ కోసేటప్పుడు మనకు ఏడుపు వస్తుంది. దీన్నే సైంటిస్టులు 'లాక్రిమేటరీ ఫ్యాక్టర్' (lachrymatory factor) అని పిలుస్తారు. 2017లో 'ACS కెమికల్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం… ఉల్లిపాయలో మనిషి కన్నీళ్లకు కారణమయ్యే రసాయనం ఏర్పడటంలో లాక్రిమేటరీ ఫ్యాక్టర్ సింథేస్ (LFS) ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. అంటే ఉల్లిపాయ మనల్ని ఎమోషనల్‌గా ఏడిపించదు. దాని కణాలు దెబ్బతిన్నప్పుడు విడుదలయ్యే ఒక రసాయన వాయువే మన కళ్లలో మంట పుట్టించి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇదంతా పక్కా సైన్స్! 1. మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లి కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. దీనివల్ల రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకే

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. వేపుళ్లు, కూరలు, సాంబారు, బిర్యానీలలో ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ మంచిది. అయితే రుచిని అందించే ఈ ఉల్లిపాయను కట్ చేసే సమయంలో మాత్రం ప్రతి ఒక్కరి కళ్ల నుంచి నీళ్లు కారడం సర్వసాధారణం. చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఉల్లిపాయలను కోసేటప్పుడు వాటిలోని కణాలు చిట్లి 'సిన్-ప్రొపాంథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఒక రకమైన సల్ఫర్ ఆధారిత రసాయన వాయువు గాల్లోకి విడుదలవుతుంది. ఈ వాయువు మన కంటిలోని సహజ తేమతో కలిసినప్పుడు స్వల్ప మోతాదులో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కంటి నాడీ వ్యవస్థ చికాకుకు గురై తీవ్రమైన మంట పుడుతుంది. ఆ మంట నుంచి కంటిని రక్షించుకోవడానికి మన శరీరం సహజ రక్షణ చర్యగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయలు తరిగే సమయంలో కన్నీళ్లు రాకుండా ఉండటానికి మంచి మార్గం ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం. ఉల్లిపాయను కట్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాల ముందు రిఫ్రిజిరేటర్లో లేదా బాగా చల్లగా ఉన్న ఐస్ నీటిలో ఉంచాలి. ఉల్లిపాయ చల్లబడటం వల్ల సల్ఫర్ వాయువును విడుదల చేసే ఎంజైమ్‌ల రసాయన చర్య వేగం గణనీయంగా మందగిస్తుంది. ఫలితంగా గాల్లోకి తక్కువ పరిమాణంలో గ్యాస్ వెలువడి కళ్ల మంట తగ్గుతుంది. అలాగే మనం ఉపయోగించే కత్తి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలామంది మొద్దుబారిన కత్తులతో ఉల్లిపాయలను కోస్తుంటారు. మొద్దు కత్తి ఉల్లిపాయ పొరలను సులభంగా కోయడానికి బదులు వాటి కణాలను ఎక్కువగా నలిపివేస్తుంది. దీనివల్ల రసాయన వాయువు తీవ్ర స్థాయిలో విడుదలవుతుంది. అందుకే బాగా పదునైన కత్తిని ఉపయోగిస్తే కణాలు సున్నితంగా తెగిపోయి, కంటికి హాని చేసే వాయువు విడుదల దాదాపు సగానికి తగ్గిపోతుంది. ఉల్లిపాయను కోసే విధానం కూడా కన్నీళ్లను అడ్డుకోవడంలో

ఎక్కువ మంది ఫేవరేట్ కూరగాయల్లో బంగాళదుంప ముందు వరసలో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ బంగాళదుంపను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. వీటిని కొని తెచ్చిన కొద్ది రోజులకే చిన్న చిన్న మొలకలు రావడం, మెత్తగా మారడం లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి. దీని వల్ల బంగాళదుంపలు త్వరగా పాడైపోయి వాటిని పడేయాల్సి వస్తుంది. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ బంగాళ దుంపలను మనం ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. బంగాళదుంపలు ఉంచిన సంచి లేదా బుట్టలో ఒక ఆపిల్ పండును ఉంచితే సరిపోతుంది. ఆపిల్ నుంచి సహజంగా విడుదలయ్యే 'ఎథిలీన్' అనే వాయువు బంగాళదుంపల్లో మొలకలు రావడానికి కారణమయ్యే కణాల వేగాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బంగాళదుంపలు చాలా వారాల పాటు మొలకెత్తకుండా తాజాగా ఉంటాయి. చాలామంది ఇళ్లలో బంగాళదుంపలు, ఉల్లిపాయలను ఒకే బుట్టలో కలిపి ఉంచుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే తేమ , వాయువుల వల్ల బంగాళదుంపలు చాలా వేగంగా మొలకెత్తడమే కాకుండా కుళ్ళిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం మంచిది. ముఖ్యం బంగాళదుంపలకు సూర్యకాంతి లేదా డైరెక్ట్ వెలుతురు తగిలితే అవి త్వరగా ఆకుపచ్చగా మారి మొలకెత్తుతాయి. ఆకుపచ్చగా మారిన భాగంలో 'సోలనిన్' అనే విషపదార్థం తయారవుతుంది. అందువల్ల వీటిని ఎల్లప్పుడూ చీకటిగా, గాలి ధారాళంగా తగిలే చల్లటి ప్రదేశంలో ఉంచాలి. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే బంగాళదుంపలను ఉంచడం వల్ల లోపల తేమ చేరి అవి త్వరగా పాడవుతాయి. వీటిని గాలి తగిలే సంచులు, పేపర్ బ్యాగులు లేదా రంధ్రాలున్న ప్లాస్టిక్/వెదురు బుట్టల్లో మాత్రమే నిల్వ చేయాలి. బంగాళదుంపలు త్వరగా పాడవకూడదని కొందరు వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్‌లోని అతి శీతల ఉష్ణోగ్రత వల్ల బంగాళదుంపల్లోని పిండి పదార్థం (స్టార్చ్) చక్కెరగా మారిపోతుంది