
Child Psychology: ఫ్రిజ్‌పై పిల్లలడ్రాయింగ్స్, మెడల్స్ పెడతారు..ఎందుకో తెలుసా? దీని వెనుక సైకాలజీ ఇదే!
Child Psychology: ఫ్రిజ్‌పై పిల్లల డ్రాయింగ్స్, మెడల్స్ పెడతారు..ఎందుకో తెలుసా? దీని వెనుక సైకాలజీ ఇదే!
© 2026 nimisham.in

Child Psychology: ఫ్రిజ్‌పై పిల్లల డ్రాయింగ్స్, మెడల్స్ పెడతారు..ఎందుకో తెలుసా? దీని వెనుక సైకాలజీ ఇదే!

Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట!

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నూతన రుణ యత్నాలు అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్‌మార్క్‌లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

వైద్య రంగంలో, ముఖ్యంగా డ్రగ్ డెలివరీ (శరీరంలో నిర్దిష్ట భాగాలకు మందులను చేరవేయడం) ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు భారత శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. బిగుసుకుపోయి, ఘనరూపంలో ఉన్న పదార్థాలను సైతం తాత్కాలికంగా ద్రవరూపంలోకి మార్చే ఒక సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆకస్మికంగా ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా పదార్థాల 'జ్ఞాపకశక్తి' (memory imprints) ముద్రలను చెరిపివేసి, వాటిని ప్రవహించేలా చేయవచ్చని నిరూపించారు. ఈ ఆవిష్కరణతో దుష్ప్రభావాలు తగ్గించి, మరింత సమర్థవంతంగా మందులను లక్షిత కణాలకు చేర్చవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) పరిశోధకులు ఈ కీలక ముందడుగు వేశారు. గ్లాస్ వంటి కొన్ని పదార్థాలు నిర్మాణాత్మకంగా ద్రవాలను పోలి ఉన్నప్పటికీ, యాంత్రికంగా ఘన పదార్థాల వలె ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా, అవి తమ గత స్థితులను గుర్తుంచుకోగలవు. ఇలా బిగుసుకుపోయిన వ్యవస్థలను (Jammed Systems) తిరిగి ప్రవహించేలా చేయడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా, మైక్రోజెల్ కణాలను ఉపయోగించి ప్రయోగాలు నిర్వహించారు. ఈ మైక్రోజెల్ కణాలను వేగంగా వేడి చేసినప్పుడు, వాటిలోని కణాల అమరికలో మార్పులు జరిగి, ఆ వ్యవస్థ తాత్కాలికంగా ద్రవరూపంలోకి మారడాన్ని గమనించారు. ఈ ప్రక్రియలో పదార్థం తన గత స్థితికి సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతుందని గుర్తించారు.ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'జర్నల్ ఆఫ్ కొలాయిడ్ అండ్ ఇంటర్ఫేస్ సైన్స్'లో ప్రచురితమయ్యాయి. RRIలో పీహెచ్డీ విద్యార్థిని, ఈ పరిశోధన పత్రం యొక్క మొదటి రచయిత సోనాలి కవాలే, ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకమైన మైక్రోజెల్

గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడినట్లేనని చాలామంది నమ్ముతారు. అయితే, అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు మాజీ టెక్కీల జీవితాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ నలుగురు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరిలో మెటా మాజీ ఉద్యోగిని బ్రిట్నీ బాల్ (37) ఏడాదికి 180,000 డాలర్ల వేతనం అందుకునేవారు. గూగుల్‌లో పనిచేసిన జాసన్ జాంగ్ (25) వార్షిక వేతనం 200,000 డాలర్లకు పైమాటే. ఇక మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న జో ఫ్రెండ్ (62) 250,000 డాలర్ల వేతనం అందుకుంటుండగా, ఇంటెల్‌లో అంతే కాలం పనిచేసిన శ్రీరామ్ రామకృష్ణ (57) 180,000 డాలర్ల వేతనం పొందేవారు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లేఆఫ్‌కు గురవడం వీరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వారు ఊహించిన దానికంటే అత్యంత కష్టతరంగా మారింది. బ్రిట్నీ బాల్ ఏకంగా 8,000కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్ రామకృష్ణ ఏడాది కాలంగా ఉద్యోగ వేట సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిట్నీ తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, జీవన వ్యయాన్ని తగ్గించుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుంచి వేరే

మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్‌సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన జైకొట్టు లోగో ఆవిష్కరణ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. చెయ్యొత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులపై విపక్ష వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విశాఖ నగరం తీవ్ర నీటి, విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని సోషల్ మీడియా వేదికగా విపక్షాలు భయాలను రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే నీటి కొరత వస్తుందనడం అసత్యమని సీఎం తేల్చి చెప్పారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం ఉద్దేశపూర్వకంగానే విషం కక్కుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మరియు అనకాపల్లి ప్రాంతాల్లో గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. 2026 ఏప్రిల్ నెలలో గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఇప్పటికే భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రిలయన్స్ సహా పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. 2029-30 నాటికి 50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి 3 నుంచి 3.5 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలవరం పారిశ్రామిక కేటాయింపుల నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సాధారణ 1 గిగావాట్ థర్మల్ ప్లాంట్ దీనికంటే పది రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వివరించారు. మరోవైపు డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. అభిమనులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన బర్త్ డే రోజున సందర్భంగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన బిగ్ సర్ప్రైజ్ లభించింది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ నుంచి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా విజన్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌ను వెస్ట్రన్ శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల నుంచి నేటి 1970ల కాలం దాకా సాగే ఈ కథాంశంలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరం మన లైఫ్‌టైమ్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.ఈ చిత్రంలో జపనీస్ సంస్కృతికి చెందిన సమురాయ్ ఎలిమెంట్స్, జపాన్ యాకుజా నేపథ్యం కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక వీడియోలో పవన్ సమురాయ్ కత్తి పట్టుకొని ఓజస్ గంభీర ఎంతో గాంభీర్యంగా కనిపించారు. 'సమురాయ్ రేమై.. యాకుజా మేకై' అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో ఈ ఓజీ విశ్వం యొక్క విస్తృతిని పరిచయం చేశారు. ఓజీ యూనివర్స్ గురించి పవన్, తమన్, సుజీత్ మాట్లాడుతూ.. 'మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ సార్ అని తమన్ అనగా ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం, యానిమేషన్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్‌ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tiger suddenly attacks on zookeeper video: సాధారణంగా జూలల్లో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని శాఖాహర జంతువులు, మరికొన్ని మాంసాహర జంతువులు ఉంటాయి. అయితే.. జూ సిబ్బంది వాటికి చక్కగా ట్రైన్ చేస్తారు. క్రూర జంతువులను సైతం తమ దారిలో తెచ్చుకుంటాయి. ఆ తర్వాత అవి జూ సిబ్బంది చెప్పినట్లు వింటాయి. కానీ కొన్నిసార్లు జూలోని జంతువులు సిబ్బందిపై ఎదురు తిరిగి దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో జూ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోతారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జూ ఎన్ క్లోజర్ లో పెద్దపులి జూ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఎన్ క్లోజర్ లో కొన్ని పెద్దపులులు ఉన్నాయి. ఇంతలో వాటిని ఆహరం వేద్దామని నెమ్మదిగా జూ సిబ్బంది దానిలోకి ప్రవేశించాడు. మరీ దానికి ఏమనిపించిందో ఏంటో కానీ ఒక్కసారిగా పెద్దపులి జూ కీపర్ పై దాడి చేసింది. ఈ ఘటనతో అతను షాక్ కు గురయ్యాడు. పులి అతని మెడను గట్టిగా పట్టుకుని పలు మార్లు తన పంజాతో దాడి చేసింది. ఇంతలో అక్కడున్న జూ కీపర్ పెంపుడు శునకం పెద్దపులిపై దాడికి దిగింది. దీంతో పులి కాస్త జూ కీపర్ ను వదిలేసింది. ఆ పెనుగులాటలో మరో జూ కీపర్ చాకచక్యంగా ప్రవర్తించి, గాయపడ్డ సిబ్బందిని బైటకు లాక్కున్నాడు. కుక్క మాత్రం పులితో పొరాటంకు దిగింది. Read more: Snake

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

భార్యాభర్తల బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం కూడా. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి ఎలా స్పందిస్తున్నారన్నదే ఆ బంధం ఎంత హెల్తీగా ఉందో చెప్పగలదు. సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ ఐదు లక్షణాలు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు కేవలం భార్యే చూసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన ఇతర నిర్ణయాల్లో భర్త కూడా తన వంతు బాధ్యత తీసుకుంటే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. భార్య అలసిపోయినప్పుడు పనిలో సహాయం చేయడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం వంటి పనులు ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమను పెంచుతాయి. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యమైన లక్షణం. కొందరు తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికి భంగం అనుకుంటారు. కానీ హెల్తీ రిలేషన్ షిప్ లో తప్పు ఒప్పుకోవడం, సారీ చెప్పడం, బలహీనత కాదు.. మెచ్యూరిటీ. గొడవ జరిగినప్పుడు ఎవరు గెలిచారనే దానికంటే, సమస్య ఎలా పరిష్కరించారనేదే ముఖ్యం. ప్రేమ అంటే ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రేమను చూపించడం కాదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ కూడా ప్రేమకు సంకేతమే. మీరు అలసిపోయారని గమనించడం, భోజనం చేశారా అని అడగడం, మీకు ఇష్టమైన విషయం గుర్తుపెట్టుకోవడం, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించడం వంటి చిన్న పనులు మీపై అతనికి ఉన్న శ్రద్ధను చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఏ బంధంలోనైనా కోపం, నిరాశ, వాదనలు ఉండొచ్చు. అయితే కోపం

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా

శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడు జన్మించిన నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు. అందుకే 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా పవిత్రమైనది అంటారు. అంతే కాకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడుతుంటారు. అంతే కాకుండా వీరికి అందరినీ ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్లలో ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. అంతే కాకుండా వీరు మాట్లాడే విధానం కూడా అందరికంటే భిన్నంగా చాలా అందంగా ఉంటుంది. వీరు అందరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాత్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతే కాకుండా అందరి దృష్ణిని కూడా ఆకర్షిస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్‌గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల

ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు జటాయువు. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ జటాయువు జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో జటాయువు అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా

టర్కీలోని ఇస్తాంబుల్ తీరం మార్మరా సముద్రంలో ఘోర నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో టర్కీ పతాకంతో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక నౌకకు చెందిన 10 మంది సిబ్బందితో సంబంధాలు తెగిపోవడంతో వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు:నౌకల వివరాలు: కొకేలీ నుంచి అలియాగా వెళ్తున్న 'అల్సు' (Alsu) అనే కెమికల్ ట్యాంకర్, ఇస్కెందరున్ ఓడరేవు నుంచి కరాడెనిజ్ ఎరెగ్లీ వైపు వెళ్తున్న 'తుగ్బర్క్ ఇమామోగ్లు' (Tugberk Imamoglu) అనే బల్క్ క్యారియర్ నౌకలు సిలివ్రి తీరానికి 18 నాటికల్ మైళ్ల దూరంలో ఢీకొన్నాయి.కనిపించకుండా పోయిన సిబ్బంది: ప్రమాదం జరిగిన అనంతరం 'అల్సు' నౌకకు ఎటువంటి తీవ్ర నష్టం జరగనప్పటికీ, 'తుగ్బర్క్ ఇమామోగ్లు' నౌకతో పాటు అందులోని 10 మంది సిబ్బంది ఆచూకీ పూర్తిగా లభ్యం కాకుండా పోయింది. అధికారులు వారి మొబైల్ ఫోన్లకు కాల్స్ చేసినా ఎలాంటి సమాధానం రాలేదు.మునిగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర ఉపరితలంపై నౌకకు చెందిన లైఫ్-సేవింగ్ జాకెట్లు, పరికరాలు కొట్టుకొచ్చినట్లు గుర్తించారు. ప్రమాద స్థలి వద్దకు 14 రెస్క్యూ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను పంపి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు

జనసేన పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జై కొట్టు లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. ఈరోజు(బుధవారం) కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ లోగోను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నియంత జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పనిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ కాలికి గాయంతో ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. కాసేపటికే

ఈ రోజు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ రోజు “OG 2” సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాం అని ఆ మధ్య తమన్ ఊదరగొట్టారు. తమన్ పాటలు కంపోజ్ చెయ్యడం కన్నా హీరోలకు భజన చెయ్యడం, అభిమానులకు ట్విట్టర్ లో అప్డేట్స్ ఇవ్వడం గురించి ఎక్కువ టైం కేటాయిస్తుంటాడు అని అందరికీ తెలుసు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ ని కలిసి “OG 2” చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఐతే “OG 2” ఉంటుంది అని చెప్పారు కానీ ఎప్పుడు మొదలవుతుంది, నిర్మాత ఎవరు వంటి విషయాలను వెల్లడించలేదు. అలా పవన్ కళ్యాణ్ అలా అన్నారో లేదో, తమన్ (Thaman) ఆ సినిమా గురించి అప్పుడే ఎంతో హడావిడి చేశారు. సెప్టెంబర్ 2న ఉంటుంది చూస్కోండి, కాస్కోండి అంటూ రెచ్చిపోయారు తమన్. ఐతే, అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది మొదలుపెట్టాలని పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లో సుజీత్ ని నాని హీరోగా మొదలుపెట్టిన “బ్లడీ రోమియో”ని పూర్తి చేసుకోమని చెప్పారు. సుజీత్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కేరళలో ఆయన ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ మహిళా నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్‌గా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అర్వింద్‌కు శ్రావణి రాఖీ కట్టగా.. సోదరి భావంతో రాఖీ కట్టినందుకు కానుకగా తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కార్లలో ఒకదానిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో జగిత్యాల జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతున్న పాత నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన శ్రావణికి ఎంపీ అర్వింద్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కడాన్ని తట్టుకోలేని జగిత్యాల బీజేపీలోని ప్రత్యర్థి వర్గం ఎంపీ అర్వింద్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని, శ్రావణికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగతా నేతలను విస్మరిస్తున్నారంటూ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కారు గిఫ్ట్ వ్యవహారంపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్‌తో ఫోన్‌కాల్‌లో మాట్లాడిన ఆయన.. ఇది చాలా చిన్న విషయమని దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.'ఆ అమ్మాయి మున్సిపల్ ఛైర్మన్ పదవిని వదులుకొని బీజేపీలో జాయిన్ అయ్యింది. పద్మశాలి అమ్మాయి.. యంగ్‌స్టర్ కాబట్టి ఏడెనిమిది నెలలు బతిమిలాడుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ చేయించుకున్నా. ఆ ప్రభావంతో జగిత్యాలలో 45 వేల ఓట్లు వచ్చినయ్. లేకుంటే చరిత్రలో 3,4 వేలకు దిక్కులేదు. కారు గిఫ్ట్ ఇవ్వటం అనేది రాజకీయం కాదు. ప్రేమతో ఆశీర్వాదం అన్నట్లుగా ఇచ్చా. నా కార్యకర్తల కోసం చాలా చేశా. కార్యకర్తలకు కోట్లలో ఖర్చు పెట్టా. అది మా డాడీకి నేను కొనిచ్చిన కారు. ఆయన కాలం చేశాక.. అది అలా మూలన పడి ఉండటం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో గూగుల్ కాస్త వెనుకబడిందన్న చర్చ జరుగుతున్న వేళ.. ఆ కంపెనీ మళ్లీ దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా కోడింగ్ విభాగంలో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్‌ను ఢీకొట్టేందుకు కొత్త జెమినీ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం.. అంతర్గతంగా ‘స్కిమాకి’గా పిలుస్తున్న ఈ మోడల్‌ను జెమినీ 3.8 ఫ్లాష్ పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.ఈ మోడల్‌ను సెప్టెంబర్ 2నే విడుదల చేయొచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే గూగుల్ ఉద్యోగులు దీనిని అంతర్గతంగా పరీక్షించినట్లు సమాచారం. గూగుల్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ జెట్‌స్కీలో నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో కొందరు ఇంజినీర్లు ఆంథ్రోపిక్ ఓపస్ మోడల్ కంటే జెమినీ 3.8 ఫ్లాష్‌ను మెరుగ్గా భావించినట్లు తెలుస్తోంది.అయితే ఇది గూగుల్ తదుపరి ఫ్రాంటియర్ మోడల్ కాదు. ఫ్లాష్ మోడళ్లు తక్కువ పరిమాణంలో ఉండి.. వేగంగా, తక్కువ ఖర్చుతో స్పందించేలా రూపొందిస్తారు. వీటిని త్వరగా మార్చి, వివిధ విధానాలను ఏకకాలంలో పరీక్షించడం సులభం. అందుకే గూగుల్ ఇటీవలి కాలంలో ఫ్లాష్ మోడళ్లపై వేగంగా ప్రయోగాలు చేస్తోంది. జులైలో జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల కాగా.. మూడు వారాలకే 3.7 ఫ్లాష్ వచ్చింది.గూగుల్‌కు ఈ కొత్త మోడల్ కీలకంగా మారింది. జెమినీ 3.5 ప్రో అంతర్గత కోడింగ్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో దాని విడుదల ఆలస్యమైందని సమాచారం. మరోవైపు తదుపరి ఫ్లాగ్షిప్ మోడల్ జెమినీ 4 శిక్షణ దశలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. ఇంకా పోస్ట్-ట్రైనింగ్ పూర్తి చేసుకుంటోంది.ఇదే సమయంలో కోడింగ్ ఏఐ మార్కెట్లో పోటీ మరింత పెరిగింది. ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐతో

ఐదు కోట్ల వ్యూస్.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్ అంకిత్ బాల్యన్ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్ ఊహించి ఉండడు. గ్యాంగ్స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల ప్రకారం ఏకంగా 16 రౌండ్లు కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే’ అనే పాటలో అంకిత్ నటించాడు. అది యూట్యూబ్‌లో 54 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. అయితే ఈ పాటలోని సాహిత్యం ..2021లో రోహిణి కోర్టులో హత్యకు గురైన తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్ భావించింది. అంతేకాదు, ప్రత్యర్థి గ్యాంగ్‌కు అంకిత్ మద్దతు ఇస్తున్నాడన్న కక్షతోనే గోగి గ్యాంగ్ , అంకిత్‌ను దారుణంగా కాల్చి చంపింది. ఈ హత్య తర్వాత పోలీసులు వేగంగా స్పందించారు. గత నెల 31న దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా, ఎదురుకాల్పుల్లో మోహిత్, సుమిత్ అనే నిందితులు హతమయ్యారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే సీఎం ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటామని అంకిత్ భార్య హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్ లోను ఉంటే ఎవరు కట్టాలి? H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్ Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఆత్మకథ ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’పై కీలక ప్రకటన చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ (A. R. Rahman) అభిమానులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. రచయిత్రి రూపా చక్రవర్తి (Rupa Chakravarti) తో కలిసి తాను రాయబోయే ఆత్మకథ గురించి ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’ (Rahman A Renaissance) అనే పేరుతో రాయనున్న పుస్తకం కోసం రూపా చక్రవర్తి, తాను రచయితలుగా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకంలో ‘నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు, సృజనాత్మక ప్రయాణంపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నప్పుడు మౌంటెనీరింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇటీవలే తన 43 ఏళ్ల వయసులో యూరప్‌లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. తద్వారా ‘వయసు సంఖ్య మాత్రమే’ అని నిరూపించి వార్తల్లో నిలిచింది. మరి, వృత్తిరీత్యా యోగా టీచర్ అయిన శివానీకి పర్వతాహరోణ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? తెలుసుకుందాం రండి.. నిద్ర లేచింది మొదలు ఇంట్లో బాధ్యతలు, కెరీర్ బిజీలో పడిపోయి.. తమ అభిరుచుల్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు చాలామంది మహిళలు. కానీ కొందరు మాత్రం కాస్త లేటు వయసులోనైనా వీటిపై దృష్టి పెడుతూ తమను తాము నిరూపించుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుంటారు. శివానీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఉత్తరప్రదేశ్ సీతాపుర్‌కు చెందిన ఆమె.. వివాహం తర్వాత లక్నోలో స్థిరపడింది. పెళ్లయ్యాక గృహిణిగా, అమ్మగా బిజీగా మారిపోయింది. స్వతహాగా ఫిట్నెస్ లవర్ అయిన ఆమె.. సాహసాలు చేయడానికీ మక్కువ చూపుతుంది. ఈ ఇష్టమే తనను పర్వతారోహణ వైపు అడుగులేసేలా చేసిందంటోంది శివానీ. ‘ఓసారి స్నేహితులతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కింగ్‌కి వెళ్లా. అప్పుడే నాకు పర్వతారోహణ పరిచయమైంది. ఈ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఇక ముందూ మౌంటెనీరింగ్ చేయాలన్న కోరిక నాలో మొదలైంది. ఈ క్రమంలోనే కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు

రాజోలి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 3న గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 3న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయి ఐడీ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్రోత్సహించడమే ఈ ఎంపికల ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా యువజన క్రీడల అధికారి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: భాజపా రాజోలి: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, దాడి చేసిన వారిని వదిలేసి, పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్య అని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఐజ పట్టణంలో రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే, బాధితుల ఇళ్లకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ, మండల అధ్యక్షులు ముదిరాజ్ నర్సింహ, గోపాలకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే

తెలంగాణ క్రిటికల్ మినరల్స్ రంగంలో కీలక అడుగులు పడుతున్నాయి. మోనాష్, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి భాగస్వామ్యులుగా ఏర్పడి పరిశోధనలు చేయనున్నాయి. హైదరాబాద్, సెప్టెంబరు 1: తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ పరిశోధనలో కీలక అడుగులు పడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఇందుకోసం ముందుకొచ్చింది. మోనాష్-ఐఐటీ హైదరాబాద్- సింగరేణి మూడు సంస్థలూ కలిసి త్రిముఖ భాగస్వాములుగా ఏర్పడి క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనలు చేస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇకపై ఖనిజ అన్వేషణ, వెలికితీత, శుద్ధి సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్ రికవరీ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ పరిశోధనలు సఫలమైతే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ల ముడి పదార్థాల కొరతను అధిగమించగలమని పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే ఐఐటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామన్నారు

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Moral Story: అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక కాకి నివసిస్తుండేది. ఒకరోజు వేకువజామునే ఆహార వేట మొదలుపెట్టిన ఆ కాకికి, అదృష్టవశాత్తు ఒక రుచికరమైన మాంసం ముక్క దొరికింది. దాన్ని చూసి కాకి ఎంతో ఆనందపడింది. కానీ, చుట్టుపక్కల ఉన్న ఇతర పక్షులు లేదా గ్రద్దలు దానిని చూస్తే లాక్కుంటాయేమోనని భయపడింది. అందుకే ఎవరి కంటా పడకుండా, ప్రశాంతంగా కూర్చుని తినడం కోసం అడవికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉన్న ఒక ఎత్తైన మర్రిచెట్టు చిటారు కొమ్మపైకి వెళ్లి కూర్చుంది. అదే సమయంలో, ఆ అడవిలో ఒక నక్క తిరుగుతోంది. అది రెండు రోజులుగా ఏ ఆహారమూ దొరకక తీవ్రమైన ఆకలితో అల్లాడిపోతోంది. అటూ ఇటూ వెతుకుతుండగా, మర్రిచెట్టు కొమ్మపై మాంసం ముక్కతో కూర్చున్న కాకి దాని కంట పడింది. ఆ తాజా మాంసం ముక్కను చూడగానే నక్క నోటి నుండి లాలాజలం ఊరింది. కానీ కాకి చాలా ఎత్తులో ఉంచిన కొమ్మపై ఉంది, పైగా నక్క చెట్లు ఎక్కలేదు. దాంతో బలాన్ని ఉపయోగించి దాన్ని సాధించడం సాధ్యం కాదని గ్రహించిన నక్క, తన తెలివికి పదును పెట్టింది. నక్క నెమ్మదిగా చెట్టు కిందకు వచ్చి నిలబడి, ఎంతో వినయంగా కాకి వైపు చూస్తూ మాట్లాడటం ప్రారంభించింది. "ఓ కాకీ! ప్రశాంతమైన ఈ ఉదయాన నిన్ను ఇక్కడ చూడటం నా పూర్వజన్మ సుకృతం. ఆహా! ఎంతటి రాజసమైన రూపం నీది! నీ నలుపు ఈకలు సూర్యకాంతిలో నల్లటి పట్టులా ఎలా మెరుస్తున్నాయో చూడు. నీ కళ్ళు రత్నాల్లా ప్రకాశిస్తున్నాయి. నిజంగా ఈ అడవిలోని పక్షులన్నింటికీ నువ్వే అసలైన మహారాణివి" అని నక్క గట్టిగా

మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. అందువలన వీరికి అన్ని విధాలుగా ఇది చాలా మంచి సమయం. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే భూ వివాదంతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా ఇది వారికి చాలా అద్భుతమైన సమయం అవుతుంది. కన్యా రాశి : శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు తమ ఇంటిలో శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ ప్రదమైన సమయం అని చెప్పాలి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

కుంభ రాశి : కుంభ రాశి వారికి వినాయక చవితి తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ రాశుల వారు ఎక్కవ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి : మకర రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎవరు అయితే ఎదురు చూస్తు్న్నారో వారికి ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా, ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి మనన్నలు అందుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఈ రాశి వారికి చాలా వరకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకతతో పాటు మంచి సంపాదన సామర్థ్యం కలిగి ఉంటారని నమ్మకం. ఇంటర్నెట్ డెస్క్: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. ఈ సంఖ్యకు శుక్రుడు అధిపతిగా భావిస్తారు. ప్రేమ, అందం, కళలు, సౌకర్యాలు, సంపద వంటి అంశాలకు శుక్రుడిని ప్రతీకగా చెబుతారు. మూల సంఖ్య 6 ఉన్నవారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రశాంతమైన స్వభావం, స్నేహపూర్వక ప్రవర్తన కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కుటుంబం, స్నేహితులు, బంధాలకు వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. తమకు ఇష్టమైన వారికి కష్టసమయంలో అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. అలాగే కళలు, అందం, సృజనాత్మకతపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. మూల సంఖ్య 6 ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. బాధ్యతగా వ్యవహరించడంతో పాటు కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ముందుంటారు. ఫ్యాషన్, కళలు, సంగీతం, సినిమా, హోటల్ రంగం, విద్య, ఇంటీరియర్ డిజైన్, వ్యాపారం, నిర్వహణ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. వీరికి సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుందని చెబుతారు. అయితే విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడటం వల్ల కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అందుకే బడ్జెట్‌ను పాటించడం, పొదుపుపై దృష్టి పెట్టడం వీరికి ముఖ్యమని సూచిస్తారు. ప్రేమ, వివాహం విషయంలో మూల సంఖ్య 6 ఉన్నవారు నిజాయతీగా, ప్రేమగా, అంకితభావంతో ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. తమ జీవిత భాగస్వామి సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. బంధాలను నిలబెట్టుకోవడానికి శ్రద్ధ చూపడంతో పాటు.. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలంటే మూల సంఖ్య 6 ఉన్నవారు ఖర్చుల విషయంలో నియంత్రణ

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్, ఆస్ట్ఫాలియా, గొట్టింగెన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్ క్యాంపస్లుఅంతేకాదు బోస్టన్ లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ జపాన్‌లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

వరదల కారణంగా నేపాల్ సర్వం కోల్పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలకొద్దీ గృహాలు వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. ఇంటర్నెట్ డెస్క్: వరదల కారణంగా నేపాల్ సర్వం కోల్పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలకొద్దీ గృహాలు వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. జనం తమ ఇళ్ల శిథిలాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు పెంపుడు కుక్కలు తమ యజమానుల కోసం ఇళ్ల శిథిలాల దగ్గర పడిగాపులు కాస్తున్నాయి. శునకాల ఎదురుచూపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో.. ధుంగే ప్రాంతంలో లిల్లీ అనే కుక్క యజమానుల కోసం ఇంటి శిథిలాల దగ్గర ఎదురుచూస్తోంది. అది అక్కడినుంచి పక్కకు వెళ్లడంలేదు. తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా కనిపించకపోతారా? అని ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. అయితే, దానికి తిండి పెట్టిన యజమానితో పాటు ఆ ప్రాంతంలోని చాలా మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభించలేదు. మరో వీడియోలో.. వరద కారణంగా ధ్వంసం అయిన బిల్డింగ్‌లోకి చేరి యజమానుల కోసం ఓ కుక్క ఎదురుచూస్తోంది. ఇంకో వీడియోలో.. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ కుక్క తన యజమానిని చేరుకుంది. కుక్కతో పాటు యజమాని కూడా ఎంతో సంతోషించింది. శునకాలకు సంబంధించిన పదుల సంఖ్యలో వీడియోలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’లో అదరగొట్టిన ఎస్-400కు మరో ఆర్డర్! ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

singer murder case:54 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించిన ఓ పాటలో నటించిన యువ సింగర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ పాటలోని వివాదాస్పద అంశాలే హత్యకు కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యాన్వీ సింగర్ అంకిత్ బాల్యాన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కేవలం 28 ఏళ్ల వయసున్న అంకిత్ ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంకిత్ నటించిన ఓ పాట ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘భరీ కోర్ట్ మే గోలి మారేంగే’ అనే పాట యూట్యూబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ పాటకు ఏకంగా 54 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే పాటలోని కొన్ని పదాలు ఓ గ్యాంగ్‌కు ఆగ్రహం తెప్పించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ పాటలోని లిరిక్స్ తమ నాయకుడిని అవమానించేలా ఉన్నాయని గోగి గ్యాంగ్ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. 2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రత్యర్థి గ్యాంగ్‌తో జరిగిన ఘర్షణలో జరిగింది. అంకిత్‌కు ప్రత్యర్థి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని గోగి గ్యాంగ్ అనుమానించినట్లు సమాచారం. అంకిత్, ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో కూడా అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పాటలో కేవలం నటించానని, పాటకు సంబంధించిన లిరిక్స్ లేదా మ్యూజిక్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంకిత్ గతంలోనే స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అతడిపై అనుమానాలు తగ్గలేదని పోలీసులు చెబుతున్నారు. గతంలో అంకిత్‌కు బెదిరింపులు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాడికి ముందు నిందితులు షామ్లీలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక పాటకు వచ్చిన భారీ

పరిహారం చేసేవాళ్లు ఇది గుర్తుంచుకోండి.. చాణక్యుడు చెప్పిన గుట్టు ఇదే!పరిహారం చేసేవాళ్లు ఇది గుర్తుంచుకోండి.. చాణక్యుడు చెప్పిన గుట్టు ఇదే! Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి చాణక్య నీతి ప్రకారం వ్యక్తిగత పరిహారాలు ఇతరులకు అస్సలు చెప్పకూడదు ఇంకా చెప్పాలంటే వీటిని గోప్యంగా ఉంచాలి వీటిని గోప్యంగా ఉంచాలి పరిహారం గురించి బయట వాళ్ళతో అస్సలు చర్చించకూడదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్య నీతి చెబుతుంది వ్యక్తిగత సమస్యలు, జరగబోయే ముందు విషయాలను పంచుకోవద్దని చాణక్యుడు గట్టిగా చెప్పారు వ్యక్తిగత సమస్యలు పరిహారం ఫలితంపై మీకు నమ్మకం ఉంటేనే మీరు ఇతరులకు చెప్పండి అది మీ విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు మీ విశ్వాసాన్ని దెబ్బతీసేలా జ్యోతిష్య పరిహారాలు చేసే వారు అవసరమైన వారికి తప్ప ఇతరుల దగ్గర మాట జారవద్దు ఇతరుల దగ్గర మాట జారవద్దు నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్నాలజీ సెక్టార్ కంపెనీ టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్ (TCC Concept Limited) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సెప్టెంబర్ 4గా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఈ కంపెనీ స్టాక్ ఈ ఏడాది 2026 ఫిబ్రవరి నెలలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం విశేషం. ఆరు నెలల్లోనే తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 100 షేర్లు కొని ఉంటే 500 షేర్లుగా మారనున్నాయి.అయితే సెప్టెంబర్ 4వ తేదీకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. 3 రోజుల్లో ఈ కంపెనీ షేర్స్ ఎక్స్ - స్ప్లిట్ ట్రేడింగ్ చేయనున్నాయి. ఆలోపు షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది. ప్రతి ఒక్క షేరు 5 షేర్లుగా మారనున్నాయి. అయితే, అందుకు తగినట్లుగానే ఈ స్టాక్ ధర తగ్గుతుందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కానీ, పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కంపెనీ షేరు గత 6 నెలల కాలంలో 52 శాతం వరకు నష్టపోయింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 225 సమీపంలో ఉన్న షేర్ ధర రూ. 45ల స్థాయికి దిగివస్తుంది.Read Also: Stock Split: 6 నెలల్లోనే పెట్టుబడి ట్రిపుల్.. లక్షకు రూ.3.45 లక్షలు.. ఇప్పుడు 1 షేరు కొంటే 10 షేర్లుగా మారుస్తోన్న కంపెనీ!కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. టీసీసీ కాన్సెప్ట్ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీస్ యాక్ట్ 2013 లోని సెక్షన్ 61కి అనుగుణంగా 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 షేర్స్ గా స్ప్లిట్ చేసేందుకు ఆమోదం

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్‌డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్‌డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్‌డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమా ముచ్చట్లకు ఎంత క్రేజ్ ఉందో.. సెలబ్రిటీల జాతకాలపై వచ్చే వార్తలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పే జోస్యాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గతంలో ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజం కావడంతో, ఈయన చేసే వ్యాఖ్యలపై అందరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఈమధ్య సినిమావాళ్ల జాతకాల గురించి కామెంట్స్ మానేశాడు వేణు స్వామి. స్టార్స్ పర్సనల్ లైఫ్ పై వాఖ్యలు చేసి కేసలు ఫేస్ చేసిన ఆయన కామ్ అయ్యాడు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న వేణు స్వామి.. ఈమధ్య కాలంలో మళ్లీ కాంట్రవర్సీలను కదిలిస్తున్నాడు. సినిమా వాళ్లకు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా జాతకాలు చెపుతూ.. హోమాలు పూజలు చేయించే వేణుస్వామి.. సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంత పేరున్న ఆయన జాతకం చెపితే ఎంత తీసుకుంటాడన్న అనుమానం చాలామందిలో ఉంది. కొంత మంది జనాల్లో వేణు స్వామి జాతకం చెప్పడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, ఈ అపోహను ఆయన పూర్తిగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద జ్యోతిష్యులు రూ. 50,000, రూ. 30,000 తక్కువలో తక్కువగా రూ. 16,000 వరకు వసూలు చేస్తుంటే, తాను మాత్రం కేవలం రూ. 6,000 మాత్రమే తీసుకుంటానని వేణుస్వామి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తన ఫీజులో ఎలాంటి మార్పు లేదని, కిందటి నుంచి చూస్తే అత్యంత తక్కువ ఫీజు తీసుకునే జ్యోతిష్యులలో తాను నాలుగో స్థానంలో ఉంటానని ఆయన చెప్పారు. పూజలు చేయడం విషయంలో తాను ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తానని వేణు స్వామి అన్నారు. వ్యక్తి ఆర్థిక స్థితిని బట్టి పూజల ఖర్చు నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లు లేదా రూ. 10 కోట్లు ఉన్నవారికి రూ. 5 లక్షల పూజలు సూచిస్తే, ఆర్థికంగా అంత వెసులుబాటు

Navapanchama Rajayoga: గ్రహ మండలంలో దేవు గురువు బృహస్పతి రాక్షస గురువు అయిన శుక్రులు తమ కదలికతో నవ పంచమ రాజ యోగం ఏర్పడింది. దీంతో ఈ 5 రాశుల దశ, దిశ విధి రాత మారబోతుంది. అంతేకాదు ఆకస్మిక సంపదతో పాటు లాభాలను తీసుకురాబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారం ఘోషిస్తుంది. Navapanchama Rajayoga Effect 2026: అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారము తరువాత, శుక్రుడు బృహస్పతితో కలిసి నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.. రాక్షస గురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు... మిథునరాశిలో ఉన్న దేవ గురువు బృహస్పతితో కలిసి నవపంచమ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఐదవ ఇల్లు జ్ఞానం, ప్రేమ, అనురాగం, భావోద్వేగాలకు ప్రతీక. తొమ్మిదవ ఇల్లు అదృష్టం, మతంతో పాటు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అందువల్ల, నవ పంచమ యోగం ఏర్పడటం కొన్ని రాశుల వారికి మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి... సింహ రాశి: సింహ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు వారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. శుక్రుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన నవ పంచమ కలయిక సమయంలో గత ప్రయత్నాలతో గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు కోరుకున్న ఒప్పందాలను చేసుకుంటారు. మిథున రాశి: మిథున రాశి వారి తెలివితేటలు, జ్ఞానంలో పెరుగుదలను అనుభవిస్తుంటారు. ఇది వారి విద్యలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన ఏదైనా డబ్బు తిరిగి పొందవచ్చు. అదృష్టం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు, బృహస్పతి నవ పంచమ కలయిక వలన కుంభ రాశి వారికి

దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ మాసం మేష రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరపు నుంచి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాసం చివరన బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఈ మాసం వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లితరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిథున రాశివారికి ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధు మిత్రుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో ఉన్న వివాదాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు

కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన