
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
© 2026 nimisham.in

Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?

NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్‌టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. 2018లో విడుదలైన 'పద్మావత్' చిత్రంలోని 'జోహార్' (సామూహిక ఆత్మాహుతి) ఘట్టాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కర్ణిసేన వంటి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వర భాస్కర్, శత్రువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు ఆత్మాహుతి చేసుకోవడాన్ని గొప్పగా చిత్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను నేను పిరికిదానిలా భావించాలా? అత్యాచార ఘటనలు పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో బాధితులకు మనం ఇలాంటి సందేశమే ఇవ్వాలనుకుంటున్నామా?" అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను రాణి పద్మావతిని ఉద్దేశించి 'పిరికిపంద' అనే పదాన్ని వాడలేదని ఆమె వివరణ ఇచ్చారు.ఈ వివాదంపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. స్వర భాస్కర్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. మహిళలు తోటి మహిళలను గౌరవించుకోవాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోవైపు, హిందూ సమాజాన్ని, రాజపుత్ర మహిళలను కించపరిచారంటూ బీహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణ కుమార్ సింగ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.కర్ణిసేన సైతం స్వర భాస్కర్‌ను తీవ్రంగా హెచ్చరించింది. "హిందూ యోధురాళ్లను, వారి అత్యున్నత త్యాగాలను అవమానిస్తే కర్ణిసేన ఎప్పటికీ క్షమించదు" అని ఆ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు కీర్తి రాథోడ్ స్పష్టం చేశారు. కేవలం హిందూ సంప్రదాయాలను
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్‌గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్‌వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను

‘ఇరుముడి’ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇటీవల తిరుపతి పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఈ సందర్భంగా శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ‘‘రెండు రోజుల క్రితం నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఓ మహిళ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ‘సార్.. నేను గవర్నమెంట్ టీచర్ని.. మీరు సినిమా అంతా చాలా బాగా తీశారు కానీ, ప్రభుత్వ పాఠశాల సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. సేమ్ యూనిఫామ్‌లు, సేమ్ టీచర్లను అలా ఎందుకు చూపించారు?’ అని అడిగారు. అప్పుడు నేను ఆమెకు సినిమా ప్రారంభ సన్నివేశాలను గుర్తుచేశాను’’ అని తెలిపారు. ‘‘సినిమా ప్రారంభంలోనే హీరో ఊరైన పొల్లూరులో ఎలిమెంటరీ స్కూల్లో ఎంతో అంకితభావం కలిగిన ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చూపించాం. ఆయన పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత చక్కగా మాట్లాడతారో అందరూ చూశారు. సినిమా క్లైమాక్స్ ఎండ్ సీన్లో కూడా పాపను తిరిగి ఆయనే తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్‌బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్‌తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు. పాకిస్థాన్ నాలుగు సభ్యుల సెలక్షన్ ప్యానెల్లో ఉన్న ఆకిబ్ జావేద్.. కండరాల గాయం కారణంగా ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గాయాలు క్రికెట్లో సహజమేనని, గతంలో ఆటగాళ్లు గాయాలతోనూ కట్టులు కట్టుకుని బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ఇమామ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. లార్డ్స్ టెస్టు తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ ఎడమ కాలి పిక్కకు గాయమైంది. దీంతో మ్యాచ్‌లో మిగిలిన భాగానికి అతడు దూరమయ్యాడు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇమామ్ మైదానంలోని అవుట్‌ఫీల్డ్‌లో కనిపించాడు. కాలికి భారీగా కట్టు కట్టుకుని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అతడు నడిచేటప్పుడు కుంటుతూ కనిపించడం చర్చకు దారితీసింది. లార్డ్స్ టెస్టు కోసం తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలపైనా ఆకిబ్ జావేద్ స్పందించారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉబైద్ షాను జట్టులోకి తీసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. వికెట్ కీపర్-బ్యాటర్ ఘాజీ ఘోరీకి అవకాశం ఇవ్వాలని, మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని ఆడించాలని తాను అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే తుది జట్టు ఎంపికలో తన సూచనలు పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు. హెడ్డింగ్లీ, లార్డ్స్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Womens Turn Waste Into Wealth: చెత్త.. అనే పదం వినగానే అందరూ ముక్కు మూసుకుంటూ ఉంటారు.. అలాంటిది ఆ చెత్తనే తమ సంపాదనగా మార్చుకున్నారు త్రిపుర రాష్ట్రంలోని కోవాయ్ పట్టణానికి సంబంధించిన 100 మంది మహిళలు.. ఒకప్పుడు సమాజంలో చెత్త ఏరుకునే వారు అని పిలుచుకుంటూ అగౌరవానికి గురైన వారు.. ఇప్పుడు ఏకంగా ఒక వ్యవస్థకే యజమానులుగా మారారు.. వారి కృషితో ఇప్పుడు పట్టణం చెత్త కుండీలు లేని నగరంగా మారిపోయి దేశానికే ఆదర్శనీయంగా నిలిచింది. పింకీ కర్ దేబ్ అని మహిళ గత తొమ్మిదేళ్లుగా చెత్తను సేకరించే పని చేసే వారట.. ఎలాంటి గ్లౌజులు లేకుండా.. చేతులతోనే చెత్తను వేరు చేసేదట.. మురుగు వాసన వచ్చే ఆ చెత్తలో పని చేస్తుంటే.. అటుగా వెళ్లే వారంతా ముక్కున వేలేసుకునే వారట.. కానీ నేడు పరిస్థితి ఊహించని స్థాయిలో మారింది.. పింకీ ఇప్పుడు ఒక చెత్త నిర్వాహణ కేంద్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టింది.. మాస్క్ లేకుండా దర్జాగా తన ఆఫీసులో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆమె ఒక కార్మికురాని స్థాయి నుంచి ఓనర్ స్థాయికి ఎదిగారు.. ఈ మార్పు వెనక ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన కూడా ఉంది. కోవాయ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నిర్మల్ కుమార్ ఒకసారి గుజరాత్ లోని అముల్ కోఆపరేషన్ సందర్శించింది.. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులతో ఎందుకు ఒక సొసైటీని ఏర్పాటు చేయకూడదు అన్న ఆయన ఆలోచనే..కోవాయ్ వేస్ట్ టు వెల్త్ ప్రొడ్యూసర్ సొసైటీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha sensational comments on cm revanth reddy: మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పిలవలేదని కాసేటికి క్రితం చెప్పారు. అయితే.. తాజాగా.. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయన .. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ వేదికగా తిరుగుబావుట ఎగురవేశారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పలేదన్నారు. అంతే కాకుండా వివాదాలల్లో.. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?.. అంటూ ఫైర్ అయ్యారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు?.. ఏం చర్యలు తీసుకుంటారు?.. అంటూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరం వినిపించారు. అంతే కాకుండా తన వివాదంకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కు అన్ని విషయాల్ని రాతపూర్వకంగా తెలియజేసినట్లు మంత్రి కొండాసురేఖ తెల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సీఎం రేవంత్ పై మండిపడిన మంత్రి కొండా
సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమా కంటే ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఎవరికీ తెలియదంటూ ఆయన చేసిన కామెంట్స్ కన్నడ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ సంచలన వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్‌కు గట్టి మద్దతు తెలిపారు. అరవింద్ అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆర్జీవీ విశ్లేషించారు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన కథలు నటీనటులను రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్లుగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు. అరవింద్ చెప్పిన విశ్లేషణను సాధారణ కోణంలో చూడాలని, అందులో ఎలాంటి వివాదం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ‘బాహుబలి’ లాంటి వండర్ రాకముందు బాలీవుడ్ లేదా ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా తెలియదని, అలాగే ‘కాంతార’ సినిమా సంచలనం సృష్టించే వరకు రిషబ్ శెట్టి ఇమేజ్ పరిమితంగానే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. అదే క్రమంలో ‘కేజీఎఫ్’ విజయంతోనే యశ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందనే ఉద్దేశంతోనే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి విశ్లేషణను జోడిస్తూ, మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్‌ఫాదర్’ లేదా క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాల్లో నటుల ఇమేజ్ కంటే కథా బలమే ప్రధాన పాత్ర పోషిస్తుందని వర్మ అన్నారు. ఒక మంచి అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా అహంకారంతో ఆలోచించే వారే వ్యక్తిగతంగా తీసుకుని వివాదాలు సృష్టిస్తారని ఘాటుగా విమర్శించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కన్నడ వర్సెస్ టాలీవుడ్ తరహాలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న వేళ ఆర్జీవీ ఇచ్చిన ఈ వివరణ కొత్త చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీలో ఒక నిజమైన
బాదం గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ వాల్నట్స్ తింటే చదివింది బాగా గుర్తు ఉంటుంది. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి నరాల పనితీరును బాగుచేస్తాయి. మెదడును చురుకుగా ఉంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది. పల్లీల్లో నియాసిన్, రెస్వెరట్రాల్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే చిక్కీలు తినడం ద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మఖానాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో తేలికగా వేయించిన ఈ మఖానా స్నాక్ రూపంలో తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడు కణాలను రక్షిస్తుంది. అందుకే ఉసిరిని డైట్లో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపశక్తి బాగుంటుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి. తద్వారా చదివింది బాగా గుర్తుంటుంది. రాగాలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు లాంటి చిరు ధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీ శక్తిని ఎక్కువసేపు తగ్గకుండా కాపాడి మెదడును చురుకుగా ఉంచుతాయి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా

ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు జటాయువు. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ జటాయువు జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో జటాయువు అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ మహిళా నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్‌గా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అర్వింద్‌కు శ్రావణి రాఖీ కట్టగా.. సోదరి భావంతో రాఖీ కట్టినందుకు కానుకగా తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కార్లలో ఒకదానిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో జగిత్యాల జిల్లా, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతున్న పాత నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన శ్రావణికి ఎంపీ అర్వింద్ ప్రాధాన్యం ఇవ్వడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.శ్రావణికి ప్రత్యేక ప్రాధాన్యత దక్కడాన్ని తట్టుకోలేని జగిత్యాల బీజేపీలోని ప్రత్యర్థి వర్గం ఎంపీ అర్వింద్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని, శ్రావణికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగతా నేతలను విస్మరిస్తున్నారంటూ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కారు గిఫ్ట్ వ్యవహారంపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్‌తో ఫోన్‌కాల్‌లో మాట్లాడిన ఆయన.. ఇది చాలా చిన్న విషయమని దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.'ఆ అమ్మాయి మున్సిపల్ ఛైర్మన్ పదవిని వదులుకొని బీజేపీలో జాయిన్ అయ్యింది. పద్మశాలి అమ్మాయి.. యంగ్‌స్టర్ కాబట్టి ఏడెనిమిది నెలలు బతిమిలాడుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ చేయించుకున్నా. ఆ ప్రభావంతో జగిత్యాలలో 45 వేల ఓట్లు వచ్చినయ్. లేకుంటే చరిత్రలో 3,4 వేలకు దిక్కులేదు. కారు గిఫ్ట్ ఇవ్వటం అనేది రాజకీయం కాదు. ప్రేమతో ఆశీర్వాదం అన్నట్లుగా ఇచ్చా. నా కార్యకర్తల కోసం చాలా చేశా. కార్యకర్తలకు కోట్లలో ఖర్చు పెట్టా. అది మా డాడీకి నేను కొనిచ్చిన కారు. ఆయన కాలం చేశాక.. అది అలా మూలన పడి ఉండటం

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం

ఈ ఆదివారం జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ సందడి చేయబోతోంది. అందులో పాత కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సుధీర్, ధనరాజ్, గెటప్ సీను, చంటీ, ఇలా అందరు సందడి చేయడంతో పాటు 13 ఏళ్ల కిందటి జబర్దస్త్ వాతావరణానికి మళ్లీ క్రియేట్ చేయబోతున్నారు. ఈక్రమంలో నాగబాబు, ధనరాజ్, ఇంద్రజల మధ్య జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పూయించాయించగా.. తాగుబోతు రమేష్, దీప్తి నల్లమోతు , రోహినీ ల కామెడీ కడుపుబ్బా నవ్వించింది. వీటితో పాటు సుధీర రష్మీల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. రష్మీ సుధీర్ పై చేసిన కామెంట్స్.. ఆమె బోరున విలపించడం అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్‌ల జంట ప్రేక్షకుల్లో పత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ షో టీఆర్పీ రేటింగ్స్‌ను విశేషంగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరు స్కిట్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ పెడితే.. ఆరోజు ఆడియన్స్ కు పండగే.. ఇక ఆతరువాత కాలంలో సుధీర్ వెండితెరపై అవకాశాలు అందుకోవడంతో జబర్దస్త్ నుంచి బయటకు రాగా, రష్మీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే చాలా విరామం తర్వాత సుధీర్ తిరిగి జబర్దస్త్ వేదికపైకి రావడం, ఆ సమయంలో రష్మీ తీవ్ర భావోద్వేగానికి గురికావడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు రీ-ఎంట్రీతో జబర్దస్త్ షోకి కొత్త కళ వచ్చి చేరింది. ఆయనతో పాటు చంటి, ధనరాజ్, హైపర్ ఆది, సద్దాం వంటి పాత కమెడియన్లు తిరిగి స్టేజ్‌పై అలరిస్తున్నారు. ఈ వరుసలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పైకి అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్అయిన ప్రోమోలో హైపర్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. మ్యాచ్ మధ్యలో కాలి కండరాలు పట్టేయడంతో అతను రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు ఆదేశించడంతో పాక్ క్రికెట్లో కలకలం రేగింది.లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావేద్ ఈ విషయంపై స్పందించాడు. "కేవలం కండరాలు పట్టేసిన గాయంతో ఒక ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌లలో ఎలా బ్యాటింగ్‌కు రాలేకుండా ఉంటాడు? ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఓ స్థానిక టీవీ ఛానెల్‌తో అన్నాడు. "గతంలో ఆటగాళ్లు ఫ్రాక్చర్లతో కూడా జట్టు కోసం మైదానంలోకి వచ్చారు. ఇది చాలా తీవ్రమైన విషయం, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశాడు.మరోవైపు, పీసీబీ విచారణను ఎదుర్కోవడానికి ఇమామ్ న్యాయవాది సహాయం తీసుకునే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామంతో ఇమామ్ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. సిరీస్‌లో వరుస ఓటముల నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇమామ్‌తో పాటు మరో ఆరుగురు ఆటగాళ్లను, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను వెంటనే ఇంగ్లండ్ నుంచి వెనక్కి పిలిపించింది.సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న ఆఖరి టెస్టుకు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, బౌలింగ్ కోచ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత

హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు గాను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్(Hitech City Railway Station)లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు రెండు విడతల్లో స్టాపింగ్స్: అదనపు చార్జీలు లేకుండా మార్పు: నరసాపూర్ - లింగంపల్లి, కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో స్టాపింగ్‌ను రెండు విడతల్లో పొడిగించారు. మొదటి విడతగా దసరా, దీపావళి రద్దీ కోసం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు, రెండో విడతగా క్రిస్మస్, సంక్రాంతి కోసం డిసెంబర్ 18 నుంచి జనవరి 19 వరకు ఈ రైళ్లు ఆగుతాయి. లింగంపల్లి నుండి బోర్డింగ్ ఉన్న ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి సులభంగా మార్చుకోవచ్చని సూచించారు. చార్లపల్లి - తిరుచానూర్ ప్రత్యేక రైళ్లు: పండుగ ప్రయాణికులకు ఊరట: మరోవైపు ఆధ్యాత్మిక యాత్రికుల కోసం చార్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 4న చార్లపల్లి నుండి, సెప్టెంబర్ 5న తిరుచానూర్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట
Yash Baxi World Record 2026 : ఏ చిన్న లెక్క చేయాలన్నా ఇప్పడందరూ ఫోన్లోనే కాలుక్యులేటర్ ఓపెన్ చేసి లెక్కించేస్తారు. లేదంటే ఏఐ, గూగుల్ సాయంతో తమకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు. కానీ మనసులోనే 120 దేశాల్లో ఎక్కడెంత టైమ్ అవుతుందని కేవలం 5 నిమిషాల్లోనే చెప్పి ప్రపంచ రికార్డు సాధించాడు అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువకుడు. 21 ఏళ్ల వయసు కల్గిన యశ్ హేమాంగ్ బక్షి ఈ రికార్డును సాధించగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి డివైజ్‌లు, చార్టులు, కనీసం కాగితం సహాయం లేకుండా కేవలం తన మెదడు శక్తితోనే 120 దేశాల స్థానిక సమయాన్ని 5.14 నిమిషాల వ్యవధిలోనే లెక్కించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. ప్రపంచంలోని వివిధ కాలమానాలు, అర్ధగంట, 45 నిమిషాల తేడాల వ్యత్యాసాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గణించి అందరినీ ముగ్ధులను చేశాడు.పాత రికార్డును తిరగరాసిన యష్ బక్షి..!గతంలో భారత ప్రమాణ సమయం ఆధారంగా 101 దేశాల స్థానిక సమయాన్ని 14 నిమిషాల 42 సెకన్లలో లెక్కించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లలో యశ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈసారి తన స్వంత రికార్డునే తిరగరాస్తూ.. ఏకంగా 120 దేశాల సమయాన్ని కేవలం 5.14 నిమిషాల్లోనే చెప్పి సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. 'వరల్డ్ రికార్డ్ యూనియన్' ప్రతినిధి షరీఫా హనీఫా ఈ ఘనతను స్వయంగా పరిశీలించి అధికారికంగా ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అబ్బురపరుస్తోన్న హైదరాబాదీ ఫ్యామిలీయశ్ సాధించిన ఈ అరుదైన మైలురాయి వెనుక ఆయన గురువు కమలేష్ సుర్తి ఎంతో శ్రమించారు. గత కొన్నేళ్లుగా యశ్‌కు శిక్షణ ఇస్తున్న కమలేష్ సుర్తి.. బట్టీ పట్టే విధానం కాకుండా విద్యార్థులలోని సహజ ప్రతిభను గుర్తించి దానికి తగిన శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధులు. "యశ్

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం. మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు. దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'. మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తెరిచిన ఈ సెంటర్ భారత్‌లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది. టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది. ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్‌కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్‌ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Moral Story: అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక కాకి నివసిస్తుండేది. ఒకరోజు వేకువజామునే ఆహార వేట మొదలుపెట్టిన ఆ కాకికి, అదృష్టవశాత్తు ఒక రుచికరమైన మాంసం ముక్క దొరికింది. దాన్ని చూసి కాకి ఎంతో ఆనందపడింది. కానీ, చుట్టుపక్కల ఉన్న ఇతర పక్షులు లేదా గ్రద్దలు దానిని చూస్తే లాక్కుంటాయేమోనని భయపడింది. అందుకే ఎవరి కంటా పడకుండా, ప్రశాంతంగా కూర్చుని తినడం కోసం అడవికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉన్న ఒక ఎత్తైన మర్రిచెట్టు చిటారు కొమ్మపైకి వెళ్లి కూర్చుంది. అదే సమయంలో, ఆ అడవిలో ఒక నక్క తిరుగుతోంది. అది రెండు రోజులుగా ఏ ఆహారమూ దొరకక తీవ్రమైన ఆకలితో అల్లాడిపోతోంది. అటూ ఇటూ వెతుకుతుండగా, మర్రిచెట్టు కొమ్మపై మాంసం ముక్కతో కూర్చున్న కాకి దాని కంట పడింది. ఆ తాజా మాంసం ముక్కను చూడగానే నక్క నోటి నుండి లాలాజలం ఊరింది. కానీ కాకి చాలా ఎత్తులో ఉంచిన కొమ్మపై ఉంది, పైగా నక్క చెట్లు ఎక్కలేదు. దాంతో బలాన్ని ఉపయోగించి దాన్ని సాధించడం సాధ్యం కాదని గ్రహించిన నక్క, తన తెలివికి పదును పెట్టింది. నక్క నెమ్మదిగా చెట్టు కిందకు వచ్చి నిలబడి, ఎంతో వినయంగా కాకి వైపు చూస్తూ మాట్లాడటం ప్రారంభించింది. "ఓ కాకీ! ప్రశాంతమైన ఈ ఉదయాన నిన్ను ఇక్కడ చూడటం నా పూర్వజన్మ సుకృతం. ఆహా! ఎంతటి రాజసమైన రూపం నీది! నీ నలుపు ఈకలు సూర్యకాంతిలో నల్లటి పట్టులా ఎలా మెరుస్తున్నాయో చూడు. నీ కళ్ళు రత్నాల్లా ప్రకాశిస్తున్నాయి. నిజంగా ఈ అడవిలోని పక్షులన్నింటికీ నువ్వే అసలైన మహారాణివి" అని నక్క గట్టిగా

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్‌కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్‌ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇంట్లో కాఫీ తాగుతూ సరదాగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు నందమూరి దీపికా జానకిరామ్

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్
ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో మనం బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎఫెక్ట్ అవుతుందని తేలింది. ప్రీ డయాబెటిస్ ఉన్న 297 మంది పెద్దవారిపై జరిగిన పరిశోధనలో శక్తి వినియోగం, శరీర కొవ్వు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఆలస్యంగా భోజనం ప్రారంభించడం, హై ఫాస్టింగ్ ఇన్సులిన్, హై ఇన్సులిన్ రెసిస్టెన్స్, లో ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉందని తేలింది. కొన్నిసార్లు సెకండ్ మీల్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. అదేంటంటే ప్రీ డయాబెటిస్ ఉన్న ఆసియాలోని మగవారిపై జరిగిన ఓ నియంత్రిత అధ్యయనంలో బ్రేక్‌ఫాస్ట్ మానేసిన వారి కంటే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నవారిలో మధ్యాహ్నా లంచ్ టైమ్‌కి గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందన తగ్గింది. దీనిని బట్టి, మార్నింగ్ సరైన ఫుడ్ తింటే ఆ రోజు తర్వాత శరీర జీవక్రియ ప్రతిస్పందనకి సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే, బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు. అందులో ఏమైనా తినొచ్చు అంటే పొరపాటే. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ కలిపిన తృణధాన్యాలు, స్వీట్ డ్రింక్స్, హై గ్లైసెమిక్ ఫుడ్‌తో నిండిన హెవీ బ్రేక్‌ఫాస్ట్ అనేది గ్లూకోజ్, ఇన్సులిన్‌లో పెరుగుదలకి దారితీస్తుంది. వాస్తవానికి, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో హై ఎనర్జీ ఫుడ్ ఏదైనా ఉందంటే అది బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలని ఎక్కువగా ఉత్పత్తి చేయగలదని తేలింది. అయినప్పటికీ మొత్తం 24 గంటల గ్లూకోజ్‌పై ఆ ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు కేవలం బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు అనుకోకుండా ఎప్పుడు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారో గమనించుకోవాలి. మార్నింగ్ కేలరీలని తీసుకోవడం కంటే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, లో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న భోజనాన్ని తీసుకోవడం చాలా మంచిది. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఓ భాగం మాత్రమే. అదే ప్రీ డయాబెటిస్‌కి ట్రీట్మెంట్ కాదు. మంచి ఫిజికల్ వర్కౌట్, హెల్దీ వెయిట్ మెంటెయిన్ చేస్తూ

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

టీమిండియాలోకి తిరిగి రావడంపై భారత బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు సాధిస్తూ తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు.టీమిండియాలోకి పునరాగమనంపై మంగళవారం కోయంబత్తూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రుతురాజ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ.. ‘‘చాలా నమ్మకంగా ఉన్నా. మళ్లీ వెళ్లి పరుగులు చేయడంపైనే దృష్టి. ఇన్నాళ్లూ పరుగులు సాధిస్తూనే ఉన్నా. ఇక నిలకడగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురుచూడాలి’’ అని చెప్పాడు.ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోసం దేశవాళీ క్రికెట్లో రుతురాజ్ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. దేశవాళీ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో రాబోయే టోర్నీలపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.ఇదిలా ఉంటే.. ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్, యువ భారత బ్యాటర్ సూర్యవంశీ మధ్య ఆసక్తికర పోరు ఉంటుందా? అని రుతురాజ్‌ను అడిగారు. అయితే ఈ పోరుపై తాను పెద్దగా ఆలోచించలేదని చెప్పాడు. ‘‘మీరు మీ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు.. నేనూ అంతే, నా దేశానికి మద్దతివ్వాలని కోరుకుంటాను" అని అన్నాడు.జట్టులో లేనప్పుడు తాను మ్యాచ్‌లను ఎక్కువగా చూడనని తెలిపాడు. ప్రస్తుతం తన సాధనపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు రుతురాజ్ తెలిపాడు. ప్రాక్టీస్‌తో పాటు దేశవాళీ టోర్నీలు కూడా ఉండటంతో టీమిండియా మ్యాచ్‌లను రోజూ చూడటం సాధ్యం కావడం లేదన్నాడు.దులీప్ ట్రోఫీ తర్వాత ఇరానీ

నేరేడు పండు తింటే షుగర్ అదుపులోకి వస్తుందా? ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mla Vemula Prashanth reddy fires on kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. అన్ని పార్టీలు కూడా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఫుల్ కాక మీదున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. కవిత మాట్లాడుతూ.. వేముల ప్రశాంత్ రెడ్డి శకుని లాంటి వాడని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులనైన వదిలేస్తానేమో కానీ వేముల ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలనని ఆయనకు తన ఉసురు తగులుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కవిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. గతంలో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏంపీకారంటూ మాట్లాడిన విషయంను గుర్తుచేశారు. అంతే కాకుండా కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం రావట్లేదని విమర్శించారని అన్నారు. సొంత వాళ్లనే కవిత ఇష్టమున్నట్లు మాటలన్నప్పుడు తామ మీద అనడంలో ఆశ్చర్యమేముందని ఆరోపణలను కొట్టిపారేశారు. కవిత మాటలకు కేసీఆర్ ఎంతో మనో వేదనకు గురౌతున్నారని అన్నారు. కవితను కేసీఆర్‌ను కలపడానికి ప్రయత్నం చేసిన, విడగొట్టడానికి చూశాడో అన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పార్టీ లైన్ దాటడం వల్ల కేసీఆర్ కవితపై వేటు వేశారన్నారు. 2001 తెలంగాణ ఆవిర్భావానికి ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, టీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి
Bonus Ceiling Limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా ధమాకా అందనుందా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరా, దీపావళి పండగల సీజన్ సమీపిస్తున్న వేళ భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్ లెక్కించే గరిష్ట పరిమితిని పెంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.7000 నుంచి రూ.21000లకు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్సీ-జేసీఎం సెక్రెటరీ శివ గోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రెటరికీ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.21 వేలుగా నిర్ణయించారు. చట్టం ప్రకారం బోనస్ లెక్కించే పరిమితి రూ.7000 లేదా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం వీటిలో ఏది ఎక్కువైతే దాని ఆధారంగా ఉండాలి. ఇదే విషయాన్ని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. మే, 2026లో జరిగిన 49వ జేసీఎం సమావేశంలో బోనస్ చట్టంలో మార్పుల ఆధారంగా పరిమితి పెంపును పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆగస్టు 25, 2026న వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ నవంబర్ 21, 2026 నుంచి అమలులోకి వచ్చేలా అమలు చేస్తుండడంతో ఈ పెంపును తక్షణమే వర్తింపజేయాలని జేఏసీ కోరింది. లేదా అక్టోబర్ 20, 2026న వచ్చే దసరా పండుగకు ముందే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.ఎవరికి లబ్ధిసాధారణంగా లెవెల్ 8 వరకు ఉండే నాన్ గెజిటెడ్, సీ-గ్రేడ్, బీ- గ్రేడ్ ఉద్యోగుకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లేదా అడ్ హాక్ బోనస్ లభిస్తుంది. బోనస్ పరిమితి రూ.21000లకు పెంచితే ఈ కేటగిరీల్లోని ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరనుంది. ఒక్కసారిగా బోనస్ మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం సాధారణంగా 30.4 రోజుల సగటు ఆధారంగా 60 రోజులు లేదా 70 రోజుల

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్‌కు, రాబోతున్న 8వ పే కమిషన్‌కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 7వ పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్‌ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. 7వ పే కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్ ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు. జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్‌లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్‌లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది. 7వ పే కమిషన్‌లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్‌లో ఖరారయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను

జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో రద్దీగా ఉన్న ఓ రైల్లో భారత పర్యాటకులు పాటలు పాడుతూ హల్చల్ చేశారు. భారతీయులు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియోలో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చుని బిగ్గరగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు వారికి వంతపాడుతూ చేతులు ఊపుతూ, ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోగా, కొందరు మాత్రం అసంతృప్తిగా అలా చూస్తుండిపోయారు. ఈ వీడియోను Amit24TD అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయ పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొందరు వ్యాఖ్యానించారు. రద్దీగా ఉన్న ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదని మరికొందరు సూచించారు. వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతర ప్రయాణికులపై రుద్దకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రైల్వే సిబ్బంది, అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని మరికొందరు ప్రశ్నించారు. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్‌తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో.. తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల గుర్తుచేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు

P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ! ఈ వార్తకు సంబంధించిన

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ! ఈ వార్తకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2024 డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్