
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
హైదరాబాద్‌లో కీలకమైన ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పనులు నత్తనడకన సాగుతుండటంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతీయ రహదారుల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 దసరా నాటికి కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే మాట ఇచ్చిందని, ఇకపై ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఎన్‌హెచ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మ్యాన్‌పవర్‌ను పెంచి మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. కారిడార్ కింద ఉన్న 6.25 కిలోమీటర్ల బీటీ రహదారి పనులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నారపల్లి, ఉప్పల్ రెండు వైపుల నుంచి లాంచింగ్ గడ్డర్లను వినియోగించి నిర్మాణ వేగాన్ని పెంచాలని సూచించారు. అదే సమయంలో కారిడార్‌కు అనుసంధానంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులతో ఎన్‌హెచ్ అధికారుల సమన్వయం పెంచాలని మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై తాను ప్రతి పది రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. 2026లోనే ఎలివేటెడ్ కారిడార్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.కాగా, ఉప్పల్ జంక్షన్ నుంచి నారపల్లి వైపు సీపీఆర్ఐ వరకు నిర్మిస్తున్న ఈ ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ పొడవు 6.25 కిలోమీటర్లు. ప్రాజెక్టు అంచనా నిర్మాణ వ్యయం రూ.626.76 కోట్లు. భూసేకరణ వ్యయం అదనంగా ఉంది. జాతీయ రహదారి-163లో హైదరాబాద్ పట్టణ పరిధిలోని రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కారిడార్ పూర్తయితే వరంగల్, యాదాద్రి, భువనగిరి వైపు వెళ్లే వాహనాలకు ఉప్పల్–నారపల్లి మార్గంలో వేగవంతమైన రాకపోకలు సాధ్యమవుతాయి.2018లో పునాది.. ఇప్పటికీ పూర్తి కాలేదుఈ ప్రాజెక్టుకు 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రాజెక్టు అనేక అవాంతరాలను