
OTT New Movies: వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!
OTT New Movies: వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!

OTT New Movies: వినాయక చవితి ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాల లిస్ట్ ఇదే!

తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
Mani Ratnam New Movie: మణిరత్నం కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబోలో రొమాంటిక్ మూవీ

మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. (Debjani Modak)
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్‌ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్‌కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్‌పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్‌లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీని ప్రకటించింది.'మైసా' చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మికకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ''స్వతహాగా ఆమె దృఢమైనది. స్వచ్ఛందంగా నిర్భయమైనది. అచంచలమైన స్ఫూర్తి కలది. మునుపెన్నడూ లేని విధంగా రష్మికతో కలిసి 'మైసా' ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.''మైసా.. ఆవేశం! వేదన! హృదయ వేదన! శోకం! దృఢ సంకల్పం! ధైర్యం! ఊహించని శక్తి - అదే మైసా'' అని రష్మిక పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాని డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దానికి వారం రోజుల ముందుగా 'మైసా' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాక్సాఫీస్ దగ్గర 'ఫౌజీ' సందడి మొదలయ్యేలోపే 'మైసా' మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మైసా’ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఇది ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా'తో పాటుగా 'రణబాలి' సినిమా చేస్తున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్‌కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్‌ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్‌కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న రష్మిక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనుంది. రష్మిక సెట్స్ లో జాయిన్ అయ్యాక జెట్ స్పీడ్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక నటన, గ్లామర్ మరియు ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం
టాలీవుడ్ చిత్రసీమ పురోగతిని, వ్యాపార విస్తరణను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సరికొత్త ఉత్తర్వులను (GO) అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సినీ విధానంపై పరిశ్రమ వర్గాలు విశేష సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) దీనిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. నేడు మన తెలుగు చిత్రాలు ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్డీఆర్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్-ఇండియా రేంజ్లో రూపొందుతున్నాయి. కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాల నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి సరైన నమూనా అవసరం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా అర్హత గల సినిమాలకు టికెట్ ధరల పెంపునకు నిబంధనలతో కూడిన దరఖాస్తు విధానం సులభతరమైంది. అయితే, ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుతోనే ముగిసిపోలేదు. ప్రతి థియేటర్ లోనూ (మల్టీప్లెక్స్ సహా) కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 ప్రదర్శనలకు (5 Shows) ప్రభుత్వం అనుమతించడం పెద్ద సినిమాలకు ఎంతో ఉపకరిస్తుంది. మొదటి కొద్ది రోజుల్లోనే భారీ డిమాండ్ నెరవేరి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి. దీనివల్ల చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు దక్కే అవకాశం మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, నిరంతరం శ్రమించే సినీ కార్మికుల సంక్షేమానికి ఈ కొత్త విధానం పెద్దపీట వేస్తోంది. ఈ నిర్ణయాల వల్ల చిత్రసీమలో పెట్టుబడులు పెరగడమే కాకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడింది. ఈ కొత్త నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

Irumudi Movie Review: రవితేజ విశ్వరూపం.. బొమ్మ దద్దరిల్లింది! Irumudi Movie Review: వరస ప్లాపులతో కాస్త వెనుకబడ్డ మాస్ మహారాజ్ రవితేజ, ఈసారి తన రొటీన్ మాస్ ఆరాటాన్ని పక్కన పెట్టి, ఒక బలమైన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికొస్తే.. సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ల వ్యాపారం చేసుకునే త్రినాథ్ అనే సగటు కుటుంబ పెద్దగా రవితేజ కనిపిస్తారు. ఆయనకు భార్య కావేరి, కూతురు మణికంఠ అంటే ఎనలేని ప్రాణం. తన వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం నియమంగా అయ్యప్ప మాల వేసుకుంటాడు త్రినాథ్. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఊరిలో అనుమానాస్పదంగా కొందరు అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. ప్రతీ అమ్మాయిలో తన కూతురినే చూసుకునే హీరో, ఈ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఎదురైన నిజాలు ఏంటి? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు.రవితేజ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. చిన్న పాప నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ ఊరులో జరిగే సాధారణ కథను తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. దర్శకుడు అనుకున్న పాయింట్‌ను చాలా బలంగా చెప్పగలిగారు. ముఖ్యంగా ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్‌కి తగ్గట్టుగా కుదిరాయి

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని
హృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ సాంగ్ చూశారా! 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మనసా వాచా’ అనే పాట విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను కె.ఎస్. చిత్ర, ఎస్.పి. చరణ్ కలిసి ఆలపించారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాటను మీరూ చూసేయండి. ఈ వార్తకు సంబంధించిన

మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది మమిత. నివిన్ పౌలి హీరోగా, మమిత కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’(Bethlehem Kudumba Unit). ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఈ నెల 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఏ నేపథ్యంలో విడుదల చేసిన చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో నటనలో తన మార్క్ చూపించిన మమితా బైజు ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా? ఆమెకున్న క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించిన మమితా బైజు.. ఈ సినిమాతో కూడా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు నివిన్ పౌలీ కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

'ఇరుముడి' .. ఫీల్ తో కూడిన టైటిల్. డివోషనల్ టచ్ ఇచ్చే టైటిల్. ఈ టైటిల్ ను చూడగానే ఈ సినిమా అయ్యప్పస్వామి నేపథ్యంలో నడుస్తునని అనుకుంటారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ .. ఆ స్వామి మహిమలను చూపిస్తారని అనుకోవడం సహజం. ప్రధానమైన కథ అదే అయితే ఈ సినిమాను కార్తీక మాసంలో రిలీజ్ చేసేవారు. అయ్యప్ప మాలతో ముడిపడిన ఈ కథలో కనిపించని మరో కోణం ఉంది. అదే ఈ సినిమాను కొత్తగా ప్రేక్షకుల ముంగిట నిలపనుంది. ఆ కోణం ఏమిటనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్ ను గమనిస్తే, రవితేజ .. అతని కూతురుగా ఒక పాపను ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. నిజమే ఈ కథ అంతా హీరో ప్లస్ అతని కూతురు చుట్టూనే తిరుగుతుంది. హీరో ఎవరినీ లెక్కచేయడు .. ఎవరి మాటను వినిపించుకోడు .. తన కూతురు మాట తప్ప. అలాంటి హీరోను అతని కూతురు ఎలా ప్రభావితం చేస్తుంది? అతను అయ్యప్పమాల వేసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ మాల వేసుకున్న తరువాత అతని జీవితం ఎలా మారిపోతుంది? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. నిజానికి 2022లో వచ్చిన 'ధమాకా' తరువాత రవితేజకి పెద్ద హిట్ లేదు. ఏడెనిమిది సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించినస్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే 'ఇరుముడి' సిద్ధమైంది. ప్రియా భవాని శంకర్ .. బేబీ నక్షత్ర .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రేపు ( ఆగస్టు 21) విడుదల

ఇంటర్నెట్ డెస్క్: ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రల్లో రూపొందిన మ్యూజికల్ డ్రామా సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై దీన్ని నిర్మించారు. ఇప్పుడీ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ సిరీస్‌లో సుమన్, సిజ్జు మేనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, రూప లక్ష్మి తదితరులు నటించారు. కర్ణాటక సంగీతపు కథతో ‘జగమే సంగీతం’ రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని తరతరాల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది ఈ సిరీస్ కథాంశం. ఈ కథకు సంగీతమే ప్రాణం. పాప్ స్టార్డమ్ ప్రపంచం నుంచి వచ్చిన ఒక గాయనికి, బాలుకు మధ్య ఏర్పడే బంధం చివరకు ఏవైపు వెళ్లిందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సుస్మిత కొణిదెల ఈ సిరీస్‌లోని పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘‘సంగీతం కేవలం వారి ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటీనటులు ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ స్టార్ యశ్ (Yash)హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’(Toxic Movie). ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది (Toxic English Trailer ). ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్‌తో అదరగొట్టారు. ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు

అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బంది పడుతున్న తన అభిమాని పట్ల సినీ హీరో రామ్ పోతినేని పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవ్యత (18) నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. మతిస్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెబితే ఆమె ఉత్సాహం చూపుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు రామ్ చిత్రాలు, వీడియోలు చూపించి, ఆమెకు అన్నం తినిపించి మందులు వేయిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రామ్.. వెంటనే స్పందించి బాలికతో వీడియో కాల్లో మాట్లాడారు. శశిభవ్యతకు అవసరమైన మందులు ఇతర ఖర్చులు అన్నీ తానే భరిస్తానని తెలిపారు. ఈ వార్త చదివారా: ఈడీ విచారణకు హాజరైన నిధి అగర్వాల్

నూతన నటీనటులతో 'దొరికిందా' సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు అశోక్ కుమార్, పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు. వి.టి. ఎంటర్ ప్రైజెస్ పతాకంపై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న సినిమా 'దొరికిందా'. తాజాగా మొదలైన ఈ సినిమా ప్రారంభోత్సవంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొని క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ స్విచ్చాన్ చేశారు. టీమ్‌కు సినిమా స్క్రిప్ట్ ను మరో నిర్మాత పద్మినీ నాగులపల్లి అందించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ, 'మా చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిత్రం 'దొరికిందా' మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పాత కొత్త నటీనటులు నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను' అని అన్నారు. ఈ చిత్రానికి జాక్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సడ్లపల్లి వెంకటేశ్ రెడ్డితో పాటు అశ్వద్థ రాయల్ దీనిని నిర్మిస్తున్నారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

యంగ్ హీరో సంగీత్ శోభన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుండి కీలకమైన టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో సంగీత్ శోభన్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం నెలకొంది. కెరీర్లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ప్రస్తుతం మారుతి అనే ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ మరియు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను అందించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ చిత్రానికి 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని మరియు వల్లభనేని గిరిబాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ ఎంపిక చేసుకునే కథలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ కొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తుందని యూనిట్ నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. టైటిల్ గ్లింప్స్ విడుదల తర్వాత సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొత్తంగా సంగీత్ శోభన్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 23న రాబోయే టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వనుంది. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషీ కాంబినేషన్ లో వచ్చిన 'బట్వారా 1947' చిత్రం కమర్షయల్ సక్సెస్ ను సాధించలేక పోయింది. అయినా ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను ప్రకటించబోతున్నారట. సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ తాజా చిత్రం 'బట్వారా 1947' స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఆమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన 'బట్వారా 1947' కథ బాగున్నా... దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చాలామంది వ్యాఖ్యానించారు. పైగా ఇటీవల వచ్చిన 'మై వాసప్ ఆవూంగా' కథాంశం కూడా దాదాపు ఇలాంటిదే కావడంతో కొత్తదానాన్ని మిస్ అయి భావనను వ్యక్తం చేశారు. దేశ విభజన నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలూ తెరకెక్కాయి. 'మై వాపస్ ఆవూంగా'లో సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తే, 'బట్వారా 1947'లో సీనియర్ నటీమణి షబానా ఆజ్మీ నటించారు. వీరిద్దరి పాత్రలకు మంచి పేరొచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. గతంలో సన్నీ డియోల్ హీరోగా రాజ్ కుమార్ సంతోషీ తెరకెక్కించిన 'ఘాయల్, దామినీ, ఘాతక్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే మూడు దశాబ్దాల కాలం నాటి ఆ మ్యాజిక్ ను తాజా చిత్రం రీ క్రియేట్ చేయలేకపోయింది. 'బట్వారా' సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా తగ్గేదే లే అంటున్నారు సన్నీ డియోల్ అండ్ రాజ్ కుమార్ సంతోషీ. ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమాను ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి యాక్షన్ మూవీని ఈ సారి వీరు చేయబోతున్నారట. మరి ఈ

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం షూటింగ్ 40 రోజులు పూర్తైంది. ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ కాగా, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. చిరంజీవి సపోర్ట్‌తో టీమ్ అంతా ఒకే స్పీడ్‌తో పని చేస్తుండడంతో 40 రోజుల షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చెప్పారు. ఇప్పటివరకూ ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ఇటీవల చిత్రీకరించిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాలో ప్రధాన హైలైట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు బాబీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనస్వర రాజన్ (Anaswara Rajan), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. భాను-నందు మాటలు రాస్తున్నారు

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘టాక్సిక్’ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ లాబీలతో పాటు పలు నగరాల్లోని మెట్రో రైళ్లపై సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది

నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాయి చిత్రం కోసం యువ దర్శకుడు వెంకీ అట్లూరిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గతంలో వెంకీ అట్లూరి పలు కథలను నాగచైతన్యకు వినిపించినట్లు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి వరుస విజయాలతో వెంకీ అట్లూరి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, ఇప్పుడు ఒక స్వచ్ఛమైన తెలుగు కథతో ముందుకు రానున్నారు. ఇందుకోసం నాగచైతన్య సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా కథాంశం వైవిధ్యంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగవంశీ, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య 25వ సినిమా బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని అంశాలు కుదిరిన తర్వాత త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కథ, కథనం మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొంత సమయం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్‌తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్‌ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్‌ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్‌తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో రాబోతోందని టాక్. నైజాంలో విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ తుఫాన్

టాలీవుడ్ యువ నటి నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా ఆగస్టు 17న ఘనంగా ప్రారంభమైంది. వరహ ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. చిత్రీకరణకు సంబంధించి తొలి పూజా కార్యక్రమాలు నేడు చిత్రబృందం సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. పౌరాణిక నేపథ్యం ఉన్న కథ కావడంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని 'తంత్ర' ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. వరహ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెం 1గా వస్తున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో వైవిధ్యమైన పాత్రలు చేసిన నిధి, ఇందులో పూర్తిగా కొత్తగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ నటి రూపాన్ని పవర్ ఫుల్ అవతార్‌లో చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. పి. అశోక్ మరియు పి. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మాత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దీంతో షూటింగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ముగిసింది. నిధి అగర్వాల్ ఇందులో అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ స్పష్టం చేశారు. మైథాలజీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ఈ సినిమా రాబోతోంది. ఇదిలా ఉండగా, నిధి అగర్వాల్ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతున్న వేళ, ఈ ప్రయోగం కచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి టైటిల్ మరియు పూర్తిస్థాయి తారాగణం వివరాలను గోప్యంగా ఉంచారు. రాబోయే రోజుల్లో ఒక్కో అప్డేట్తో ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచాలని

రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650 ఇప్పుడు కొన్ని మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ లుక్‌తో పాటు, వాడుకలోనూ కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఈ కొత్త కాంటినెంటల్ జీటీ 650 లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటివి కొత్తగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్లు. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో బైక్ లుక్ మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా మారింది. రాకర్ రెడ్ కలర్ మోడల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీని ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు పూర్తిగా బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చారు. దీనికి తోడు అలాయ్ వీల్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. దీంతో ఈ మోడల్ మొత్తం బ్లాక్-అవుట్ లుక్‌తో చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. అపెక్స్ గ్రే మోడల్లో కూడా దాదాపు ఇలాంటి బ్లాక్-అవుట్ లుక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ కలర్ మోడళ్లలో మాత్రం పాత పాలిష్డ్ ఇంజిన్ లుక్, స్పోక్ వీల్స్‌నే కొనసాగిస్తున్నారు. కొత్త కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 648 సిసి, ట్విన్-సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,150 rpm వద్ద 47 హార్స్పవర్, 5,250 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, హారిస్ పెర్ఫార్మెన్స్ కలిసి డెవలప్ చేసిన స్టీల్ ఫ్రేమ్‌నే కొనసాగించారు. కాబట్టి కొత్త మోడల్లో ప్రధానంగా లుక్, ఫీచర్లలోనే మార్పులు జరిగాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ 650 ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ కేఫ్ రేసర్ డిజైన్ వంటివి యథాతథంగా

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం అలియాస్ రుక్మిణి నేటి నుంచి షూటింగ్ ప్రారంభం చేసుకుంది. ఆగస్టు 17న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణను చిత్రబృందం అధికారికంగా మొదలుపెట్టింది. బోల్డ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తుండటం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఒక రకమైన ఉత్కంఠ మొదలైంది. గత ఆగస్టు 3న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నాని తన సొంత బ్యానర్లో దీప్తి గంతతో కలిసి ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో కీలకమైన ఇండోర్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని ఈ కథపై పూర్తి నమ్మకంతో ఉండటంతో, నితిన్ కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫలితంగా నాని మరియు నితిన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, చిత్రబృందం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. సినిమాలోని పాటలు మరియు కీలకమైన అవుట్డోర్ సన్నివేశాల కోసం లొకేషన్లను ఎంపిక చేస్తున్నారు. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా నాని ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మిస్తున్నారని సమాచారం. నిర్మాతగా మారుతున్న నాని ఈ సినిమాను 2027 మొదటి భాగంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న అలియాస్ రుక్మిణి ప్రాజెక్టును

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్ థ్రిల్లర్లు, కొరియన్ మెడికల్ డ్రామా, తెలుగు రొమాంటిక్ డ్రామా, తమిళ రొమాంటిక్ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్ గన్ షేర్డ్ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్ లాంతర్న్ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా సీజన్ 18 ప్రముఖ కామెడీ సిరీస్ ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్ పబ్ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్ ఎపిసోడ్లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా ఫేసింగ్ ఎల్ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్ లార్డ్ ఎల్ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్ ఆగస్టు 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. ప్యార్ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్ కామెడీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం విశ్వంభర విడుదలపై చిత్ర యూనిట్ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, మేకర్స్ నుండి ఇప్పటివరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. కనీసం టీజర్ లేదా పాట విడుదల చేయకపోవడంపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశ దాటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు సమాచారం అందుతున్నప్పటికీ, అధికారికంగా చిత్ర బృందం పెదవి విప్పడం లేదు. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదలవుతుందని గతంలో జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, దానిపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. దీంతో మెగాస్టార్ తదుపరి చిత్రాలపై ఆసక్తి చూపుతున్న అభిమానులు, ఈ సినిమా అప్డేట్స్ విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు బాబీతో చేయబోయే తన కొత్త చిత్రానికి ‘కదిరి’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు ఆయన స్వయంగా పేర్కొన్నారు. అయితే, కొత్త చిత్రం గురించి చిరంజీవి ఇచ్చిన చిన్న అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ, విశ్వంభర మౌనం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా అటు కొత్త ప్రాజెక్టు వార్తలు, ఇటు విశ్వంభర అప్డేట్స్ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ వెంటనే స్పందించి విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విశ్వంభర విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక పోవడంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రానున్న

Prabhas Fauzi:ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలు కూడా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఇద్దరు ప్రముఖ చారిత్రక వ్యక్తుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీలో మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో పలు వైవిధ్యమైన, చారిత్రక పాత్రల్లో నటించిన అనుపమ్ ఖేర్ గాంధీజీగా కనిపిస్తే ఆ పాత్రపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు నటుడు అనిష్ యోహన్ కురువిల్లా రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గాంధీజీతో పాటు ఠాగూర్ పాత్రను కూడా కథలో భాగం చేస్తే ఫౌజీకి మరింత చారిత్రక నేపథ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పాత్రలను కథలో ఎలా ముడిపెట్టారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనిష్ యోహన్ కురువిల్లా ఠాగూర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తకు కూడా ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఫౌజీ కథ స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం ఇప్పటికే

మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసుకుంటోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి సీజన్లో థియేటర్లకు తీసుకురావడం విశేషం. ఇదిలా ఉండగా, ఈ సినిమా నుండి విడుదలైన తాజా పోస్టర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సాయి దుర్గ తేజ్ రక్తం, గాయాలతో, మంటల మధ్య ఆయుధం పట్టుకుని చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ రఫ్ లుక్ చూస్తుంటే సినిమా పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా సాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమాకు సంబంధించిన సాంకేతిక విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని కీలక పాత్రల్లో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. అనుభవజ్ఞులైన నటీనటులు తోడవడంతో కథలో భావోద్వేగాలకు లోతు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు, సంక్రాంతి పండుగ వేళ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. పండుగ సెలవులను క్యాష్ చేసుకునేలా 2027 జనవరి 12న విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సాయి దుర్గ తేజ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా మెగా అభిమానులకు
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయ్యగారిని వంద కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో కూర్చోబెట్టింది. సినిమాలో భాగమైన వారందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది.‘లెనిన్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘జీ 5’ ఓటీటీ కొనుగోలు చేసింది. థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ ప్రకారం ఇటీవలే ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి డిజిటల్ వేదికపైనా అనూహ్య స్పందన లభిస్తోంది. మనోడు ఓటీటీలోనూ ఇరగదీస్తున్నాడు. మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్నాడు.బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ మూవీ కేవలం 2 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించినట్లు ‘జీ 5’ ఓటీటీ ఇటీవల ప్రకటించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు రాబట్టిందని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “అయ్యగారి రాయల్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. లెనిన్ ఫీవర్ అన్ స్టాపబుల్” అంటూ పోస్టర్ షేర్ చేసుకుంది. ఇది చూసి అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అఖిల్ కోరుకున్నట్టుగా ఆడియన్స్ లెనిన్ ను తమ ఇంటికి తీసుకెళ్లిపోయారని అభిప్రాయ పడుతున్నారు.'లెనిన్' చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో అఖిల్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయనకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే అలరించింది. ప్రమోద్ పంజు, శివాజీ, శత్రు, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు. నటీనటుల పర్ఫార్మన్స్, డిఫరెంట్ స్క్రీన్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prabhas Fauzi Poster News: ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ'. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మొహం చూపించకుండానే ప్రభాస్ సృష్టించిన విధ్వంసం, బ్యాక్‌డ్రాప్‌లో మహాత్మా గాంధీని చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ విశేషాలు, కథా నేపథ్యం.. చార్మినార్ బ్యాక్‌డ్రాప్: తాజా పోస్టర్లో చార్మినార్ నేపథ్యంగా భారీ మారణహోమం జరిగినట్లు చూపించారు. దోతి ధరించి, రక్తంతో తడిచిపోయి, రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గాంధీజీ - ప్రభాస్ విభిన్న ధ్రువాలు: ఒకవైపు అహింసా మార్గాన్ని బోధించిన మహాత్మా గాంధీ వెనక్కి వెళ్తుంటే.. మరోవైపు తుపాకులు పట్టుకుని ప్రభాస్ హింసా మార్గంలో ముందుకు వెళ్తున్నట్లు ఈ పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" అనే క్యాప్షన్ ఈ సినిమా కథాంశం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. ఫ్యాన్స్ రియాక్షన్, అంచనాలు ఇప్పటివరకు విడుదలైన రెండు పోస్టర్లలోనూ ప్రభాస్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, విపరీతమైన బ్లడ్ బాత్ (రక్తపాతం) ఉంటుందనే హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' సైనికుడి నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా

విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం `మకుటం`. ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి లింగ ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ కాగా, కొడుకు కృపా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌గా భార్య జమున, ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఒకరు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మరొకరు రోజువారీ అవసరాలకే కష్టపడుతుంటారు. ఇందులో అంజలి లింగాకి జోడీగా చేసింది. ఆమెకి బలమైన పాత్ర దక్కింది. కానీ సినిమాకి మాత్రం నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలోని కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విశాల్, చిత్ర లక్ష్మణన్ మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వు తెప్పించడానికి బదులు, బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. ప్రేక్షకులతో ఈలలు వేయించాలనే ఉద్దేశంతో పెట్టిన కొన్ని మాస్ సీన్లు కూడా అనుకున్నంత ప్రభావం చూపలేదు. స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కథనంలో వేగాన్ని తగ్గించేలా కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లేలో గ్యాప్స్ ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయింది. పాటలు, నేపథ్య సంగీతం యావరేజ్‌గానే ఉన్నాయి. ద్విపాత్రాభినయం చేసినా, కృపాకరణ్ పాత్ర కంటే లింగ పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దర్శకుడుగా విశాల్ సక్సెస్ కాలేకపోయారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన డ్యూయల్ రోల్, ఇద్దరు హీరోయిన్లు, ఫ్యామిలీ సెంటిమెంట్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం వంటి అన్ని అంశాలను విశాల్ ఇందులో చేర్చాడు. కానీ, ఇవన్నీ కలిసినా ప్రేక్షకులకు సరైన థియేటర్ అనుభూతిని ఇవ్వడంలో ఈ సినిమా విఫలమైంది. ఇదే ఈ సినిమాకు పెద్ద మైనస్. మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'మగుడం'(మకుటం) వసూళ్లలో భారీ దెబ్బతింది. Sacnilk రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఇండియాలో తొలిరోజు కేవలం రూ. 68 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇందులో తమిళ వెర్షన్ రూ. 38 లక్షలు, తెలుగు వెర్షన్ రూ. 20 లక్షలు రాబట్టింది. కర్ణాటకలో రూ. 7 లక్షలు, కేరళలో రూ

Bhargav BV: కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ బీవీ ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు వాడే అయినప్పటికీ శాండల్‌వుడ్‌లో ఈయన క్రేజీ హీరో అయ్యాడు. ఆయన నటించిన ‘పరిశుద్ధం’ వంద రోజులు ఆడిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘టెడ్డీ బేర్’ వంటి చిత్రాలు నటుడిగా మంచి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలో ఈయన కనబరిచిన ప్రతిభకు గాను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ‘బెస్ట్ యాక్టర్’ అవార్డుతో పాటు కర్ణాటక కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. భార్గవ్ బీవీ ప్రస్తుతం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సరికొత్త ద్విభాషా చిత్రం ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ నిన్ననే (ఆగస్టు 14, 2026) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కొసల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక పవర్ఫుల్ ఎమోషనల్ మైండ్-గేమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ చిత్రం ద్వారా భార్గవ్ టాలీవుడ్లోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందుకు ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు భార్గవ్. తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన క్లాసిక్ పాట పేరునే టైటిల్‌గా ఎంచుకోవడం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్‌లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా సినీ ప్రముఖుల సమక్షంలో శుభారంభంగా

సీనియర్ నటుడు ప్రభు, నటి సుకన్య.. ఒకప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించిన హిట్ జోడీ. సీనియర్ నటుడు ప్రభు(Prabhu), నటి సుకన్య (Sukanya)ఒకప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించిన హిట్ జోడీ. ‘సెంతమిళ్‌పాట్టు’, ‘చిన్న మాప్పిళై’, ‘మిస్టర్ మద్రాస్’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంటకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తెరపై కనిపించలేదు. 31 ఏళ్ల తర్వాత ఈ సీనియర్ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభు–సుకన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘మేరీగోల్డ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, మనుషుల మధ్య ఉండే బంధాలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తిరునెల్వేలి, తూత్తుక్కుడి ప్రాంతాల నేపథ్యంతో సాగే ఈ కథలో పల్లెటూరి వాతావరణం కూడా కీలకంగా ఉండనుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఆర్. రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. కథలోని భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూనే, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో సినిమాను రూపొందించనున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ చిత్రంలో రక్షణ్, నమ్రత, సింగంపులి, వడివుక్కరసి, ఇమాన్ అన్నాచ్చి, వివేక్ ప్రసన్న, స్టాలిన్, వడివేల్ మురుగన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా గ్యాప్ తర్వాత ప్రభు–సుకన్య కలిసి నటిస్తుండటంతో ‘మేరీగోల్డ్’పై ఆసక్తి పెరుగుతోంది. అసలు ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? వారి మధ్య ఎలాంటి బంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు