
MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యంక్లారిటీతో తెరపడిన ఉత్కంఠ
MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యం క్లారిటీతో తెరపడిన ఉత్కంఠ
© 2026 nimisham.in

MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యం క్లారిటీతో తెరపడిన ఉత్కంఠ

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ‘సీఎస్కే జట్టుకు హెడ్ కోచ్ ఉంటాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి హెడ్ కోచ్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తొందరేం లేదు’ అని రుతురాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 2008లో సీఎస్కే ప్లేయర్‌గా జట్టులో చేరాడు. ఆ తర్వాతి ఏడాదే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. ధోని నుంచి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రుతురాజ్.. గతేడాది తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ‘ఎంఎస్ ధోని నుంచి కెప్టెన్సీ తీసుకోవడం చాలా పెద్ద బాధ్యత. అతడు సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. సహజంగానే అభిమానులు మరిన్ని విజయాలు, టైటిళ్లను ఆశిస్తారు. అయితే ఈ అదనపు బాధ్యతను నేను ఆస్వాదిస్తున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కెప్టెన్‌గా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నా. 2008 నుంచి సీఎస్కే అద్భుతమైన ప్రయాణం సాగించింది. దాదాపు ప్రతి సైకిల్లోనూ ఐపీఎల్

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్‌ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్‌ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సీజన్లో ధోనీ ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెడతాడా అనేది అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై తలుపులు తెరిచే ఉంచినప్పటికీ ఆయన ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని సమాచారం. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. గడిచిన 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, డగౌట్ నుంచి తన జట్టు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. రోజూవారీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఒక కారణం. ఈ క్రమంలో సీఎస్కే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి మెంటార్ హోదా ఇచ్చే ఆలోచనలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జూలై 2026లోనే జట్టు నుంచి తప్పుకున్నారు. 2009 నుంచి సుదీర్ఘకాలం పనిచేసిన ఫ్లెమింగ్ ఇప్పుడు ఇంగ్లండ్ రెడ్ బాల్ టీమ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో సీఎస్కే కొత్త హెడ్ కోచ్ కోసం వెతుకుతోంది. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. స్థానిక తమిళనాడు క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కోచింగ్ అనుభవం ఉండటంతో ఆయన వైపు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ధోనీ మెంటార్‌గా మారినా కొత్త హెడ్ కోచ్ నియామకం తప్పనిసరి కానుంది. గత కొన్ని రోజులుగా ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో వాటా కోరారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మొదట 25 శాతం, ఆపై 18 శాతానికి అంగీకరించారని వార్తలు హల్చల్ చేశాయి. ఈ పుకార్లపై సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించారు. ధోనీ వాటా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అధార రహితమైనవని స్పష్టం చేశారు. ధోనీ నిర్ణయానికే సీఎస్కే యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీలో ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వాటా కోరుతున్నట్లు వస్తున్న వార్తలను సీఎస్కే యాజమాన్యం ఖండించింది. ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన వదంతులని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది.ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతో ధోనీకి విడదీయరాని అనుబంధం ఉంది. అతడి సారథ్యంలో జట్టు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఫ్రాంచైజీతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో ధోనీ సుమారు 20 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నాడని, కానీ సీఎస్కే యాజమాన్యం కేవలం 3 శాతం మాత్రమే ఆఫర్ చేసిందని కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలతో ఇరువర్గాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ వదంతులపై కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ, "ధోనీ వాటా అడిగాడన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే" అని కొట్టిపారేశారు. ఇక వచ్చే సీజన్లో ధోనీ ఆడతాడా లేదా అనే విషయంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. "వచ్చే సీజన్లో తాను ఆడనని ధోనీ మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా అతడిదే తుది నిర్ణయం" అని తెలిపారు. కాగా, 2025 మెగా వేలానికి ముందు సీఎస్కే ధోనీని రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, గాయం కారణంగా 2026 సీజన్‌లోని ఒక్క మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడలేకపోయాడు

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్‌లు, కార్లంటే ఎంతటి పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే. రాంచిలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల భారీ విస్తీర్ణంలో 'కైలాసపతి' పేరుతో రూ.100 కోట్లకు పైగా విలువైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఆధునిక డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ బంగ్లాలో అత్యాధునిక జిమ్, ఈత కొలను, ఇండోర్ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న పదుల సంఖ్యలోని సూపర్‌బైక్‌లు, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేయడం ఈ భవనం ప్రత్యేకత. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? మరోవైపు డేంజరస్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ నజఫ్‌గఢ్ వీధుల నుంచి హౌజ్ ఖాస్‌లోని రాజభవనం వరకు సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో సెహ్వాగ్‌కు ఉన్న 'కృష్ణ నివాస్' బంగ్లా విలువ సుమారు రూ.130 కోట్లుగా అంచనా. ఇందులో 12 విశాలమైన గదులు, ప్రాంగణంలో అందమైన కోవెల, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకమైన లాన్ ఉన్నాయి. హర్యానా, నజఫ్‌గఢ్‌లలో కూడా ఆయనకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో కోహ్లీ రాజభవనం.. ముంబైలో సచిన్ కలల సౌధం! భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ముంబై, లండన్, అలీబాగ్ ప్రాంతాలలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అయితే అన్నింటికంటే

Rishabh Pant: భారత టెస్ట్ క్రికెట్లో వికెట్ కీపర్ల పాత్ర ఎంతో కీలకమైనది. గతంలో ఎంఎస్ ధోనీ కీపర్‌గా 6 సెంచరీలు చేసి భారతదేశం తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా మొదటి స్థానంలో ఉండేవాడు. సుదీర్ఘ కాలం పాటు ఈ రికార్డు ధోనీ పేరిటే భద్రంగా ఉంది. అయితే రిషభ్ పంత్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో ఏకంగా 8 సెంచరీలు నమోదు చేసి ధోనీని రెండో స్థానానికి నెట్టేశాడు. 2018లో టెస్ట్ అరంగేట్రం చేసిన పంత్, అతి తక్కువ కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఒత్తిడి ఉన్న సమయంలో భయపడకుండా కౌంటర్ ఎటాక్ చేయడం పంత్ ప్రత్యేకత. మ్యాచ్ పరిస్థితికి తగినట్లుగా తన గేర్‌ను మారుస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విధానం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే రిషభ్ పంత్ 8 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంఎస్ ధోనీ 6 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలు సాధించగా, ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ చెరో 2 సెంచరీలు చేశారు. ఈ గణాంకాలను బట్టి పంత్ భారత కీపింగ్ విభాగంలో ఎంతటి భారీ జంప్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: Kavya Maran: గుసగుసలకు చెక్.. ఎట్టకేలకు అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ ఎక్కడంటే ? విదేశీ గడ్డపై చెలరేగుతున్న డాషింగ్ వికెట్ కీపర్ పంత్ బ్యాటింగ్ కేవలం సెంచరీల సంఖ్యకే పరిమితం కాలేదు. విదేశీ గడ్డ పై క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి సవాలుతో కూడిన మైదానాల్లోనూ బౌలర్లను బెదరగొడుతూ పంత్ ఆడిన తీరు క్రీడాభిమానులను అలరించింది. 2025లో ఇంగ్లాండ్‌తో హెడింగ్లేలో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి, ఒకే

MS Dhoni Retirement: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీది ఒక సువర్ణ అధ్యాయం. అతడి అంతర్జాతీయ ప్రయాణం ఏ తరహాలో ప్రారంభమైందో, సరిగ్గా అదే తీరుగా ముగియడం విధి ఆడిన వింత నాటకం. ఒకేలా పెవిలియన్ చేరిన ఆ రెండు రనౌట్ల మధ్య దాగి ఉన్న కన్నీటి గాథ, అద్భుతమైన ప్రయాణం అభిమానులకు ఎప్పటికీ చిరస్మరణీయం. 2004లో బంగ్లాదేశ్‌పై తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆ పొడవాటి జుట్టు కుర్రాడిని బహుశా ఎవరూ మర్చిపోలేరు. రాంచీ లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఎంఎస్ ధోనీపై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. తనదైన స్టైల్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ, తొలి బంతిని ఎదుర్కొని సింగిల్ తీసే క్రమంలో అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే కేవలం ఒక బంతిని ఎదుర్కొని (0) రనౌట్‌గా పెవిలియన్ దారి పట్టడం అప్పట్లో అభిమానులను, క్రీడా విశ్లేషకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహ్మద్ కైఫ్‌తో కలిసి సమన్వయ లోపం కారణంగా తలెత్తిన ఆ రనౌట్ ఒక చేదు జ్ఞాపకం. ఆ అరంగేట్రపు అనుభవం నుంచి అతడు నేర్చుకున్న పాఠాలు అద్భుతం. ఆ మొదటి రనౌట్ పరాభవం తర్వాత ధోనీ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాడు. అతడి అద్భుతమైన మార్గదర్శకత్వంలో భారత జట్టు ఏకంగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2013లో ఒక ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. క్రీజులో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఒంటిచేత్తో విజయాలను అందించే ఈ జార్ఖండ్ వీరుడు, మైదానంలో పర్వతం లాంటి ఒత్తిడినైనా ప్రశాంతమైన చిరునవ్వుతో ఎదుర్కోవడం అతడికే చెల్లింది. దశాబ్దన్నర పైగా సాగిన ఈ

మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన సారథి.. భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్. వికెట్ కీపర్‌గానూ చురుకైన పాత్ర. మరి ఇలాంటి ప్లేయర్‌కు ఎంతటి ఘనమైన వీడ్కోలు అందాలి. కానీ, అవేవీ తనకు అవసరం లేదని భావించాడీ ‘కెప్టెన్ కూల్’ (Captain Cool). అంతర్జాతీయంగా తన ‘7’వ నంబర్ జెర్సీకి చడీచప్పుడు లేకుండా గుడ్‌బై చెప్పేసి ఆరేళ్లైనా ఇప్పటికీ ‘ధోని’ ఘనతలను మరువలేం. అదీనూ భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వీడ్కోలు చెప్పడం విశేషం. ఇటీవల అజింక్య రహానే తన రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా కొందరు ప్లేయర్లు ఇలానే చెప్పారు. విరాట్, రోహిత్ అయితే టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. కానీ, పెద్దగా ప్రచారం కోరుకోని ధోని (MS Dhoni) మాత్రం ఓ ఆసక్తికరమైన పోస్టుతో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అమితాబ్ బచ్చన్ నటించిన కభికభీ సినిమాలోని సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టాడు. ‘‘ఇవాళ రాత్రి 19:29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు పరిగణనలోకి తీసుకోండి’’ అని 2020 ఆగస్టు 15న అభిమానుల కోసం పోస్టు పెట్టాడు. డిసెంబర్ 2019లో బోరియా మజుందార్‌తో ఓ షోలో ధోని ఆ పాటను రెండు లైన్లు పాడటం విశేషం. సాధారణంగా ఎవరైనా ప్లేయర్ తాము అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నామని జట్టు మేనేజ్మెంట్కు చెప్పడం సహజం. ఫేర్వెల్ మ్యాచ్‌ను ఆడించి ఘనమైన వీడ్కోలు పలకడం ఆనవాయితీ. కానీ, ధోని మాత్రం ఇలాంటివి కోరుకోలేదు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను 2019 జులైలో ఆడాడు. దాదాపు 13 నెలల తర్వాత అంటే 2020 ఆగస్టు 15న ఆటకు గుడ్‌బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘‘మాట కాదు.. పనే మాట్లాడాలి’ అన్నట్లుగా ధోని (Dhoni Records) సాధించిన ఘనతలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ధోనితోపాటు సురేశ్ రైనా కూడా ఇదే రోజున

On This Day In Cricket: స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశమంతా సంబరాల్లో ఉండగా, భారత క్రికెట్ అభిమానుల గుండెలు మాత్రం ముక్కలయ్యాయి. సరిగ్గా 2020 ఆగస్టు 15వ తేదీన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఏకకాలంలో అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పి యావత్ క్రీడాలోకాన్ని కన్నీట ముంచారు. ఆ భావోద్వేగ క్షణాలకు నేటితో సరిగ్గా ఆరేళ్లు. భారత చరిత్రలో ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎర్రకోట నుంచి గల్లీ వరకు ప్రతి భారతీయుడు పండుగ చేసుకునే ఆ రోజున, సామాజిక మాధ్యమాల్లో ధోనీ పెట్టిన ఓ చిన్న పోస్ట్ సునామీ సృష్టించింది. తనదైన శైలిలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోకముందే, అతడి బాటలోనే నడుస్తూ సురేష్ రైనా కూడా అదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఇద్దరు పంచుకున్న భావోద్వేగ వీడ్కోలు సందేశాలు, వారి నిరాడంబర వీడ్కోలు ఇప్పటికీ అభిమానుల కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. ధోనీ, రైనాల ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. జాతీయ జట్టులో అయినా, ఫ్రాంచైజీ క్రికెట్లో అయినా వీరిద్దరి కలయిక అద్భుత విజయాలను అందించింది. మిడిల్ ఆర్డర్లో వీరు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. విజయాలైనా, అపజయాలైనా ఏనాడూ విడిపోకుండా కలిసి పంచుకునేవారు. కేవలం సహచర ఆటగాళ్లుగానే కాకుండా ఒకరికొకరు సోదరుల్లా ఎదిగారు, వీరి అద్భుతమైన బంధం ఎప్పుడూ క్రికెట్ అనే ఆట కంటే గొప్పదిగానే నిలిచింది. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! చెరిగిపోని జ్ఞాపకాలు.. సైలెంట్ వీడ్కోలు.. క్రికెట్ మైదానంలో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Eoin Morgan CSK Coach News: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాలం పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్కే ప్రయాణం ముగియడంతో, తదుపరి కోచ్ ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2026 ఐపీఎల్ సీజన్లో జట్టు ప్రదర్శన నిరాశపరచడంతో మేనేజ్మెంట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అశ్విన్ అంచనా ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోచ్ రేసులో ఇయాన్ మోర్గాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు 2019 వన్డే వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు సీఎస్కే హెడ్ కోచ్ పదవికి బలంగా వినిపిస్తోందని అశ్విన్ తెలిపారు. ఫ్రాంచైజీ స్థాయిలో ఇప్పటికే మోర్గాన్ నియామకంపై చర్చలు జరుగుతున్నాయని, ఆయన ఈసారే బాధ్యతలు చేపడతారా లేక భవిష్యత్తులో వస్తారా అనేది చూడాలని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. మోర్గాన్‌కు ప్రధాన కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అంతర్జాతీయ కెప్టెన్‌గా, 2021లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన అనుభవం సీఎస్కేకు ఎంతో మేలు చేస్తుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ బాధ్యతలకు కూడా మెకల్లమ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వైట్-బాల్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా రేసులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనకున్న ఇతర బాధ్యతల వల్ల సీఎస్కేకు రావడం కష్టమని అంచనా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Eoin Morgan CSK Coach News: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాలం పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్కే ప్రయాణం ముగియడంతో, తదుపరి కోచ్ ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2026 ఐపీఎల్ సీజన్లో జట్టు ప్రదర్శన నిరాశపరచడంతో మేనేజ్మెంట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అశ్విన్ అంచనా ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోచ్ రేసులో ఇయాన్ మోర్గాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు 2019 వన్డే వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు సీఎస్కే హెడ్ కోచ్ పదవికి బలంగా వినిపిస్తోందని అశ్విన్ తెలిపారు. ఫ్రాంచైజీ స్థాయిలో ఇప్పటికే మోర్గాన్ నియామకంపై చర్చలు జరుగుతున్నాయని, ఆయన ఈసారే బాధ్యతలు చేపడతారా లేక భవిష్యత్తులో వస్తారా అనేది చూడాలని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. మోర్గాన్‌కు ప్రధాన కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అంతర్జాతీయ కెప్టెన్‌గా, 2021లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన అనుభవం సీఎస్కేకు ఎంతో మేలు చేస్తుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ బాధ్యతలకు కూడా మెకల్లమ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వైట్-బాల్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా రేసులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనకున్న ఇతర బాధ్యతల వల్ల సీఎస్కేకు రావడం కష్టమని అంచనా

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ బోర్డుపై ఏకంగా 664 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆగస్టు 9న ప్రారంభమైన ఈ టెస్టులో భారత జట్టు రెండో రోజున 664 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రధాన విశేషం ఏంటంటే.. నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అద్భుతమైన సెంచరీ సాధించడం. కుంబ్లే 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో ఓవల్ మైదానంలో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆసియా ఆటగాడిగా కుంబ్లే సరికొత్త రికార్డు సృష్టించాడు. సెంచరీ చేసే సమయానికి ఆయన వయస్సు 36 సంవత్సరాల 296 రోజులు. ఈ ఇన్నింగ్స్‌లో భారత అగ్రశ్రేణి బ్యాటర్లంతా రాణించారు. ఎంఎస్ ధోనీ (92), దినేష్ కార్తీక్ (91), సచిన్ టెండూల్కర్ (82), రాహుల్ ద్రావిడ్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు వసీమ్ జాఫర్ (35), సౌరవ్ గంగూలీ (37), జహీర్ ఖాన్ (11), ఆర్పీ సింగ్ (11), శ్రీశాంత్ (35) పరుగులు చేశారు. గడిచిన 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, జట్టులోని 11 మంది ఆటగాళ్లూ డబుల్ డిజిట్ (కనీసం 10 పరుగులు) దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 345 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 180/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 500

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ అనే పేరు ఒక ఐకానిక్ బ్రాండ్. కెప్టెన్‌గా, పవర్ఫుల్ ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన మహీ, ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచారు. జార్ఖండ్‌లోని రాంచీ అనే చిన్న నగరం నుంచి వచ్చి, దాదాపు 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ధోనీ పేరిట ఇప్పటికీ ఎవరూ దాటలేని కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి. 1. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సారథ్యంలో భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను ముద్దాడింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఏ కెప్టెన్ కూడా ఈ మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వరల్డ్ రికార్డు కూడా ధోనీ పేరిటే ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి ధోనీ మొత్తం 332 మ్యాచ్‌ల్లో భారత జట్టును ముందుండి నడిపించారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నారు. 3. వికెట్ వెనుక 195 అంతర్జాతీయ స్టంపింగ్‌లు వికెట్ కీపర్‌గా ధోనీ ఎంత వేగంగా స్పందిస్తారో అందరికీ తెలిసిందే. తన మెరుపు వేగంతో బ్యాటర్లను పెవిలియన్‌కు పంపే మహీ, అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 195 స్టంపింగ్‌లు చేశారు. ప్రపంచంలో మరే ఇతర వికెట్ కీపర్ కూడా ఇన్ని స్టంపింగ్‌లు చేయలేదు, ఇది ఇప్పటికీ చెక్కుచెదరని ప్రపంచ రికార్డు. 4. వన్డేల్లో వికెట్ కీపర్‌గా 183 పరుగుల ఆల్‌టైమ్ రికార్డు 2005లో జైపూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ నాటౌట్‌గా 183 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు