
భాజపా ఆధ్వర్యంలోప్రధాని మోదీకి పాలాభిషేకం
సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎంపీ రఘునందన్ రావు ప్రజా సమస్యలపై ఎప్పుడు పనిచేస్తుంటారని.. ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని అన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రం, ఆధునిక పార్సిల్ యూనిట్ కేంద్రాలను మంజూరు చేసినందుకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు






