Stock Market: మళ్లీ వణికిస్తున్నక్రూడ్ ధరలు.. క్షణాల్లో ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్లకుపైగా నష్టం!
Stock Market: మళ్లీ వణికిస్తున్న క్రూడ్ ధరలు.. క్షణాల్లో ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్లకుపైగా నష్టం!
© 2026 nimisham.in
Stock Market: మళ్లీ వణికిస్తున్న క్రూడ్ ధరలు.. క్షణాల్లో ఇన్వెస్టర్లకు రూ. 6 లక్షల కోట్లకుపైగా నష్టం!

Stock Market | భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్.. సెన్సెక్స్ 813 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెంచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాండ్ ఈల్డ్స్‌లో కదలికలు కూడా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగొచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి.సెన్సెక్స్ 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 23,873.45 వద్ద ముగిసింది.నిఫ్టీకి 24,000 స్థాయి కీలకమైన అడ్డంకిగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగువన 23,800 స్థాయి తక్షణ కీలక మద్దతుగా ఉందన్నారు. ఈ స్థాయి కంటే నిఫ్టీ నిర్ణయాత్మకంగా దిగువకు వెళ్తే అమ్మకాలు మరింత పెరిగి 23,600 వరకు సూచీ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.నిఫ్టీ షేర్లలో బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.37 శాతం పెరగగా.. స్మాల్‌క్యాప్ సూచీ 1.2 శాతం లాభపడింది.రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయింది. మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాలు కూడా విస్తృత మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడ్డాయి.మరోవైపు రూపాయి కాస్త కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే రూ.94.48 వద్ద బలంగా నిలిచింది. డాలర్ లిక్విడిటీ మెరుగుపడటం దీనికి మద్దతుగా నిలిచింది. దాదాపు 127 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లు రూపాయిపై ఒత్తిడిని తగ్గించే బఫర్‌గా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు. రూపాయి

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి

Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. హీరోకు ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి వారంలోనే భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యశ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్క్‌ను ‘టాక్సిక్’ సులభంగా అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచే గణనీయమైన డ్రాప్‌ను చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం సినిమా థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటకలో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ను అందుకోవాలనే టార్గెట్‌ను ‘టాక్సిక్’ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి హిందీ మార్కెట్లో మాత్రం సినిమాకు కొంత ఊరట లభించినట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్ట్‌లో ‘టాక్సిక్’కు మెరుగైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అక్కడి నుంచి వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తెలుగులోనూ ‘టాక్సిక్’కు తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యే
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్‌కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్‌లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్‌వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి (Stock Market Today). మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి.. 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి.. 23,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ , విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది. నెలరోజుల గ్యాప్ తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. హర్మూజ్‌పై పట్టుకోసం ఇరాన్, అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Crude oil prices). బ్రెంట్ క్రూడ్ ప్యూచర్స్ ఒక బ్యారెల్‌కు 95.52 డాలర్లుగా ఉండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:25 సమయానికి నిఫ్టీ(Nifty) 226 పాయింట్లు తగ్గి 23,827 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 683 పాయింట్లు నష్టపోయి 76,261 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.77 బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.2 డాలర్లు యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.8 శాతానికి చేరాయి. గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.71 శాతం పడిపోయింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) ‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్ (ఫొటోలు) ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం క్రితం రోజు లాభాలను నిలబెట్టుకోలేక స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 24,055 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 12 పాయింట్లు పడిపోయి 76,944 వద్ద నిలిచింది. దేశీయంగా ఇటీవలి జీడీపీ గణాంకాలు బలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరగడం భారతదేశం లాంటి దిగుమతి ఆధారిత దేశాల ద్రవ్యోల్బణానికి సవాలుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. అమెరికా బాండ్ ఈల్డ్‌లు పెరగడం, అక్కడి వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగుతాయనే అంచనాలు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణకు దారితీశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్లు తీవ్ర ప్రతికూలతల్లో ఉన్నప్పటికీ రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎమ్సీజీ, ఐటీ విభాగాలు సూచీలకు ఆసరాగా నిలిచాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిసి నష్టాల తీవ్రతను పరిమితం చేశాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్వల్పకాలంలో విదేశీ మార్కెట్ల సంకేతాలు, అంతర్జాతీయ చమురు ధరల గమనం ఆధారంగానే ఇండియన్ మార్కెట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు! మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ మరింత పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం. అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 383 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాదిలో మరో 7 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 1.8 శాతం వృద్ధి నమోదైంది. అమెరికా పెట్టుబడులను ఎక్కువగా భారత స్టాక్ మార్కెట్లోనే పెట్టింది. 2025 చివరికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024లో ఇది 373 బిలియన్ డాలర్లు.భారత దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇవి 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్వల్పకాలిక రుణ పత్రాల్లో పెట్టుబడులు 500 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారుల వద్ద ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను మాత్రమే సూచిస్తాయి. కర్మాగారాలు, మౌలిక వసతులు వంటి భౌతిక ఆస్తుల్లో చేసిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఇందులో ఉండవు.చైనాను వెనక్కి నెట్టిన భారత్అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: ప్రపంచ మార్కెట్లలో బంగారం మరోసారి దూసుకుపోతోంది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు వరుసగా మూడో వారంలోనూ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ వారం మాత్రమే దాదాపు 5 శాతం పెరిగిన బంగారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పెరుగుదల వెనుక ఒకే కారణం కాకుండా అనేక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కలిసి పనిచేస్తున్నాయి. డాలర్ బలహీనత ప్రధాన కారణం: బంగారం ధరల పెరుగుదలకు ప్రస్తుతం అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలహీనపడటం. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం చౌకగా మారుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల అమెరికా ట్రెజరీ తీసుకున్న బాండ్ బైబ్యాక్ నిర్ణయాల తర్వాత డాలర్ మే నెల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చింది. అమెరికా రుణభారం ఆందోళనలు: అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో డాలర్ విలువ మరింత తగ్గే అవకాశం ఉందనే భావనతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అందుకే ప్రస్తుతం బంగారాన్ని "కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణ కవచం"గా చూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. ఇటీవల వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు, మందగించిన ఉద్యోగ వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు స్థిరంగా

ప్రస్తుతం ఆసియాలోకెల్లా భారత్ స్టాక్ మార్కెట్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్‌ఏ) చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ నెల 7–13 మధ్య ఆసియా ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైనట్లు నివేదికలో బీవోఎఫ్‌ఏ సర్వేలో తెలియజేసింది. దీంతో ఇండొనేసియా స్థానంలో భారత్‌ను చేర్చినట్లు వెల్లడించింది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 272 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్న 98 ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో బీవోఏ మరిన్ని అంశాలను పేర్కొంది. వివరాలు ఇలా.. 27 శాతానికి డౌన్ భారత్‌తో పోలిస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఇండొనేసియావైపు మొగ్గు చూపుతోంది. జూలైలో 32 శాతంగా నమోదైన నెట్ అండర్‌వెయిట్(పెట్టుబడుల ప్రాధాన్యం) ఆగస్ట్ రెండోవారానికల్లా 27 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఇండొనేసియాకు ప్రాధాన్యం పెరిగింది. ఆసియా ప్రాంతంలో తైవాన్, జపాన్ మార్కెట్లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి భారత్ చైనా, ఫిలిప్పీన్స్కంటే వెనుకబడినట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పటిష్టస్థాయిలో ఎక్స్పోజర్ లేకపోవడానికితోడు.. బలహీన ఆర్థిక వృద్ధి దేశీ ఈక్విటీలపట్ల సమస్యాత్మకంగా భావిస్తున్నట్లు బీవోఎఫ్‌ఏ సర్వే పేర్కొంది. సంస్కరణలలేమి, షేర్ల అధిక ధరలు, రూపాయి బలహీనత సైతం ప్రతికూలంగా పరిణమించినట్లు వివరించింది. గత రెండు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడిన సందర్భంలో సర్వే వివరాలు వెలువడటం గమనార్హం! అయితే ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతుండటం, కంపెనీల ఆర్జన అంచనాలు మెరుగుపడటం, మార్కెట్ అంతర్గత మూలాలు మెరుగుపడుతుండటం తదితర సానుకూలతలను ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా స్పందించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ క్యాలండర్ ఏడాది(2026) తొలి ఆరు నెలలు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో భాగమైన కంపెనీల సగటు ఆర్జన వార్షికంగా 18 శాతం పుంజుకోగా.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్‌కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్‌కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్‌ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్‌లో బిట్‌కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది

గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర గందరగోళానికి గురైంది. ఒక్కో దశలో మంచి లాభాల్లోకి దూసుకెళ్లినప్పటికీ... అంతిమంగా స్వల్ప లాభంతో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కేవలం 3 పైసలు పుంజుకుని 95.71 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్లలో డాలర్ కొంత బలహీనపడటం రూపాయికి కలసివచ్చినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయి దూకుడుకు అడ్డుకట్ట వేశాయి.ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఉదయం రూపాయి 95.69 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో గరిష్ఠంగా 95.65 స్థాయికి చేరుకుని ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో వెంటనే కోలుకున్న డాలర్ ధాటికి ఒకానొక సమయంలో 95.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి గురువారం నాటి ముగింపు (95.74) కంటే కేవలం 3 పైసలు మాత్రమే మెరుగై 95.71 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.గడువు కుదింపు.. ఒక్కసారిగా $56 బిలియన్ల వరద!గడిచిన 30 రోజుల్లో అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ప్రత్యేక విదేశీ డిపాజిట్ పథకానికి (FCNR-B) ఇచ్చిన గడువును ఆర్బీఐ ఆగస్టు 31 వరకు కుదించింది. ఈ ముందస్తు ఆదేశంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీ భారత్‌కు పోటెత్తింది. దీనిద్వారా దేశంలోకి ఏకంగా 56.84 బిలియన్ డాలర్ల నిధులు రాగా, మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఈ నిధుల వరద రూపాయి పతనానికి బలమైన అడ్డుకట్టగా మారింది.చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!రూ.707 బిలియన్లకు చేరిన విదేశీ కరెన్సీ నిల్వలుగత కొద్ది వారాల్లో భారత్ ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా $14.13 బిలియన్లు పెరిగి $707 బిలియన్ మార్కును అధిగమించాయి. ఈ బలమైన ఆర్థిక పునాదితో ఆర్బీఐ స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేస్తూ, రూపాయి విలువను నిలకడగా

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMDC)కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు లభించింది. ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ విభాగంలో APMDC ఈ పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా భారీగా నిధులు సమీకరించినందుకు ఈ గుర్తింపు దక్కింది. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా APMDC సుమారు రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్థిక వనరులను సమర్థవంతంగా సమీకరించడంతో పాటు బాండ్ మార్కెట్‌ను వినియోగించుకున్న తీరుకు ASSOCHAM నుంచి ప్రశంసలు లభించాయి. APMDC చేపట్టిన ఈ భారీ నిధుల సమీకరణ సంస్థ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని అధికారులు పేర్కొన్నారు. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్(NCD) ద్వారా సమీకరించిన నిధులతో సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరడమే కాకుండా.. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా APMDC స్థానం మరింత బలోపేతమైంది. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ, మార్కెట్ ఆధారిత నిధుల సమీకరణ, సంస్థాగత ఆర్థిక ప్రణాళికకు గుర్తింపుగా ASSOCHAM అవార్డును భావిస్తున్నారు. రూ.9 వేల కోట్ల స్థాయిలో నిధులను సమీకరించిన APMDC పనితీరుకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

శ్రావణ మాసం రాకతో దేశమంతటా పండుగల కోలాహలం మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా వేడుకల కోసం పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, కుటుంబాలు సిద్ధమవుతున్న వేళ మార్కెట్లో పసిడి ధరలు షాకిస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్, పండుగల సెంటిమెంట్‌కు తోడు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ అందుకున్నాయి. ఈ ఒక్క వారంలోనే పసిడి ఏకంగా 5 శాతం మేర ప్రియమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,620 డాలర్ల దాకా చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల తులానికి రూ. 1,60,780 దాటేసింది. గడిచిన రెండున్నర నెలల కాలంలో పసిడి ఈ స్థాయి గరిష్ఠ రేటును తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ధరలు ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణాలేంటి?అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలే ఈ సడన్ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తమ రుణాలు తగ్గించుకునేందుకు బాండ్ల బైబ్యాక్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా క్షీణించాయి.మరోవైపు అమెరికాపై 40 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల భారం పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విదేశీ కరెన్సీల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా భావించే పసిడి వైపే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడుమున్ముందు బంగారం బాట ఎటు?బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం... బంగారం గతంలో ఉన్న రూ. 1,53,000 - 1,56,000 పరిధి నుంచి దాటుకుని ఇప్పటికే రూ. 1,58,500 మైలురాయిని దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ. 1,62,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ కదలికలు , మధ్యప్రాచ్య

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెరుగుతోన్న చమురు ధరలు వంటి కారణాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడుదొడుకులతో సాగిన సూచీలు (Stock Market).. చివరకు స్తబ్దుగా ముగిశాయి. ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) కాసేపటికి 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఒక దశలో 77,445 కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు అత్యల్పంగా 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 7 రోజుల వరుస నష్టాల తర్వాత కిందటి రోజు (ఆగస్ట్ 21) భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. ఇవాళ (ఆగస్ట్ 21) మళ్లీ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ ఫ్లాట్‌గా 77,530 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 24230 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రముఖ మల్టీనేషనల్ పైపుల తయారీ కంపెనీ షేరు ధర భారీగా పెరిగింది. ఏకంగా 17 శాతానికిపైగా పెరగడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాల్ని అందిస్తోంది.అదే ప్రముఖ పైప్ తయారీ సంస్థ వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆ కంపెనీ చరిత్రలోనే తాజాగా అతిపెద్ద ఆర్డర్ దక్కడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో రూ. 2005.20 వద్ద ముగిసిన ఈ షేరు ధర ఇవాళ నేరుగా 8 శాతానికిపైగా లాభంతో రూ. 2175 వద్ద ఓపెన్ అవగా, తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో 17 శాతానికిపైగా పెరిగి రూ. 2348.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కూడా కావడం విశేషం.ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 61.31 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 710 గా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ భారీగా పుంజుకుంటూ వస్తోంది. 5 రోజుల్లో ఏకంగా 27 శాతం పెరగ్గా, నెలలోనే 45 శాతం పెరిగింది. గత 6 నెలల వ్యవధిలో చూస్తే ఏకంగా 200 శాతం పెరగడం విశేషం. ఈ క్రమంలో లక్షను రూ. 3 లక్షలు చేసింది. గత ఐదేళ్లలో 2 వేల శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని 20 లక్షలకుపైగా

దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు వరలక్ష్మీ వ్రతం పండుగ రోజున కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు కూడా నేడు భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్! ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..? ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 12.65 పాయింట్లు లేదా 0.052 శాతం తగ్గి 24,219.20 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 56.94 పాయింట్లు లేదా 0.073 శాతం కరిగి 77,480.78 వద్ద ట్రేడవుతోంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.04 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.44 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించగా, నిఫ్టీ రియాల్టీ అధిగమించింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) మీరు అసలు మనుషులా రాక్షసులా.? పసి బిడ్డను చంపేస్తారా.? టీచర్ పై పేరెంట్స్ రియాక్షన్ YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్ DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్‌రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వరుస నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. రియల్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 628.04 పాయింట్లు లాభపడి 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇటీవలి మార్కెట్ పతనంతో తక్కువ స్థాయికి చేరిన షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు తెలిపారు.రానున్న సెషన్లో నిఫ్టీకి 24,100-24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 24,300, 24,575 వద్ద నిరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. 24,000 స్థాయిని నిలబెట్టుకుంటే కోలుకునే అవకాశాలు కొనసాగుతాయని, దాని కిందకు పడిపోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగొచ్చని సూచించారు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్ల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 628.04 పాయింట్లు లేదా 0.82 శాతం పెరిగి 77,537.72 వద్ద, నిఫ్టీ 153.55 పాయింట్లు లేదా 0.64 శాతం పెరిగి 24,231.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ దాదాపు 2 శాతం లాభంతో అధిగమించగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ తక్కువ లాభంతో తక్కువ పనితీరు కనబరిచాయి. విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) 'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. తులం ఎంతంటే?

రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల నెలవారి బడ్జెట్ పైన తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఎల్ నినో ప్రభావంతో సాగు తగ్గడం పంటలు సరిగా పండక పోవడం, మరోవైపు రవాణా చార్జీలు పెరగడంతో, ఆ ఛార్జీల భారాన్ని కూడా నిత్యవసర వస్తువుల పైన వేయడం వంటి చర్యలతో సామాన్యులు కుదేలవుతున్నారు.భారీగా పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు తాజాగా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ప్రతిరోజు అవసరమైన ఉల్లిపాయలు సామాన్య మధ్య తరగతి కుటుంబాల ప్రజల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయల ధరలు మళ్లీ భారీగా పెరిగి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. గత నెలలో రూ.20కే లభించిన ఉల్లి ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముడవుతోంది. దీంతో ఇంటి ఖర్చులు మరింత పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి పెరుగుతోంది.రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశంకిలో ఉల్లిపాయల ధరలు 50 రూపాయలకు చేరుకోవడంతో వంటలో ఉల్లిపాయలను వాడడానికి కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో పంట సాగు ఆలస్యం కావడం, ఖరీఫ్ సీజన్లో ఉల్లి దిగుబడి తగ్గడం, అలాగే డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.సామాన్యులకు భారంగా ఉల్లి ధరల పెరుగుదల ఇప్పటికే మార్కెట్లో పంచదార ధరలు పెరుగుతుండగా, ఉల్లి ధరలు కూడా పెరగడం సామాన్యులకు మరో భారం అయ్యింది. ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ప్రస్తుతం టమోటా కిలో రూ.15, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.45, ఉల్లిపాయ రూ.40, ఉల్లిపొర రూ.45, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.45, ఆలుగడ్డ రూ.18 వంటి రేట్లు నమోదవుతున్నాయి.బాసింగబలాలు ఫేమ్ ఈశ్వరసాయి మాధురి రాథోడ్ వ్యవహారం.. సోషల్ మీడియాలో రచ్చధరలను

stock market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. దీంతో వరుసగా ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,909.68) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీ లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,611.11 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 628.04 పాయింట్ల లాభంతో 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా ఉంది. సెన్సెక్స్ 30లో టైటాన్, హెచ్‌సీఎల్, ఇండిగో, టాటా స్టీల్ కంపెనీ షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 93.94డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,490.60 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సూపర్‌మార్కెట్‌కి వెళ్లి అరటిపండ్లు తెస్తే.. అక్కడ మాత్రం చాలా పచ్చగా, ఫ్రెష్‌గా మెరిసిపోతుంటాయి. కానీ, తీరా ఇంటికి తీసుకొచ్చాక రెండు రోజులు తిరిగేసరికి తొక్క అంతా నల్లబడిపోయి, మెత్తగా అయిపోతాయి. అసలు సూపర్మార్కెట్లలో 10 రోజుల వరకు పాడవకుండా ఉండే అరటిపండ్లు, మన ఇంట్లోనే ఎందుకు అంత త్వరగా పండిపోతాయి? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ సైన్స్ ఏంటి? ఇంట్లో కూడా వాటిని ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సూపర్మార్కెట్లలో అరటిపండ్లు రోజులు గడిచినా చాలా తాజాగా కనిపించడానికి ప్రధాన కారణం అక్కడ నిర్వహించే ప్రత్యేకమైన వాతావరణం. స్టోర్లలో, వాటి కోల్డ్ స్టోరేజీలలో ఉష్ణోగ్రతను ఎప్పుడూ 13°C నుంచి 15°C (55–59°F) వద్ద పక్కాగా నిర్వహిస్తారు. ఈ తక్కువ ఉష్ణోగ్రత వల్ల పండు మగ్గే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంతేకాకుండా, అక్కడ తేమను 90–95% వరకు మెయింటెన్ చేస్తారు. దీనివల్ల పండ్లలోని నీటి శాతం తగ్గిపోకుండా, ముడతలు పడకుండా ఉంటాయి. అలాగే పండ్లు సహజంగా విడుదల చేసే ఎథిలీన్ గ్యాస్‌ను బయటకు పంపడానికి పెద్ద వెంటిలేషన్ సిస్టమ్‌లు ఉంటాయి. కొన్ని వాణిజ్య నిల్వ కేంద్రాల్లో 1-MCP అనే సురక్షిత వాయువును ఉపయోగిస్తారు. ఇది పండ్ల కణాలు ఎథిలీన్ గ్యాస్‌ను పీల్చుకోకుండా తాత్కాలికంగా అడ్డుకుంటుంది. దీనికి తోడు మార్కెట్‌కు తెచ్చేటప్పుడే పూర్తిగా పండని, పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లనే విక్రయానికి ఉంచుతారు. రవాణాలో దెబ్బతినకుండా హ్యాంగర్లు లేదా ప్రత్యేక ట్రేలలో ఉంచడం వల్ల బరువు పడి కణాలు దెబ్బతినవు. ఇంటికి తెచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మన ఇంట్లో సాధారణ గది ఉష్ణోగ్రత 25°C కంటే ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగేసరికి పండులో రసాయన చర్యలు వేగవంతమై త్వరగా పండిపోతాయి. అరటిపండ్లు క్లైమాక్టరిక్ రకానికి చెందిన పండ్లు. అంటే, చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా అవి ఎథిలీన్ అనే వాయువును విడుదల

దేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 బెడ్రూమ్ (3BHK) అపార్ట్మెంట్ల ధరలను పరిశీలిస్తే, ముంబై అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో నిలవగా, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 2026 నాటి ప్రాపర్టీ మార్కెట్ డేటా ఆధారంగా ఈ విశ్లేషణ వెలువడింది.ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ఆధారంగా దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 3BHK ఫ్లాట్ల ధరలను విశ్లేషించారు. ఈ నివేదిక ప్రకారం, ఆర్థిక రాజధాని ముంబైలో 3BHK అపార్ట్మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు (sq ft) సుమారు రూ. 33,217గా ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర రూ. 20,000 నుంచి ప్రారంభమై, ప్రీమియం ప్రాంతాల్లో రూ. 65,000 దాటుతోంది.ముంబై తర్వాత స్థానంలో న్యూఢిల్లీ నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ. 15,329గా ఉండగా, గురుగ్రామ్‌లో ఇది రూ. 13,391గా ఉంది. ఇక దక్షిణాదిలో కీలకమైన ఐటీ హబ్ బెంగళూరులో 3BHK ఫ్లాట్ సగటు ధర చదరపు అడుగుకు రూ. 11,223గా నమోదైంది. పూణెలో రూ. 9,635, చెన్నైలో రూ. 9,007గా ఉంది.హైదరాబాద్‌లో అందుబాటు ధరలుఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 3BHK ఫ్లాట్ల ధరలు కొంత అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర సుమారు రూ. 7,900గా రికార్డయింది. కొత్త ప్రాజెక్టులలో ఈ

ప్రేమలో ఓడిపోయిన వాళ్లు మళ్లీ కలుసుకుంటే ఏం జరుగుతుంది? గొడవలు, అసౌకర్యం, ఇబ్బందికరమైన పరిస్థితులు గుర్తొస్తాయి. కానీ వియత్నాంలో మాత్రం మాజీ ప్రేమికులను కలుసుకోవడానికే ఓ ప్రత్యేక సంత జరుగుతుంది. ఏడాదికి ఒక్కరోజు జరిగే ఈ వేడుకలో ఒకప్పుడు ప్రేమించుకున్నవారు మళ్లీ కలుసుకుని కాసేపు మాట్లాడుకుంటారు. స్థానిక సంస్కృతిలో ఇదొక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.ఓ ప్రేమకథతో మొదలై..వియత్నాంలోని హా జియాంగ్ ప్రావిన్స్‌లో జరిగే ఈ వేడుకను ‘ఖావు వై లవ్ మార్కెట్’గా పిలుస్తారు. దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమకథ ఈ సంప్రదాయానికి కారణమైంది.నుంగ్ తెగకు చెందిన ‘బా’ అనే యువకుడు గియాయ్ తెగకు చెందిన ‘ఉత్’ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరి కుటుంబాలు, సంప్రదాయాలు వేరు కావడంతో వారి ప్రేమకు అడ్డంకులు ఎదురయ్యాయి. కుటుంబాల మధ్య గొడవలు జరగకూడదని భావించిన ఆ ప్రేమికులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏడాదికి ఒక్కసారి ఖావు వైలో కలుసుకోవాలని అనుకున్నారు. ఆ చిన్న నిర్ణయమే కాలక్రమంలో ఓ సంప్రదాయంగా మారింది.ఏడాదికి ఒక్కసారి..చంద్ర క్యాలెండర్ ప్రకారం మూడో నెల 27వ రోజున ఈ లవ్ మార్కెట్ జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ వేడుక ఉంటుంది. వివిధ గిరిజన వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుంటారు.ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తులను కలుసుకోవడానికి మాజీ ప్రేమికులు వస్తారు. కాసేపు మాట్లాడుకుంటారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు వెళ్లిపోతారు.పాటలు.. నృత్యాలు.. పండుగ వాతావరణంఇది కేవలం మాజీ ప్రేమికుల కలయికతోనే ముగిసిపోదు. సంప్రదాయ దుస్తుల్లో ప్రజలు

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇతర మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో నిఫ్టీ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,235.46) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఓ దశలో 76,822.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్ల నష్టంతో 24,078 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91 డాలర్ల స్థాయికి చేరగా.. బంగారం ఔన్సు ధర 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కృష్ణాజిల్లా: గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా మానసికంగా, లైంగికంగా తన ఇంటికి రావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 17న ఆమె తండ్రి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు అనంతరం ఆమెను అధికారం అండతో బంటుమిల్లికి బదిలీ చేయించిట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు కోరారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ అన్నారు. ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) అందుకే సచిన్ క్రికెట్ దేవుడు.. 100 ఏళ్లయినా ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ రంగానికి చెందిన పరిశ్రమల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ20తో పాటు మార్కెట్లో ఈ10 పెట్రోల్‌ను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురావాలా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది.సన్నీ లియోన్ వ్యాపారాలు, వాటి టర్నోవర్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్భారత్ అనుకున్న గడువు కంటే దాదాపు ఐదేళ్ల ముందే అంటే గతేడాదే పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌నే ప్రామాణిక ఇంధనంగా విక్రయించడం ప్రారంభించారు. అయితే ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన వాహనాలు ఈ ఈ20 ఇంధనానికి అనుగుణంగా డిజైన్ చేయబడలేదు. దీని వల్ల పాత వాహనాలలో మైలేజ్ గణనీయంగా తగ్గడం, రబ్బర్ పార్ట్స్, ఇంజిన్ భాగాలు పాడవుతున్నాయనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల పాత వాహనాల్లో 3 నుంచి 6 శాతం వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా పార్లమెంట్లో అంగీకరించింది.ప్రస్తుతం మార్కెట్లో వాహనదారులకు పెట్రోల్‌ను ఎంచుకునే ప్రత్యామ్నాయం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత కార్లు లేదా బైకులు ఉన్నవారు తమ వాహనానికి సరిపోయే ఈ10 పెట్రోల్‌ను వాడదామన్నా.. బంతుల్లో అది లభించడం లేదు. దీనిపై ప్రతిపక్ష నాయకులు, వాహనదారుల సంఘాలు వరుసగా ప్రశ్నలు గుప్పించాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ కూడా ఇటీవల ఒక వ్యాసంలో మిలియన్ల కొద్దీ పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను ఈ20తో పాటు సమాంతరంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రివ్యూ- ట్యాక్స్ కట్పాత వాహనదారుల ప్రధాన ఆందోళన వాహన

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,900 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,42,910గా నమోదైంది.అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,930గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులకు అనుగుణంగా దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి

Gold Price Today: భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు పెరగడం సగటు కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత వారం రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,500 కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. మంగళవారం ధర కాస్త పెరగ్గా, బుధవారం నాటికి కూడా అదే ధోరణి కొనసాగుతూ స్వల్పంగా రేట్లు పైకి కదిలాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో ఈ ఊహించని మార్పులకు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగి, మార్కెట్లో ధరలు ఉన్నపళంగా పైకి లేవడం సాధారణంగా మారిన పరిణామం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిలో పయనిస్తున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బిస్కట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.1,55,900 వద్ద విక్రయమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద నిలిచింది. వెండి కూడా బంగారం తోటి పోటీపడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 మార్కును తాకింది. చెన్నైలో కూడా వెండి ఇదే స్థాయిలో ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,49,900 వద్ద లభ్యమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో స్థానిక పన్నుల ప్రభావంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో

Jane Street | ఇంటర్నెట్ డెస్క్: ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’.. సరిగ్గా ఈ సామెత అమెరికాకు చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జేన్‌స్ట్రీట్‌కు సరిపోతుందేమో. భారత స్టాక్ మార్కెట్‌ను కొల్లగొట్టి దేశంలో నిషేధం ఎదుర్కొన్న ఈ సంస్థకు.. వాల్‌స్ట్రీట్‌లో తాజాగా గట్టి షాక్ తగిలింది. నేరుగా ఈ కంపెనీ నష్టపోనప్పటికీ.. నమ్మి పెట్టుబడి పెట్టిన ఓ హెడ్జ్‌ఫండ్ భారీగా నష్టపోవడంతో జేన్స్ట్రీట్కూ భారీగానే నష్టం వాటిల్లింది. వక్రమార్గంలో భారత స్టాక్ మార్కెట్‌ను మోసం చేసిన ఈ సంస్థకు.. ఏడాది తిరగకముందే అంతకు రెండు, మూడింతలు నష్టపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడైన 24 ఏళ్ల లియోపోల్డ్ ఆస్చెన్బ్రెన్నర్ ఆస్చెన్బ్రెన్నర్ సిట్యువేషనల్ అవేర్నెస్ పేరిట హెడ్జ్ ఫండ్‌ను స్థాపించాడు. 19 ఏళ్లకే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఈయన.. గతంలో ఎఫ్‌టీఎక్స్, ఓపెన్ఏఐలలో పనిచేశాడు. అయితే, సెమీకండక్టర్ షేర్లపై సిట్యువేషనల్ అవేర్నెస్ పెట్టిన పెట్టుబడులు బెడిసికొట్టడంతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దీంతో ఈ హెడ్జ్ ఫండ్‌లో పెట్టుబడులు కలిగిన జేన్స్ట్రీట్కూ భారీగా నష్టం వాటిల్లింది. సిట్యువేషనల్ అవేర్నెస్ సంస్థ జూన్ నెలలో శాన్డిస్క్లో 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టింది. జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర కుప్పకూలాయి. దీంతో కేవలం ఒక్క నెలలోనే పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 67 శాతం ఆవిరైంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10 శాతం వాటా కలిగిన బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా అదే నెలలో 31 శాతం పడిపోయాయి. టీఎస్ఎంసీ, నెబియస్ షేర్లలో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా 45 బిలియన్లుగా ఉన్న ఫండ్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ పతనం కారణంగా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ దాదాపు 15 బిలియన్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 281.09 పాయింట్లు నష్టపోయి 77,728.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.35 పాయింట్లు కోల్పోయి 24,287.65 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా ఒడుదొడుకులు కనిపించాయి.ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు మెటల్, రియల్టీ రంగ షేర్లు రాణించాయి. నిఫ్టీకి 24,400 స్థాయి కీలక నిరోధంగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిని అధిగమించి నిలబడితే 24,500-24,600 దిశగా సూచీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. దిగువన 24,300-24,200 ప్రాంతం కీలక మద్దతుగా ఉందన్నారు. 24,250 కంటే దిగువకు బలంగా పడిపోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి 24,000 స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.05 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.36 శాతం లాభపడింది. ఎంపిక చేసిన మెటల్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు కొంత మద్దతు ఇచ్చాయి.దేశీయంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు. క్రూడ్ ధరలు పెరగడం, ఆర్బీఐ ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్ విండోను ముందుగానే మూసివేయాలని నిర్ణయించడం దీనికి కారణమని చెప్పారు. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలహీనపడటం, వినియోగదారుల గణాంకాలు కొంత మెరుగ్గా ఉండటం దీర్ఘకాలికంగా రిస్క్ తీసుకునే ఆసక్తికి మద్దతు ఇస్తున్నాయని

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు రావడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్ మారకం విలువలో కదలికలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత భేతాళుడిలా పైకి లేచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరిగిన రేట్లు.. తులం ఎంత ఉందంటే?ఆగస్టు 17 సోమవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.53 పెరిగి రూ.15,566 వద్దకు చేరింది. సాధారణంగా ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాముకు రూ.50 పెరిగి రూ.14,270 వద్ద నమోదుకాగా, 18 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.41 పెరిగి రూ.11,676 గా ఉంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ.5,300 పెరిగి రూ.15,56,600 టచ్ చేసింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. గ్రాముపై రూ.255 పెరగుదల నమోదవ్వగా.. ప్రస్తుతం కిలో రూ.2,55,000 గా ఉంది. వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల నగరాల్లో నేటి ధరలు!మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి.24 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.530 పెరిగి రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.500 పెరిగి రూ.1,42,700 నమోదు కాగా..18 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.410 పెరిగి రూ.1,16,760 వద్దకు చేరింది.18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో

భారతీయులు ఎక్కువగా కొత్త ఫోన్ ఏ కారణంతో కొంటున్నారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది

గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కొనసాగింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడటంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీలపై స్పష్టంగా కనిపించింది. వీటిలో ఐదు దిగ్గజ కంపెనీలు కలిసి తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) నుంచి ఏకంగా రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టపోయాయి.నష్టపోయిన కంపెనీలలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క వారంలోనే టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,263.28 కోట్లు క్షీణించి రూ.8.53 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.31,869.13 కోట్లు తగ్గి రూ.17.70 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.25,891.88 కోట్లు నష్టపోయి రూ.9.86 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.7,165.37 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,792.65 కోట్లు తమ మార్కెట్ విలువను కోల్పోయాయి.లాభపడ్డ మరో ఐదు కంపెనీలు ఒకవైపు ఐదు కంపెనీలు నష్టాలపాలవ్వగా, మరో ఐదు కంపెనీలు మాత్రం లాభాలను ఆర్జించడం విశేషం. ఈ ఐదు కంపెనీలు కలిసి తమ మార్కెట్ విలువకు రూ.55,149.45 కోట్లను జోడించుకున్నాయి. లాభపడిన వాటిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ముందుంది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.26,438.49 కోట్లు పెరిగి రూ.5.23 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ కూడా రూ.20,592.13

భారతీయుల కొత్త వెడ్డింగ్ హాట్‌స్పాట్ శ్రీలంక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దుబాయ్‌కి బ్రేక్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, బాలి వైపు మొగ్గు భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్‌కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్‌పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్‌లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు భారతీయులు

Gold Price Today News: బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన క్రమంలో బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి రోజే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారంపై దాదాపుగా రూ.1,260 (10 గ్రాములకు) తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. వెండి ధరకు గ్రాముకు రూ.260 వద్ద పరిమితమయ్యాయి. ఈ వారంలో జరగనున్న అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా.. అమెరికాకు చెందిన సెంటర్ కీలక శాంతి ఒప్పందం.. ఇప్పుడు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బంగారం భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి రోజు ఉన్న ధరలతో పోలిస్తే ఆగస్టు 13వ తేదీన 24 క్యారెట్ల విలువైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,260 తగ్గి.. రూ.1,53,600 ధరకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గుముఖం పట్టి రూ.1,40,800 ధరకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.940 తగ్గిపోయి రూ.1,15,200 వద్దకు చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న వెండి ధర నేడు అనగా ఆగస్టు 13 నాటికి రూ.2,60,000 వద్దకు చేరింది. భారీగా ధరలో పతనమైన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా నిన్నటితో పోలిస్తే మార్పులు లేదు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం. కేసముద్రం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం. ఈ మార్కెట్‌కు గురువారం 48 మంది రైతులు 1,106 బస్తాల్లో ధాన్యం తీసుకురాగా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో ధాన్యానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355, కనిష్ఠంగా రూ.2,029, సగటున రూ.3,549 ధరలతో వ్యాపారులు ఖరీదు చేశారు. జైశ్రీరాం పాతరకం ధాన్యానికి ఓ వ్యాపారి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355 ధర నమోదు చేసి దక్కించుకున్నాడు. దీంతో మార్కెట్ ఏర్పడిన నాటి నుంచి ధాన్యానికి క్వింటాకు ఈ ధర దక్కడం ఇక్కడ ఒక రికార్డుగా నిలుస్తోంది. జూలై 21న తొలిసారి ఈ రకం ధాన్యానికి క్వింటాకు రూ.4 వేల మార్కు దాటి రూ.4,013 ధర రాగా, అదే నెల 28న రూ.4,036, ఈ నెల 3న రూ.4,135, 4న రూ.4,141 ధరలు నమోదయ్యాయి. ఇదే రకం ధాన్యం గత ఏడాది ఇదే సమయానికి రూ.3,600 నుంచి రూ.3,700 వరకు గరిష్ఠ ధరలతో కొనుగోలు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో అన్ని రకాల ధాన్యం ధరలు సాధారణం కంటే క్వింటాకు రూ.500 నుంచి రూ.700 అధికంగా ఉన్నాయి. అసాధారణ రీతిలో ధాన్యం ధర పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, బియ్యం వినియోగదారులు మాత్రం రేట్లు పెరుగుతాయని ఆందోళనతో ఉన్నారు

దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి బొగ్గు ధరలను పెంచలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు సంబంధించిన ధరల విషయంలోనూ పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మినరల్స్ అంశంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పన్నులు, సెస్‌ల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలను గౌరవిస్తూనే ఖనిజ రంగ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. దేశంలో మినరల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్! దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం

దేశీయ మార్కెట్లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతంహైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్

శ్రావణ మాసం ఎఫెక్ట్.. బంగారం ప్రియులకు బిగ్‌షాక్.. అసలు కారణమిదే.. నేటి ధరలు ఇలా.. Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ వార్తకు సంబంధించిన

పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. దాదాపు ఏడాది పొడవునా పత్తి క్రయవిక్రయాలు జరిగే ఆదోని మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు రూ.10వేలుపైనే లభిస్తోంది. తాజాగా క్వింటా పత్తి రూ.10,350 పలికింది. ఈ నెల ఒకటో తేదీన రూ.9,830 పలికిన ధర.. పది రోజుల్లో రూ.500దాకా పెరిగింది. మార్చి నెలలో కనీస మద్దతు ధర కూడా లేకపోగా.. ఇప్పుడు డిమాండ్ వచ్చింది. గతేడాది పత్తికి డిమాండ్ ఉన్నా.. ఉత్పత్తి లేకపోవడం, తుఫాన్ల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తిని రైతులు నిల్వ ఉంచుకోలేక, వచ్చిన ధరకు అమ్మేశారు. ఇప్పుడు సీజన్ ముగిసిపోయి, పత్తి నిల్వలు తరిగిపోయిన తర్వాత మంచి ధర వస్తోంది. రాష్ట్రంలో 2025-26 మార్కెటింగ్ సీజన్లో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో పత్తి పండించగా, దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యింది. పత్తి క్వింటా కనీస మద్దతు రూ.7,710-8,110 ఉండగా, 38,940 మంది రైతుల నుంచి రూ.1,556.93కోట్ల విలువైన 19,99లక్షల క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే గతేడాది పత్తి తీసే తరుణంలో మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసి, పత్తి తడిసి, పాడైపోయి రైతులు భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.6వేలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కొంత పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు. సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో బయట ధరలు ఎమ్మెస్పీ