
రీ-ఎంట్రీలో చిరుకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్
చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సక్సెస్ అందుకున్న మూడు సినిమాలూ సంక్రాంతి సీజన్ లోనే రావడం విశేషం. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సైతం సంక్రాంతికే వస్తుండటంతో చిరు డబుల్ హ్యాట్రిక్ కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారని మెగాభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవలే 40 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత పొంగల్ బరిలో హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. చిరు - బాబి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని మెగాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత 2017లో 'ఖైదీ నెం. 150' తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమా ఎన్నేళ్ళ తర్వాత వచ్చినా అభిమానులు అక్కున చేర్చుకోవడం ఖాయమని ఆ సినిమాతో నిరూపితమైంది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఆపైన 2022లో వచ్చిన 'ఆచార్య, గాడ్ ఫాదర్' చిత్రాలు సైతం కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఇక 2013లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఆ యేడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా జయకేతనం ఎగరేసింది. విశేషం ఏమంటే... రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి రెండో విజయం కూడా సంక్రాంతికే లభించింది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు సీనియర్ హీరోల చిత్రాలలో

