
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ నిర్వహించారు.

Bullet Train: బుల్లెట్ రైలు ఢీకొని భారతీయ మహిళ మృతి

Alleti Maheshwar Reddy | కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా..? సస్పెన్షన్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

Bullet Train: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఏపీలో తొలి స్టేషన్ అక్కడే.. రూట్ మ్యాప్ ఫిక్స్..

మొత్తం ప్లెయిన్ చైన్ ఉంటుంది. మధ్యలో నల్లపూసలు ఉంటాయి. చైన్, బ్రేస్లేట్ రెండూ ఒకే డిజైన్ లో ఉంటాయి. మీకు నల్లపూసల చైన్, బ్రేస్లేట్ రెండూ కాస్త గ్రాండ్ లుక్ కావాలి అంటే ఇలాంటి డిజైన్ ట్రై చేయచ్చు. వైట్ స్టోన్స్ మంచి లుక్ ఇస్తాయి. ప్లెయిన్ చైన్ కి కింద నల్లపూసలు, చిన్న లాకెట్ వేలాడదీసి ఉంటుంది. మ్యాచింగ్ బ్రేస్లేట్ మంచి లుక్ ఇస్తుంది. నల్లపూసలు గోల్డ్ చైన్ కి అక్కడక్కడ ముత్యాల టచ్ ఇచ్చారు. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో మంచి నల్లపూసలు కావాలి అంటే.. ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ బరువులోనే ఈజీగా లభిస్తుంది. ఇలాంటి నల్లపూసల డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. నల్లపూసలు, గోల్డ్ పూసల కాంబినేషన్ లో ఉంటుంది. మ్యాచింగ్ బ్రేస్లేట్ మరింత మంచి లుక్ ఇస్తుంది. AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు! Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

సన్న వడ్లకు రూ.500 బోనస్.. తెలంగాణ రైతులకు భారీ ఊరట రూ.8 లక్షల కోట్ల అప్పులు.. కాంగ్రెస్ పాలనపై పొంగులేటి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే.. పొంగులేటి సంచలన ఆరోపణలు Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 1000 రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిందని తెలిపారు. రాజకీయ బేషజాలకు వెళ్లకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత పాలనలో పేరుకుపోయిన సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ : వ్యవసాయ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోత్సాహకాలతో తెలంగాణ వరి ఉత్పత్తి పంజాబ్‌ను మించి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు. Read Also : Vivo T5 Launch : బడ్జెట్లో బిగ్ బ్యాటరీ బీస్ట్.. 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో ఈ వివో 5G ఫోన్ దుమ్మురేపుతోంది! ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టామని అన్నారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు. హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న
మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 57 మందికి అస్వస్థత మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందగా మరో 57 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో.. మలేరియా నివారణ మాత్రలు అయిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఒక చిన్నారి మృతి చెందడమే కాకుండా మరో 57 మంది తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. వీరిలో 41 మంది చిన్నారులు ఉండగా.. 16 మంది గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుతం వీరిందరికీ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించిన

నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ! ఈ వార్తకు సంబంధించిన

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chloroquine Tablets Reaction: పోలవరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థులు మరణించారు. వరుసగా చిన్నారుల మరణం ఘటన ఏటపాక మండలం పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చోటుచేసుకుంది. మలేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా చిన్నారులకు వేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 5గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా చిన్నారులు మరణించడంతో గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే.. ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించిన మలేరియా నివారణ క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న తర్వాత పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత శుక్రవారం పద్దం రోజా, మాడమ జమున అనే ఇద్దరు బాలికలు మరణించారు. తాజాగా మరో ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కుప్పకూలడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే, గొల్లగుప్ప గ్రామంలో 75 మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్సీ) వైద్యుల కొరతతో పాటు తగినన్న బెడ్లు లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలకు తగిన వైద్యం అందలేదు. దీంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతూ.. చిన్నారులను ట్రాక్టర్లపై భద్రాచలం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీ పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య శాఖ నిర్లక్ష్యం, డోసేజ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, గొల్లగుప్ప గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆసక్తికర ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు ఆసక్తికర ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble The Trouble) విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విభిన్న కథలు, వినూత్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మరోసారి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆ తర్వాత వచ్చిన ‘కేకు వాకు’ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్లో ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆయన పక్కనే చిన్నారి స్సారా చేతిలో రంగుల మాయాజాలం కనిపిస్తోంది. ఆ మాయతో డబ్బు వర్షంలా కురుస్తుండటం పోస్టర్‌కు ఫాంటసీ టచ్‌ను తీసుకొచ్చింది. ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదం, ఫాంటసీ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు పోస్టు ద్వారా బెదిరింపులేఖ వచ్చింది. 'కరుడుగట్టిన ఉగ్రవాదులు' త్వరలోనే హత్య చేస్తారని లేఖ పంపిన వ్యక్తి హెచ్చరించాడు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్‌కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. పోస్ట్ (తపాలా) ద్వారా వచ్చిన ఒక సంతకం లేని లేఖలో, 'కరుడుగట్టిన ఉగ్రవాదులు త్వరలోనే నిన్ను హత్య చేస్తారు' అని హెచ్చరించినట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లును కూడా పేర్కొన్నారు. హోం కార్యదర్శికి ఫిర్యాదు.. విచారణకు విజ్ఞప్తి తీవ్రమైన ఈ బెదిరింపు లేఖపై చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాశారు. బెదిరింపు లేఖ మూలాలు, దాని ప్రామాణికతపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్‌కు కేంద్ర హోంశాఖ ద్వారా 'Z' కేటగిరీ భద్రత ఉంది. అయితే, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించి, అవసరమైతే మరింత భద్రతను పెంచాలని హోం కార్యదర్శిని కోరారు. కేంద్రమంత్రి రాబోయే బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది, లేఖ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు
5/5సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రముఖ గ్లోబల్ మూవీ రివ్యూయింగ్ ప్లాట్‌ఫామ్ 'లెటర్‌బాక్స్' (Letterboxd) ప్రొఫైల్ ద్వారా ఇచ్చే సినిమా రేటింగ్‌లు బయటకు రావడంతో ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కంటెంట్‌ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిర్భయంగా ఇచ్చే ఈ రేటింగ్‌లు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా టాక్సిక్ పై ఇచ్చిన రేటింగ్ వైరల్ గా మారింది. టాక్సిక్ కి గౌతమ్ అర నక్షత్రం రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు వివిధ భాషలు, వివిధ జోనర్లకి చెందిన 400లకి పైగా సినిమాలని గౌతమ్ వీక్షించినట్లు అతని ప్రొఫైల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ రివ్యూల సమాహారంలో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాలైన 'పోకిరి', '1: నేనొక్కడినే' చిత్రాలకు ఏకంగా పూర్తిస్థాయి 5/5 నక్షత్రాల రేటింగ్ ఇచ్చాడు. తన తండ్రి కెరీర్లోనే ఎంతో వైవిధ్యమైన, సాహసోపేతమైన ప్రయోగాత్మక పాత్రలను గౌతమ్ ఎంతగా అభినందిస్తాడో ఈ రేటింగ్స్ నిరూపిస్తున్నాయి. అయితే అదే సమయంలో, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' చిత్రానికి గౌతమ్ కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోవడం విశేషం. అంతేకాదు, మహేష్ బాబు నటించిన 'నిజం', 'వంశీ' చిత్రాలకు కూడా కేవలం 2 స్టార్ల చొప్పున మాత్రమే రేటింగ్ కేటాయించి తన స్వతంత్ర అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోలేదు. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల పాన్-ఇండియా, హాలీవుడ్ చిత్రాల విషయంలోనూ గౌతమ్ తన సమీక్షా ముద్రను స్పష్టంగా వేశాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'బాహుబలి 2' చిత్రానికి గౌతమ్ సంపూర్ణంగా 5 నక్షత్రాలు అందించగా, క్లాసిక్ లవ్ అండ్ యూత్ ఫుల్ డ్రామాలైన 'పెళ్లిచూపులు', 'సీతారామం' సినిమాలకు 4.5 రేటింగ్ ఇచ్చి తన సినిమా అభిరుచి ఎంత పరిణతి చెందిందో చాటిచెప్పాడు. ప్రతికూల వైపు చూస్తే, యశ్ నటించిన

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు. జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు. హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్ Viral : 20 సెకన్లలో ఇద్దరిపై కత్తులతో దాడి.. న్యూయార్క్ లో టెన్షన్! పరారీలో బాసింగ బాసింగ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

శరీరాన్ని చల్లగా ఉంచి, రోజంతా శక్తిని అందించే అల్పాహారాలలో జొన్న అంబలి (లేదా జొన్న సద్దన్నం) ఒకటి.. ఇది రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాధారణ ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలకు బదులుగా ఈ సాంప్రదాయ వంటకాన్ని ఎంచుకోవడం వల్ల కడుపులో హాయిగా ఉండడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. జొన్నల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థం (ఫైబర్), విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. పురాతన కాలం మనుషులు శారీరకంగా బలంగా ఉండేవారు. జొన్న అంబలి ముఖ్యంగా ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. మన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఈ పులియబెట్టిన ఆహారంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యంతో చేసే చద్దన్నంతో పోలిస్తే, జొన్న అంబలి బరువు పెరగకుండా చూస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా దీనిని తీసుకోవచ్చు.. ఎందుకంటే జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. నానబెట్టడం: ఒక కప్పు తెల్ల జొన్నలను (లేదా పచ్చ జొన్నలు) ఒకటి, రెండుసార్లు శుభ్రంగా కడిగి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం సిద్ధం చేయాలంటే ముందురోజు మధ్యాహ్నమే నానబెట్టుకోవడం ఉత్తమం. రుబ్బడం: నానిన జొన్నలలోని నీటిని వంపేసి, మిక్సీ జార్ లోకి వేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్‌లో ఆపుకుంటూ రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించడం: రుబ్బుకున్న జొన్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా వెంటనే కలుపుతూ ఉండాలి. ఫెర్మెంటేషన్

ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest మీరు ఇప్పటి వరకు ఎన్నో రెసిపీస్ చూసి ఉంటారు వాటికన్నా ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని అది ఎదో కాదు రాగి అంబలి. దీనిని రాగి పిండితో తయారు చేస్తారు దీనిని ఎలా తయారు చేయాలంటే? రాగి అంబలి మూడు కప్పుల రాగి పిండి , రెండు గ్లాస్ ల మంచి నీళ్లు , ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు - తగినంత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ , జీలకర్ర పొడి కావాల్సిన పదార్దాలు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు లేదా మూడు గ్లాస్ ల నీళ్లు పోసి పెట్టి మరిగించాలి. స్టెప్ 1 ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి దీనిలో పోస్తూ తిప్పాలి స్టెప్ 2 ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఈ పిండి బాగా ఉడికే వరకు 10 నిమిషాలు ఉంచాలి స్టెప్ 3 ఈ రాగి జావ చల్లారాక మజ్జిగను దీనిలో వేసి కలపాలి. ఇంకా దీనిలో తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర పొడి వేసి కలపాలి. స్టెప్ 4 (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా

జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. అలాగే, సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం పెరుగుతాయని నమ్మకం. పుట్టిన తేదీ ప్రకారం 1 నుంచి 9 వరకు మూలసంఖ్యలు ఉన్నవాళ్లు ఏ వస్తువులను పర్సులో లేదా తమ దగ్గర ఉంచుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 1. దీనికి అధిపతి సూర్యుడు. వీరు తమ పర్సులో ఒక వెండి నాణెం లేదా రాగి బిళ్ల ఉంచుకుంటే అదృష్టం పెరుగుతుందని నమ్మకం. ఇది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ఇక 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన మూలసంఖ్య 2. దీనికి అధిపతి చంద్రుడు. వీరు తమ పర్సులో లేదా పనిచేసే చోట స్వచ్ఛమైన ముత్యం లేదా తెల్లటి స్పటికాన్ని ఉంచుకోవడం వల్ల సంపద, కొత్త అవకాశాలు వస్తాయని నమ్మకం. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 3. దీనికి అధిపతి గురుడు. వీరు పసుపు కలిపిన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం శుభప్రదం. ఇవి సంపదను పెంచి, డబ్బుకు సంబంధించిన అడ్డంకులను తగ్గిస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. వీరు తమ దగ్గర ఒక చిన్న స్క్వేర్ షేప్ వెండి రేకును ఉంచుకోవడం మంచిది. ఇది కొత్త ఆదాయ మార్గాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుందని, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం. 5, 14, 23 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 5. దీనికి అధిపతి బుధుడు. వీరు తమ దగ్గర ఒక చిన్న శంఖాన్ని ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. శంఖం లక్ష్మీదేవికి

దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్యాస్ గృహ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్‌కు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియపై సదరు కంపెనీలు అత్యవసర అలెర్ట్ జారీ చేశాయి. బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అనే ఈ-కేవైసీ ప్రక్రియను రేపటిలోపు పూర్తి చేయాలని, లేదంటే గ్యాస్ సబ్సిడీ వర్తించదని స్పష్టం చేశాయి.నిబంధనను పాటించకపోతే సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశంప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ నిబంధనను పాటించకపోతే సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని, వినియోగదారులు ఈ విషయాన్ని మర్చిపోకూడదని చెప్తున్నాయి. అలాగే సాధారణ ధరకు సిలిండర్ పొందలేక, అధిక ధర చెల్లించాల్సి రావచ్చని పేర్కొంది. కనెక్షన్ పూర్తిగా రద్దు కాకపోయినా, సేవల్లో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి.ఆన్లైన్ పోర్టళ్లలో రద్దీ, సర్వర్ సమస్యల కారణంగా గడువు పొడిగింపుఈ చర్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత పెంచడం, నకిలీ కనెక్షన్లు నివారించడం కోసం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కాకుండా సాధారణ గృహ వినియోగదారులు, ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేయాలి. గతంలో ఆన్లైన్ పోర్టళ్లలో రద్దీ, సర్వర్ సమస్యల కారణంగా గడువు పొడిగించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం రేపటితో ముగిసే అవకాశం ఉంది.ఓటీపీ ద్వారా లాగిన్ అయి, ఫేస్ స్కాన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి ఈ-కేవైసీ పూర్తి చేయడం చాలా సులభం. వినియోగదారులు తమ గ్యాస్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఆధార్ కార్డు నంబర్, కన్స్యూమర్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక యాప్‌లైన ఇండియన్ఆయిల్ వన్, హలో బీపీసీఎల్, హెచ్‌పీ పే తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓటీపీ ద్వారా లాగిన్ అయి, ఫేస్ స్కాన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది.రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి!వినియోగదారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం డీఆర్డీఏ-సెర్ప్ ఆయా రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలతో రాష్ట్రస్థాయిలో ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. తాజాగా మహిళలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చాయ్‌రాస్తా పేరుతో టీస్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా అనంతపురం జిల్లాలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సెర్ప్ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది.ఈ చాయ్ రాస్తా బ్రాండ్‌తో టీస్టాల్ ఏర్పాటుకు ఫ్రాంచైజ్ తీసుకుంటే కంటైనర్‌తో పాటుగా సామాగ్రి అందిస్తారు. టీ, కాఫీ కోసం పంచదార, పాలు.. బిస్కెట్లు, కూల్డ్రింకులు విక్రయించొచ్చు. అలాగే చాయ్ రాస్తా ఏర్పాటుకు సంబంధించి లొకేషన్ సర్వే, డాక్యుమెంటేషన్, లైసెన్సులు, మార్కెటింగ్, వ్యాపార శిక్షణలో ఎదురయ్యే సమస్యల పరిష్కరిస్తారు. ఈ చాయ్ రాస్తా ఏర్పాటు చేసుకునేందుకు డీఆర్డీఏ స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 4 లక్షల వరకు రుణం అందిస్తారు. PMEGP (ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం) కింద రూ. 4 లక్షల రుణం పొందితే రూ. 1.40 లక్షల రాయితీ పొందే అవకాశం కూడా కల్పించారు.ఆయా ప్రాంతాన్ని బట్టి.. ప్రతి రోజూ రూ. 5వేల వ్యాపారం జరిగితే నెలకు రూ. 40వేలు వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది. అదే రూ. 10వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. లక్ష వరకు.. రూ. 20వేలు వ్యాపారం జరిగితే నెలకు రూ. 2.50 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మహిళలు చాయ్రాస్తాలు ఏర్పాటు చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 30చోట్ల అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ చాయ్ రాస్తాలను ప్రధానంగా టోల్గేట్లు, నేషనల్ హైవేలు, రద్దీ ప్రదేశాల్లో పెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరికొన్నిచోట్ల చాయ్ రాస్తాలు ఏర్పాటు

భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా అర్హతలేని వారంతా రైతుబంధు ప్రయోజనాలు పొందారని అన్నారు. భూ రీసర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు 70 గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతున్నదని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేస్తామన్నారు

నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై.. పెంట్లవెల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మంత్రి స్వయంగా బకెట్లో నీరు తీసుకొని మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. వెంటనే రూ.450తో ఒక బకెట్, జగ్గు, ఫినాయిల్ డబ్బా, బ్రష్, తెప్పించి కార్యాలయానికి అందజేశారు. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మన బాత్రూమ్లను మనమే శుభ్రం చేసుకోవచ్చని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి మంత్రి సూచించారు

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్ శుక్రవారం.. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్ దాడిలో లోచబ్ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని

గత నెల 20న ఢిల్లీలో నీట్ అక్రమాలపై విద్యార్ధులు నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన పెల్లెట్ల ప్రయోగంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ఏకంగా సాహిల్ అనే ఓ బాధితుడిని తీసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చేశారు. ఉన్నట్లుండి ఇవాళ ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు సాహిల్, అతని తల్లితో కలిసి వచ్చిన రాహుల్ గాంధీ.. పోలీసుల్ని బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు.ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!దీంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని కూడా పిలిపించుకుని పోలీసు స్టేషన్ బయట బైఠాయించారు. దీంతో కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్ధితి ఎదురైంది. అయినా సాయంత్రం వరకూ దీనిపై స్పందించకుండా ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తూనే ఉన్న పోలీసులు.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించారు. అనంతరం బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, వెంటనే ఆ కాపీని రాహుల్ గాంధీ చేతికి అందించారు. పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!దీంతో రోజంతా పోలీసు స్టేషన్ లోనే ఈ ఎఫ్ఐఆర్ కోసం నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పెల్లెట్ల ప్రయోగమే చేయలేదని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు.. ఇవాళ అందుకు కావాల్సిన ఆధారాలను, బాధితుడి మెడికల్ రిపోర్టులను, చివరికి పెల్లెట్లను కూడా పోలీసులకు అందజేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు. దీంతో పెల్లెట్ల ప్రయోగంలో గాయాల పాలైన ఇతర విద్యార్ధులు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ల నమోదు కోరబోతున్నారు. తనపై జరిగిన పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపు కోల్పోయిన సాహిల్.. తన ఆరోగ్యంపై ఆరా తీసేందుకు నిన్న ఫోన్

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నాపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకస్మిక ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ధర్నాపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కేవలం తనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వైఖరి తీసుకుంటున్నారని, అక్కడ ఉన్న ఆధారాలు ఆయన మాటలకు సరిపోలుతున్నాయా అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన ఆమె.. వ్యవస్థను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా కేవలం నాటకీయ నిరసనలు తెలపడం రాహుల్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ నిశితంగా గమనిస్తూ పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్‌తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు. సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా

తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో మరోసారి తనదైన శైలిలో వ్యవహరించి వార్తల్లో నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేసి అధికారులు, సిబ్బందికి షాక్ ఇచ్చారు.ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఆయన, అక్కడి మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. దీంతో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతూ, తానే స్వయంగా బకెట్ లో నీళ్లతో మరుగుదొడ్లను శుభ్రం చేశారు. దుమ్ము పేరుకుపోయిన గోడలపై నీళ్లు చల్లి క్లీన్ చేశారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో అక్కడి అధికారులు ఏం చేయాలో పాలుపోక చూస్తుండిపోయారు.ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిరంతరం కార్యాలయాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి బాధ్యతారాహిత్యం తగదని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఇకపై విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందితో పాటు సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత స్థానిక అధికారులపై ఉందని జూపల్లి గుర్తుచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్లక్ష్య వైఖరి వీడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు. ఈ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ తీరు మారాల్సిన అవసరాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది
Dividend: మిడ్ క్యాప్ విభాగంలో బలమైన ఆర్థిక ప్రదర్శన కనబరుస్తున్న జిల్లెట్ ఇండియా ( Gillette India Share Price ) తమ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడులు అందిస్తోంది. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై 600 శాతం మేర డివిడెండ్ చెల్లిస్తోంది. అంటే ఒక్కో షేరుకు రూ.60 చొప్పున డివిడెండ్ డబ్బులు అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి వస్తాయి. షేరు ధరతో సంబంధం లేకుండా ఈ డబ్బులు చెల్లిస్తారు. మరి ఈ డివిడెండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.డివిడెండ్ అర్హత, రికార్డ్ తేదీ వివరాలు డివిడెండ్ మొత్తం: ఒక్కో షేరుకు 600 శాతం అంటే రూ.60 చొప్పున చెల్లించనున్నారు. రికార్డ్ తేదీ: ఆగస్టు 24, 2026ను రికార్డ్ తేదీగా నిర్ణయించారు. ఎవరికి అర్హత ఉంటుంది ?: ఆగస్టు 24వ తేదీ లోపు కంపెనీ డీమ్యాట్ ఖాతా రికార్డులలో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్‌ను పొందడానికి అర్హులు. ఎక్స్-డివిడెండ్ తేదీ: సాధారణంగా రికార్డ్ తేదీకి ఒక రోజు ముందు లేదా అదే రోజు (T+1) సెటిల్మెంట్ ప్రకారం ఎక్స్ డివిడెండ్ తేదీగా మారుతుంది. అంటే ఆగస్టు 21వ తేదీన మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది.జిల్లెట్ ఇండియా వ్యాపార బలంప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సమూహానికి చెందిన జిల్లెట్ ఇండియా, దేశీయంగా షేవింగ్ ప్రొడక్ట్స్, రేజర్లు, బ్లేడ్లు, పర్సనల్ కేర్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ వద్ద ఉన్న బలమైన బ్రాండ్ వాల్యూ, మెరుగైన త్రైమాసిక లాభాలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నిర్ణయాలు ఈ స్టాక్‌ను దీర్ఘకాలికంగా బలంగా ఉంచుతున్నాయి.స్టాక్ పనితీరుజిల్లెట్ ఇండియా కంపెనీ స్టాక్ ఈరోజు రూ. 7515 వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఒక దశలో రూ. 7555 గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ వార్త రాసే సమయానికి స్వల్ప లాభంతో రూ. 7529

తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారింది. గత కొంత కాలంగా కొండా వైఖరి పార్టీకి సమస్యగా మారుతోంది. జిల్లాలోని సొంత పార్టీ నేతలే కొండా పైన వరుస ఫిర్యాదులు చేస్తు న్నారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ నుంచి ఇప్పుడు కుమార్తె సుస్మిత వరకు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి.. పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. దీంతో. సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నారు. చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. అటు ఏఐసీసీ సైతం వీరి పై చర్యలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.కొండా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో.. రేవంత్ ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ వ్యవహారం పైన సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణా రాహిత్యమని.. నోటీసులకే పరిమితం కాకూడదని డిసైడ్ అయ్యారు. నోటీసులకు కొండా సురేఖ వివరణ ఇచ్చారు.సుస్మిత వ్యాఖ్యల్లో నా ప్రమేయం లేదు.. నన్ను బాధ్యురాలిని చేయొద్దు: మంత్రి కొండా సురేఖతన కుమార్తె వ్యాఖ్యలతో తాను ఏకీభవించటం లేదని.. తన కుమార్తె చేసిన వ్యక్తిగత ఆరోపణలకు తానెలా బాధ్యురాలినని గురువారం కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇచ్చారు. అదే విధంగా కొండా సురేఖ ఓఎస్డీ పైనా కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గతంలో ఓ వివాదంలో సుమంత్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినపుడు కూడా కొండా సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర స్థాయిలో అడ్డుకుని ఆరోపణలు చేశారు.రేవంత్ అమెరికా పర్యటన రద్దు, కేంద్రం బ్రేక్..? తిరిగి వెనక్కు, అసలు కారణం..!!రేవంత్ సీరియస్.. కఠిన చర్యలుకొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు ములుగు, పరకాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అయితే ఈ

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. 22A Land Complaints Call Center: 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా.. ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 22A సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు అందిన సుమారు 400 కాల్స్ వివరాలు, వస్తున్న ప్రధాన సమస్యలు, ప్రజలకు అందిస్తున్న సమాచారాన్ని అధికారులు మంత్రికి వివరించారు. కాల్ సెంటర్‌కు వచ్చే దరఖాస్తులను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా, పూర్తి వివరాలను తక్షణమే సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్రిజిస్ట్రార్లకు చేరవేయాలని మంత్రి చెప్పారు. సమస్య కొలిక్కి వచ్చేంతవరకు పురోగతిని నిరంతరం ట్రాక్ చేయాలన్నారు. "ఆన్లైన్ ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలి. సదరు భూమి 22A పరిధిలోకి ఎలా వచ్చింది..? దరఖాస్తుదారుడి క్లెయిమ్ సరైనదేనా అనే అంశాలను క్షేత్రస్థాయిలో విచారించి, స్పష్టమైన ఆధారాలతో నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి ఫిర్యాదు చేసిన బాధితులు పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా ఆధారంగా భారీ భూదందాలు, దోపిడీ జరుగుతున్నాయని ఆరోపిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 22ఏ భూముల విషయంలో తప్పులు జరిగాయని ఒప్పుకుని మంత్రి క్షమాపణలు చెప్పడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికారులపై నెపం తోసి తప్పించుకోలేరని, ఎవరి ఆదేశాల మేరకు లక్షలాది మంది ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల కేటాయింపులు, తొలగింపుల్లో వేల కోట్ల రూపాయల దందాలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం 22ఏ జాబితాపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే ప్రాంతాన్ని కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలను ఈ పరిధిలోకి తెచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడటంలో విఫలమైందని, కాంగ్రెస్ పాలన రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు
తెలంగాణ రాజకీయాల్లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం మరోసారి హీట్ పెంచింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడటం చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్‌చేసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష హోదాలో ఉండి పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం తప్ప బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఆ పార్టీకి చెందిన నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు మర్చిపోవద్దని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీశ్ రావు ఎలా సంపాదించారో, ఏ వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో భారీగా ఆర్థికంగా ఎదగడానికి కారణమేంటో ప్రజలకు వివరించాలని పొంగులేటి ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మెడికల్ కాలేజీల వరకు బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ పాలనలో కమీషన్ల మీద పనులు జరిగాయని.. అదే విధానం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని బీఆర్ఎస్ భావించడం కేవలం భ్రమేనని అన్నారు. మీ భ్రమను ప్రజలపై రుద్దకండి అంటూ హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి హితవు పలికారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం

తమిళనాడులోని మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివ కుమార్, కేరళ సీఎం సతీషన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ కీలక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రాంతీయ సహకారం, మౌలిక వసతుల విస్తరణ, నదీ జలాల సమర్థ నిర్వహణపై చంద్రబాబు విజన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక సీనియర్ రాజకీయ వేత్తగా కేవలం సొంత రాష్ట్రానికే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రాంతాన్నంతా ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను ఆయన సదస్సు ముందుంచారు.అమరావతి-బెంగళూరు-చెన్నై బుల్లెట్ కారిడార్!దక్షిణాదిలో రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ముఖ్యంగా అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించారు.దీంతో పాటు దక్షిణాది వ్యాప్తంగా సమర్థవంతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో మరింత పటిష్టంగా అనుసంధానించాలని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు ఒకదానికొకటి తక్షణమే సహకరించుకునేలా మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు, తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.దక్షిణాది సీఎంల దండయాత్ర.. అమిత్ షా ముందు జల జగడం! 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి!దేశ జీడీపీలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా

పెళ్లైన అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. మంగళసూత్రం కాంబినేషన్ లో ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజూ వేసుకోవడానికి లైట్ వెయిట్ బ్రేస్లేట్ బాగుంటుంది. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలాంటి బ్రేస్లేట్స్ చీరలు, లెహంగాల మీదకు కూడా చాలా అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి.. ఇలాంటి డిజైన్లు చాలా అరుదుగా దొరుకుతాయి. చేతికి హెవీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా అందంగా కనపడుతుంది. గోల్డ్ నచ్చనివారు.. కాస్త యూనిక్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి స్టోన్ బ్రేస్లేట్ డిజైన్లు ఎంచుకుంటే సరిపోతుంది. చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి.. ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ ఇది. చైన్ కి.. హార్ట్స్ వేలాడదీసి ఉన్నాయి. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది.. రోజ్ గోల్డ్ బ్రేస్లేట్ డిజైన్లు.. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో నిండి ఉంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది. Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే! చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, ‘భూ భారతి’ వ్యవహారాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, నిన్న మంత్రి శ్రీనివాసరెడ్డికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. తన సవాల్ మేరకు ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన మీడియా పాయింట్ వద్ద ఉన్నారు. అయినా, ఎవరూ రాకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు, ఫీనిక్స్ గ్రూప్ కంపెనీల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న రాఘవ కన్ స్ట్రక్షన్స్ తదితర సంస్థలకు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు, ఆస్తుల బదిలీలు అక్రమంగా జరిగాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 102 షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.కావాలనే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, ఆ తర్వాత కమీషన్లు, సెటిల్మెంట్ల కోసం రైతులను, భూ యజమానులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పట్టా భూములను సైతం ఈ జాబితాలో చేర్చి 'కలెక్షన్ సెక్షన్'లా మార్చేశారని విమర్శించారు.ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ, ఈడీతో సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే హౌస్ కమిటీ వేయాలని కోరారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను దర్యాప్తు సంస్థలతో పాటు

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. న్యూఢిల్లీ, ఆగస్టు 20: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదని.. దోపిడి పాలన ఉందని విమర్శించారు. భూదందాలు చేస్తూ ప్రజల భూములను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో చేరిందన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణలు చెప్పడం సిగ్గు చేటని ఎంపీ అన్నారు. అధికారులను బాధ్యులుగా చేయడం కాదని.. దీనికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22 ఏ జాబితాను బహిర్గతం చేయాలన్నారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 22 A భూములపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. భూములు నిషేధిత జాబితాలో పెట్టారని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణలో భూముల పేరుమీద కుంభకోణాలు, సెటిల్మెంట్, దందాలు బయట పడుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో భూములు కాజేయాలని చూస్తే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉండి పోరాటం చేశారని.. భూములు కాపాడుతామని చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ అన్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో అంటే... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి నెట్టిందని అన్నారు. వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని మంత్రులు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు. హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. తన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ తెలిపిన బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉరుములు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దీంతో హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మబ్బులతో కప్పబడి సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ నగరవాసులు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం బలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రమాదం తీవ్రంగా ఉన్నందున వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన నిర్మాణాల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రోడ్డు ప్రయాణికులు మరియు పొలాల్లో

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. ఈ

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలనా లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' విధానంలోకి మారే క్రమంలో, 2026 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో పాత సినిమాలను తిరిగి థియేటర్లలో ప్రదర్శించే రీరిలీజ్ ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా పాత చిత్రాలు విడుదలవుతున్న ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో రాసిన ఒక లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు 35 ఏళ్ల క్రితం అంటే 1989-90 కాలంలో రీరిలీజ్‌ల విషయమై అభిమానులకు ఆయన రాసిన లేఖతో ఈ అంశంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత సినిమాలు మళ్లీ రావడం వల్ల హీరో ఇమేజ్ పాడవుతుందన్న అభిమానుల భయాందోళనలకు అప్పట్లోనే ఆయన ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ సమయంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే వస్తుండటం, అదే సమయంలో సెకండ్ రన్ మరియు థర్డ్ రన్ పేరిట పాత చిత్రాలు ప్రదర్శితం కావడంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చిరంజీవి, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, లంకేశ్వరుడు వంటి భారీ చిత్రాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. ముఖ్యంగా తెరపై రెండు మూడు నిమిషాలు కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కోసం 3 నుండి 4 రోజుల పాటు ప్రత్యేక షూటింగ్ పనులు అవసరమవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు మరియు నాటి సినీ పరిశ్రమ సంక్షోభం కూడా కొత్త సినిమాల ఆలస్యానికి కారణాలని తెలిపారు. రీరిలీజ్ అంశంపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, పాత సినిమాలు సెకండ్ రన్ లో ఆడటం వల్ల ఇమేజ్ పెరుగుతుందే తప్ప దెబ్బతినదని విశ్లేషించారు. దీంతో అప్పట్లో సరిగ్గా ఆడని చిత్రాలు కూడా కాలం మారిన తర్వాత కొత్త దృక్పథంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని స్పష్టం చేశారు. 16 ఏళ్ల వయస్సులో తీయించుకున్న ఫోటోను 26 ఏళ్ల వయస్సులో చూసుకుంటే అసహ్యం వేయదని, ఆశ్చర్యం మరియు ఆనందం మాత్రమే కలుగుతాయని ఉదాహరణగా చెప్పారు. ఇదిలా ఉండగా కాలక్రమంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం మారడం వల్ల పాత

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన అద్భుతమైన ఆట తీరుతోనే కాకుండా, ఇటీవల నుదుటిపై ధరించిన ఒక విచిత్రమైన చిన్న పరికరంతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సింధు తలపై కనిపించిన ఈ హైటెక్ గాడ్జెట్ పేరు టెంపుల్. ఇది పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వేరబుల్ టెక్నాలజీతో రూపొందించబడిన ప్రయోగాత్మక ఫిట్నెస్ మరియు బ్రెయిన్ ట్రాకింగ్ డివైజ్.క్రీడాకారులు తీవ్రమైన ఒత్తిడి, పోటీ వాతావరణంలో ఉన్నప్పుడు వారి మెదడు, శరీరం ఎలా స్పందిస్తాయో నిజ సమయంలో విశ్లేషించడానికి దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది మెదడు రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలు, మానసిక ఏకాగ్రత, ఒత్తిడి, అలసట స్థాయిలను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఈ అత్యాధునిక పరికరాన్ని జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్ ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్, మోహన్‌లాల్

పాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్నగర్లోజరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రసంస్థ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్టు చెప్పాడు. దీంతో, కశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. హఫీజ్ సయీద్ సారథ్యంలోని లష్కరే తొయిబా భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హఫీజ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. 26/11 దాడుల్లో మంది పాక్ ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబైలోకి ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. ఇక గతేడాది పహల్గాం దాడిలో 26 మంది సాధారణ పౌరులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జమ్మూలోని కోర్టు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఎల్ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యాంశాలు.. * రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు. * జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్నంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను. * ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం. * 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దు

IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత బ్యాటర్ల తీరుపై ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్షా భోగ్లే తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ డిక్లేర్ చేయడంలో ఆలస్యం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక విజయానికి 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంకను ఆలౌట్ చేసేందుకు వీలుగా త్వరగా డిక్లేర్ చేయకుండా భారత్ సమయం వృథా చేసిందని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు. చివరి 40 నిమిషాల ఆటలో జట్టు అనుసరించిన విధానం తనకు అస్సలు అర్థం కాలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నప్పుడు బౌలర్లకు ఎక్కువ సమయం కేటాయించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాప్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే 69 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. పంత్‌తో పాటు దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. మిగిలిన బ్యాటర్లందరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ అనుకున్న స్థాయిలో పరుగుల పసిడి సాధించలేకపోయింది. మైదాన సిబ్బంది కవర్లతో సిద్ధంగా ఉన్న దృశ్యాలను గుర్తు చేస్తూ వర్షం పడితే గెలుపు అవకాశాలు చేజారిపోతాయని భోగ్లే హెచ్చరించారు. ఇది కూడా చదవండి: IND vs SL: ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్ మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చిన కర్ణాటక యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఫార్మ్‌తో

ఇలాంటి గాజులు తులం బంగారంలోనే వచ్చేస్తాయి. చూడటానికి చాలా సన్నగా ఉంటాయి. కానీ, చాలా గట్టిగా ఉంటాయి. ఈ గాజులు చూడటానికి మాత్రమే హెవీగా కనిపిస్తాయి. కానీ.. చాలా తక్కువ బరువులోనే వస్తాయి. చేతికి మాత్రం నిండుగా కనిపిస్తాయి.. ఇలాంటి గాజు ఒక్కటి ఉంటే చాలు. మీకు నచ్చిన కలర్ బ్యాంగిల్స్ దీనిలో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. చీరకు మ్యాచింగ్ ట్రై చేయచ్చు.. ఈ గాజులు చూడటానికి కడా ఫీలింగ్ ఇస్తాయి. ఇలాంటి వాటిని మట్టిగాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు. Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు! Gold Bracelet: 10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి Mangalsutra: మోడ్రన్ టచ్ ఇచ్చే డైలీవేర్ మంగళసూత్రం డిజైన్స్..చూసేయండి Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం

ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు భూమిని 22ఏలో పెట్టారంటూ మేడ్చల్ (Medchal), హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), సంగారెడ్డి (Sangareddy) జిల్లాల నుంచి 750 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. 22ఏ భూములపై నాలుగు జిల్లాల్లోని అధికారులతో కలిసి చర్చించాం. గతంలో ఆ భూములు యుఎల్‌సీ జాబితాలో ఉన్నాయి. నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగింది. అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నాం. ప్రైవేట్ ఆస్తుల్ని 22ఏ జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తాం. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18005994788కు సప్రందించాలి. భూములకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నవారు ఆందోళన చెందవద్దు అని అన్నారు