
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి గ్రామీణం: శ్రావణమాసం శనివారం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గోదావరిలో స్నానాలచరించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రావణమాసం ఆలయంలో, గోదావరిలో రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విజిలెన్స్ ఎస్పీ బసవ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు


