
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

DigiLocker | ఇంటర్నెట్ డెస్క్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్! ఈ పరీక్ష షెడ్యూల్(GATE 2027 Reschedule)లో ఐఐటీ మద్రాస్(IIT Madras) కీలక మార్పులు చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొలుత ప్రకటించినట్లుగా ఆగస్టు 14 నుంచి కాకుండా.. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులంతా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 5వరకు దరఖాస్తు చేసుకోవచ్చని., పరీక్ష తేదీల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరోవైపు, గేట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు డిజిలాకర్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరని ఐఐటీ మద్రాస్ తెలిపింది. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్సైట్లో తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్/అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజిలాకర్ను అనుసంధానం చేయాలని, దీనివల్ల ధ్రువీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫొటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్‌గా పోర్టల్ సేకరిస్తుందని తెలిపింది. తద్వారా అప్లికేషన్ ప్రక్రియ వేగంగా, మరింత కచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఇటీవల ప్రకటించినట్టుగానే గేట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నట్లు ఐఐటీ మద్రాస్ తన షెడ్యూల్లో పేర్కొంది. సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా భద్రపరుచుకోవడం, షేర్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వెరిఫై చేసుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందే ఈ ‘డిజిలాకర్’. పేపర్‌లెస్ సదుపాయం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన

సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్‌తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఎంవోయూ అమరావతి: సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ- మద్రాస్‌తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మధ్య ఒప్పందం చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీరప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌కు అప్పగిస్తూ బుధవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. గోడ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ఏపీ మారిటైం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంటుంది. తీరంలో కోత తీవ్రత, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా గోడ నిర్మాణ డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. వచ్చే నవంబరు నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు

ఉప్పాడ తీర రక్షణకు ఒప్పందం. రూ. 323 కోట్లతో గోడ. ఐఐటీ మద్రాస్ సాంకేతిక పర్యవేక్షణ. Uppada Sea Erosion Wall: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ తీర ప్రాంతం సుదీర్ఘకాలంగా తీవ్రమైన సముద్రపు కోతకు గురవుతోంది. అలల ఉధృతికి నివాస ప్రాంతాలు, రోడ్లు, మత్స్యకార గ్రామాలు ముంపునకు గురవుతూ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ సమస్యకు అత్యాధునిక శాస్త్రీయ పద్ధతిలో శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీర పరిరక్షణ గోడ(Uppada Sea Erosion Wall) డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) రూపకల్పన, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ సంస్థకు అప్పగించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరిలో ఈ ఒప్పందం కుదిరింది. AP SIPB Meeting: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు, 21 వేల ఉద్యోగాలు.. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ రూ. 323 కోట్లతో రక్షణ గోడ: ఈ ప్రాజెక్టును దాదాపు రూ. 323 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఐఐటీ మద్రాస్‌లోని ఓషన్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఉప్పాడ తీరంలోని అలల తీవ్రత, సముద్ర ప్రవాహాలు, కోత స్వభావంపై లోతైన శాస్త్రీయ పరిశోధనలు చేయనుంది. సముద్రపు భయంకర అలల దాడిని తట్టుకునేలా అత్యంత మన్నికైన ఇంజినీరింగ్ డిజైన్‌ను రూపొందించడమే కాకుండా, నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించనుంది. నవంబర్ నుంచి ప్రారంభం కానున్న పనులు: ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం పూర్తికావడంతో రాబోయే నవంబర్ నాటికే క్షేత్రస్థాయి నిర్మాణ పనులను మొదలుపెట్టేందుకు జిల్లా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉప్పాడ పరిసర మత్స్యకార గ్రామాలను వేధిస్తున్న ఆస్తి, ప్రాణ నష్ట భయాలకు ఈ ప్రాజెక్టు ముగింపు పలకనుంది. శాస్త్రీయ నిర్మాణం ద్వారా తమ ఊళ్లకు, జీవనోపాధికి శాశ్వత ధీమా లభించనుండటంతో స్థానిక ప్రజలు, మత్స్యకారులు