
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వెండి నాణేలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 7 కిలోల వెండి నాణేలను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వెండి నాణేలకు సంబంధించిన బిల్లులు, రసీదులు లేకపోవడంతో ఆ ప్రయాణికుడిని తమ అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటి గురించి విచారణ చేస్తున్నారు.ఎయిర్‌పోర్టు చెకింగ్ పాయింట్ వద్ద ప్రయాణికులు, వారి లగేజీని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా భారీగా ఈ వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిపై అనుమానం రావడంతో సిబ్బంది ప్రయాణికుడి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో వెండి నాణేలు ఉన్నట్లు గుర్తించారు. వాటి బరువు సుమారు 7 కిలోలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెండి నాణేలు కొనుగోలు చేసినట్లు బిల్లులు గానీ, రసీదులు గానీ లేదా ఇతర ఆధారాలను ఆ ప్రయాణికుడు అధికారులకు చూపించలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటిని ఢిల్లీకి ఎందుకు తరలిస్తున్నారు.. వాటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలు ఎందుకు లేవు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.వెండి నాణేల కచ్చితమైన బరువు, వాటి విలువ, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రయాణికుడి వద్ద ఉన్న పత్రాలు, అతను ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఈ వ్యవహారంపై సంబంధిత కస్టమ్స్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెండి నాణేల రవాణా వెనుక అసలు కారణం ఏంటి.. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఢిల్లీలో ఎవరికి అప్పగించాల్సి ఉంది అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.. వెండి నాణేలకు సంబంధించిన పత్రాలు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ