
కారు యాక్సిడెంట్ పై నోరువిప్పిన లింగమనేని, కుమారుడు సంజూష్
హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తన పాత్రపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్ (Lingamaneni Sanjush) తో పాటు ఆయన కూడా నోరు విప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ సంజూష్ ఓ ప్రకటన విడుదల చేసారు. అలాగే లింగమనేని రమేశ్ కూడా జరిగిన ఘటన బాధాకరమని, ఇందులో తాము పోలీసులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని, అలాగే బాధితుల్ని ఆదుకునేందుకు కూడా సిద్దమనని ప్రకటించారు.ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని లింగమనేని సంజూష్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన భారతి ముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించానన్నారు. వైద్య సాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతి ముఖి మృతి చెందారని తెలిపారు. ప్రమాదం తర్వాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు తను చేసిన ప్రయత్నాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తాను ఎక్కడికీ వెళ్లిపోకుండా స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు వెల్లడించారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించానన్నారు. పోలీసులు కూడా అన్ని వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి, ప్రమాదానికి ముందు , తరువాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడపై కేశినేని, లింగమనేని పట్టుప్రమాదం జరిగిన సమయంలో తన శారీరక పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేశారన్నారు. వీటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చాయన్నారు. వైద్య పరీక్షల ఫలితాలను కూడా ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలతో పాటు దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భారతి ముఖి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో పోలీసులకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని సంజుష్ తెలిపారు. లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..!
