
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు - ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు రూ.1 కోటి 80 లక్షలు ఎక్స్గ్రేషియా భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : రియాక్టర్లు పూర్తిగా మరమ్మత్తులు అయ్యేవరకు హెజోలో లాబరేటరీస్ కంపెనీని సీజ్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు తెలిపారు. శనివారం భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామం హెజోలో పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది, నైట్ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందుతుందా, కంపెనీ యజమాన్యం భద్రతా ప్రమాణాలు, ఎలాంటి చర్యలు తీసుకున్నారో వంటి పలు విషయాలపై ఆయన ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.ఒక కోటి 80 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కంపెనీ యజమాన్యానికి సూచించారు. వర్కింగ్ కండిషన్ వచ్చేంత వరకు కంపెనీని సీజ్ చేస్తున్నామని తెలిపారు. నైట్ షిఫ్ట్ లో 10 గంటల నుండి 10:30 లోపు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, క్షతగాత్రులు పూర్తిస్థాయిలో కోలుకొనే వరకు వైద్యుల ఖర్చుల బాధ్యత కంపెనీ యజమాని భరించాలన్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో అన్ని పరిశ్రమల యజమాన్యాలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో ప్రమాదాలకు దారితీస్తున్న కారణలపై సమగ్రంగా చర్చించి భద్రతా చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హెజోలో కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన పట్ల ప్రభుత్వం సీరియస్ గా వ్యహరిస్తుందన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, చౌటుప్పల్ సిఐ మన్మధరావు, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ జగన్, గ్రామ సర్పంచ్ యాట జంగయ్య, ఉప సర్పంచ్ బద్దం వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ఉట్కూరి