
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
UPI New Features: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్లు మరింత వేగంగా చేసే అవకాశం లభించింది. డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా యూపీఐలోనూ ట్యాప్ అండ్ పే ఫీచర్ వచ్చేసింది. ఏఐ ఆధారిత మైయూపీఐతో పాటు ఈ ఫీచర్‌ను జీఎఫ్ఎఫ్ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా లాంచ్ చేశారు. ఇక నుంచి ఫోన్ చూసిస్తే సరిపోతుంది యూపీఐ పేమెంట్లు పూర్తి చేయవచ్చు. మరి అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.

మనం రోజూ ఎన్నోసార్లు కరెన్సీ నోట్లను వాడుతుంటాం. ముఖ్యంగా రూ.100, రూ.200, రూ.500 నోట్లను చేతిలోకి తీసుకున్నప్పుడు వాటి అంచుల వద్ద కొన్ని గీతలు, గుర్తులు ఉండటాన్ని గమనించే ఉంటాం. చాలామంది ఇవి నోట్ల డిజైన్‌లో భాగమని లేదా అలంకరణ కోసం వేశారని అనుకుంటారు. కానీ, ఆ గుర్తుల వెనుక ఓ ముఖ్యమైన, మానవతా దృక్పథంతో కూడిన కారణం ఉంది. దృష్టి లోపం ఉన్నవారు కూడా నోటు విలువను సులభంగా గుర్తించేందుకే ఆర్బీఐ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.కరెన్సీ నోట్లపై ఈ గుర్తులను 'ఇంటాగ్లియో' లేదా రైజ్డ్ ప్రింటింగ్ పద్ధతిలో ముద్రిస్తారు. అంటే.. ఆ గుర్తులు కాస్త ఉబ్బెత్తుగా ఉండి, చేతివేళ్లతో తాకినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. దృష్టి సమస్యలు ఉన్నవారు నోటును చేతిలోకి తీసుకుని, దాని అంచులను వేలితో తాకడం ద్వారా ఆ గుర్తులను స్పర్శించి, అది ఏ నోటో కచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి నోటుకు వేర్వేరు గుర్తులు ఉండటం వల్ల వారు ఇతరులపై ఆధారపడకుండా, మోసపోకుండా తమ లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు.ఉదాహరణకు రూ.100 నోటు అంచుల్లో ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే గీతలను మనం స్పర్శించవచ్చు. ఇక రూ.200 నోటుపై ఈ గీతలతో పాటు రెండు సున్నాలు కూడా ఉంటాయి. అత్యధిక చలామణిలో ఉండే రూ.500 నోటు విషయానికొస్తే, దాని అంచుల వద్ద ఏటవాలుగా ఉండే ఐదు గీతలను ముద్రిస్తారు. ఇలా ఒక్కో నోటుకు ఒక్కో రకమైన గుర్తును కేటాయించడం ద్వారా అంధులు సులభంగా తేడాను గుర్తిస్తారు. కేవలం ఈ నోట్లపైనే కాకుండా, ఇతర అధిక విలువ

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్ మాత్రమే సెట్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దాని స్థానంలో అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన పూర్తి స్థాయి బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్లు సులభంగా ఊహించడం లేదా క్రాక్ చేయడం వారికి అసాధ్యం అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను పరిచయం చేశారు. మన కాంటాక్ట్‌లో లేని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. ఆ నంబర్ వేరే దేశానిదా లేక మనతోపాటు ఏవైనా కామన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉందా అనే వివరాలను స్క్రీన్ పైనే చూపిస్తుంది. ఈ అదనపు సమాచారం ద్వారా ఆ కాల్ రిసీవ్ చేసుకోవాలో లేదో యూజర్లు ముందే నిర్ణయించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్ సెలబ్రిటీలు వీరే? లిస్ట్ చూస్తే మతిపోవడం పక్కా

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా... పెనుకొండ రూరల్ (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేశారు. సరికొత్త ఏఐ ఫీచర్లతో తయారైన తొలి సొరెంటో కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చిందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగులీ తెలిపారు. సొరెంటోను సెప్టెంబరు 4న మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశంలోని కియా ఇండియా డీలర్‌షి్‌పలు, వెబ్సైట్ ద్వారా ప్రీ బుకింగ్స్‌కు అవకాశం కల్పించామని తెలిపారు

మీరు కంప్యూటర్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీటింగ్‌లో ఉన్నారు? ఏం టైప్ చేస్తున్నారు? ఏ మెయిల్ రాస్తున్నారు? ఇవన్నీ అర్థం చేసుకుని అవసరమైన సమయంలో సాయం చేసే ఏఐ అసిస్టెంట్ వస్తే ఎలా ఉంటుంది? భవిష్యత్తులో చాట్‌జీపీటీ ఇలాంటి సామర్థ్యాలతో రావచ్చని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.స్క్రీన్‌పై ఏం జరుగుతుందో గమనిస్తూ..జెడ్ ఫెలోస్ వ్యవస్థాపకుడు కోరీ లెవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ ఈ విషయాలను వెల్లడించారు. భవిష్యత్ చాట్‌జీపీటీ వినియోగదారుడి కంప్యూటర్ స్క్రీన్, మీటింగ్స్, కాల్స్‌ను నిరంతరం గమనిస్తూ సందర్భాన్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ఇది ఆరు నెలల్లో అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.అవసరమైన సమాచారానికే యాక్సెస్వినియోగదారులు ఏ సమాచారాన్ని ఏఐతో పంచుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చని ఆల్ట్‌మన్ తెలిపారు. టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్, డాక్యుమెంట్లు, స్లాక్ వంటి వనరులకు యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏఐ స్వయంగా నిర్ణయాలు తీసుకోదని.. వినియోగదారుడితో కలిసి పనిచేస్తూ సూచనలు ఇవ్వడం, అనుమతి ఉన్న పనులను పూర్తి చేయడం చేస్తుందని వివరించారు.పని చేస్తూనే సూచనలుఉదాహరణకు ఓ స్టార్టప్ సీఈఓ కస్టమర్‌కు సేల్స్ పిచ్ రాస్తున్నారని అనుకుందాం. గతంలో ఆ కస్టమర్‌తో జరిగిన సంభాషణలు, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి ఏఐ అక్కడికక్కడే మెరుగైన సూచనలు ఇవ్వగలదు. వ్యూహాత్మక డాక్యుమెంట్ తయారుచేస్తున్నప్పుడు తప్పును గుర్తించి హెచ్చరించవచ్చు. అవసరమైతే అనుమతితో సంబంధిత పనిని కూడా పూర్తి చేయగలదు.ఒక్కో ప్రశ్నకు సమాధానం దాటి..ప్రస్తుతం ఏఐకి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రమే ప్రధాన పని. భవిష్యత్ అసిస్టెంట్ మాత్రం యూజర్

Bajaj Pulsar 125: మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్ 125.. లాంచ్‌కు ముందే లీకైన పిక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే ఈ వార్తకు సంబంధించిన

సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది? 2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్‌లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి. నేటి నుంచే కీలక విచారణ మెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు

కొన్నేళ్ల క్రితం 360-డిగ్రీ కెమెరా అంటే ఆడి, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి లగ్జరీ కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సామాన్యుల బడ్జెట్ కార్లలోనూ ఈ ఫీచర్ వస్తోంది. రూ.10 లక్షల లోపు 360-డిగ్రీ కెమెరా ఉన్న టాటా కారు కోసం చూస్తుంటే టియాగో, పంచ్, ఆల్ట్రోజ్ బెస్ట్ ఆప్షన్లు. 360-డిగ్రీ కెమెరా టాటా కార్ల జాబితాలో టాటా టియాగో (2026 మోడల్) అత్యంత చవకైన కారు. దీని క్రియేటివ్ వేరియంట్లో ఈ ఫీచర్ లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.8.24 లక్షలు, పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.8.87 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.9.14 లక్షలు, CNG ఆటోమేటిక్ (AMT) ధర రూ.9.79 లక్షలు (ఆన్-రోడ్). తక్కువ బడ్జెట్లో ఈ ఫీచర్ కోరుకునేవారికి టియాగో మంచి ఎంపిక. టాటా పాపులర్ కాంపాక్ట్ SUV అయిన పంచ్‌లో కూడా 360-డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది. దీని అడ్వెంచర్ వేరియంట్ నుంచి ఈ ఫీచర్ మొదలవుతుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9.04 లక్షలు, పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.9.72 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.9.97 లక్షలు, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ ధర రూ.9.88 లక్షలు (ఆన్-రోడ్). అయితే CNG ఆటోమేటిక్ (AMT) వేరియంట్ ధర రూ.10.59 లక్షలు కావడంతో, అది రూ.10 లక్షల బడ్జెట్‌ను దాటుతుంది. 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌తో వచ్చే మరో టాటా మోడల్ ఆల్ట్రోజ్. దీని క్రియేటివ్ వేరియంట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.9.48 లక్షలు. కాబట్టి ఇది రూ.10 లక్షల బడ్జెట్లో ఉంది. కానీ పెట్రోల్ ఆటోమేటిక్ (AMT) ధర రూ.10.11 లక్షలు, CNG మాన్యువల్ ధర రూ.10.35 లక్షలు, CNG ఆటోమేటిక్ (AMT) ధర రూ.10.96 లక్షలు. ఇవన్నీ బడ్జెట్‌ను మించిపోతాయి. ఒకవేళ మీకు డీజిల్ ఇంజిన్‌తో 360-డిగ్రీ

రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650 ఇప్పుడు కొన్ని మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ లుక్‌తో పాటు, వాడుకలోనూ కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఈ కొత్త కాంటినెంటల్ జీటీ 650 లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటివి కొత్తగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్లు. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో బైక్ లుక్ మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా మారింది. రాకర్ రెడ్ కలర్ మోడల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీని ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు పూర్తిగా బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చారు. దీనికి తోడు అలాయ్ వీల్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. దీంతో ఈ మోడల్ మొత్తం బ్లాక్-అవుట్ లుక్‌తో చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. అపెక్స్ గ్రే మోడల్లో కూడా దాదాపు ఇలాంటి బ్లాక్-అవుట్ లుక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ కలర్ మోడళ్లలో మాత్రం పాత పాలిష్డ్ ఇంజిన్ లుక్, స్పోక్ వీల్స్‌నే కొనసాగిస్తున్నారు. కొత్త కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 648 సిసి, ట్విన్-సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,150 rpm వద్ద 47 హార్స్పవర్, 5,250 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, హారిస్ పెర్ఫార్మెన్స్ కలిసి డెవలప్ చేసిన స్టీల్ ఫ్రేమ్‌నే కొనసాగించారు. కాబట్టి కొత్త మోడల్లో ప్రధానంగా లుక్, ఫీచర్లలోనే మార్పులు జరిగాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ 650 ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ కేఫ్ రేసర్ డిజైన్ వంటివి యథాతథంగా

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నకిలీ కార్డులతో జరుగుతున్న మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు, 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త ఆహార భద్రతా కార్డులను (రేషన్ కార్డులు) జారీ చేయనుంది. దీని ద్వారా అక్రమాలకు తావులేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కొత్త కార్డుల రూపకల్పనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. కార్డు ముందు భాగంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంతకం ఉంటుంది. వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్‌ను ముద్రిస్తారు. కార్డుపై 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అనే అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. చేతితో తాకినప్పుడు ఈ అక్షరాలను సులభంగా గుర్తించవచ్చు. దీనిని 'రిలీఫ్ టెక్స్ట్' టెక్నాలజీగా పేర్కొంటున్నారు.వీటితో పాటు, కంటికి స్పష్టంగా కనిపించని మరిన్ని ఫీచర్లను కూడా పొందుపరిచారు. కార్డుపై 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అనే వాక్యాన్ని అతి సూక్ష్మ అక్షరాలతో పదేపదే ముద్రిస్తారు. భూతద్దం సహాయంతో మాత్రమే వీటిని చూడగలం. వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్‌మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.అంతేకాకుండా, 'డ్యూయల్ హిడెన్ ఇమేజ్' అనే మరో ప్రత్యేక టెక్నాలజీని కూడా వాడుతున్నారు. కార్డును ఒక ప్రత్యేక కోణంలో చూసినప్పుడు 'జీవో టీజీ ఒరిజినల్' వంటి రహస్య గుర్తులు కనిపిస్తాయి. ఈ అధునాతన భద్రతాంశాల వల్ల కొత్త రేషన్ కార్డులను నకిలీ చేయడం దాదాపు అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత

Telangana Smart Ration Card : తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న స్మార్ట్ రేషన్ కార్డు సాధారణ కార్డులకు పూర్తి భిన్నంగా ఉండనుంది. కేవలం లబ్ధిదారుల వివరాలు మాత్రమే కాకుండా.. నకిలీ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపర్చనున్నారు. యాంగిల్ మార్చితే కనిపించే హిడెన్ ఇమేజెస్, UV లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, భూతద్దంతో మాత్రమే కనిపించే మైక్రో టెక్స్ట్ వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి. కార్డును తాకినా, స్కాన్ చేసినా దాని అసలైనదో కాదో గుర్తించేలా సాంకేతికతను ఉపయోగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులను అందజేయనుంది. ఆగస్టు 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు.. కార్డు యాజమాని వివరాలు ఉంటాయి. అంతేకాక.. రేషన్ దుకాణం నంబరు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అధికారిక సంతకం ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డు ముందు, వెనుక భాగాల్లో స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్‌గా ధ్రువీకరించే సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్, ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ రిలీఫ్ టెక్స్ట్, సూక్ష్మ అక్షరాలతో కూడిన మైక్రో టెక్స్ ఇందులో ఉన్నాయి. సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ.. కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులో అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చారు. కార్డులో అత్యంత సూక్ష్మ పరిమాణంలో మైక్రో టెక్స్ట్ ను ముద్రించనున్నారు. సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలు భూతద్దం ద్వారా పరిశీలించినప్పుడు మాత్రమే గుర్తించగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటింగ్ యంత్రాలతో వీటిని డూప్లికేట్ చేయడం కష్టతరం. కార్డు బ్యాక్ గ్రౌండ్లో గిల్లోష్ ప్యాటర్న్ అనే సంక్లిష్ట రేఖా ఆకృతిని ఉపయోగించనున్నారు. స్మార్ట్

ప్రస్తుతం సాధారణ బ్యాక్గ్రౌండ్లు, లిమిటెడ్ థీమ్లకే పరిమితమైన చాట్ లుక్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది. చాట్ లుక్ మారిపోవడంతో పాటు చాట్ సమయంలో బ్యాక్ గ్రౌండ్ థీమ్ యానిమేటెడ్ వాల్ పేపర్లతో కనిపించనుంది. 3 రకాల కొత్త థీమ్‌లు : iOS బీటా వెర్షన్ 26.31.10.74లో కొత్త థీమ్ కస్టమైజేషన్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో (Featured, Doodle, Minimal) అనే 3 సెక్షన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సెక్షన్లో విభిన్న రంగులు, డిజైన్లు, వాల్పేపర్లు అందించనుంది. Read Also : Flipkart Freedom Sale 2026 : కెమెరా ప్రియులకు పండగే.. రూ.10 వేల తక్కువకే పిక్సెల్ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ కావద్దు! ఎంచుకున్న థీమ్‌కు సరిపోయేలా మెసేజ్ బబుల్ కలర్లను కూడా వాట్సాప్ ఆటోమేటిక్‌గా సెట్ చేయనుంది. తద్వారా చాట్ మొత్తం ఒకే స్టైల్లో కనిపిస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీసు వర్క్ సంబంధిత చాటింగ్ కోసం వేర్వేరు లుక్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉండనుంది. యానిమేటెడ్ వాల్పేపర్లు : ఇకపై స్టేబుల్ బ్యాక్‌గ్రౌండ్‌లతో పనిలేదు.. యానిమేటెడ్ ఎలిమెంట్స్‌తో వాల్పేపర్లు రాబోతున్నాయి. మీరు చాట్ చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్లో వాల్ పేపర్లు మూవ్ అవుతుంటాయి. తద్వారా చాట్ స్క్రీన్కు మరింత డైనమిక్ లుక్ ఇవ్వనున్నాయి. అయితే, ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం డెవలప్, టెస్టింగ్ స్టేజీలోనే ఉన్నాయి. రెగ్యులర్ ఐఫోన్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా కూడా ఇలాంటి థీమ్ కస్టమైజేషన్ ఫీచర్ డెవలప్ చేస్తున్నట్టు సమాచారం

కొత్త హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్ ఆప్షన్ ఏఐ ఫీచర్లు, 200MP ప్రైమరీ కెమెరా సెటప్ Honor Magic 9 Series : హానర్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ సిరీస్ రాబోతుంది. చైనా ఫోన్ మేకర్ హానర్ వచ్చే నెలలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, హానర్ మ్యాజిక్ 9 ప్రో, హానర్ మ్యాజిక్ 9 ప్రో మాక్స్ అనే 3 మోడళ్లు ఉంటాయని అంచనా. ఈ సిరీస్‌లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉండొచ్చు. అయితే, హానర్ సీఈఓ లీ జియాన్ సెప్టెంబర్ 28న జరగబోయే హానర్ రోబోట్ ఫోన్ లాంచ్ ఈవెంట్లో కొత్త హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించారు. ఈ స్మార్ట్ఫోన్లు క్వాల్కామ్ నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్తో రన్ అవుతాయని అంచనా. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ ఫీచర్లు (అంచనా) : టిప్‌స్టర్ ప్రకారం.. హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. హానర్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం జర్మన్ ఇమేజింగ్ సంస్థ (ARRI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ఫొటోగ్రఫీ వీడియో రికార్డింగ్ కోసం ARRI LogC3, ARRI Look, ARRI Movie Mode వంటి ఫీచర్లు రావచ్చు. Read Also : LPG Gas Subsidy : కొత్త LPG గ్యాస్ కనెక్షన్ కావాలా? PMUYతో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే! హానర్ రోబోట్ ఫోన్ కోసం కూడా హానర్‌తో ARRI భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో పైభాగంలో రోబోటిక్ గింబల్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త సిన్నమోన్ కాపర్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. మాగ్నస్ జి మ్యాక్స్‌లో ఇప్పుడు హిల్ హోల్డ్, క్రూజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో యజమానులు స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మై స్కూటర్ అండ్ పింగ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా దీనికి లభిస్తాయి. యాంపియర్ కనెక్ట్ యాప్‌తో మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ స్కూటర్లో అప్డేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. నావిగేషన్, ఇతర వాహన సమాచారాన్ని కొత్త 5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడవచ్చు. ఇతర కనెక్టెడ్ ఫీచర్లలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ అండ్ టో అలర్ట్‌లు, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్సైట్స్ ఉన్నాయి. మాగ్నస్ జి మ్యాక్స్‌కు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లు కూడా లభిస్తాయి. ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్లను రిమోట్‌గా ఇన్స్టాల్ చేయడానికి.. స్కూటర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని సాఫ్ట్వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. మాగ్నస్ జి మ్యాక్స్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 2.4 kW మోటార్‌ను కలిగి ఉంది. సర్టిఫైడ్ రేంజ్ 142 కిమీ. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీ వర్తిస్తుంది. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా

రివోల్ట్ ఆర్‌వీఎక్స్‌లో 4kW మిడ్-డ్రైవ్ PMSM ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. దీని గరిష్ఠ పవర్ 5.3kW వరకు ఉంటుంది. వెనుక చక్రానికి గరిష్ఠంగా 230Nm టార్క్ అందుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్నిఅందుకోగలదు. బూస్ట్ మోడ్‌లో గరిష్ఠంగా 90 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే యువతను దృష్టిలో పెట్టుకుని RVXను రూపొందించినట్లు రివోల్ట్ మోటర్స్ తెలిపింది. ఆర్‌వీఎక్స్‌లో 3.24kWh NMC బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని అవసరమైనప్పుడు బైక్ నుంచి తొలగించుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు సుమారు 80 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. రోజువారీ ప్రయాణాలకు ఈ రేంజ్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. Revolt RVXలో రైడర్ అవసరానికి అనుగుణంగా ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు ప్రధాన రైడింగ్ మోడ్లు ఉన్నాయి. వీటితో పాటు బూస్ట్ మోడ్ కూడా అందించారు. Boost మోడ్‌ను ఉపయోగించినప్పుడు బైక్ గరిష్ఠ పనితీరును అందిస్తుంది. వేగంగా యాక్సిలరేషన్ కావాల్సిన సమయంలో ఇది ఉపయోగపడుతుంది. బూస్ట్ అవసరం లేని పరిస్థితి వచ్చిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్‌గా తిరిగి స్పోర్ట్ మోడ్‌కు మారుతుంది. RVXలో ముందు భాగంలో USD ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు అందించారు. బైక్‌లో 3.5 అంగుళాల IP67 రేటెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టెలిమాటిక్స్, OTA అప్డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా జియో-ఫెన్సింగ్, కాల్, మెసేజ్ అలర్ట్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, వాక్ అసిస్ట్, ఇమ్మొబిలైజర్, వెహికల్ లొకేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో రోజువారీ వినియోగంతో పాటు స్మార్ట్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చే వారికి

లావా స్మార్ట్4 ధర రూ.8,499గా నిర్ణయించారు. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కోణార్క్ గోల్డ్, అజంతా గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ మొబైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఈఎంఐ వంటి సులభ ఫైనాన్స్ సౌకర్యాలు కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్లో 6.59 అంగుళాల LCD డిస్ప్లే ఇచ్చారు. దీనికి క్యూహెచ్డీ రిజల్యూషన్ ఉంది. అంటే ప్రస్తుతం ఎక్కువ బడ్జెట్ ఫోన్లలో కనిపించే 720p డిస్ప్లేల కంటే తక్కువ క్లారిటీ ఉండే అవకాశం ఉంది. అయితే 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ కొంత స్మూత్‌గా అనిపిస్తుంది. ఫోన్‌కు యూనీసాక్ SC9863A ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది సాధారణ పనులైన కాల్స్, వాట్సాప్, వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి అవసరాలకు సరిపోతుంది. ఇందులో ఉన్న 3GB RAMను మరో 3GB వరకు వర్చువల్ RAMగా పెంచుకునే అవకాశం కూడా ఉంది. Lava Smart 4 వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ అండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. తక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్వేర్పై కూడా వేగంగా పనిచేసేలా ఈ వెర్షన్‌ను రూపొందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 19 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని ఇచ్చారు. యూఎస్బీ టైప్‌సీ పోర్టుకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటంతో తక్కువ ఎత్తు నుంచి పడిపోతే తట్టుకునేలా రూపొందించారు. అంతేకాకుండా డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ధరను బట్టి చూస్తే లావా స్మార్ట్4 సాధారణ యూజర్ల కోసం తీసుకొచ్చిన ఫోన్. అయితే హైక్వాలిటీ వీడియోలను అదే రిజల్యూషన్‌తో చూడాలనుకునే వారికి ఈ

తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలనుకుంటే ఇక్కడ మేము కేవలం అయదు లక్షల రూపాయల్లో వచ్చే కార్ల వివరాలు ఇచ్చాము. రూ.5 లక్షల లోపు బడ్జెట్లో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటివి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి మారుతి సుజుకి సెలెరియో మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు. పెట్రోల్ వేరియంట్ 24.97 నుంచి 26.68 కిలోమీటర్ల వరకు, సీఎన్జీ వేరియంట్ 34.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో రోజూ ప్రయాణించేందుకు ఈ కారు చాలా ఉత్తమ ఎంపిక. అయిదు లక్షల రూపాయల కన్నా తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారిని ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో చాలా బాగుంటాయి. ఆల్టో కె10 కారు ప్రారంభ ధర సుమారు రూ.3.70 లక్షలు. ఇది పెట్రోల్‌పై 24.39 నుండి 24.90 కిలోమీటర్లు, సీఎన్జీపై 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఒక ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర సుమారు రూ.3.50 లక్షలు ఉంటుంది. ఇది పెట్రోల్‌పై 24.12 నుండి 25.30 కిలోమీటర్లు, సీఎన్జీపై 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎత్తైన సీటింగ్, మినీ ఎస్యూవీ లాంటి లుక్ దీని ప్రత్యేకతలు. డిజైన్ అదిరిపోవాలనుకుంటే రెనాల్ట్ క్విడ్ కొనండి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.30 లక్షలు. పెట్రోల్‌పై ఇది 21.7 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. చిన్న కారే అయినా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత కావాలనుకుంటే టాటా టియాగో ఎంపిక చేసుకోవాలి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు కాగా, పెట్రోల్‌పై దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని బలమైన నిర్మాణం, డ్రైవింగ్ అనుభవం దీని ప్రధాన బలాలు

Apple Pay: త్వరలోనే భారత్‌లో యాపిల్ పే సేవలు.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే.? Apple Pay: భారత్‌లో యాపిల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Apple Pay ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్‌లో Apple Pay భారత్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాపిల్ పే ప్రారంభమైన తర్వాత వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వివరాలను యాపిల్ వాలెట్ యాప్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ లేదా ఇతర దుకాణాల్లో చెల్లింపు చేయాల్సిన సమయంలో ఐఫోన్ లేదా ఐపాడ్‌ను POS మెషీన్‌కు దగ్గరగా ట్యాప్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం NFC (Near Field Communication) టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. దీంతో కార్డ్‌ను చేతిలో తీసి స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు వేగంగా, సురక్షితంగా పూర్తవుతాయి. యాపిల్‌పే ప్రారంభ దశలో వీసా, మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్‌కు చెందిన క్రెడిట్ కార్డులు మాత్రమే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా Apple Pay ఇదే విధంగా పనిచేస్తోంది. డెబిట్ కార్డులు లేదా ఇతర చెల్లింపు విధానాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రారంభ దశలో క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని పెంచడంపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. భారత్‌లో డిజిటల్ చెల్లింపుల్లో UPI ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, Apple Pay ప్రారంభ సమయంలో UPI సపోర్ట్ ఉండదు. UPI సేవలను అందించాలంటే యాపిల్, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి ఒక స్పాన్సర్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కూడా అవసరం. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే Apple Payలో UPI సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై Apple ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. Apple Pay ద్వారా జరిగే ప్రతి క్రెడిట్ కార్డ్

CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన అనంతరం నల్లజెర్లలో దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకానికి ఎలాంటి అత్యాధునిక భద్రతను కల్పించారనే విషయాలను వెల్లడించారు. పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత.. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బుల్లెట్ వేగంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. రైతులకు అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత కల్పించామని చెప్పారు. పాస్ పుస్తకాలకు కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను అమలు చేస్తున్నామని, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని అన్నారు. క్యూఆర్ కోడ్ తో పాటు ఇతర సాంకేతిక భద్రతా ఫీచర్లను కూడా పాస్ పుస్తకాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందించామని సీఎం తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మొత్తం 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 41 వేల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు అందించినట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు గతంలో కేటాయించిన భూములను 22ఏలో చేర్చిన సందర్భాలను పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి రైతుకు, భూ యజమానికి

ఆన్లైన్ షాపింగ్, రీఛార్జ్‌లు, సబ్స్క్రిప్షన్ల హవా నడుస్తున్న నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు సైతం వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మన వ్యాలెట్‌లో ఉండే ప్లాస్టిక్ డెబిట్ కార్డుల స్థానంలో ఇప్పుడు బ్యాంకింగ్ యాప్‌లలోనే వర్చువల్ డెబిట్ కార్డ్ ప్రత్యక్షమవుతోంది. కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివీవీ వంటి అన్ని వివరాలు మీ ఫోన్లోని బ్యాంకింగ్ యాప్‌లోనే కనిపిస్తాయి. ఫిజికల్ కార్డు పొగొట్టుకుంటామనే భయం లేకుండా, అవసరమైనప్పుడు క్షణాల్లో వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. అయితే, ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ వీటి వినియోగంలోనూ కొన్ని భద్రతాపరమైన ప్రమాదాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.సౌకర్యంతో పాటు లభించే అదనపు నియంత్రణసాధారణంగా ఏదైనా కొత్త వెబ్సైట్లో కొనుగోలు చేసేటప్పుడు మన ప్రధాన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అసలు డెబిట్ కార్డ్ వివరాలను ఇవ్వడానికి చాలామంది భయపడతారు. అలాంటి సమయాల్లో ఈ వర్చువల్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.అనేక బ్యాంకులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ కార్డుల ఖర్చుల పరిమితిని స్వయంగా నిర్ణయించుకునే సదుపాయాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా, అవసరం లేనప్పుడు కార్డును టెంపరరీ ఆఫ్ లేదా డిసేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దీనివల్ల కార్డు వివరాలు బయటకు పొక్కే అవకాశం చాలావరకు తగ్గుతుంది.రూపాయి ఛార్జ్ పడదు! మా కస్టమర్లకు ఫ్రీగానే... ఫోన్‌పే సంచలన గ్యారెంటీభ్రమల్లో ఉండొద్దు... మోసాలకు ఇవీ మినహాయింపు కాదు!వర్చువల్ కార్డ్ వాడటం వల్ల సైబర్ మోసాలు అస్సలు జరగవు అనుకోవడం అపోహ మాత్రమే. ఇది మీ బ్యాంక్ ఖాతాకే నేరుగా లింకై ఉంటుంది కాబట్టి, ఇందులో చేసే ప్రతి చెల్లింపు మీ ఖాతా నుంచే కట్ అవుతుంది. ఫేక్ వెబ్సైట్లు, సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ లింకులు లేదా ఓటీపీ మోసాల్లో పడి మనమే స్వయంగా సమాచారాన్ని అందిస్తే వర్చువల్ కార్డు కూడా రక్షణ ఇవ్వలేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఎంతటి కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగదారుల

ఫోన్‌పే తన ప్లాట్ఫామ్లో పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఫిక్స్డ్ డిపాజిట్ సేవలను ప్రారంభించింది. దీంతో వినియోగదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే వివిధ బ్యాంకుల FDలను పోల్చి చూసి తమకు నచ్చిన డిపాజిట్‌ను వెంటనే బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో చేసిన FDలను కూడా ఒకే యాప్‌లో సులభంగా నిర్వహించుకోవచ్చు. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన FDలకు రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది. ఫోన్‌పే ప్రవేశపెట్టిన డైలీ RD ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో రోజుకు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆటోమేటిక్‌గా పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా యువత, ఉద్యోగులు, చిన్న మొత్తాలతో సేవింగ్స్ ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. UPI ఆటోపే ద్వారా ప్రతిరోజూ నిర్ణయించిన మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. వరుసగా 15 రోజుల వరకు డబ్బు జమ కాకపోయినా ఎలాంటి జరిమానా ఉండదు. అలాగే డిపాజిట్ చేసిన తర్వాత కేవలం 7 రోజులకే అవసరమైతే డబ్బు ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు. కావాలంటే ఆటోపే మాండేట్ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ఫోన్‌పే యాప్‌లోని "Mutual Funds & Deposit" విభాగంలో Fixed Deposits లేదా Daily RD ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న భాగస్వామ్య బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీని ఎంపిక చేయాలి. తర్వాత డిపాజిట్ కాలపరిమితిని 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎంచుకుని పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయాలి. అనంతరం PAN, ఆధార్ ద్వారా డిజిటల్ ధ్రువీకరణ పూర్తి చేసి, నామినీ వివరాలు నమోదు చేయాలి. చివరగా PhonePe UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తే వెంటనే FD పూర్తవుతుంది. డైలీ RD కోసం UPI ఆటోపే అనుమతిని