
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జల్ సంచయ్.. జన్ భాగీదారీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నీటి సంరక్షణను కేవలం ఇంజినీరింగ్ కార్యక్రమంగా కాకుండా, ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాఽధి, పర్యావరణ పరిరక్షణకు జలభద్రతే అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో సదుపాయం, ప్రతి గ్రామానికీ విశ్వసనీయమైన సామూహిక జలవనరు ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాలతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) నిధుల ద్వారా జలసంరక్షణ పనులు జరుగుతున్నాయని.. వీటి మధ్య సరైన సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు పొందలేమన్నారు. ప్రతి జలసంరక్షణ ఆస్తిని (చెక్‌డ్యామ్‌లు, చెరువులు తదితర) జియో ట్యాగింగ్ చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని ప్రతిపాదించారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో... సుప్రీంకోర్టు నిర్ణయం.. తదుపరి విచారణ 24కు వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్సజడ్) పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. కేబీఆర్ పార్కు ఈఎ్‌సజడ్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ కాజల్ మహేశ్వరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా చూడడానికి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఈఎ్‌సజడ్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి, వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాజల్ మహేశ్వరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనింగ్, 'రీఫారెస్టేషన్' (పునరటవీకరణ) కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును (నాగేంద్రరావు) ( MLC Konidela Nagendra Babu) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్ -93 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, అడవుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ఆయా కార్యక్రమాలను అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, సమన్వయం, పర్యవేక్షణలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రబాబును నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిబంధనలకు లోబడి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల కార్యకలాపాల సమర్థవంతంగా అమలు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె

హైదరాబాద్‌లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)గా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ ఆటో కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే కాకుండా, పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నూతన విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీనిద్వారా హైదరాబాద్ పరిధిలోని దాదాపు 18,766 ఆటో రిక్షాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఇది ఎంతో తోడ్పడనుంది. ఈ పథకం కింద పాత ఆటోలను ఈవీ రెట్రోఫిట్మెంట్ (మార్పిడి) చేసుకోవడానికి లేదా సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సాయం అందించనుంది. అర్హులైన ప్రతి ఆటో యజమానికి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు రోజువారీ ఇంధనం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వారి నికర ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నిర్ణయంతో ఆటోల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఆటో డ్రైవర్ సంఘాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. ఈ రకమైన సబ్సిడీ పథకం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా, కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న నగరవాసులకు స్వచ్ఛమైన గాలి లభించే అవకాశాలు మెరుగుపడతాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత నిబంధనలు అమలు మార్గదర్శకాలను

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై వైసీపీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభలో ఖనిజాల చట్ట సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పంచదార్లలోని పురాతన ప్రదేశాలను, సహజ జలాశయాలను పరిరక్షించేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పర్యటన వేళ జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీలు.. పొలిటికల్ టెన్షన్!పురాతన వారసత్వ క్షేత్రాలకు తీవ్ర ముప్పు!పంచదార్లలో ఉన్న సంరక్షిత బౌద్ధ క్షేత్రం, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఆలయ సముదాయం గుండా ప్రవహించే ఐదు సహజ జలాశయాలతోనే పంచదార్లకు ఆ పేరు, గుర్తింపు ముడిపడి ఉన్నాయని వివరించారు.రక్షిత ప్రాంతాల వద్దకు మైనింగ్ పొంచి రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పర్యావరణానికి జరుగుతున్న హానిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, నీటి కాల్వలపై హైడ్రోలాజికల్ అధ్యయనం జరిపించాలని కోరారు. ఆ అధ్యయనం పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి మైనింగ్ జరగకుండా తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ అనూహ్య నిర్ణయం, కీలక నియామకం- కొత్త లెక్కలు..!!రాష్ట్రాల ఆదాయాలు, పర్యావరణాన్ని పరిరక్షించాలి!ఖనిజాల చట్ట సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. ఖనిజ సంపద ప్రజల ఆస్తి అని, దాని నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి స్పష్టమైన మైనింగ్ విధానం అవసరమే అయినప్పటికీ, అది రాష్ట్రాల ఆదాయాలకు, స్థానిక ప్రజల జీవనోపాధికి లేదా పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించకూడదని హితవు పలికారు. మైనింగ్ వల్ల తలెత్తే పర్యావరణ, మౌలిక సదుపాయాల వ్యయ భారాన్ని రాష్ట్రాలే మోస్తాయని, అందుకే మైనింగ్