
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో.. నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. నానో-క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి.. హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. నానో-క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని వెల్లడించింది. గురువారం నాడిక్కడ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ కేవీ రాంబాబు మాట్లాడుతూ.. కఠినమైన శాస్త్రీయ పరీక్షల అనంతరం నియంత్రణ సంస్థ ఈ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. నానో టెక్నాలజీతో కూడిన విటమిన్ డీ3 ఔషధానికి ఈ తరహా అనుమతి లభించటం ప్రపంచంలో ఇది తొలిసారని ఆయన చెప్పారు. కాగా ఈ అనుమతితో ఇప్పటి వరకు పరిశోధన స్థాయిలో ఉన్న ఈ ఔషధం పూర్తి స్థాయి ఉత్పత్తిగా మార్కెట్లో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. నానో క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధంతో సెరమ్ విటమిన్ డీ3 స్థాయిలు 50-60 శాతం పెరిగినట్లు క్లినికల్ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. 2010 నుంచి ఈ ఔషధంపై పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామని, కంపెనీ ప్రొప్రైటరీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ అయిన అక్వీల్పై దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు రాంబాబు తెలిపారు. ఈ టెక్నాలజీతో ప్రస్తుతం ఈ ఔషధాన్ని దిగ్గజ ఫార్మా సంస్థలైన అబ్బాట్, సనోఫీలకు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విటమిన్ కే2-7, బీ12, ఐరన్ ఔషధాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తు తం కంపెనీ రూర్కీతో పాటు బద్దీ, హైదరాబాద్‌ల్లో ప్లాంట్లను నిర్వహిస్తోందని చెప్పారు. కాగా రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యా లీలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

పాఠశాల విద్యార్థుల్లో పెరుగుతున్న నేర ప్రవత్తి.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరారోపిత బాలల సంఖ్య తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం.. డ్రగ్స్, మద్యం, సోషల్ మీడియాతో ప్రభావం దేశంలో 9వ స్థానంలో తెలంగాణ.. పిల్లలను గమనించాలి.. సమస్యలు తెలుసుకోవాలి: నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా పొడిచి చంపేశారు.. కూకట్‌పల్లిలో కొందరు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని పాఠశాలలోనే కొట్టి చంపారు.. నిజామాబాద్‌లో హైస్కూల్ విద్యార్థులు తమ సహచర విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా బయటికి వచ్చింది... ఇలా చెప్పుకొంటూ వెళితే ఎన్నో. పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌమార దశలోని విద్యార్థుల్లో క్రూరమైన నేర ప్రవృత్తిపై చర్చ జరుగుతోంది. డ్రగ్స్, మద్యం... ఫోన్లో కళ్లముందు హింస.. విద్యార్థుల్లో మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వినియోగం పెరగడం వారిలో నేరప్రవృత్తిని నాటుతున్నాయని.. అవి పిల్లల నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో, ఓటీటీల్లో హింసాత్మక వీడియోలు, గ్యాంగ్ కల్చర్, సైబర్ బుల్లీయింగ్ వంటివి నేరప్రవృత్తి పెరిగేందుకు దారితీస్తున్నాయి. హింసను వినోదంగా చూపించే కంటెంట్, దూకుడు ప్రవర్తనను హీరోయిజంగా చూపించే సంస్కృతి, అశ్లీల వీడియోలు పిల్లల్లో ఆ తరహా మనస్తత్వాన్ని పెంచుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎక్కువే! ఇటీవల రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ‘‘మీరు ఏం చేస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు?’ అని దాదాపు 5వేల మంది విద్యార్థులను ప్రశ్నించగా.. 96శాతం విద్యార్థులు చెప్పిన సమాధానం ఒక్కటే. మంచి మార్కులొస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారని.. మార్కులు తప్ప మరే

Nalgonda: నల్గొండలో డ్రగ్స్ నివారణపై అదనపు కలెక్టర్ సమీక్ష ఈ వార్తకు సంబంధించిన

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమ ఇంజెక్షన్ల విక్రయం ముగ్గురు అరెస్ట్ హైదరాబాద్: చట్టవిరుద్ధంగా మెఫెంథెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ సిటీ, రాజేంద్రనగర్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం (15.08.2026) అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో దాడి నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ బృందం, మహమ్మద్ ఐజాజ్ (23) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించింది. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ 'ఇండియా మార్ట్' (IndiaMART) ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, థర్డ్ పార్టీ కొరియర్ సేవల ద్వారా తెప్పించుకుంటున్నట్లు తేలింది. సుమారు ₹5,000 లకు 30 ఇంజెక్షన్ల ప్యాక్‌ను కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌ను ₹1,000 చొప్పున విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. జుబేర్ సూచనల మేరకు మహమ్మద్ సైఫ్ ఖాన్ ఈ ఇంజెక్షన్లను సరఫరా చేయగా, మహమ్మద్ ఐజాజ్ వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఐజాజ్ (23): వృత్తి: చార్మినార్ KPB కాంప్లెక్స్‌లోని దుస్తుల దుకాణంలో పని, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (ఇంజెక్షన్ల విక్రేత). (గతంలో సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, బహదూర్ పురా, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లలో 5 కేసుల్లో నిందితుడు). మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ (30): వృత్తి: మోడలింగ్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. (గతంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది). మహమ్మద్ సైఫ్ ఖాన్ (20): వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్‌నుమా. శుభమ్ రాజ్‌పుత్: నివాసం: రాజస్థాన్. (ముఖ్య సరఫరాదారు — పరారీలో ఉన్నాడు). 110 మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్ (Vails) (మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 6,00,000/- గా అంచనా). రాజేంద్రనగర్ మరియు శంషాబాద్ జోన్ల అదనపు డిసిపి కె.ఎస్. రావు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను (TG SAFE) రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఇకపై ఏకీకృత పరిపాలన కింద పనిచేయనున్నాయి. ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌పై లైసెన్సింగ్, తనిఖీలు, శాంప్లింగ్, పరీక్షలు, ఎన్ఫోర్స్మెంట్ను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. TG SAFEలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్ఫోర్స్మెంట్, లీగల్ & ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేయనున్నాయి. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఒకే ల్యాబొరేటరీ విభాగం కిందకు ప్రభుత్వం తీసుకురానుంది. అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్, రిస్క్ ఆధారిత తనిఖీలను TG SAFE చేపట్టనుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం TG SAFEకు పోలీసు సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. తొలిదశలో క్యూర్ ప్రాంతంలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. క్యూర్ ప్రాంతంలో ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. TG SAFE ఏర్పాటు ద్వారా ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది. టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది. కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్తాప్ను బ్యాట్‌తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు

Tanuku: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా AISB విద్యార్థి యూనియన్ భారీ నిరసన ర్యాలీ! ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్‌ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్‌తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోకి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది.. అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని

హ్యాష్ ఆయిల్ స్వాధీనం స్నాప్‌చాట్ ద్వారా దందా పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్ Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా, కొత్త దారుల్లో ఈ దందాను విస్తరిస్తూ యువతను నాశనం చేసేందుకు పెడ్లర్లు యత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ అమ్ముతున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడి నేర పథకాన్ని భగ్నం చేశారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు స్నాప్‌చాట్ వేదికగా రూ. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ దందా: ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్డీపీఎస్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అతడు, ఆగస్టు 2న ఒడిశా వెళ్లి రూ.9,000కు హ్యాష్ ఆయిల్(Hash Oil Seized) కొనుగోలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా స్నాప్‌చాట్ ద్వారా సరఫరాదారుడితో మాట్లాడటంతో పాటు, ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించాడు. హైదరాబాద్‌లో 10 మి.లీటర్లను రూ. 1,200 చొప్పున అమ్మి లాభ పడాలని ప్లాన్ చేశాడు. పోలీసులు వేసిన పక్కా స్కెచ్: విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ORR వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బస్సు దిగిన వెంటనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, రూ. 2.5 లక్షల విలువైన 200 మి.లీ (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై కన్నువేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు

హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్‌ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. రూ.54 కోట్ల విలువైన 27కిలోల డ్రగ్స్ స్వాధీనం కొండమడుగులో ల్యాబ్ అద్దెకు తీసుకొని మెఫిడ్రిన్ తయారీ నాగ్‌పూర్ ముఠా దందా.. నలుగురి అరెస్టు, నలుగురు పరార్ యాదాద్రి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులో ఓ ల్యాబ్‌ను అద్దెకు తీసుకొని గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన ఓ ముఠా గుట్టును యాదాద్రి భువనగరి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నాగ్‌పూర్‌కు తరలిస్తున్న సుమారు రూ.54 కోట్ల విలువైన 27కిలోల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదివారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. డ్రగ్స్ రవాణాపై సమాచారంతో హైదరాబాద్ శివారు, బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో పోలీసులు శనివారం సాయంత్రం తనిఖీలు చేశారు. ఓ కారులో 27కిలోల మెఫిడ్రిన్తోపాటు మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్ రసాయనాన్ని గుర్తించారు. కారులోని నిందితులను విచారించగా.. నాగ్‌పూర్‌కు చెందినముఠా కొండమడుగులో ఓ ల్యాబ్‌ను అద్దెకు తీసుకొని అక్కడ మెఫిడ్రిన్ తయారు చేసి రవాణా చేస్తున్నట్టు తేలింది. నాగ్‌పూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్.. వేటుకూరి ల్యాబ్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. అసోంకు చెందిన ఎండీ అయూబ్ అలీ.. ల్యాబ్ ఏర్పాటు, ముడిపదార్థాల సమీకరణ, కెమి్స్టల ఏర్పాటు వంటి పనులు చేపట్టాడు. మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన వీరు ఈ నెల 5-7 తేదీల్లో ఆ ల్యాబ్‌లో మెఫిడ్రిన్ తయారు చేశారు. దానిని కారులో తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ కేసులో 8 మంది పాత్రను గుర్తించిన పోలీసులు.. చేతన్ మధుకర్ మెష్రామ్ (49), అసోంకు చెందిన ముజమల్ హక్(25), నాగపూర్‌కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే(31), వేటుకూరి

సాక్షి, యాదాద్రి: బీబీనగర్, ఎస్వోటీ పోలీసులు స్థానికంగా తయారవుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్ , 40 కేజీల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి చేసే సమయంలో మరో నలుగురు నిందితులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..? నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?