
రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది
Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు
Gold Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు గత మూడేళ్ల కాలంలో కొన్ని రకాల గోల్డ్ ఫండ్స్ ఊహించని రీతిలో భారీ లాభాలు అందించాయి. వాల్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో లంప్ సమ్ పెట్టుబడిపై ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) రాబడిని అందించిన టాప్-5 పథకాల గురించిన వివరాలు ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. ఇందులో నాలుగు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ సంస్థల స్కీమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (UTI Gold ETF FoF) గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 36.14 శాతంతో అందించింది. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.52 లక్షలు అవుతుంది.Read Also: NFOs: మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 3 కొత్త స్కీమ్స్.. ఈరోజు నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quantum Gold ETF FoF) గత మూడేళ్ల రిటర్న్స్ చూసుకుంటే సగటున ఏడాదికి 35.98 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల క్రితం లంప్ సమ్‌గా రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లియితే ఆ విలువ రూ.2.51 లక్షలు అవుతుంది.ఎస్బీఐ గోల్డ్ ఫండ్ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఎస్బీఐ గోల్డ్ ఫండ్ (SBI Gold Fund) గడిచిన 3 ఏళ్లలో సగటున వార్షిక రాబడి 35.77 శాతం చొప్పున అందించింది. ఇందులో లంప్ సమ్ విధానంలో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టినట్లియితే ఇప్పుడు ఆ విలువ
ఆర్మీకి గుడ్‌బై చెప్పిన మేజర్ రిషభ్ సంబ్యాల్ .. 12 ఏళ్ల సైనిక సేవకు ముగింపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కన.. మిలటరీ గంభీర్యంతో కనిపించే.. ఈ హ్యాండ్సమ్ మేజర్ని గుర్తుపట్టారా? ద్రౌపది ముర్ము ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే ఈ మేజర్ గురించి బహుశా.. తెలియని వాళ్లు ఉండరు. ఈయన ఫోటోలు ఒకప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయన పట్ల చూపిన అభిమానంతో.. రాత్రికి రాత్రే 'నేషనల్ క్రష్'గా మారిపోయారు. ఆయనే మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి భవన్లో.. ఏడీసీగా సేవలు అందించిన.. ఈ ఎలైట్ పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి.. ఊహించని విధంగా ఆర్మీకి గుడ్ బై చెప్పారు. దాదాపు 12 ఏళ్లు సైన్యంలో విశిష్ట సేవలు అందించిన ఆయన.. ముందస్తు పదవీ విరమణ తీసుకుని.. అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి, ఆయన ఎందుకిలా చేశారు. ఆయన జర్నీ ఎందుకు స్ఫూర్తిదాయకం. ఈ వార్తకు సంబంధించిన

BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ డివిజన్లోని మార్కెట్ రోడ్డులో 100 మీటర్ల ఫ్లెక్సీతో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరసన చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేతలు మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే… — Telugu Scribe (@TeluguScribe) September 2, 2026

Qutubullapur: 14 ఎకరాల ఆలయ భూమికి హద్దులు; రంగంలోకి రెవెన్యూ! Qutubullapur: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరి రక్షణకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా సర్వీ దేవాదాయ శాఖ కుత్బుల్లా పూర్ మండల రెవెన్యూ అధికారులు ఆలయ ప్రాంగ ణంలో స్థానిక నాయకులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆట యానికి కేటాయించిన Mఏకరాల 10 గుంటల స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 318/1లో గల స్థలానికి సరిహద్దులను పరిశీలిస్తు న్నారు. కబ్జా అయిన ఆలయ స్థలాన్ని గుర్తించడా వికీ డిజిటల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు వినాయక చవితి వండగలోపు డిజిటల్ సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేయాలని, కళ్ళా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. సర్వే దేవి ఆలయ భూములను రికార్డుల్లోకి ఎక్కిబడను వ్నట్లు అధికారులు. అదికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 12 వారాల్లో సర్వేపూర్తి చేయాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వట్టాదారులతో ఉన్న మిబాబత్ వల్లనే ఇప్పటి వరకు సర్వే చేయకుండా తాత్సర్యం చేశారని నాయకులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్న రెవెన్యూ అది కబ్జాదారుల గుండెల్లో గుబులు జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు శ్రీకారం ముట్టడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కుల సంఘాల ముసుగులో ఆలయ స్థలాన్ని కబ్జాచేసి గదులు కట్టి లక్షల రూపాయ బంచారు. రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తే కబ్జాల బాగోతం బయేట పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమపై కేసులు నమోదు అవుతాయని కంగారు పడుతున్నారు. దీంతో అధికారులు, నాయకుల మాటూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు. కాదులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తు న్నారని

శామీర్‌పేట, సెప్టెంబర్ 1 : ఆర్టీసీ ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ కళ్యాణి మంగళవారం ప్రకటనలో కోరారు. టీజీఎస్ ఆర్టీసీ హకీంపేంట ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో డీజిల్ మెకానిక్(1 సంవత్సరం), మోటాల్ మెకానిక్(2 సంవత్సరాలు) కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 దరఖాస్తులకు చివరి తేది అని పూర్తి వివరాల కోసం 9391072283 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. Beetroot Supplements | మార్కెట్లో అందుబాటులో ఉన్న బీట్ రూట్ సప్లిమెంట్లు.. ఇవి శరీరానికి ఏ మేర మేలు చేస్తాయి, వీటిని తీసుకోవ్చా..? BCCI | బుమ్రా వచ్చేశాడు.. మళ్లీ భారత టీ20 స్క్వాడ్‌లో ఆ ముగ్గరు..! ENE Repeat | గెట్ రెడీ ఫర్ సీక్వెల్.. తరుణ్ భాస్కర్ ENE Repeat టీం క్రేజీ వీడియో

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీసీ’. రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటుడిగానూ ఆరంగేట్రం చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 50 రోజుల పాటు.. లోకేశ్ బాడీని ఫిట్‌గా మార్చుకునేందుకు ఏకంగా 50 రోజుల పాటు కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను ఫాలో అయ్యారట. ఆయన ట్రైనర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జిమ్‌లో లోకేశ్ కసరత్తులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ బైసెప్స్, కండరాలను టోన్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారే క్రమంలో లోకేశ్ చూపించిన అంకితభావాన్ని ట్రైనర్ ప్రశంసించారు. అరుణ్ మాథేశ్వరన్కు నాలుగో చిత్రం ‘డీసీ’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘రాకీ’ (2021), ‘సాని కాయిదమ్’ (2022), ‘కెప్టెన్ మిల్లర్’ (2024) చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందించగా.. జీకే ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, కస్తూరి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదీ చదవండి: షూటింగ్లో అస్వస్థత..! డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..! విజయవాడ
iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్ బస్టర్ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా వేటలో, గ్లోబల్ సినిమా వేటలో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, మెగాస్టార్ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. ఆ టైమ్‌లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్‌గా వాహ్ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ

ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్‌తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.మూడు గంటల నరకం.. అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్‌ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.Viral Video: వికెట్ తీసి Gen-Z సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMDC)కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు లభించింది. ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ విభాగంలో APMDC ఈ పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా భారీగా నిధులు సమీకరించినందుకు ఈ గుర్తింపు దక్కింది. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా APMDC సుమారు రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్థిక వనరులను సమర్థవంతంగా సమీకరించడంతో పాటు బాండ్ మార్కెట్‌ను వినియోగించుకున్న తీరుకు ASSOCHAM నుంచి ప్రశంసలు లభించాయి. APMDC చేపట్టిన ఈ భారీ నిధుల సమీకరణ సంస్థ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని అధికారులు పేర్కొన్నారు. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్(NCD) ద్వారా సమీకరించిన నిధులతో సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరడమే కాకుండా.. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా APMDC స్థానం మరింత బలోపేతమైంది. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ, మార్కెట్ ఆధారిత నిధుల సమీకరణ, సంస్థాగత ఆర్థిక ప్రణాళికకు గుర్తింపుగా ASSOCHAM అవార్డును భావిస్తున్నారు. రూ.9 వేల కోట్ల స్థాయిలో నిధులను సమీకరించిన APMDC పనితీరుకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు, ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'స్పిరిట్' మూవీ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. నానో-క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి.. హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. నానో-క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని వెల్లడించింది. గురువారం నాడిక్కడ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ కేవీ రాంబాబు మాట్లాడుతూ.. కఠినమైన శాస్త్రీయ పరీక్షల అనంతరం నియంత్రణ సంస్థ ఈ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. నానో టెక్నాలజీతో కూడిన విటమిన్ డీ3 ఔషధానికి ఈ తరహా అనుమతి లభించటం ప్రపంచంలో ఇది తొలిసారని ఆయన చెప్పారు. కాగా ఈ అనుమతితో ఇప్పటి వరకు పరిశోధన స్థాయిలో ఉన్న ఈ ఔషధం పూర్తి స్థాయి ఉత్పత్తిగా మార్కెట్లో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. నానో క్యారియర్ ఎన్‌ట్రా్‌ప్డ విటమిన్ డీ3 ఓరల్ ఔషధంతో సెరమ్ విటమిన్ డీ3 స్థాయిలు 50-60 శాతం పెరిగినట్లు క్లినికల్ పరీక్షల్లో వెల్లడైందని తెలిపారు. 2010 నుంచి ఈ ఔషధంపై పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామని, కంపెనీ ప్రొప్రైటరీ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ అయిన అక్వీల్పై దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు రాంబాబు తెలిపారు. ఈ టెక్నాలజీతో ప్రస్తుతం ఈ ఔషధాన్ని దిగ్గజ ఫార్మా సంస్థలైన అబ్బాట్, సనోఫీలకు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విటమిన్ కే2-7, బీ12, ఐరన్ ఔషధాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తు తం కంపెనీ రూర్కీతో పాటు బద్దీ, హైదరాబాద్‌ల్లో ప్లాంట్లను నిర్వహిస్తోందని చెప్పారు. కాగా రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యా లీలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Alwal: అల్వాల్‌లో వినూత్న చోరీ చందా కోసం వెళ్లి నగదు దోచుకున్న మైనర్లు ఈ వార్తకు సంబంధించిన
Mutual Funds SIP Calculator: మ్యూచువల్ ఫండ్లలో మీరు పెట్టుబడులు పెడుతుంటారా? ఇక్కడ ఎన్నో కేటగిరీలకు చెందిన ఫండ్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, డిఫెన్స్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే వేటికవే ప్రత్యేక లక్ష్యాల్ని, వ్యూహాల్ని కలిగి ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్లలో మిడ్ క్యాప్ ఫండ్స్‌కు విశేష ఆదరణ ఉంటుంది. వీటిల్లో నిర్వహణలోని ఆస్తుల పరంగా అతిపెద్ద సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నుంచి హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాసుల పంట పండించింది. ఇది గత ఐదేళ్లలోనే సగటున వార్షిక ప్రాతిపదికన 20.04 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ రిటర్న్స్ 18.26 శాతంగా ఉండగా, మిడ్ క్యాప్ కేటగిరీ సగటు 16.12 శాతంగా ఉంది.అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. గతంలో అద్భుత స్థాయిలో రాబడి ఇచ్చిన స్కీమ్ భవిష్యత్తులోనూ ఇస్తుందని చెప్పలేం. అలా అని ఇవ్వదన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఇక్కడ స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే ఫండ్ పనితీరు ఎలా ఉంది, ఏయే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఫండ్ మేనేజర్లు ఎవరున్నారు? ఇలా పూర్తి వివరాలు తెలుసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది.ఇక ఇప్పుడు మనం దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడి అందించిన హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. ఇది 2007, జూన్‌లో ప్రారంభమైంది. ఇక్కడ ఐదేళ్లు, పదేళ్లు, అలాగే స్కీమ్ ప్రారంభం నుంచి చూసినా అత్యుత్తమంగా రాబడి అందించిన వాటిల్లో ఈ పథకం ముందు వరుసలోనే ఉంటుంది. మూడేళ్లలో సగటున వార్షికంగా 19.45 శాతం, ఐదేళ్లలో 20.04 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఇంకా స్వల్ప కాలంలో ఈ స్థాయిలో రాబడి ఉండదు. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.Read Also

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్టైనట్లు గుర్తించారు. వీరికి గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌కు కీలక లింకులు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఐఏఎస్ సానుభూతిపరులు హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్.. వీరి చాటింగ్‌పై నిఘా పెట్టింది. తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

మన దేశమంతా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాము. కానీ పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరోజు నిర్వహించుకోరు. వారికి ఆగస్టు 18న స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటారు. అందుకే ఆ రోజే నిర్వహించుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాలు ఆగస్టు 18నే స్వాతంత్య్ర దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుంటాయి. అలా ఎందుకు చేసుకుంటారో తెలుసుకోండి. 1947లో భారత విభజన సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల విభజన బాధ్యతను లండన్‌కు చెందిన న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ కు అప్పగించింది. అంతకుముందు ఎన్నడూ భారతదేశానికి రాని రాడ్‌క్లిఫ్, సరిహద్దు కమిషన్లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. వారు గీసిన ప్రాథమిక మ్యాప్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నదియా, మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్‌పూర్ వంటి ప్రాంతాలను పొరపాటున తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) భూభాగంలో చూపించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే, ఈ ప్రాంతాల ప్రజలు తాము ఏ దేశంలో ఉన్నామో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాత్కాలిక మ్యాప్ ఆధారంగా ఆగస్టు 14, 15 తేదీలలో నదియాలోని కృష్ణనగర్, మాల్దాలోని ఇంగ్లీష్ బజార్ వంటి ప్రభుత్వ భవనాలపై పాకిస్తాన్ జాతీయ జెండాలను కూడా ఎగురవేశారు. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, హిందూ మహాసభ నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నదియా రాజకుటుంబీకులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేసి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మౌంట్‌బాటన్, రాడ్‌క్లిఫ్‌ను సరిహద్దులను సరిచేయాల్సిందిగా ఆదేశించారు. ఆగస్టు 17 రాత్రి ఆల్ ఇండియా రేడియో ద్వారా సవరించిన మ్యాప్ వివరాలను ప్రకటించారు. దీని ప్రకారం ఈ ముస్లిమేతర మెజారిటీ ప్రాంతాలు భారతదేశంలోనే ఉంటాయని స్పష్టమైంది. రేడియో ప్రకటన తర్వాత, 1947 ఆగస్టు 18 మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లోని పాకిస్తాన్ జెండాలను తొలగించి, మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఎగురవేశారు

భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూళ్లలో 20 శాతం మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ)కు ఇవ్వాలని ఆదేశించింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 'పెద్ది', 'రాజాసాబ్', 'మనశంకర వరప్రసాద్ గారు', 'అఖండ 2' వంటి చిత్రాలకు ఇది వర్తించనుంది. ఈ సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్లో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు, టీజీఎఫ్డీసీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల (థియేటర్ల యజమానులు) నుంచి వసూలు చేసి, సంబంధిత ఖాతాల్లో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలతో పాటు భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది

నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది. తెలుగు సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. అయితే అందుకు ఓ షరతును విధించింది. నిర్మాతలు ఎవరైనా సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని అనుకుంటే, పెంచిన టిక్కెట్ ఛార్జీలలోని లాభంలో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడానికై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జమ చేయాలని చెప్పింది. అందుకు కొందరు నిర్మాతలు ఆమోదం తెలిపి, తమ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సిద్థపడ్డారు. అలా గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది. కానీ ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది. ఆ రకంగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్ ఇండియా, వృద్ధి సినిమాలకు లేఖను పంపింది. మరి వీరు ఎప్పటిలోగా ఆ డబ్బుల్ని జమ చేస్తారో చూడాలి

ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రసారాల రూపురేఖలను మార్చేసిన ఈఎస్పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ఈఎస్పీఎన్ ప్రస్తుత, మాజీ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన దార్శనికతను స్మరించుకున్నారు.1970వ దశకం చివర్లో తన కుమారుడు స్కాట్‌తో కలిసి 24 గంటల పాటు కేవలం క్రీడల కోసమే ఒక కేబుల్ నెట్వర్క్ ఉండాలనే ఆలోచనకు బిల్ రాస్ముసెన్ బీజం వేశారు. ఈ ఆలోచన ఫలితంగా 1979 సెప్టెంబర్ 7న ఈఎస్పీఎన్ ప్రారంభమైంది. మొదట్లో ఈ కాన్సెప్ట్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమైనా, అనతికాలంలోనే ఇది మీడియాలో ఒక సంచలనంగా మారింది. రాస్ముసెన్ ఈఎస్పీఎన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.ఈఎస్పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో నివాళులర్పిస్తూ.. "రాస్ముసెన్ ఒక అసాధారణ వ్యక్తి, గొప్ప దార్శనికుడు, ఆవిష్కర్త. క్రీడలకే అంకితమైన నెట్వర్క్ ఆలోచన ఆయనదే" అని కొనియాడారు. 1970లలో ఆయన చూపిన స్ఫూర్తి, అభిరుచి ఇప్పటికీ తమ సంస్థ సంస్కృతిలో భాగమేనని తెలిపారు. ప్రముఖ యాంకర్ క్రిస్ బెర్మన్ స్పందిస్తూ.. "ఆయన మా జార్జ్ వాషింగ్టన్, ఒక మంచి స్నేహితుడు" అని అభివర్ణించారు.క్రీడా ప్రసార రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2025లో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు
Axis Bank Credit Card Rules: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు ఆగస్టు 28, 2026 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ వల్ల విదేశీ లావాదేవీల ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, రివార్డ్ పాయింట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సేవలపై ప్రభావం పడనుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, కొత్త రుసుములు, పాయింట్ల విధి విధానాలు తెలుసుకుందాం.డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ రుసుము పెంపువిదేశాలలో ఉన్నప్పుడు లేదా అంతర్జాతీయ వ్యాపారులకు (POS టెర్మినల్స్, ఆన్లైన్ ద్వారా) భారతీయ రూపాయిలలో చెల్లింపులు చేసినప్పుడు విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ మార్కప్ ఫీజను యాక్సిస్ బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం డీసీసీ ఛార్జీలు 1.5 శాతంగా ఉండగా దానిని 3.5 శాతానికి పెంచారు. మాగ్నస్ కార్డుపై అయితే 2 శాతం, ఒలింపస్ కార్డుపై 1.8 శాతం ఛార్జీలు ఉండనున్నాయి.ఆలస్య చెల్లింపు రుసుము పెంపురూ.50 వేలు అంత కంటే ఎక్కువ బకాయిలు ఉన్న కార్డ్ హోల్డర్లకు కొత్త స్లాబును కేటాయించారు. ఈ పరిమితి దాటితే లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1,300గా నిర్ణయించారు. బకాయి మొత్తం ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee) రూ.500 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు రూ.501 నుంచి రూ.5000 రూ.500 రూ.5001 నుంచి రూ.10,000 రూ.750 రూ.10,001 నుంచి రూ.50,000 రూ.1,200 రూ.50,000 ఆపైన రూ.1,300 బకాయి చెల్లింపు సర్దుబాటుక్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్లును పాక్షికంగా (Partial Payment) చెల్లించినప్పుడు, ఆ బ్యాంక్ ఆ సొమ్మును వివిధ కేటగిరీలుగా సర్దుబాటు చేస్తుంది. వర్తించే రుసుములు, ఛార్జీలు (జీఎస్టీతో కలిపి) విధిస్తారు. ఈఎంఐ (EMI)లుగా మార్చడం వడ్డీపైన ఛార్జీలు పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ అడ్వాన్స్ ఏటీఎం విత్ డ్రాయల్స్ రివార్డ్ పాయింట్లు

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్‌తో చేసిన లియో, రజనీకాంత్‌తో చేసిన కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. కథ, సెకండ్ హాఫ్ స్క్రీన్‌ప్లే లోపాల వల్ల సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాయి. ఇక ఆ ట్రోల్స్ ని తట్టుకొని DC సినిమాతో హీరోగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ .. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #AA23 చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న ఈ సినిమా, అత్యంత వినూత్నమైన కాన్సెప్ట్, హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందనుంది. ఇటీవల లోకేష్ నటించిన చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ లోకేష్‌ను అభినందించడం, వీరి కాంబినేషన్ మూవీపై ఉన్న క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై లోకేష్ కనగరాజ్ చాలా హుందాగా, స్పష్టంగా స్పందించాడు. 'మా అమ్మ కూడా నాకు సంబంధించిన ఆ ట్రోల్స్, మీమ్లను స్క్రీన్షాట్లు తీసి పంపుతుంటుంది. ఇందులో కంగారు పడటానికి ఏమీ లేదు

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’. ఈ మూవీపై తాజాగా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీసీ’ (DC). సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ వైవిధ్యమైన చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. రీసెంట్గా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేయగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సైతం ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. లోకేష్ కనగరాజ్ నటనతో పాటు సినిమా మేకింగ్ అద్భుతంగా ఉందంటూ బన్నీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై తన రివ్యూను పంచుకుంటూ.. ‘‘ఇప్పుడే ‘డీసీ’ సినిమా చూశాను. ఇది తమిళ చిత్రసీమలో ఒక క్లాసిక్ చిత్రం. అర్థం చేసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. సినిమా ప్రేమికులందరూ తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు నా హృదయపూర్వక అభినందనలు. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మాస్టర్ బూస్టర్‌లా నిలిచింది. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది’’ అంటూ అల్లు అర్జున్ కొనియాడారు. చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేశారని, ముఖ్యంగా వామికా గబ్బి, హీరోగా నటించిన లోకేష్ కనగరాజ్ నటన ఎంతో ఆకట్టుకుందని బన్నీ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రానికి అతిపెద్ద పిల్లర్‌గా నిలిచిన నా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు, నిర్మాతలు సన్ పిక్చర్స్, మొత్తం ‘డీసీ’ టీమ్‌కు నా ప్రత్యేక అభినందనలు’’ అని తెలిపారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేశ్ బాబు, అల్లు అర్జున్ వరుసగా ప్రశంసలు కురిపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘డీసీ’

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ 'డిసి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక 'తమిళ క్లాసిక్'గా అభివర్ణిస్తూ, ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన కళాఖండం అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తాజా రివ్యూ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది."‘డిసి’ చూశాను! ఇదొక తమిళ క్లాసిక్. ప్రతీ సినిమా ప్రేమికుడు తప్పక చూడాలి. దీన్ని అర్థం చేసుకున్న వారికి ఇది ఒక కవిత్వం లాంటిది" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు తన అత్యున్నత గౌరవాన్ని తెలియజేశారు. రాకీ, సాని కాయిధమ్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ పనితనాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన అనిరుధ్ రవిచందర్‌ను 'అబ్సొల్యూట్ మాస్టర్ బూస్టర్' అని పొగిడిన బన్నీ, సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని అన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను 'ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ఆధారం' అని అభివర్ణించారు. ఆ పాత్రలో లోకేశ్ జీవించారని ప్రశంసించారు. కథానాయిక వామికా గబ్బితో పాటు ఇతర నటీనటులందరూ అద్భుతంగా నటించారని తెలిపారు.ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ రివ్యూ మరింత బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా మెచ్చుకున్న సంగతి

తమిళ యాక్షన్ క్రైమ్ డ్రామా ‘డీసీ’ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సినిమాలోని ప్రతి అంశాన్ని తాను ఆస్వాదించానని, ఇది ఒక అద్భుతమైన ఒరిజినల్ చిత్రమని మహేశ్ బాబు కొనియాడారు. ప్రముఖ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం, దేవదాస్ కథాంశం ఆధారంగా తమిళనాడు నేపథ్యంలో రూపొందింది. ఇందులో లోకేష్ కనగరాజ్ ‘దేవ్‌దాస్’ పాత్రలో నటించగా, వామికా గబ్బి ‘చంద్ర’గా ప్రధాన పాత్ర పోషించారు. కథాకథనాలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, అనూహ్యంగా ప్రేక్షకాదరణ పొందుతూ భారీ లాభాల దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన 9 రోజుల్లోనే డీసీ సినిమా ఇండియా నెట్ వసూళ్లు 50.26 కోట్ల మార్కును అధిగమించాయి. ఇదిలా ఉండగా, 10వ రోజు నాటికి వసూళ్లు 54 కోట్ల రూపాయలకు చేరుకుని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సినిమాలోని సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంపై సినీ వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని చూసి, సాంకేతిక విలువలను మరియు లోకేష్ కనగరాజ్ నటనను ప్రత్యేకంగా అభినందించారు. ఫలితంగా ఈ చిత్రం తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రశంసల పట్ల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మరియు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సామాజిక మాధ్యమాల వేదికగా మహేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ హీరోల నుండి వస్తున్న ఈ సానుకూల స్పందన డీసీ చిత్రానికి మరింత మైలేజీని ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై చర్చ మొదలై, ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్

లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా డీసీ. ఆగస్టు 7న రిలీజైన డీసీ సరికొత్త రస్టిక్, ఒరిజినల్ అండ్ మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొటీన్ కథాంశాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా సూపర్ పర్ఫామెన్స్ తో, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్ శైలికి అనిరుధ్ మ్యూజిక్ తోడై ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఇటీవల విడుదలైన ‘డీసీ’ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుప్రశంసల వర్షం కురిపించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై మహేష్ స్పందిస్తూ.. "డీసీ... ఒరిజినల్ మరియు అవుట్‌స్టాండింగ్ సినిమా. సినిమా చాలా కూల్‌గా అనిపించింది, ప్రతీ సీన్నూ ఎంతగానో ఆస్వాదించాను. చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు" అని ఎక్స్ వేదికగా కొనియాడారు. మహేశ్ బాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంస 'డీసీ' చిత్ర బృందానికి పెద్ద బూస్ట్‌లా మారింది. మహేశ్ బాబు ట్వీట్ కు రిప్లై ఇస్తూ మీ ట్వీట్ కు ధన్యవాదాలు సార్ అని చెప్తూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కామెంట్ చేసారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BEd Admission: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కోర్సు అయిన బీఈడీకి మళ్లీ డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఈ కోర్సులో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈసారి 13,695 సీట్లకు గాను.. మొదటి విడతలోనే 9,407 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు. ఎడ్ సెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించగా.. మొత్తం కన్వీనర్ కోటాలో 13,695 సీట్లు ఉన్నాయి. అందులో ఈసారి 15,009 మంది వెబ్ ఆప్షన్స్ ఎంచుకున్నారు. వీరిలో 9,407 మది సీట్లను దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్నవారు ఈనెల 20 వరకు ఫీజు చెల్లించి రిపోర్టు చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. కాగా 2025లో మొదటి విడతలో 4,474 మంది రిపోర్టు చేశారు. రెండో విడతలో 7,441 మంది సీట్లు దక్కించుకున్నారు. అంటే ఈ రెండు విడతల్లో 11వేలకు పైగా సీట్లు నిండిపోయాయి. ఈ సారి మొదటి విడతలోనే 9వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యాయి. అంటే ఈ సారి 81.85 శాతం సీట్లను మహిళలే దక్కించుకున్నారు. కాగా జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ కోర్సును పున ప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మాస్టర్స్ డిగ్రీ లేదా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు అవుతారు. సాధారణ మూడేళ్ల డిగ్రీ చదివిన వారికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు యథాతథంగా కొనసాగనుంది. కాగా ఈ నూతన కోర్సుపై అభ్యర్థుల్లో భారీగా ఆసక్తి నెలకొంది

Hyderabad: నకిలీ లక్ష్మీదేవి విగ్రహం విక్రయ యత్నం ఆరుగురి అరెస్ట్ ఈ వార్తకు సంబంధించిన

కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని అభివర్ణించారు. గత రెండున్నరేళ్లలో మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అడగలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని, అందులో తప్పేమీ లేదన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆయన బాధ్యతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని అంతర్గతంగా సరిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీకే మంచిదని అనిరుధ్ రెడ్డి అన్నారు. పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడకుండా, ప్రజా సమస్యలపై చర్చగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో మైనర్ బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన..!

టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘DC’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న లోకేష్‌కు అల్లు అర్జున్ టీమ్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ AA23 టీమ్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుండి చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా, DC చిత్ర విజయం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది. “డిసి చిత్రానికి అఖండ విజయం అందించినందుకు అభినందనలు లోకేష్ కనగరాజ్, ఇప్పుడు AA23 వంతు” అని వారు పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ త్వరలోనే AA23 ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న లోకేష్, తదుపరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో ఈ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ మార్క్ మేకింగ్‌కు అల్లు అర్జున్ స్టార్డమ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరియు ఇతర వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది

ఉత్తరాఖండ్ చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శిథిలాలు, నీటిని తొలగించిన సహయక సిబ్బంది మరో మృతదేహాన్ని వెలకితీశారు. ఉత్తరాఖండ్: చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో నిన్న (శుక్రవారం) భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బిర్హి నది సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి పెద్దఎత్తున వరదనీరు, శిథిలాలు వచ్చి చేరాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారి కోసం సహాయక బృందాలను అధికారులు రంగంలోకి దించారు. నిన్నటి నుంచి భారీగా చేరిన నీరు, శిథిలాలను తొలగిస్తూ.. నేడు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు, శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు ఉదయం స్పందించారు. టీహెచ్‌డీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా శిథిలాలు, నీరు చేరడంతో విధుల్లో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. చిక్కుకుపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ఏజెన్సీలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోందని సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. ఏ నిర్మాణ ప్రాజెక్టులోనైనా పని చేసే సిబ్బంది భద్రతే తొలి ప్రాధాన్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, సొరంగం లోపల భారీగా చేరిన నీరు

మేడ్చల్: వరంగల్-హైదరాబాద్ హైవేపై ఘట్కేసర్ వద్ద జరిగిన ప్రమాదంలో బాలిక మృతి చెందింది. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు సురేశ్, ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

డిజిటలైజేషన్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ సిటీ: డిజిటలైజేషన్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా పంపిణీ చేసిన తర్వాత.. జిల్లాల వారీగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 8.39 లక్షలు, రంగారెడ్డిలో 6.53 లక్షలు, మేడ్చల్‌లో 6.49 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. తొలివిడతగా మండలానికి వెయ్యి చొప్పున అందజేసి, మిగతా కార్డులను డీలర్ల ద్వారా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గ్రేటర్లో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు అందనున్నట్లు వారు చెప్పారు. రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?

సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ చిత్రం మాదిరిగానే ఈ సినిమా కూడా తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆదరణ సొంతం చేసుకుంటోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రీ-బుకింగ్స్, ఓపెనింగ్ డే అక్యుపెన్సీలలో సొంత రాష్ట్రం కంటే తెలుగు వెర్షన్లోనే భారీ నంబర్లు నమోదు చేసింది. భారతదేశంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లోనూ తెలుగు వెర్షన్ అగ్రస్థానంలో కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో విడుదలైన ‘డీసీ’ చిత్రం తమిళనాడులో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే బాటలో సూర్య చిత్రం కూడా తెలుగు వెర్షన్ హోమ్‌స్టేట్ నంబర్లను దాటేసే దిశగా సాగుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవ వారాంతంలో విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్, బిజినెస్ టైకూన్ పాత్రలో కనిపించి మెప్పించారు. దీంతో కుటుంబ భావోద్వేగాలు, వయసు తేడా ఉన్న ప్రేమకథ చుట్టూ సాగే ఈ నారేటివ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలమైంది. నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లోని థియేటర్లలో నమోదు అవుతున్న అక్యుపెన్సీలు చూస్తుంటే తెలుగు వెర్షన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా రాబోయే రోజుల్లో తెలుగు నంబర్లు తమిళ వెర్షన్‌ను పూర్తిగా వెనక్కి నెట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ తెలుగు వెర్షన్ సాధిస్తున్న ఆధిక్యం సినిమా సక్సెస్ రేంజ్‌ను మరింత పెంచేలా కనిపించడం గమనార్హం. సూర్య ఇటీవల ‘కరుప్పు’ వంటి భారీ హిట్‌తో మంచి

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానళ్ల యాడ్స్ ప్రసారంపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానళ్లు గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదన్న దాదాపు రెండు దశాబ్దాల నాటి పాత నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ఈ కొత్త మార్పు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ 1994 సవరణల గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో టీవీ ఛానళ్లకు ప్రకటనల ప్రసారంలో పూర్తి స్వేచ్ఛ లభించనుంది. ఈ 12 నిమిషాల పరిమితి నిబంధన కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ కింద 2006 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. అప్పట్లో దేశంలో కేవలం 62 టీవీ ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా కేబుల్ వ్యవస్థ అంతా అనలాగ్ పద్ధతిలోనే సాగేది. అయితే ప్రస్తుతం దేశంలో 900కు పైగా ఛానళ్లు ఉండటమే కాకుండా డీటీహెచ్, డిజిటల్ కేబుల్ ప్లాట్‌ఫామ్‌లు వందలాది ఛానళ్లను వీక్షకులకు అందిస్తున్నాయి. బ్రాడ్కాస్టర్లు ఈ నిబంధనను సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయించగా 2026 మే నెలలో ఢిల్లీ హైకోర్టు ట్రాయ్ నిబంధనలను సమర్థించింది. దీంతో టీవీ రంగంలో పెరిగిన తీవ్రమైన మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని పూర్తిగా రద్దు చేసింది. ఇదిలా ఉండగా టీవీ రంగానికి చెందిన పే ఛానళ్లు మరియు ఫ్రీ-టు-ఎయిర్ ఛానళ్లు ప్రధానంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. మరోవైపు డిజిటల్ మీడియా మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనల సమయంపై ఎలాంటి కాలపరిమితి లేకపోవడంతో టీవీ రంగానికి అసమాన పోటీ ఎదురైంది. ప్రకటనల ఆదాయాన్ని నమ్ముకున్న టీవీ ఛానళ్లకు డిజిటల్ మాధ్యమాలతో సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణల నిర్ణయం వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఫలితంగా టీవీ ఛానళ్లు తమ ప్రకటనల సమయాన్ని తమకు నచ్చినట్లు

టెలివిజన్ ఛానెళ్ల ప్రసారాల్లో ప్రకటనల సమయంపై ఉన్న కీలక నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. గంటకు 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న పరిమితిని ఎత్తివేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. టీవీ, డిజిటల్ మీడియా మధ్య సమాన పోటీని ప్రోత్సహించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల కింద 2006లో ఈ 12 నిమిషాల ప్రకటనల పరిమితిని ప్రవేశపెట్టారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు టీవీ ప్రసార రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 2006లో దేశంలో కేవలం 62 టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 900కు పైగా ఉందని గుర్తు చేసింది.ఆ రోజుల్లో అనలాగ్ పద్ధతిలో ఉన్న కేబుల్ టీవీ ప్రసారాల వల్ల ఛానెళ్ల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ, ఇప్పుడు కేబుల్ టీవీ రంగం పూర్తిగా డిజిటలైజ్ అయింది. డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు 300 నుంచి 500కు పైగా ఛానెళ్లను అందిస్తూ ప్రేక్షకులకు విస్తృత ఎంపికలు కల్పిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో పోటీతత్వం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.భారత్‌లో టీవీ రంగం 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానెల్ అనే దానితో సంబంధం లేకుండా ప్రకటనల ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మరోవైపు, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలపై ఎలాంటి కాలపరిమితి నిబంధన లేదు. ఈ అసమాన పోటీ

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆ సమయంలో HCC సిబ్బంది నిర్మాణ పనులు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మందిని బయటకు తీసుకొచ్చారు. వారిలో ఏడుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో NDRF, భారత సైన్యం, ITBP బృందాలను కూడా రంగంలోకి దించారు. టన్నెల్లో ఇంకా ఇద్దరు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్, NDRF అధికారి అమృత్ లాల్ మీనా సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో భారీగా నీరు చేరడంతో రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, అన్ని సంబంధిత సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల కుత్బుల్లాపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “తిరంగా ర్యాలీ”లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్న ఈటల రాజేందర్, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ కలిసి జీవించే దేశం భారతదేశమని అన్నారు. మనందరం భారతమాత ముద్దుబిడ్డలమని పేర్కొన్నారు. జనగణమన, వందేమాతరం వంటి జాతీయ భావనలు అసేతు హిమాచలం భారతీయులను ఐక్యంగా ఉంచుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారతదేశ ఔన్నత్యం సమున్నతంగా నిలుస్తోందన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ కి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి, ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మరియు ఇంచార్జి మల్లారెడ్డి, వడేపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషగిరి రావు, కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కాంత రావు, కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల జయశేఖర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు వేముల రమేష్, బీజేవైఎం నాయకులు శ్రీనాథ్, సాయి కిరణ్ రెడ్డి, ఆర్తిక్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు సర్కార్ కూడా ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి ఫుల్ గా దృష్టి సారించింది.రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలుఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కొత్త పైలెట్ శిక్షణా కేంద్రాలు కర్నూలు, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో ఏర్పాటు కానున్నాయి.ఈ విమానాశ్రయాలలోనే పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్వహణలో కర్నూలు విమానాశ్రయం ఉంది. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి. ఇవి మాత్రమేకాక తిరుపతి విమానాశ్రయంలో కూడా ఎఫ్‌టీవోలు ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు ఈ కేంద్రాలను నిర్వహించనున్నాయి.వివిధ దశల్లో పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కర్నూలులో రెండు ఎఫ్‌టీవోలకు రాష్ట్రంలోని కూటమి సర్కార్ అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకటి ఈ నెల 22న ప్రారంభం కానుంది. రెండోది డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుంది. రాజమహేంద్రవరంలో రెండు పైలెట్ శిక్షణా కేంద్రాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల్లోగా అవి ప్రారంభం కావచ్చు. కడపలోనూ రెండు ఎఫ్‌టీవోలకు టెండర్లు ప్రారంభించారు.ఒక్కో కేంద్రం ద్వారా 30 నుంచి 40 మందికి పైలట్ శిక్షణ అందించే అవకాశం ఉంటుంది.తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!ఏపీలో పైలెట్ ట్రైనింగ్ ఔత్సాహికులకు పండుగే ఇప్పటివరకు రాష్ట్రంలో పైలెట్ శిక్షణ అందుబాటులో లేదు. కాబట్టి ఈ శిక్షణా కేంద్రాల ద్వారా

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు స్టే అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల డిమోలిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. మల్కాజిగిరి మండలంలో ఉన్న వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాల విషయంలో గతంలోనే న్యాయస్థానం స్టే మంజూరు చేసింది. అయినప్పటికీ.. ఆ స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. కూల్చివేతలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి మండలాల తహసీల్దార్లు కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కీలక విషయాలను న్యాయస్థానానికి వివరించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు, ఉత్తర్వులు ఇవ్వలేదనీ, తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ అందించిన ప్రాథమిక సమాచారం, జీఎల్ఆర్ సూచనల మేరకే చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. క్షేత్రస్థాయి రికార్డులను, న్యాయపరమైన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ పేర్కొంది. ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన హై కోర్టు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల

మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మేడ్చల్, ఆగస్టు 12: దేవరాయాంజాల్‌లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతకంతకూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలానికి డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ మున్సిపల్ సిబ్బంది భారీగా మోహరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఈ వార్తకు సంబంధించిన
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) నుంచి వస్తున్న నెక్ట్స్ భారీ చిత్రం ' జై హనుమాన్ '. సంచలన విజయం సాధించిన 'హను-మాన్' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ ఆధ్యాత్మిక ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్లో లీడ్ రోల్లో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో రానా దగ్గుబాటి అశ్వత్థామగా ఓ కీలక పాత్రలో అలరించనున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన కాస్టింగ్ జరిగిందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ‘డీసీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ వామికా గబ్బి ... ‘జై హనుమాన్’లో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో ఆమె యూనిట్‌తో కలవనున్నారని సమాచారం.* ఆ ఒక్క కామెంట్‌తో మా నాన్న సినిమాలు చూడటం మానేశా... చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న సూర్యపంజాబీ, హిందీ రచయిత గోవర్ధన్ గబ్బి కుమార్తె అయిన వామికా గబ్బి చిన్నతనం నుంచే కళా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రసిద్ధ కథక్ నృత్యకారిణి అయిన ఆమె, 2007లో 'జబ్ వియ్ మెట్' చిత్రంతో బాల నటిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితమే (2015) 'భలే మంచి రోజు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వివిధ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినప్పటికీ, ఆమె నటనకు సరైన గుర్తింపు దక్కడానికి కాస్త సమయం పట్టింది. ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి 'జీ2' (G2) చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.* అరుదైన విదేశీ కోతితో ఆటలు.. చియాన్ విక్రమ్ కొంపముంచిన వీడియో... రంగంలోకి అటవీ శాఖ‘డీసీ’తో మారిన కెరీర్ఇటీవల వచ్చిన ‘డీసీ’ చిత్రంలో 'చంద్ర' అనే పాత్ర వామికా కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.. 22ఏ/POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భూ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకే ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. POB దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకు పంపాలి.. POB దరఖాస్తులను ఇక తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని మంత్రి పొంగులేటి సూచించారు. POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దని ఆదేశించారు. తిరస్కరణకు కారణాలు తెలిపేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదని స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. 'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల్లో ఉత్సాహం, టీమ్ స్పిరిట్‌కు ప్రోత్సాహమని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఎన్పీడీసీఎల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి మంగళవారం హనుమకొండ రెడ్డిపురంలోని క్రికెట్ గ్రౌండ్ లో ఉద్యోగులు, క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసిమెలిసి క్రికెట్ ఆడిన సీఎండీ, క్రీడాకారులను అభినందిస్తూ వారిని మరింత ఉత్సాహపరిచారు. ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణంలో గడిపారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం, నాయకత్వ లక్షణాలు, సమన్వయం, టీమ్ స్పిరిట్ ను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎండీ అన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి ఒక టీమ్ గా సమైక్య భావంతో పనిచేయాలని, ఉద్యోగుల ఆరోగ్యం సంస్థ తరఫున మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎండీ తెలిపారు. సీఎండీ స్వయంగా క్రీడల్లో పాల్గొనడం ఉద్యోగులు, క్రీడాకారుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, క్రీడాకారులు సీఎండీతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అంతకుముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా వీడబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, మొదట్లో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాత్రమే రేసులో ఉన్నాయనే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏకంగా 5 ఐపీఎల్ జట్లు హార్దిక్‌ను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద వ్యూహాలనే రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్‌లు తమ స్టార్ ప్లేయర్లను ఇచ్చి అయినా హార్దిక్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి అక్షర్ పటేల్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చే ప్రతిపాదన తెచ్చే అవకాశముంది. గత కొన్నేళ్లుగా ముంబై వద్ద స్ట్రాంగ్ స్పిన్ ఆల్ రౌండర్ లేకపోవడం, అక్షర్‌కు లీడర్షిప్ స్కిల్స్ ఉండటం దీనికి కలిసివచ్చే అంశం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ పవర్ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను ముంబైకి పంపి, హార్దిక్‌ను తెచ్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ, అతను బౌలింగ్ తక్కువగా చేస్తుండటంతో LSG హార్దిక్ కోసం ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన హెడ్ కోచ్ పదవిని భర్తీ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ట్రేడ్ కుదిరితే హార్దిక్ కోసం శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రే లేదా డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఇద్దరు ఆటగాళ్లను చెన్నై వదులుకోవాల్సి రావచ్చు. అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత యాషెస్ సిరీస్ ఉన్నందున

హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఓ ఉద్యోగి, అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో డిపోలో విషాదఛాయలు అలముకున్నాయి.వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ (39), ఓ ఆర్టీసీ బస్సు బ్రేకుల్లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు వెళ్లారు. ఆయన బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న విషయాన్ని గమనించని డ్రైవర్, ఒక్కసారిగా బస్సును ముందుకు కదిపారు. దీంతో సంతోష్ కుమార్ బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తోటి ఉద్యోగి ఆకస్మిక మరణంతో డిపో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, దానితో పాటు అదృష్టం, సరైన సమయం కూడా కలిసి రావాలి. ఈ రెండింటిలో ఏది తగ్గినా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం చాలా కష్టం. ముఖ్యంగా కథానాయికల విషయంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కానీ కొందరు మాత్రం విజయం దక్కే వరకు ఓపికగా కష్టపడుతూనే ఉంటారు. ఒకసారి సరైన హిట్ పడితే, ఇక వెనుతిరిగి చూసుకోకుండా దూసుకెళ్తుంటారు. ప్రస్తుతం సరిగ్గా ఇదే తరహా క్రేజీ ఫేజ్‌ను అనుభవిస్తోంది అందాల భామ వామికా గబ్బి (Wamiqa Gabbi) బాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘జబ్ వుయ్ మెట్’ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత తెలుగులో ‘భలే మంచి రోజు’ (Bhale Manchi roju) సినిమాతో మన ప్రేక్షకులను అలరించింది. అనంతరం ‘మాలై నేరత్తు మాయకమ్’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆయా సినిమాల్లో ఆమె నటనకు, పర్ఫార్మెన్స్కు మంచి మార్కులే పడినా, కొత్త అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో తలుపు తట్టలేదు. కెరీర్లో ఎన్ని నంబర్స్ సాధించినా, ఎన్ని సినిమాలు చేసినా రావాల్సిన గుర్తింపు రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. అయితే అవకాశాలు తగ్గిన సమయంలో కూడా ఈ భామ అధైర్యపడలేదు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ముందుకు సాగింది. సినిమా అవకాశాల్లో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వామిక బాగా సద్వినియోగం చేసుకుంది. వరుస వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనలోని వైవిధ్యాన్ని నిరూపించుకుంది. అలా ప్రతి అడుగులోనూ నటనను మరింత పదును పెట్టుకుంటూ సరైన సమయం

రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమరావతి, ఆగస్టు 10: రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా.. 24 ఏళ్ల చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. అఫిఫా మృతి తీవ్రంగా కలిచివేసింది: హోం మంత్రి అనిత విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతిపై హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. 24 ఏళ్ల వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. అఫిఫా మృతి తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. విషాద సమయంలో అఫిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు. అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని హోం మంత్రి అనిత ప్రార్థించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అఫిఫా భౌతికకాయానికి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివాళులర్పించారు. అజిత్ సింగ్ నగర్‌కు చేరుకున్న డీజీపీ, సీపీ.. అఫిఫాకు నివాళులర్పించి, షరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. నిన్న(ఆదివారం) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల బీచ్‌కు బయలుదేరిన అఫిఫా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో జాతీయ