
బంగారంప్రియులకు, ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. లలితాజ్యువెలరీ భారీ ఐపీఓ.. కనీస పెట్టుబడి ఎంతో తెలుసా
లలితా జ్యువెలరీ ఐపీఓ ప్రారంభం. రూ. 1,700 కోట్ల ఇష్యూ. ప్రతి షేరు రూ. 190. Lalithaa Jewellery IPO: దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ‘లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్’ (Lalithaa Jewellery IPO) తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు సన్నాహాలు పూర్తి చేసుకుంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ప్రతి ఈక్విటీ షేరు ముఖ విలువ రూ. 5 గా నిర్ణయించగా, ప్రైస్ బాండ్‌ను రూ. 190 నుండి రూ. 201 గా ఖరారు చేశారు. ఈ ఐపీఓ వివరాలతో కూడిన రెడ్ హెర్రింగ్ ప్రోస్పెక్టస్ (RHP) పత్రాలను కంపెనీ ఇప్పటికే చెన్నై ఆర్ఓసీ వద్ద సమర్పించింది. Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణవార్తలపై వీడిన సస్పెన్స్.. పాక్ ఆర్మీ సంచలన ప్రకటన ఐపీఓ కీలక తేదీలు, బిడ్డింగ్ వివరాలు: ఈ ఐపీఓ 2026, ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. మొత్తం రూ. 1,700 కోట్ల ఇష్యూలో రూ. 1,200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లు ఉండగా, ప్రమోటర్ ఎం. కిరణ్ కుమార్ జైన్ ద్వారా రూ. 500 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్ల లాట్ పరిమాణానికి బిడ్ వేయాల్సి ఉంటుంది. అంటే కనీస ధర రూ. 190 లెక్కన రూ. 14,060, గరిష్ఠ ధర రూ. 201 వద్ద రూ. 14,874 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ విస్తరణ, ఆర్థిక ప్రగతి: దక్షిణ భారతంలోని 51 నగరాల్లో 61 షోరూమ్‌లతో విస్తరించిన లలితా జ్యువెలరీ, టైర్-II, టైర్-III నగరాలపైనే ప్రధాన దృష్టి సారించింది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులతో కొత్తగా 10 షోరూమ్‌లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్రిసిల్ నివేదిక ప్రకారం, FY26 లో ఒక్కో స్టోర్‌కు