
సీపీఎస్ రద్దుకు నేడు ఛలో హైదరాబాద్..వేలాది మంది ఉద్యోగులతో పీఆర్టీయూ మహాధర్నా
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PRTUTS: పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారం కోరుతూ.. నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం, ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర సంఘం వెల్లడించింది. 50వేల మందితో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా..ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల్లో సెంటీమీటర్ కదలిక కూడా లేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 3 డీఏలు పెండింగ్ లో ఉంటేనే గగ్గోలో పెట్టారని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 6 డీఏలు పెండింగ్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ సమయంలో బకాయి బిల్లులు రూ.4,000 కోట్లుగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి రూ.16,000 కోట్లకు చేరాయని అన్నారు. 4 నెలలుగా ఈహెచ్ఎస్ నిధులు కోత విధించినప్పటికీ, ఏ ఆసుపత్రిలోనూ హెల్త్ కార్డులు ఇప్పటికీ చెల్లడం లేదని ఆయన ఆరోపించారు. మేనిఫెస్టోలోని హామీలను, వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు నిరసనగా మంగళవారం ఇందిరా పార్కులో "చలో హైదరాబాద్" అనే భారీ నిరసన చేపట్టనున్నట్లు పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కులు, భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యంతో, పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నేడు హైదరాబాద్లోని ఇందిరా పార్కులో భారీ నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని