
ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్ లో బీఆర్ ఎస్ నిరసనర్యాలీ
Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. నల్లగొండ, సెప్టెంబర్ 2: జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు(గురువారం) మహాధర్నాకు సిద్ధమయ్యారు. రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ప్రధాన ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే రేపు మిర్యాలగూడలో మాజీ మంత్రి ధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది. పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు..1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. గత పదేళ్ల వైఫల్యాలపై ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తూ పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. కేటీఆర్ పర్యటన వేళ ఫ్లెక్సీల ఏర్పాటుతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో ఉద్రిక్తత సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తకు సంబంధించిన

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అద్భుతం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, ఆగస్టు18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అద్భుతం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమరవీరుల స్తూపానికి ఉన్న ప్రాధాన్యతే పాపన్న విగ్రహానికి ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2029లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరిగితే 117 సీట్లతో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం అయితే.. ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయితే.. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యారని.. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని సోదాహరణంగా వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యమకారులకు కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులిచ్చామని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఎర్రబెల్లి, వినోద్‌రావుకు పదవులిచ్చారని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ సీఎం అయితే.. వారి కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌజ్‌లు వచ్చాయని ఎద్దేవా చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని వివరించారు. దిశ బాగుంటుందని కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని తెలిపారు. కానీ

వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతం చరిత్ర, ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్, ఆగస్టు 17: వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వందేమాతరం చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గీతం వందేమాతరమని, ఈ గీతాన్ని విని అప్పట్లో బ్రిటీష్ వారు భయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి కాంగ్రెస్ వణుకుతోందని విమర్శించారు. దేశం మారితే సరిపోదని.. దేశ విలువలు, సంస్కృతి, వేల ఏళ్ల చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నీట్ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేసి విచారణ జరిపారని, మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించారని బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల్లో విపక్షాలు విషబీజాలు నాటుతున్నాయని ఆరోపించారు. విపక్షాల మాటల్లోని అంతరార్థాన్ని యువత అర్థం చేసుకోవాలని, వాస్తవాలను గ్రహించకపోతే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం పంచుకున్నాయని, ఇప్పుడు కూడా లోపాయికారీ ఒప్పందం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ అవినీతి కేసులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయాయని, తెలంగాణలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని.. యువతకిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. ఉద్యోగావకాశాల కోసం వచ్చినవారిపై లాఠీచార్జీయా? హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని, ప్రతి నెలా నిరుద్యోగ భృతితో పాటు యువతకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెప్పింది. కానీ రెండేళ్లు గడిచినా నేటికీ తెలంగాణ యువత ఉద్యోగాల కోసం రోడ్లపైనే నిరీక్షించాల్సి రావడం శోచనీయ’మని ఆయన పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో యువత కోసం మొసలి కన్నీరు కారుస్తుంది.. తెలంగాణలో మాత్రం ఉపాధి కోసం వచ్చిన అమాయక నిరుద్యోగ యువతపైకి పోలీసులను ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ చెప్పే ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటే ఇదేనా?’ అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం రూ.4,000 నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదని, యువత స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఆర్నెలల్లోనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాల హామీలు కాంగ్రెస్ మార్క్ మోసానికి నిదర్శనంగా మిగిలిపోయాయన్నారు. ‘హైడ్రాలో కేవలం 150 ఉద్యోగ ఖాళీల ప్రకటన రాగానే వేలాది మంది నిరుద్యోగులు సరూర్ నగర్ స్టేడియానికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం కేవలం అభ్యర్థుల సమూహం కాదు.. ఉపాధి దొరక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ యువత అనుభవిస్తున్న నైరాశ్యానికి, ఆవేదనకు అది సజీవ సాక్ష్యం. తమ భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే అమాయక