
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Bomb Threats Target Gujarat | ఒకేరోజు అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్లతో సోదాలు

Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు

రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్‌జీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.ఖగంతక్-243 ప్రత్యేకతలునాగ్పూర్కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్‌హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్‌లో దీనిని పరీక్షించారు.ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్‌కు

Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లే ధర్మాసనం 44 పేజీల తీర్పును వెలువరించింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు కోర్టు అప్పగించింది. 2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్‌లో ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా సాలియన్ కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తరువాత వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దిశా సాలియన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దిశా సాలియన్ మృతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

Disha Salian Death Case:దిశా సాలియన్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ముంబై పోలీసులు సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా రాజా భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, అలాగే దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఒక వ్యక్తిపై ఆరోపణలు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లభించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ దర్యాప్తులో ఎలాంటి నేరం జరగలేదని తేలితే, సీబీఐ సంబంధిత కోర్టులో తగిన నివేదిక సమర్పించవచ్చని తెలిపింది. దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ భవనం 12వ అంతస్తు నుంచి కిందపడిపోయి మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ ఈ వివరణపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన నిజాలను కొందరు ప్రభావశీల వ్యక్తులను కాపాడేందుకు దాచిపెట్టారని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన

బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌ల ధరలను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కేవలం రూ.10గా నిర్ణయించారు. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం నాణ్యతతో పాటు తక్కువ ధరలో ఉత్పత్తులను అందించాలనే రిలయన్స్ వ్యూహంలో భాగంగానే ఈ బ్రాండ్‌ను రూపొందించారు. బాంబే క్రీమరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిజమైన డెయిరీ క్రీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు RCPL తెలిపింది. ఐస్‌క్రీమ్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అసలైన పాల పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. RCPL డైరెక్టర్ టీ. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. డెయిరీ ఉత్పత్తుల్లో షార్ట్‌కట్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈ బ్రాండ్‌ను రూపొందించామని చెప్పారు. ప్రతి భారతీయ కుటుంబం కొనుగోలు చేయగల ధరలో అసలైన ఐస్‌క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు సిద్ధం చేసింది. రిలయన్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భారీ రిటైల్ వ్యవస్థ ఉంది. దీంతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను వేగంగా వినియోగదారులకు చేరవేయడం కంపెనీకి సులభం కానుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే ఆహారం, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ వినియోగ ఉత్పత్తుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంపా ద్వారా డ్రింక్స్ మార్కెట్లో రిలయన్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా వంట నూనెలు, పిండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే పప్పులు, బియ్యం, నూడుల్స్, సాస్‌లు, బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ కేర్, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తులు వంటి అనేక విభాగాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా FMCG రంగంలో రిలయన్స్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. భారత

దేశంలో మద్యం ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఓల్డ్ మాంక్ (Old Monk). దశాబ్దాలుగా లిక్కర్ మార్కెట్ లో తన మార్కును చాటుకుంటున్న ఈ బ్రాండ్ లేబుల్‌పై త్వరలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. బాటిల్‌పై దర్జాగా కనిపించే 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్ అనే ట్యాగ్‌లైన్‌ను తీసివేయడానికి దీని తయారీ సంస్థ మోహన్ మీకిన్ అంగీకరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఈ ప్రకటన ఉందంటూ బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ దిగొచ్చింది.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ - FSSAI లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాటిల్లో ఉన్న మద్యంలో అసలైన రమ్ స్పిరిట్ కేవలం 2 నుంచి 5 శాతం మాత్రమే ఉంచి, మిగిలినదంతా సాధారణ స్పిరిట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు 7 ఏళ్ల నిల్వ అని ఎలా రాస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 7 ఏళ్లు అంటే ఏడేళ్లే ఉండాలి.. అంతేకానీ ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోనే ఫస్ట్ టైమ్.. లిక్కర్ రేట్లు తగ్గింపుబూతద్దం పెట్టి చూసినా కనపడని అక్షరాలు!కేవలం వయసు అని రాసిన ముద్రణ మాత్రమే కాకుండా.. రుచి, సువాసన కోసం కలిపే ఫ్లేవర్ల వివరాలను బాటిల్‌పై చాలా చిన్న అక్షరాలతో ముద్రించడంపై కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. నేను బూతద్దం పెట్టి మరీ బాటిల్ మూలమూలలా వెతికినా ఆ ఫ్లేవర్ల వివరాలు నాకు కనిపించలేదు అని పేర్కొన్నారు. దీంతో నాణ్యత, ముద్రణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం- కొత్తగా 121 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ, ధరలు..!!మహారాష్ట్రలో అమ్మకాలపై నిషేధం!ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ బ్రాండ్ పరిధిలోని కొన్ని వేరియంట్ల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. దీనిపై ఊరట నివ్వాలని కంపెనీ కోరగా, బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇరువైపులా ఉన్న

ఇరాన్‌కు చెందిన కీలక జలమార్గాలపై అమెరికా ఇప్పటికే గణనీయమైన నియంత్రణ సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. త్వరలో పూర్తి నియంత్రణ తమ చేతికి వస్తుందని అన్నారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు.మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ జలమార్గాల గురించి మాట్లాడుతున్నారన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇరాన్‌పై సైనిక చర్యల కారణంగా అమెరికన్లకు పెట్రోల్, ఇంధన ధరలు కొంత పెరగవచ్చని కూడా అంగీకరించారు. అయినా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు.ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం తీవ్రంగా బలహీనపడ్డాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి కీలక నాయకులు కూడా లేకపోవడంతో చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడం కష్టంగా మారిందన్నారు.ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీ సామర్థ్యం భారీగా దెబ్బతిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.ఇరాన్ అణ్వాయుధం తయారుచేసే దశకు కేవలం రెండు వారాల దూరంలో ఉందని తమకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై బీ-2 బాంబర్లతో దాడి చేశామని తెలిపారు. ప్రతి బాంబు లక్ష్యాన్ని ఛేదించిందని పేర్కొన్నారు.ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు భారీ ముప్పు ఉండేదని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ భద్రతలో తన పాత్ర కీలకమని కూడా వ్యాఖ్యానించారు

హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది. దాంట్లో ప్రయాణించాల్సిన సురేష్.. విమానం ఎక్కి కూర్చున్నాక తన బ్యాగులో బాంబు ఉందని అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని మరోసారి ప్రశ్నించగా... తనకు వేరేవారు చెప్పారని సమాధానమిచ్చాడు. దీంతో తనిఖీలు ప్రారంభించారు. విమానంలోని అందరినీ దించేసి లగేజీలను పరిశీలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నారు. సాయంత్రం 5.25కు బయల్దేరాల్సిన విమానం రాత్రి 7.20కు టేకాఫ్ తీసుకుంది. సురేష్‌ను విమానాశ్రయ పోలీస్‌లు అదుపులోకి తీసుకుని, ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్–951 విమానం మంగళవారం రాత్రి 7.15కు శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. కొద్ది క్షణాల ముందు పైలట్లు సాంకేతిక సమస్య గుర్తించడంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్‌ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాత్రి 10కి బయల్దేరింది. కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు) అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ? ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్ అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్

భారత కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ 108 ఏళ్ల చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) తొలిసారిగా వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన ఈ సమావేశానికి అవసరమైన 'కోరం' లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామం కార్పొరేట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.టాటా సన్స్ నిబంధనల ప్రకారం, సంస్థలో సుమారు 51.5 శాతం మెజారిటీ వాటా కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు సంయుక్తంగా ఒక అధీకృత ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సమావేశానికి అవసరమైన కోరం పూర్తవుతుంది. అయితే, సర్ రతన్ టాటా ట్రస్ట్ కార్యకలాపాలు, ప్రధాన నిర్ణయాలపై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆంక్షలు విధించడంతో, ఉమ్మడి ప్రతినిధిని నామినేట్ చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా కోరం కొరత ఏర్పడి సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం 'బాంబే హౌస్'లో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, బోర్డు సభ్యులు సౌరభ్ అగర్వాల్, అనితా మరొంగోలీ జార్జ్ ప్రత్యక్షంగా హాజరుకాగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, హరీశ్ మన్వానీ, వేణు శ్రీనివాసన్, మెహ్లీ మిస్త్రీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ సహా ఇతర కీలక అంశాలకు ఈ ఏజీఎంలో ఆమోదం తెలపాల్సి ఉంది. 2027 ఫిబ్రవరి తర్వాత తాను పదవిలో కొనసాగబోనని చంద్రశేఖరన్ ఇప్పటికే సంకేతాలిచ్చిన

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందంటూ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 'మిరే అసెట్ మేనేజ్ మెంట్ మేనేజర్స్' సీఈవో స్వరూప్ మొహంతి హెచ్చరించారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం వల్ల దేశంలో 'రిటైర్మెంట్ టైమ్ బాంబ్' పేలే పరిస్థితి కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో సరైన ఆర్థిక భద్రత లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు కోలుకోలేని దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు చేసే అతిపెద్ద పొరపాటు తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడమేనని స్వరూప్ మొహంతి స్పష్టం చేశారు. మారుతున్న కాలంతో పాటు మానవ ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా విశ్రాంతి నిధిని సమకూర్చుకోవడంలో ప్రజలు తీవ్రంగా వెనుకబడుతున్నారని వివరించారు. వయసు పెరిగే కొద్దీ ఆకస్మికంగా వచ్చే వైద్య ఖర్చులు, జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఒక్కసారిగా కరిగించేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి కేవలం సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చేయడం లేదా షేర్ మార్కెట్లపై మాత్రమే ఆధారపడటం సరిపోదని ఆయన సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవనశైలి ఖర్చులను తట్టుకోవాలంటే చిన్న వయస్సు నుంచే మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి విభిన్న సాధనాల్లో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. సరైన ప్లానింగ్ లేకపోతే రిటైర్మెంట్ జీవితం భారంగా మారుతుందని హెచ్చరించారు

మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్‌ను పునరుద్ధరించడంలో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షాపు మూసి ఉండటంతో జరిగిన నష్టానికి గాను వారికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారులు ఇటీవల పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పరిశుభ్రతకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. ఆ తరువాత షాపు వారు జులై 9న ఎఫ్‌డీఏ అధికారులను మరోసారి తనిఖీ చేయాలని కోరారు. నిబంధనలన్నిటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఎఫ్‌డీఏ అధికారులు మరోసారి తనిఖీ నిర్వహించారు. షాపు వారు నిబంధనల అమలు విషయంలో 98 శాతం పక్కాగా ఉన్నట్టు తేల్చారు. 36 మార్కులకు గాను 35 ఇచ్చారు. అయితే, మునుపు రద్దు చేసిన లైసెన్స్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో, షాపు వారు హైకోర్టును ఆశ్రయించారు. 34 రోజులుగా షాపు మూసి ఉండటంతో రూ.8.74 లక్షల నష్టం వచ్చిందని చెప్పారు. కస్టమర్లకు ఎలాంటి అనారోగ్యం కలిగిందనే విషయాన్ని లైసెన్స్ రద్దు ఆదేశాల్లో అధికారులు పేర్కొనలేదని అన్నారు. అయితే, షాపు యజమాన్యం అభ్యర్థనను పరిశీలించామని, నిర్ణయాన్ని ఆగస్టు 11కు వాయిదా వేశామని ఎఫ్‌డీఏ తరఫు లాయర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్‌డీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఏ తీరు వింతగా ఉందని అభిప్రాయపడింది. కల్తీని కట్టడి చేయాలన్న ఎఫ్‌డీఏ తీరు అభినందనీయమే అయినా డిపార్ట్మెంట్ అతి చేస్తోందని కోర్టు అభిప్రాయపడింది. 98 శాతం కంప్లెయన్స్ ఉన్నప్పుడు వెంటనే లైసెన్స్‌ను పునరుద్ధరించి ఉండాల్సిందని

దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు తీవ్ర కలకలం రేగింది. ఆగస్టు 14న ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. "Blast Delhi High Court@2:11 PM" అనే సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ ఇమెయిల్‌లో ఖలిస్తాన్ పేరు ప్రస్తావనకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందడి ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపు వార్త రాజధాని వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ బెదిరింపుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3, జామ్‌నగర్ హౌస్, ఝండేవాలన్, సాకేత్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీస్ వంటి ప్రాంతాలకు కూడా ఇమెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఫైర్ సర్వీసెస్ రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులతో మాట్లాడి ప్రాంగణమంతా సమగ్ర తనిఖీలు చేయించారు. సదరు ఇమెయిల్‌లో ఆగస్టు 15న హైకోర్టులో 2:11 గంటలకు, జిల్లా కోర్టుల్లో 3:11 గంటలకు పేలుళ్లు జరుగుతాయని బెదిరించారు. ఎర్రకోట, ఢిల్లీ మెట్రో, అంబాలా నుంచి వచ్చే రైళ్లు కూడా తమ లక్ష్యాలని అందులో పేర్కొన్నారు. 1984 సంఘటనలు, కోర్టుల్లో సిక్కులపై కేసులను ప్రస్తావిస్తూ బాబర్ ఖల్సా కెనడా పేరుతో ఈ మెయిల్ వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో భద్రతా దళాలు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి నిమిషనిమిషానికి పరిస్థితిని సమీక్షించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కునాల్ మల్హోత్రా పరిస్థితులపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అయినా, బాంబు స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఫలితంగా ఇది కేవలం ఒక నకిలీ బెదిరింపుగా తేలిపోవడంతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని

ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం హైకోర్టు, ఎయిర్‌పోర్ట్‌లో విస్తృత తనిఖీలు నకిలీ మెయిల్‌గా తేల్చిన పోలీసులు Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వసిద్ధమవుతున్న వేళ బాంబు బెదిరింపులు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్-3తో పాటు సాకేత్, జండేవాలాన్, జామ్‌నగర్ హౌస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎమ్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. Land Pooling Case: సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు డిస్మిస్ ఇ-మెయిల్ ద్వారా బెదిరింపు, రంగంలోకి భద్రతా దళాలు: ఢిల్లీ హైకోర్టుకు ఇ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు రాగా, మధ్యాహ్నం 2:11 గంటలకు పేలుడు జరుగుతుందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిరోధక బృందాలు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. విమానాశ్రయం, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఫైర్ సిబ్బంది, పోలీసులు అణువణువూ గాలించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిరంతరం పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు. తేలిన నకిలీ బెదిరింపులు, యథాతథంగా విధులు: ఈ విస్తృత సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు(Delhi Bomb Threat) పదార్థాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇవన్నీ కేవలం నకిలీ (హోక్స్) బెదిరింపులుగానే ప్రాథమికంగా నిర్ధారించారు. భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ కోర్టు కార్యకలాపాలు యథాతథంగా సాగాయి. ప్రస్తుతం రాజధానిలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, పోలీసులు వెల్లడించారు

దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముంగిట తీవ్ర కలకలం రేగింది. వేడుకలకు ఒక్క రోజు ముందే ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు రావడం భద్రతా దళాలను తీవ్ర అప్రమత్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు విమానాశ్రయ అధికారులకు వచ్చిన ఈ బెదిరింపు లేఖలతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు వెంటనే రంగంలోకి దిగాయి. హైకోర్టు ఆవరణ, విమానాశ్రయ ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ సోదాలు చేపట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే రాజధాని వ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయగా, ఈ బెదిరింపులతో సున్నితమైన ప్రభుత్వ భవనాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తనిఖీలను తీవ్రతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన పేలుడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ ‘అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధికారికంగా పేర్కొంది. ఆగస్టు 10న విడుదలైన యూఎన్ఎస్సీ విశ్లేషణాత్మక సహాయ, ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.2025 నవంబర్ 10న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారును ఉమర్-ఎ-నబీ నడిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దాడిని తొలుత పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) అని అయి ఉంటుందని అనుమానించారు. ఓ సభ్య దేశం కూడా వరుస దాడులతో పాటు రెడ్‌ఫోర్ట్ పేలుడికి జేఈఎం కారణమని పేర్కొన్నట్లు యూఎన్ఎస్సీ నివేదిక తెలిపింది. తాజాగా ఏక్యూఐఎస్‌కు అధికారికంగా ఆపాదించడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.2014లో ఏర్పాటైన ఏక్యూఐఎస్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అల్‌ఖైదా కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పడిన ప్రాంతీయ అనుబంధ సంస్థ. పెద్ద ముఠాల కంటే చిన్న చిన్న చెదురుమదురు సెల్‌లుగా పనిచేస్తూ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకుంటోందని యూఎన్ఎస్సీ నివేదిక పేర్కొంది.అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థల సామర్థ్యాలపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రసాయన, జీవ ఆయుధాలపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటిని తయారు చేయడంలో సాంకేతిక సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపింది

వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మేజర్ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కోర్టు సమర్థించింది.నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయసులో ట్యూషన్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తన కుమార్తెను ఆ యువకుడు అక్రమంగా నిర్బంధించాడంటూ తల్లి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా కోర్టు నేరుగా ఆ యువతితో మాట్లాడింది. తాను తన ఇష్టప్రకారమే ఆ యువకుడితో కలిసి ఉంటున్నానని, అతనితోనే జీవించాలనుకుంటున్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె మేజర్ అని నిర్ధారించుకున్న న్యాయస్థానం, ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. అక్రమ నిర్బంధం రుజువు కాని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని స్పష్టం చేస్తూ తల్లి పిటిషన్‌ను నాగ్‌పూర్ ధర్మాసనం కొట్టివేసింది

తన ఫొటోలు, వీడియోలను ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారంటూ శ్రుతిహాసన్ కోర్టును ఆశ్రయించారు. కృత్రిమ మేధ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రముఖ నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇమేజ్ను ఉపయోగించి వ్యాపార ప్రయోజనాల కోసం నకిలీ ప్రకటనలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ముఖాన్ని ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు, వీడియోలు రూపొందించి ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారని శ్రుతిహాసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే పేరు, ఇమేజ్ను ఉపయోగించి పలు ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రకటనలు సైతం రూపొందిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సంబంధిత సంస్థల నుంచి రూ.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని శ్రుతిహాసన్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్న కంపెనీల పేర్ల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే తరహాలో తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సీనియర్ నటి టబు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే

నేడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెగా సిటీగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కీలకమైన వ్యాపార కేంద్రంగా దుబాయ్ వెలుగుగొందుతోంది. అయితే, సరిగ్గా 1947 స్వాతంత్ర్య సమయానికి ముందు చరిత్ర ఇంకో మలుపు తిరిగి ఉంటే... నేడు దుబాయ్ భారతదేశంలోనో లేదా పాకిస్తాన్లోనో ఒక భాగంగా ఉండేది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది ముమ్మాటికీ నిజమంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు శామ్ డాల్రింపుల్. ఆయన రాసిన ష్యాటర్డ్ ల్యాండ్స్ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఈ నిజాలు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.ఢిల్లీ కేంద్రంగా సాగిన అరబ్ పాలకుల పాలనఒకప్పుడు అరబ్ ప్రాంతాలు నేరుగా బ్రిటన్ రాజధాని లండన్ నుంచి కాకుండా, బ్రిటిష్ ఇండియా రాజధాని అయిన ఢిల్లీ నుంచే పాలించబడేవి. పర్షియన్ గల్ఫ్ పరిధిలోని అనేక అరబ్ సంస్థానాలు, రక్షణ ప్రాంతాలు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేసేవి. 1889 నాటి అప్పటి చట్టాల ప్రకారం కువైట్, అడెన్, అబుదాబి వంటి ప్రాంతాలను చట్టబద్ధంగా భారతదేశంలో భాగంగానే భావించేవారు. ఎంతలా అంటే, అబుదాబి పేరు భారత్‌లోని స్వదేశీ సంస్థానాల అధికారిక జాబితాలో ఉండేది. అలాగే అప్పట్లో అక్కడి ప్రజలకు ఇండియన్ ఎంపైర్ పాస్‌పోర్ట్‌లను సైతం జారీ చేసేవారు. రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో నెహ్రూ సర్కార్ వద్దన్నాక తీరిన ఆశలు1947లో భారత్, పాకిస్తాన్‌లు విడిపోతున్న తరుణంలో, బ్రిటీష్ అధికారుల ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడింది. భారత్ వీడి వెళ్తున్న దొరలు, పర్షియన్ గల్ఫ్ లోని ఈ అరబ్ ప్రాంతాల బాధ్యతను కాబోయే భారత ప్రభుత్వానికి లేదా పాకిస్తాన్‌కు అప్పగిద్దామని భావించారు. అయితే, ఆ సమయంలో ఢిల్లీలోని భారత అధికారులు, అప్పటి పాలకులు గల్ఫ్ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సముద్రం దాటి ఉన్న ఆ ప్రాంతాలను నిర్వహించడం భారత్‌కు పెద్దగా ప్రయోజనకరం కాదని భావించడంతో, ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు