
చికెన్ -65కి ఆ పేరెలా వచ్చింది? అసలు కథ ఇదే
చికెన్-65 అంటే తెలియని నాన్‌వెజ్ ప్రియులు ఉండరేమో. కరకరలాడే చికెన్, కారం మసాలా రుచితో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ వంటకం పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ‘65’ ఎందుకు వచ్చిందో తెలుసా?చికెన్-65ను 1965లో చెన్నైలోని బుహారీ హోటల్లో తొలిసారిగా తయారు చేసినట్లు చెబుతారు. హోటల్ వ్యవస్థాపకుడు ఏఎం బుహారీ ఈ వంటకాన్ని రూపొందించినట్లు సమాచారం. కస్టమర్ల కోసం స్నాక్‌గా తయారు చేసిన ఈ చికెన్ ముక్కలు త్వరగానే పాపులర్ అయ్యాయి. అప్పట్లో స్థానిక రుచికి తగ్గట్టుగా చికెన్‌ను మసాలాలు అద్ది కరకరలాడేలా వేయించేవారు.ఇక ఈ వంటకం పేరులోని ‘65’కు కారణం కూడా ఇదేనని చెబుతారు. 1965లో తయారైన వంటకం కావడంతో దానికి ‘చికెన్-65’ అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఈ వంటకం తయారీ విధానంలో మార్పులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో స్థానిక మసాలాలు, ఇతర పదార్థాలను జోడిస్తూ తమదైన శైలిలో చికెన్-65ను తయారు చేస్తున్నారు.అయితే ఈ పేరు రావడం వెనక ఇదే కారణమంటూ అనే వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. సరిగ్గా 65 రోజులు పెరిగిన కోళ్లతో తయారు చేస్తారనేది ఒక వాదన. అలాగే 65 ముక్కలు ఉంటాయని అందుకే చికెన్-65 అంటారనే ప్రచారమూ ఉంది. మరోవైపు కిలో చికెన్‌కు 65 మిరపకాయలు వాడతారని అందుకే ఆ పేరొచ్చిందనే వదంతీ వ్యాప్తిలో ఉంది. మరోవైపు సైనికులకు ఇచ్చే మెనూలో 65వ నంబర్లో ఈ చికెన్ ఉండేదని.. అందుకే చికెన్-65 అని పిలుస్తారని మరికొందరు చెబుతుంటారు. కానీ, ఇవన్నీ ఉత్తి వదంతులే. కేవలం 1965లో