
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla).. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ట్రాక్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. ‘ఆనందం’తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ లాంటి సినిమాలతో సాగింది. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో నవ్వుల పండగే అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయేవారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో చేసిన సరికొత్త ప్రయోగాలు, బ్రహ్మానందం లాంటి హాస్య నటులకు రాసిన విలక్షణ పాత్రలు వెండితెరపై నవ్వుల పూలు పూయించాయి. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక సరికొత్త ఫార్ములాను సెట్ చేసిన ఘనత ఆయనది. అయితే కాలక్రమంలో ఒకే తరహా ఫార్ములా రొటీన్ అవ్వడం, కథల్లో కొత్తదనం తగ్గడంతో ఆయనకు కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే.. తన మార్క్ వినోదంతో పాటు నేటి ట్రెండ్‌కు తగ్గ కథనంతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు శ్రీను వైట్ల. సరైన కథ కుదిరితే ఆయన కలం, కెమెరా ఎంతటి మ్యాజిక్ చేస్తాయో ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)తో సరికొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ప్రారంభించిన రోజే విడుదల తేదీని కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. "మా చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి హ్యాట్రిక్ విజయాలు సాధించిన చరిత్ర శర్వానంద్‌కు ఉంది. ఇప్పుడు 'జార్జ్ క్రిష్' చిత్రంతో ఆ సెంటిమెంట్‌ను కొనసాగించబోతున్నాడు" అని ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్‌కు గతంలో ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు సంక్రాంతి సీజన్లో మంచి విజయాలు అందించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఈ సినిమా కూడా పండుగ బరిలో నిలవనుంది.హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. తొలి షాట్‌కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఏటీవీ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ల జాబితాను ప్రకటించడం. సాధారణంగా

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. శర్వానంద్ (Sharwanand), శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఉదయం 9:45 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా మాజీమంత్రి తలసాని క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంతో సినిమాకు అధికారికంగా ఫస్ట్ క్లాప్ పడింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్టైన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) నిర్మిస్తుండగా ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్.. ఈ ప్రాజెక్ట్‌తో మరో కొత్త జోనర్లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. కాగా దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన మార్క్ కామెడీ, వన్‌లైనర్ పంచ్‌లతో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. శర్వానంద్‌కు ఉన్న క్లాస్ అండ్ మాస్ ఇమేజ్‌కు శ్రీను వైట్ల స్టైల్ కామెడీ జోడైతే థియేటర్లలో మంచి ఎంటర్టైన్మెంట్ అందుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, బైకర్ వంటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన శర్వానంద్ త్వరలోనే ముచ్చటగా మూడవ చిత్రం భోగి థియేటర్లలోకి రానుంది

చార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand) తన తర్వాతి సినిమాను సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu vaitlla)తో చేయనున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జార్జ్ కృష్ణ(George Krishna) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను ఆగస్టు 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం ఉన్న కథతో వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ టైమ్ మెషీన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాంటసీ అంశాలను కలిపి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర(Anil Sunkara) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను షూటింగ్ ప్రారంభానికి ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్(Anup Rubens) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. జార్జ్ కృష్ణ సినిమాను సంక్రాంతి 2027 బరిలోకి తీసుకురావాలనే టార్గెట్ తో చిత్రబృందం ముందుకు సాగుతోంది. రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం ప్రస్తుతం స్పెషల్ మేకోవర్‌పై పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శర్వానంద్ ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి(Bhogi) సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. శర్వానంద్ వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టులు సూచిస్తున్నాయి