Yes Essence: దేశీయ ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సరైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఈ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకంగా వారి జీవనశైలికి తగినట్లుగా, విలువైన రివార్డులు, ప్రత్యేక సౌకర్యాలను అందించేలా యెస్ ఎసెన్స్ (Yes Essence) పేరుతో క్రెడిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. నేటితరం ఉద్యోగిణులు, యువ వృత్తి నిపుణులు, డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే మహిళల ఆకాంక్షలు, వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించినట్లు వెల్లడించింది.యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు వెల్కమ్ ఆఫర్లు: యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ పొందిన వెంటనే ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, ఫిట్నెస్ బ్రాండ్లపై ప్రత్యేకమైన వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. హెల్త్ బెనిఫిట్స్: ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ (క్యాన్సర్ మార్కర్ స్క్రీనింగ్‌తో సహా) లభిస్తుంది. రోజువారీ ఖర్చులపైనా రివార్డులు: డైనింగ్, గ్రోసరీ, షాపింగ్, బ్యూటీ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్ పై అదనపు రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. వినోదం, కాంప్లిమెంటరీ సర్వీసెస్: బై వన్ గెట్ వన్ (Buy One Get One) సినిమా టికెట్లు, ప్రముఖ మాల్స్‌లోని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో కాంప్లిమెంటరీ కాఫీ సౌకర్యం లభిస్తాయి. బర్త్ డే స్పెషల్స్: పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. మైల్ స్టోన్ బోనస్: నిర్ణీత టార్గెట్ ఖర్చులపై ప్రతి సంవత్సరం 10 వేల వరకు యెస్ రివార్డ్స్ (YES Rewardz) పాయింట్లు పొందే అవకాశం ఉంది.'యెస్ బ్యాంకులో మా వినియోగదారుల మారుతున్న ఆశయాలను అర్థం చేసుకోవడంలోనే అర్థవంతమైన ఆవిష్కరణలు మొదలవుతాయని మేము నమ్ముతాము. ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ వారికి తగిన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాల అవసరం కూడా పెరుగుతోంది. నేటి మహిళల జీవనశైలికి అనుగుణంగా వారికి ప్రయోజనకరమైన, ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా మా 'YES Essence' క్రెడిట్ కార్డ్ రూపొందించాం. ' అని యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మర్చంట్ అక్వైరింగ్ కంట్రీ హెడ్ అనిల్ సింగ్ తెలిపారు.Read Also: Women's Day: మహిళలకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్, లాకర్.. ప్రత్యేక అకౌంట్ తెచ్చిన బ్యాంక్ముంబై కేంద్రంగా పని చేస్తున్న యెస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 300లకి పైగా జిల్లాల్లో 1300 కంటే ఎక్కువ బ్రాంచీలు, 1350 కి పైగా ఏటీఎంలు కలిగి ఉంది. గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్, అబుదాబిలో ప్రతినిధి కార్యాలయంతో అంతర్జాతీయ సేవలను విస్తరించింది. అంతే కాకుండా యెస్ సెక్యూరిటీస్, యెస్ ఫౌండేషన్ ద్వారా సామాజిక వికాసానికి తనవంతు పాత్ర పోషిస్తోంది.