
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Yash Fan Death: కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. తన అభిమానుల విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ విషాద ఘటనలో ఓ అభిమాని అంత్యక్రియలకు ఆయన హాజరు కాకపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై యశ్ స్పందించడంతో అసలు కారణం ఏమిటనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది.
2021లో యశ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చివరి కోరికగా తన అంత్యక్రియలకు యశ్, అప్పటి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య అంత్యక్రియలకు వెళ్లగా.. యశ్ మాత్రం అక్కడికి వెళ్లలేదు.
అభిమాని అంత్యక్రియలకు హీరో హాజరు కాకపోవడంతో అప్పట్లో యశ్‌పై కొందరు విమర్శలు చేశారు. తనను ఎంతో అభిమానించిన వ్యక్తి చివరి కోరికను కూడా ఆయన నెరవేర్చలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఈ నిర్ణయం వెనుక మరో కారణం ఉందని యశ్ తాజాగా వెల్లడించారు.
అభిమాని మరణం తనను తీవ్రంగా కలచివేసిందని యశ్ తెలిపారు. అయితే అభిమానాన్ని చాటుకునేందుకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకుంటే, తాను అతని అంత్యక్రియలకు వెళ్లడం సరైన సందేశాన్ని ఇవ్వదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను అక్కడికి వెళ్తే తన కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే మరికొందరికి అది ప్రోత్సాహంగా మారే ప్రమాదం ఉందని భావించినట్లు చెప్పారు.
అభిమానులు తనను కలవాలని లేదా తన కోసం ఏదైనా చేయాలని అనుకుంటే.. జీవితంలో ఏదైనా సాధించి తన ముందుకు రావాలని కోరుకుంటానని యశ్ పేర్కొన్నారు. కానీ ప్రాణాలను తీసుకోవడం వంటి చర్యలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించనని స్పష్టం చేశారు. ఆ సమయంలో తనకున్న బాధ్యతను దృష్టిలో పెట్టుకునే అంత్యక్రియలకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదలకు సిద్ధమవుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం మరో సినిమా విడుదల వాయిదా పడటంతో టాక్సిక్‌కు సోలో రిలీజ్ దక్కే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





