
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) వ్యాఖ్యానించారు. ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా యనమల మీడియాతో మాట్లాడారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
వైసీపీ హయాంలో ప్రజలను మభ్యపెట్టేందుకే 2019 డిసెంబర్లో ఓ జీవో (GO) జారీ చేశారని యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉందని తెలిసినప్పటికీ, అప్పుడు అధికారంలో ఉన్న అదే పార్టీ కోర్టుకెళ్లడమనేది హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
అలాంటి తీర్పు వచ్చిన తర్వాత కోర్టులో రివిజన్ లేదా రివ్యూ పిటిషన్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు దాఖలు చేయలేదు? అని యనమల ప్రశ్నించారు. జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అని నిలదీశారు. ఇది ఉద్దేశపూర్వకంగా బీసీలను మోసం చేయడమేనని విమర్శించారు. ముందుగా, బీసీల సంక్షేమంపై, తాను నిర్లక్ష్యం చేసినందుకు వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
Read Latest AP News And Telangana News And National News





