
Varun Tej Korean Kanakaraju Day 1 Box Office Collections Rs 18 Crore 1002244
Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’.
Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన ఓపెనింగ్ గణాంకాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్‌తో పాటు డే 1 కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లో ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది.
విడుదలకు ముందు నుంచే ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్‌తో పాటు వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేసిన వరుస ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రూపంలో మంచి స్పందన దక్కింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపించే కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవితాన్ని గడిపే కనకరాజు.. చైత్ర (రితిక నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడ స్థిరపడాలనేది చైత్ర కల. అయితే అనూహ్యంగా కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఆ ఆత్మ కారణంగా కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఆ ఆత్మ అతడిని వదిలి వెళ్లిందా? అనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి ఓపెనింగ్ అందుకున్న ‘కొరియన్ కనకరాజు’.. రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
