
ఇంటర్నెట్ డెస్క్: ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)తో హిట్ అందుకున్నారు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సినిమాల ఎంపిక, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అన్న రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనుందని వెల్లడించారు.
‘‘ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. గత 5 ఏళ్లుగా సరైన విజయం దక్కలేదు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం సంతోషంగా ఉంది. మొదటి నుంచి నేను ఒకే జానర్ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నా. ఒక నటుడు ఏ క్యారెక్టర్లోనైనా, ఏ జానర్లోనైనా ఇమడగలగాలి. కోవిడ్‌లో ఓటీటీ కంటెంట్ చాలా చూశాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలు చేయాలని అప్పుడే అర్థమైంది. వాళ్లు థియేటర్లో సినిమా చూసి, నవ్వుతూ.. ఒత్తిడి, టెన్షన్లు మర్చిపోవాలి. అదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
‘గని’ ఫెయిల్ అయ్యాక మళ్లీ స్పోర్ట్స్ డ్రామా ఎందుకు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘గని’లో అన్నీ కలిపి గందరగోళం చేశాం. ఈసారి ‘బరి’ చాలా రూటెడ్‌గా, హైపర్-ఫోకస్డ్గా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. నిహారిక గురించి మాట్లాడుతూ.. ‘మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ‘బరి’ (Bari) ఐడియా తనే ఇచ్చింది. నచ్చడంతో ఓకే చెప్పా. యంగ్, ప్యాషనేట్ టీమ్‌తో వర్క్ చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ సినిమాకు కూడా ఓకే చెప్పా. ఇది నా వయసుకి సూట్ అయ్యే లవ్ స్టోరీ. ఇతర ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది.
‘‘ చరణ్ అన్నయ్య పెద్ద స్టార్. ఆయన సినిమాలపై పెట్టే ఎఫర్ట్ చూసి నేను కూడా అలా అవ్వాలని అనుకుంటాను. ప్రతీ యాక్టర్‌కి పోలికలు ఉంటాయి. దాన్ని పాజిటీవ్‌గా తీసుకోవాలి. చరణ్ అన్నతో ఒక సినిమా చేయాలని ఉంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలనే వచ్చాను. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తా’’ అని వరుణ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వెంకటేశ్ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే





