
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్‌కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్‌కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్‌లకు విమాన సర్వీసులు నడపనున్నారు.
హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం రాక..
ఇక హైదరాబాద్ నుంచి భోగాపురానికి ఉదయం 6.45 నిమిషాలకు భోగాపురం రానుంది. అందులోని ప్రయాణికులకు జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు వారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పనున్నారు. ఆ తర్వాత భోగాపురం నుంచి ఫస్ట్ విమాన సర్వీసు 7.30 గంటలకు హైదరాబాద్‌కు బయలు దేరనుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, 8.20 డిల్లీకి, 8.50 హైదరాబాద్‌కు సర్వీసులు ఇక్కడ నుంచి బయలు దేరనున్నట్టు అధికారులు తెలిపారు.
2 వేలకు పైగా అన్నదాతలకు ఉచిత విమాన ప్రయాణం.. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి 2,200 మంది రైతులు తమ భూములను ఇచ్చారు. వారందరికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కమారు ఉచిత విమాన ప్రయాణం చేయిస్తామని హామి ఇచ్చింది. సోమవారం కొంత మంది రైతులను విమాన ప్రయాణం చేయించనున్నారు. మిగిలిన వారిని విడదల వారీగా తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు.
విశాఖలో నిలిచిపోనున్న కమర్షియల్ సర్వీసులు..
మరోవైపు విశాఖ పట్నంలోని విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బందికి వీడ్కోలు పలికారు. వారికి అక్కడ సిబ్బంది మిఠాయిలు పంచారు. అంతేకాదు అందులో పనిచేస్తున్న వారు విశాఖ నుంచి భోగాపురానికి ప్రత్యేకంగా మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అక్కడి సిబ్బంది కోరారు.
4 వేల 592 కోట్ల వ్యయం.. భోగాపురం విమానాశ్రయం 4వేల 592 కోట్ల వ్యయంతో తొలి దశను పూర్తి చేశారు. 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించారు. 2,203 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటుచేశారు. మరో 500 ఎకరాలను అదనంగా కేటాయించారు. ఒక్కో రన్ వేను 3.8 కి.మీ. పొడవుతో రెండు రన్వేలు నిర్మించారు. ప్రారంభ సమయంలో 60 లక్షలమంది ప్రయాణికులకు సేవలు అందించేవిధంగా చర్యలు చేపట్టారు. ఈసంఖ్య క్రమేణ నాలుగు కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు.
విశాఖ నుంచి భోగాపురానికి 4 వరుసల రహదారి..
భోగాపురం విమానాశ్రయానికి అనుగుణంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ఆకర్షణీయంగా నిలిచాయి. విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన 15 అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీ పెంచేపనులను విశాఖ మహా నగరపాలక సంస్థ బాధ్యతగా తీసుకుంది. 4 వరుసల రహదారులు ద్వారా భోగాపురం చేరుకునే విధంగా రోడ్డు మార్గం రూపుదిద్దుకుంది. విజయనగరం రింగ్‌రోడ్డు-అయినాడ జంక్షన్, దొరతోట, కాపులుప్పాడ, మద్దిలపాలెం, శొంఠ్యాం-అడవివరం, బోయపాలెం, షీలానగర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు కీలకంగా మారాయి. రూ.390 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. 15 అంతర్గత రోడ్లలో అత్యంత ప్రాధాన్యంగా గుర్తించిన 7 రహదారుల నిర్మాణం శరవేగంగా పూర్తిచేశారు. విశాఖపట్నం శివారు అగనంపూడి నుంచి కొమ్మాది వరకు 12 జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించడానికి అగనంపూడి-లంకెలపాలెం, విశాఖ స్టీల్ ప్లాంటు-BHEL, సత్యం జంక్షన్- హనుమంతువాక, మధురవాడ స్టేడియం-కొమ్మాది వరకు 4 ఎలివేటెడ్ కారిడార్లు కీలకంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.