
ఆదిలాబాద్ సాంస్కృతికం: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామాన్ని సందర్శించారు. పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు విజయ్ కేంద్రే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ రాము షిండే చిన్నమ్మ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అనంతరం గ్రామానికి చెందిన బలిరాం గిత్తే స్వర్గస్తులవగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
గుడిహత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






