
Sonal Dinusha Niroshan Dickwella Create Massive Test Record Vs India 2875990
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా..
Aug 17 2026 4:31 PM | Updated on Aug 17 2026 4:36 PM
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.
అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది.
స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు 1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు 2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు 3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు 4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు 5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు.
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
టీచర్ల సస్పెన్షన్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
అచ్చెన్నాయుడికి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన MLC అరుణ్ కుమార్
సాక్షాలతో నేను బయటపెడతా! వాళ్ళ వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారు...
మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
బెల్జియం లో మరణమృదంగం వేడికి చచ్చిపోతున్న జనాలు





