
© 2026 nimisham.in

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీరు మారలేదు. తెలుగు సినిమాపై మరోసారి తన అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
తెలుగు సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేస్తుంటే... ఉత్తరాది దర్శకులకు కంటగింపుగా ఉంది. ఏదోరకంగా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 'బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్.' వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. దాంతో ఏదో ఒంకను తెలుగు సినిమాను చులకన చేయడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగినప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ మల్లారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని గురించి చెబుతూ, భవిష్యత్తులో రణబీర్ కపూర్ సైతం హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలను మరీ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. సమయంకోసం వేచిచూసి, ఏదో రకంగా తెలుగు సినిమాను తగ్గించే పనికి వారు పూనుకుంటున్నారు.
తాజాగా గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోందని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, 'మరి దేవర, ఓజీ, రాజా సాబ్ చిత్రాల పరిస్థితి ఏమిటీ?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'ఊఫ్స్' అంటూ రియాక్షన్ ఇచ్చారు. అంటే పరోక్షంగా అయ్యో అంటూ తన సానుభూతిని ఈ చిత్రాలకు ఆయన తెలియచేశాడని భావించాలి. దీనిని తెలుగు సినిమా రంగంలోని వారు కాస్తంత సీరియస్ గా తీసుకుంటున్నారు. పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఇలా బాధ్యతను మార్చి స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా మీద వ్యతిరేక భావన పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఉత్తరాది వారే అని అంటున్నారు. గతంలో దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ ఉత్తరాదికి వెళ్ళి జయకేతనం ఎగరేశారు. అలానే ఉత్తరాది చిత్రాలను తెలుగులో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ కొంతకాలంగా దక్షిణాదిలో స్టార్ హీరోలు ఏ సినిమాలలో నటిస్తున్నారు? స్టార్ డైరెక్టర్స్ ఏ సినిమాలు చేస్తున్నారు? అనే కుతుహలాన్ని ఉత్తరాది వారు చూపిస్తున్నారు. అక్కడి స్టార్స్ కూడా దక్షిణాది చిత్రాలలో కీలక పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ ఏ భాషలో సినిమా తీసినా... అది ఇండియన్ ఫిల్మ్ అని అందరూ సగర్వంగా చెబుతుంటే... ఇలా కొన్ని పాత్రాల చిత్రాల పట్ల అసూయ నింపుకుని పరోక్ష విమర్శలు చేయడం సరికాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి సిద్దార్థ్ ఆనంద్ లాంటి వారికి ఎప్పుడు బుద్ధి వస్తుందో చూడాలి.
మ్యాడ్ కాంబో.. కార్తీక్ సుబ్బరాజ్‌తో వరుణ్ తేజ్!
రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష..
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.