
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Samantha: తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలో తన రోజువారీ అనుభవాలు, సరదా సంఘటనలను ప్రెగ్నెన్సీ డైరీస్ పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ఎదుర్కొన్న ఓ చిన్న సమస్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శరీర ఆకృతిలో మార్పుల కారణంగా గతంలో వేసుకున్న దుస్తులు సౌకర్యంగా ఉండకపోవచ్చు. సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెకేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన వార్డ్‌రోబ్‌లోని చాలా దుస్తులు ప్రస్తుతం తనకు సరిపోవడం లేదని ఆమె గుర్తించారు.
ఈ విషయాన్ని సరదాగా తీసుకున్న సమంత.. అద్దం ముందు తీసుకున్న మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన చాలా దుస్తులు ఇప్పుడు వేసుకోలేకపోవడంతో మొదట కాస్త బాధగా అనిపించిందని తెలిపారు. కొద్దిసేపు ఆందోళనకు గురైనప్పటికీ వెంటనే ఆ భావన నుంచి బయటపడి, ప్రస్తుతం సౌకర్యంగా ఉన్న రెండు జతల దుస్తులతోనే వెకేషన్‌ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న మార్పులను కూడా సమంత అభిమానులతో ఓపెన్‌గా పంచుకుంటున్నారు. దీంతో ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తల్లికాబోతున్న మహిళలు సమంత అనుభవాన్ని తమ అనుభవాలతో పోల్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
తన మాతృత్వ ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతున్న సమంత.. ప్రసవం, మాతృత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు పుస్తకాలు కూడా చదువుతున్నట్లు గతంలో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ కొత్త దశను ప్రశాంతంగా, ఆనందంగా ఆస్వాదించేందుకు ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కలిసి గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. వీరి అనుబంధం తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ కలిసి ప్రయాణం కొనసాగించారు. సమంత తన మాతృత్వ ప్రయాణానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడంతో ఆమె అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
బిడ్డ జననం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి మాతృత్వాన్ని ఆస్వాదించాలని సమంత భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాత్రం తన ప్రెగ్నెన్సీ జర్నీలోని ప్రతి చిన్న అనుభవాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





