
డిచ్‌పల్లి : కాంగ్రెస్ పార్టీ నిజమాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి తన సొంత ఖర్చుతో చేపట్టిన కాలువ పూడికతీత పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులాస్‌పూర్ నుంచి ముల్లంగి గ్రామం వరకు ఉన్న కాలువ పూర్తిగా పూడికతో నిండిపోయిందని దీంతో పూడిక తీత పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు. పూడికతీతతో వంద ఎకరాలకుపైగా పంటలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీనివాస్, ఎంపీపీ మాజీ అధ్యక్షుడు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





