
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన స్వయంభు (Swayambhu) సినిమాని చాలా మంది మర్చిపోయారు. ఈ ఏడాది మొదట్లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడింది. గత కొంతకాలంగా దీని గురించే డిస్కషన్ లేదు. మొదట్లో వచ్చిన బజ్ అంతా పోయింది.
ఇప్పుడు ఈ సినిమాకి సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు విడుదల తేదీని ప్రకటిద్దామంటే ఇతర సినిమాలతో పోటీ తప్పకపోవడమే.
ఈ సెప్టెంబర్ లో విడుదల చెయ్యలేరు. ఎందుకంటే పబ్లిసిటీ సరిపోదు. అక్టోబర్ లో జైలర్ 2, రణబాలి, ఆదర్శ కుటుంబం ఉన్నాయి. నవంబర్ మొదటి వారంలో రామాయణ ఉంది. డిసెంబర్ లో ప్రభాస్ సినిమా, బాలకృష్ణ సినిమా, నాగార్జున సినిమా లైనప్ లో ఉన్నాయి.
ఒకవేళ ప్రభాస్ సినిమా డిసెంబర్ 3న రాకపోతే, అప్పుడు ఆ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. నాగార్జున నటిస్తున్న కింగ్ 100 డిసెంబర్ 24 ఫిక్స్. ఇక అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’ రాకపోతే ఆ డేట్ సెట్ చేసుకోవచ్చు. ఇక మిగతా డేట్స్ ఏవీ సెట్ కావు. సంక్రాంతి స్లేట్ ఇప్పటికే నిండిపోయింది.
సో, ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోవడం పెద్ద సమస్య. దానికి తోడు, ఈ సినిమాపై మొదట్లో ఉన్న హైప్ పోయింది. మళ్ళీ కొత్తగా ప్రచారం చేసుకోవాలి. ఇలాంటి సినిమా ఉంది అని జనాలకు గుర్తు చెయ్యాలి.





