
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Nepal Floods update: నేపాల్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా....2,500 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వారిలో దాదాపు 500 మంది విదేశీయులున్నారు. ఈ వరదల్లో కొన్ని గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికార లెక్కల్లోని దాదాపు 25 వేల నుంచి 30 మంది చనిపోయినట్టు అనధికార సమాచారం. ముఖ్యంగా హిమాలయాల్లోని హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో చైనా-నేపాల్ సరిహద్దులో ఏర్పడిన సరస్సు కారణంగా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. దాని వల్ల బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ వరద ముప్పుపై చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా దిగువ ప్రాంత ప్రజలను నేపాల్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వరద హెచ్చరికల మెసేజ్‌లతో దిగువ ప్రాంత ప్రజల ఫోన్లు దద్దరిల్లాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి, నిలువనీడలేకుండా మిగిలిన వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఈ అలర్ట్స్ మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, త్రిశూలీ నదికి దాదాపు మూడు గంటల పాటు వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది.
త్రిశూైలి -3ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోయిన కార్మికులు,.. వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్‌హౌస్ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.
త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి ఆదివారం మరో వంతెన ఉదయం కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో గండకి గ్రామీణ మున్సిపాలిటీ ప్రజలు పృథ్వీ హైవేకి వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతోపాటే భోటే కోశీ నదిలో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటి వరకు ఆహార పదార్థాలతో కూడిన 37 ట్రక్కులు, ఆహారం, ఇతర సామగ్రితో నిండిన ఏడు హెలికాప్టర్లను పంపించారు. గాలింపు, సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులను పంపించింది. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం ఆదివారం భారత్ నుంచి నేపాల్‌కు చేరుకుంది.
నేపాల్‌లోని వరద ప్రభావిత త్రిశూలి వ్యాలీలో ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత కారణంగా ఏకంగా 1,643 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడి త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. హెచ్చరిక అందగానే రాజేంద్ర దవాడీ అప్రమత్తమయ్యాడు. వెంటనే బడిగంట కొట్టి విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని మిగతా టీచర్లకు హెచ్చరికలు జారీచేశాడు. స్కూల్ బస్సు డ్రైవర్లను అప్రమత్తంచేశాడు. బస్సుల్లో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్కూల్ వరద బురదలో మునిగింది. ఈ రోజు కొన్ని చోట్ల శవాలను గుర్తుపట్టేని విధంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా శవాల డీఎన్ఏ పక్కనపెట్టి.. వాటి ఫోటోలను తీసి సామూహిక ఖననం చేస్తున్నారు.
మంచు, రాళ్ల విస్పోటనమే ప్రళయానికి కారణం..
ఆరేళ్ల బాలిక శిథిలాల కింద మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేని ప్రాణాలతో బయటపడింది. వరదలవల్ల అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం వరదతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, శుక్రవారం ఓ చిన్నారి రోదన వినిపించింది. శిథిలాలను తొలగించి ఆ బాలికను వెంటనే బయటకు తీశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ సజీవంగా ఉండడంతో శుక్రవారమే హెలికాప్టర్లో కఠ్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. శనివారం ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. మొత్తంగా ఈ ప్రళయానికి కారణంగా మంచు, రాళ్ల విస్పోటనమే కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపం కానీ.. హిమనీ నదం కరిగి వరద రావడం కారణం కాదనీ తాజా అధ్యయనం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





