
© 2026 nimisham.in


Nandamuri Mokshagna : నందమూరి అభిమానులు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచుస్తున్నారు. అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు అని ఇన్నేళ్లు మీనమేషాలు లెక్కించారు. ఆ దర్శకుడితో సినిమా, ఈ దర్శకుడితో మోక్షజ్ఞ సినిమా అని అనేక రూమర్స్ వచ్చాయి. 32 ఏళ్ళు వచ్చిన మోక్షజ్ఞ అయితే తన సినీ ప్రయాణానికి కోచింగ్ లు తీసుకొని మరీ రెడీ అయ్యాడు.
మొదట మోక్షజ్ఞని బాలయ్య తనే లాంచ్ చేస్తాను అన్నారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 సీక్వెల్ తీసి అందులో మోక్షజ్ఞను హీరోగా పెడతాను అన్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నాను అని చెప్పారు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఇక హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ కూతురు తేజస్విని నిర్మాణంలో మోక్షజ్ఞ హీరోగా మొదటి సినిమా అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సింబా అనే టైటిల్ కూడా అనుకున్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.
Also See : Jabardasth Ram Prasad : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఆటో రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
అయితే ఏమైందో ఏమో కానీ ప్రశాంత్ వర్మకు,మోక్షజ్ఞ కు మధ్య విబేధాలు వచ్చాయని, బాలకృష్ణతో కూడా దర్శకుడికి సెటవ్వలేదని, ఆ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న మోక్షజ్ఞ పుట్టిన రోజు నాడు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా అని మళ్ళీ అధికారికంగా ప్రకటించారు. దీంతో మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేసేది దర్శకుడు వశిష్ఠ అని ఫిక్స్ అయ్యారు. అయితే దీనిపై కూడా సందేహాలు వస్తున్నాయి.
ఎందుకంటే దర్శకుడు వశిష్ఠ బింబిసారా లాంటి హిట్ సినిమా చేయడంతో చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు. దీంతో వశిష్ఠ విశ్వంభర సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా మొదలయి మూడేళ్లు పైనే అయింది. టీజర్ వచ్చి విమర్శల పాలైంది. గ్రాఫిక్స్ విషయంలో అవుట్ పుట్ అస్సలు బాగోలేదు అని మళ్ళీ రీ షూట్, రీ వర్క్ కూడా చేసారు. ఈ సినిమాకు వేరే దర్శకుడు కూడా పనిచేసాడు.. ఇలా విశ్వంభర సినిమా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారు. అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరూ చెప్పట్లేదు. మరి ఇలాంటి దర్శకుడికి బాలకృష్ణ పిలిచి తన కొడుకుని పరిచయం చేయమన్నాడు అంటే ఆలోచించాల్సిన విషయమే.
Also Read : Bigg Boss Telugu 10 Day 1 Promo : బిగ్ బాస్ డే 1 కొత్త ప్రోమో వచ్చేసింది.. ఆ పది పవర్స్ చుట్టే ఆట అంతా..
అయితే మోక్షజ్ఞని పరిచయం చేయడానికి బాలయ్య అడిగితే ఏ దర్శకుడైనా ఓకే అంటాడు. మరి బాలయ్య అడగట్లేదా? మోక్షజ్ఞతో సినిమా చేయడానికి దర్శకులు ముందుకు రావట్లేదా అనేది క్లారిటీ లేదు. కానీ బాలయ్యకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన బోయపాటి, బాలయ్య అభిమాని, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా మోక్షజ్ఞతో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. మరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో? ఇప్పుడు వసిష్ఠ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమా ఎప్పుడొస్తుందో? ఆ తర్వాత లైనప్ ఏ దర్శకులతో చేస్తాడో చూడాలి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.







