
© 2026 nimisham.in

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో మూడు గంటలకు పైగా బొమ్మ చూపించబోతున్నారు. పెరిగిన ఈ లెంత్పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మామూలుగా అయితే సినిమాలకి రెండున్నర గంటలు ఐడియల్ రన్ టైమ్ అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2.30 కాదు 3.30 గంటలు తీస్తామంటున్నారు. ఆ మధ్య పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3.44 హవర్స్ వచ్చింది.. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్లోనూ 3.24 గంటలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3.21 గంటల నిడివితో వచ్చింది. మామూలుగా మూడు గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి.. యాదృశ్చికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది పుష్ప 2, యానిమల్ మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్, కుబేరా కూడా. వీటి రన్ టైమ్ 3 గంటలకు పైగానే. గతేడాది లెంత్ మీద అన్ని అనుమానాలను పూర్తిగా తుడిచేసిన సినిమా రణ్వీర్ సింగ్ ధురంధర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 3.32 గంటల నిడివితో వచ్చి 1400 కోట్లు వసూలు చేసింది.. సెకండ్ పార్ట్ 3.49 గంటలతో వచ్చి ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల విజయాలు చూసాక.. సినిమాకు లెంతీ రన్ టైమ్ అనేది అస్సలు మ్యాటరే కాదని ఫిక్సైపోయారు మేకర్స్. తాజాగా టాక్సిక్ రన్ టైమ్‌పై చర్చ మొదలైంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 3.14 గంటలకుపై నిడివితో రాబోతుంది. పైగా A సర్టిఫికెట్ చిత్రమిది. ఆగస్ట్ 26న విడుదల కానున్న టాక్సిక్‌పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ట్రైలర్, విజువల్స్, సాంగ్స్.. ఇలా ప్రతీ ఒక్కటీ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చేసాయి. మొత్తానికి సినిమాలో మ్యాటర్ ఉంటే.. రన్ టైమ్ మ్యాటరే కాదనడానికి ఈ సినిమాలే నిదర్శనం. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3.44 గంటలు.. డైరెక్ట్ రిలీజ్లోనూ 3.24 గంటల రన్ టైమ్.. యానిమల్ రన్ టైమ్ 3.21 గంటలు.. 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన ట్రిపుల్ ఆర్, కుబేరా.. ధురంధర్ పార్ట్ 1 రన్ టైమ్ 3.32 గంటలు.. ధురంధర్ 2 రన్ టైమ్ 3.49 గంటలు.. 3.14 గంటలకు పైనే నిడివితో రానున్న టాక్సిక్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు!
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే..
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








