
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు.
పవర్ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్‌తో పాటను చాలా ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్‌తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్‌ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖుల మాటలు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది, ఒక డిఫరెంట్ రవితేజను థియేటర్లలో చూస్తారు" అని అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.."ఇది తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ఎమోషనల్ అనుభూతిని మిగుల్చుతుంది" అని వెల్లడించారు.
"అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్ ఇది. అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది." - నిర్మాత రవిశంకర్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. "రవితేజ కెరీర్లో ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ అందించాను. థియేటర్లలో ప్రేక్షకులు దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. తన భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనువిందు చేయనున్నారు. అలాగే సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలో పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిచగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





