
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Dhruv Vikram:అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ రిలేషన్షిప్, బ్రేకప్ గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ రెండేళ్ల రిలేషన్షిప్లో తాను మానసిక వేధింపులు, నియంత్రణను ఎదుర్కొన్నట్లు అనుపమ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ఆమె తన మాజీ ప్రియుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్షిప్ ధ్రువ్ విక్రమ్తోనేనా అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, చర్చలపై ధ్రువ్ విక్రమ్ స్పందించారు.
ఇటీవల ఓ రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న ధ్రువ్ విక్రమ్‌ను వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు తనను ఎంతవరకు ప్రభావితం చేశాయని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ఇలాంటి విషయాలు తనను అసలు ప్రభావితం చేయలేదని చెప్పడం నిజం కాదని తెలిపారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.
తాను ఎవరో, తన విలువలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని ధ్రువ్ అన్నారు. తనకు ముఖ్యమైన వ్యక్తులు, విషయాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెడతానని తెలిపారు. నిజం ఏమిటో తనకు తెలుసు కాబట్టి బయట నుంచి వచ్చే విమర్శలు ఒక స్థాయికి మించి తనను ప్రభావితం చేయలేవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రపంచాన్ని తాను కాపాడుకుంటూ, అంతర్గతంగా బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
మరోవైపు సోషల్ మీడియాలో తాను ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడానికి గల కారణాలపై కూడా ధ్రువ్ స్పందించారు. తనకు ఫొటోలు, వీడియోలు షూట్ చేయడం, వాటిని ఎడిట్ చేయడం ఇష్టమని చెప్పారు. తన తండ్రి, మేనకోడలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలను రూపొందిస్తానని, అయితే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయనని తెలిపారు.
సోషల్ మీడియా విషయంలో తనకు పెద్దగా ఆసక్తి లేదని, సినిమా ప్రమోషన్స్ సమయంలో మాత్రమే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటానని ధ్రువ్ వెల్లడించారు. మిగతా సమయంలో పుస్తకాలు చదవడం, సంగీతం వినడంలో గడుపుతానని చెప్పారు. తనకు ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా లేదా అనే ప్రశ్నకు కూడా ఆసక్తికరంగా స్పందించారు.
ఇదిలా ఉంటే, ఇటీవల అనుపమ పరమేశ్వరన్ తన గత రిలేషన్షిప్ గురించి పలు విషయాలను వెల్లడించారు. రెండేళ్ల పాటు కొనసాగిన ఆ బంధంలో తనపై నియంత్రణ ఉండేదని, సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలి, ఏ పాటను ఎంచుకోవాలి వంటి విషయాల్లో కూడా అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తన మాజీ ప్రియుడిని నార్సిసిస్టిక్ వ్యక్తిగా అభివర్ణించారు.
అనుపమ వ్యాఖ్యల తర్వాత నెటిజన్లు పాత ఇంటర్వ్యూలను బయటకు తీసి ధ్రువ్ విక్రమ్ పేరును ప్రస్తావిస్తున్నారు. అయితే అనుపమ తన మాజీ ప్రియుడి పేరును అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ధ్రువ్ కూడా అనుపమను నేరుగా ప్రస్తావించకుండా తనపై వస్తున్న వ్యక్తిగత చర్చల గురించి మాత్రమే స్పందించారు. దీంతో వీరి మధ్య అసలు ఏం జరిగిందనే అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.
Read more: Antara Banerjee: ట్రైన్లో బట్టలు విప్పేసి.. పోలీసులపై బ్లేడ్ తో దాడి చేసిన నటి అంతారా బెనర్జీ.!. మ్యాటర్ ఏమిటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





