
పాన్ఇండియా రేంజులో ఆర్భాటంగా విడుదలవుతున్న సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న తరుణంలో, ఓ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రచారానికి కూడా బడ్జెట్ లేక సైలెంటుగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది సాధిస్తున్న విజయం చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకతలేంటి?
ఆగస్టు 7న ఏమాత్రం హడావుడి లేకుండా విడుదలైంది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). స్టార్లుగానీ, తెలిసిన ముఖాలుగానీ లేని ఆ సినిమాకు తొలిరోజు వసూళ్లు.. కేవలం రూ.10 లక్షలు. ఓపెనింగే ఇంత డల్‌గా ఉంటే ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. తొలివారంలో రూ.1కోటి 8లక్షలు వసూలు చేసింది. రెండో వారం మరింత దయనీయం. రూ.40లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక దీని పనైపోయినట్లే, బొమ్మ తీసేయడమే తరువాయి అని అనుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. తొలి 14 రోజుల్లో రూ.1.48 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, ఒక్క మూడో వారంలోనే ఏకంగా రూ.10.4 కోట్లు రాబట్టింది!
నాలుగో వారంలో ఈ సినిమా దూకుడు చూసి ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 22వ రోజు రూ.6.25 కోట్లు, 23వ రోజు రూ.9.25 కోట్లు, 24వ రోజు రూ.12.75 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాల మొత్తం కలెక్షన్ల కన్నా, 24వ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువంటే, ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.47.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్లకు చేరువవుతోంది.
ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తే రూ.200 కోట్లొచ్చాయ్..!
1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రచారానికి కూడా డబ్బుల్లేక, చిత్రబృందం ఓ కొత్త ఆలోచన చేసింది. 8 చోట్ల భండారాలు (సామూహిక అన్నదానం) నిర్వహించి, తమ సినిమాను చూడమని అభ్యర్థించారు. నీమ్ కరోలి బాబాను ఆరాధించేవారు థియేటర్లకు తరలివచ్చారు. సినిమా బాగుందన్న నోటి ప్రచారం ఊపందుకోవడంతో వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి. సినిమా ప్రచారం కోసం భారీగా ఖర్చు పెట్టి, వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి, తొలి వారాంతంలో భారీ వసూళ్లను రాబట్టుకోవడానికే చాలా మంది నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. తొలి వారాంతం వసూళ్లే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయని భావిస్తుంటారు. అలాంటి వారందరికీ ‘హనుమాన్ అంశ్’ ఓ కనువిప్పు లాంటిదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరుముడి’. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ నుంచి మరో సాంగ్విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రపంచంలోనే తాను అత్యంత అదృష్టవంతురాల్ని అంటోంది కావ్య కల్యాణ్‌రామ్.. తన ప్రియుడు కాలభైరవతో పెళ్లిపీటలెక్కనుండడంతో ఇలా ఆనందాన్ని పంచుకుంది. మనసిచ్చిన వాడిని మనువాడనున్న కావ్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
‘ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే’ అంటున్నారు కథానాయకుడు మాధవ్. ఆయన కీలక పాత్రలో మంచాల నాగరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మారెమ్మ’.
విజయవంతమైన ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2’.