
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిస్థితిని గమనించిన మోదీ కొంత ఆందోళన చెందారు. తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారు. ‘అంతా బాగానే ఉన్నదా?’ అని జిన్‌పింగ్ అనువాదకుడిని మోదీ అడిగారు. (BRICS Summit) వెంటనే ఎలాంటి స్పందన రాకపోవడంతో అదే ప్రశ్నను పునరావృతం చేశారు. అంతా సవ్యంగానే ఉందని సూచిస్తూ జిన్‌పింగ్ తల ఊపారు. దీంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు. అయితే ఈ సంఘటన వెనుక కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ అంతరాయం కొన్ని క్షణాలే కొనసాగినప్పటికీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అందరి దృష్టిని ఇది ఆకర్షించింది.
కాగా, ఏడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌ను సందర్భించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనంతరం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరుకాలేదు. సుదీర్ఘ ప్రయాణం, బిజీ షెడ్యూల్ కారణంగా చైనా అధ్యక్షుడు అలసిపోవడం వల్ల విందుకు గైర్హాజరైనట్లు తెలుస్తున్నది. అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కూడా ఈ విందులో పాల్గొనలేదు.
#WATCH | Prime Minister Narendra Modi briefly paused his BRICS Summit address on Day 1 to check on Chinese President Xi Jinping after appearing to notice that something was wrong.
More Details: https://t.co/5kAspx5jji pic.twitter.com/cGoNFbyWJp
— Hindustan Times (@htTweets) September 13, 2026






