
Being Born As A Star Kid Has Both Pluses And Minuses 407802
సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు.
సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు. తాను, తన అన్న నాగచైతన్య(naga Chaitanya) తరచూ నెపోటిజం డిస్కషన్స్ లో భాగమవుతుంటామని, ఈ విషయాన్ని తాము అంగీకరించామని చెప్పాడు. అయితే స్టార్ కిడ్‌గా ఉండటం పూర్తిగా అనుకూలమైన అంశం కాదని, అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తన లాంచ్ టైమ్ లో వచ్చిన హైప్ ఒక యంగ్ యాక్టర్ కు అంచనా వేయలేనంతగా ఉందని గుర్తుచేసుకున్నాడు. సౌత్ లో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తున్నారంటే ఆడియన్స్‌లో సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడుతుందని అఖిల్ పేర్కొన్నాడు. అంతటి అంచనాలను కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక ఫెయిల్యూర్ తర్వాత తిరిగి నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం తనకు కనిపించే ప్రధాన ప్రయోజనమని వివరించాడు. ఒక సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా లేకపోయినా మరో ప్రయత్నం చేసే ఫ్రీడమ్ స్టార్ కిడ్స్‌కు ఉంటుందని అన్నాడు.
ఇక సోషల్ మీడియా ట్రోలింగ్‌ను కూడా సినీ లైఫ్ లో భాగంగానే చూడాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందించకుండా, నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను మాట్లాడతానని తెలిపాడు. కానీ విమర్శలు హద్దులు దాటిన సందర్భాల్లో తన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సిస్టమ్‌ను అర్థం చేసుకుని, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించడం నేర్చుకోవాల్సిందేనని అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.





