
Apsara Rani Dark Secrets Movie Streaming In Amazon Prime Ott Sy 1123399
Dark Secrets : అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా డార్క్ సీక్రెట్స్.
Dark Secrets : అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా డార్క్ సీక్రెట్స్. టచ్వుడ్ టేల్స్ బ్యానర్ పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మాణంలో అవినాష్ కొకటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
డార్క్ సీక్రెట్స్ సినిమా ఇటీవలే అమెజాన్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది. ఆంథాలజీ జానర్లో తెరకెక్కిన డార్క్ సీక్రెట్స్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఇండియాలో టాప్ 10 జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. రెంట్ పద్దతిలో సినిమా కొనుక్కొని చూసే సినిమాల్లో డార్క్ సీక్రెట్స్ టాప్ లో ఉంది.
ఓ నలుగురు మహిళల జీవితాల్లో ఏం జరిగింది? వారి జీవితాల్లో ఉన్న రహస్యాలు ఏంటి? ఆ రహస్యాలు బయటపడితే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో బోల్డ్ గా మెసేజ్ ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథలు ఒంటరితనం, సామాజిక ఒత్తిడి, నిషేధిత భావోద్వేగాలు, నైతిక హద్దులు.. లాంటి అంశాలను స్పృశిస్తాయి.






